inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: మా తెలంగాణ వాసులను జైలు నుంచి విడుదల చేయండి,యూఏఇ రాయబారికి కేటీఆర్ వినతి పత్రం
యూఏఇ రాయబారికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వినతి పత్రం అందజేశారు. దుబాయ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. యూఏఈ రాయబారి అబ్దుల్ నసీర్ అల్షాలీతో ప్రగతి భవన్లో సమావేశమైన మంత్రి కేటీఆర్. ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి మల్లేష్, శివరాత్రి రవి, నాంపల్లి వెంకట్, దండుగుల లక్ష్మణ్, శివరాత్రి హనుమంతులు ప్రస్తుతం దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు భారత దౌత్య కార్యాలయంతో పాటు యూఏఈ దౌత్య కార్యాలయానికి అనేకసార్లు తాను స్వయంగా విజ్ఞప్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే యూఏఈ కోర్టు వీరి క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిందని, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ క్షమాబిక్ష పెడితేనే బాధితులకు విముక్తి లభిస్తుందని తెలిపారు. క్షమాభిక్షకు అర్హమైన ఈ కేసులో దుబాయ్ రాజు సానుకూలంగా స్పందించేలా ఆయన దృష్టికి తమ విజ్ఞప్తిని తీసుకురావాలని మంత్రి కేటీఆర్ యూఏఈ రాయబారిని కోరారు. ఈ అంశంలో ప్రత్యేకంగా చొరవ చూపించి, దుబాయిలోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు భారతీయ ప్రవాసీలను వెంటనే భారతదేశానికి పంపించేలా ప్రయత్నం చేయాలని కోరారు. కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ రాయబారి నసీర్ తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మరోవైపు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పట్ల నసీర్ ప్రశంసల జల్లు కురిపించారు. అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీపడేలా నిర్మిస్తున్న మౌలిక వసతుల వల్ల భవిష్యత్తులో హైదరాబాద్ ముఖచిత్రం మరింతగా మారుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఉన్న స్టార్టప్ ఈకో సిస్టం, ఐటి, ఐటీ అనుబంధ రంగాల్లో తెలంగాణ బలం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పారిశ్రామిక రంగాల్లోని పెట్టుబడి అవకాశాలను, తెలంగాణ ప్రభుత్వ పాలసీలను మంత్రి కేటీఆర్, యూఏఈ రాయబారికి వివరించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని స్టార్టప్ ఈకో సిస్టంతో ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లోని వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్నోవేషన్ ఈకో సిస్టం భాగస్వాములు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చారని, ఇదే రీతిన యూఏఈలోని వెంచర్ క్యాపిటలిస్టులను టీ హబ్కు పరిచయం చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన యూఏఈ రాయబారి. ఈ మేరకు తమ దేశంలోని ఔత్సాహిక వెంచర్ క్యాపిటలిస్టులను, హైదరాబాద్ ఈకో సిస్టంలోని స్టార్టప్ సంస్థలను అనుసంధానం చేసేలా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి: మేజర్న్యూస్ తెలంగాణ ప్రతినిధిః తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎలాంటి ఢోకా లేదని పోలీసులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని హోం మంత్రి నాయిని నర్శింహరెడ్డి అన్నారు. వరంగల్ నగరంలో జరిగిన పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్టాడుతూ క్రీడలతో శారీరక దారుడ్యాన్ని రూపొందించుకోవచ్చన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అత్యున్నత ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు. పాలనలో సిఎం కెసిఆర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న చెరువులను ఆధునీకరించేందుకు మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్శింహరెడ్డి అన్నారు. కాకతీయ రెడ్డి రాజులు ఆనాడు గొలుసు కట్టు చెరువలును ఏర్పాటుచేసి అభివృద్ధి చేశారని వారిని స్పూర్తిగా తీసుకుని మిషన్ కాకతీయను చేపట్టామన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా తయారు చేయాలంటే చెరువులు బాగుండాలన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో సంక్షేమరంగంలో తెలంగాణ నెంబర్ వన్గా దూసుకుపోతుందన్నారు. రాబోయే బడ్జెట్లో యాదవుల సంక్షేమం కోసం నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను కెటాయించబోతున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలను పెంచామన్న ఆయన తెలంగాణ పోలీసుల పనితీరును కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో మన పోలీసుల పాత్ర అత్యం గొప్పదని కితాబిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపి పసునూరి దయాకర్, ఎమ్మెల్యే వినయ్బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్!'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్పై కేసు నమోదు
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్పై వివాదాస్పద పోస్ట్ చేసిన ఆరోపణలపై ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్పై కేసు నమోదైంది. కన్నౌజ్ జిల్లాలోని కోర్టులో కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్లో జుకర్బర్గ్ కాకుండా మరో 49 మంది పేర్లు ఉన్నాయి.యాదవ్పై జుకర్బర్గ్ స్వయంగా ఎలాంటి పరువు నష్టం కలిగించే పోస్ట్ చేయలేదు. యాదవ్కు వ్యతిరేకంగా అవమానకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేయడానికి అతని ప్లాట్ఫారమ్ ఉపయోగించబడినందున ఎఫ్ఐఆర్ అతని పేరు పెట్టింది.కన్నౌజ్ జిల్లాలోని సరహతి గ్రామానికి చెందిన అమిత్ కుమార్, అఖిలేష్ యాదవ్పై పరువు నష్టం కలిగించే పోస్ట్లు చేసినందుకు జుకర్బర్గ్తో పాటు మరో 49 మందిపై కేసు పెట్టారు."బువా బాబూవా" పేరుతో ఫేస్బుక్ పేజీలో సమాజ్వాదీ పార్టీ అధినేత ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించారని కుమార్ కోర్టుకు సమర్పించిన దరఖాస్తులో ఆరోపించారు. కుమార్ మే 25న పోలీసు సూపరింటెండెంట్కు దరఖాస్తు పంపాడు, అయితే అతని దరఖాస్తు పట్టించుకోలేదు. దీంతో ఆయన కోర్టుకు వెళ్లి సీఈవో జుకర్బర్గ్తో పాటు ఫేస్బుక్ పేజీ అడ్మిన్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కుమార్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేయాలని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ధరమ్వీర్ సింగ్ పోలీసులను కోరారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 39,579 కరోనా పరీక్షలు చేయగా 374 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వల్ల ఒకరు మృతిచెందగా, 683 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,477 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.91% గా ఉంది
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'తెలంగాణ కరోనా అప్డేట్'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తొలిసారిగా ప్రధాని పదవిపై పెదవి విప్పారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ… 2019లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే తానే ప్రధాని పదవి చేపడతానన్నారు. అవినీతి వ్యక్తిని కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించారో మోడీ చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్గాంధీ అన్నారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ… 35వేల కోట్లు దోచుకున్న రెడ్డి వర్గానికి ఎందుకు 8 సీట్లు ఇచ్చారు? అని రాహుల్ ప్రశ్నించారు. ఉద్యోగ కల్పన ఎందుకు జరగడం లేదో మోడీ యువతకు సమాధానం చెప్పాలన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ '2019లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే నేనే ప్రధాని: రాహుల్ గాంధీ'.
2
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదు: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రూపురేఖలు మారిపోయాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ. తెలంగాణకు చేసిందేమీలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ మున్సిపాటిలోని రాంబాగ్, నాయుడివాడలో పర్యటించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల పరిష్కారం, పురోగతిపై ఆరా తీశారు. అభివృద్ధి పనులతోపాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ. కొత్త జిల్లాతో పాటు జిల్లా కోర్టులను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అభివృద్ధితోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయని, వాటిని సకాలంలో అర్హులైన వారందరికీ అందేలా చూసే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. పల్లె, పట్టణాల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో అందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధుల భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పల్లె ప్రకృతి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, కొన్ని వార్డుల్లో అనుకున్న స్థాయిలో పనులు జరగడం లేదని, అధికారులు అలసత్వం వీడాలన్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: నేటి సమాజంలో చట్టాలు ఎంత తీవ్రతరమవుతున్నా కూడా చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో తొమ్మిదేళ్ల చిన్నారిపై 25 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక '9ఏళ్ళ బాలికపై అఘాయిత్యం'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రైతుబంధునే కాపీకొట్టి అన్నదాత సుఖీభవ: కేటీఆర్
తెలంగాణ సీఎం కెసిఆర్ రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్నే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపీకొట్టి అన్నదాత సుఖీభవ పథకం పెట్టారని ఎద్దేవా చేశారు తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్ వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు నాయుడు తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని కాపి కొట్టి అన్నదాత సుఖీవ అనే పేరు పెట్టుకున్నారన్నారు. చంద్రబాబునాయుడు ప్రతిరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి కేసీఆర్ గురించి దుమ్మెత్తి పోస్తున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు.
1
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: మండల గ్రామాల్లోని రైతులు నీటి తీరువా బకాయిలు త్వరితగతిన చెల్లించాలని బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, అమృతలూరు మండల తహసీల్దార్ ఎం. స్వర్ణలత కోరారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ అమృతలూరు మండల పరిధిలోని 13 రెవెన్యూ గ్రామాలలో 14, 591 మంది ఖాతాదారులు ఉన్నారని, ఆ క్రమంలో నీటి తీరువా 84. 20 లక్షలు చెల్లించాల్సి ఉండగా, ప్రస్తుతం 11. 87 లక్షలు నీటి తీరువా వసూలు చేసినట్లు వివరించారు. ఇంకా 72. 32 లక్షలు బకాయి వసూలు చేయాల్సి ఉందన్నారు. గతంలో రెవెన్యూ సిబ్బంది నీటి తీరుగా మాన్యువల్ గా వసూలు చేసేవారని ప్రస్తుతం ప్రభుత్వం ఆన్లైన్ పద్ధతి ప్రకారం రైతులు చెల్లించే సౌకర్యం ఏర్పాటు చేసిందన్నారు. రైతులు స్థానికేతరంగా ఉంటున్నా వారు అక్కడ వార్డు, గ్రామ సచివాలయంలో ఆన్ లైన్ ద్వారా కూడా చెల్లించినా వారి ఖాతాల్లో చెల్లింపులు జమ అవుతాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'రైతులు నీటి తీరువా బకాయిలు వెంటనే చెల్లించాలి'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: తిరుమల శ్రీవారిని ఎంపీ సీఎం రమేశ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రమేశ్కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం తలపెట్టిన దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రేపు అనంతపురంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. కర్మాగారం నిర్మాణానికి పునాది వేసే వరకు గడ్డం తీయనని శపధం చేశారు తిరుమల శ్రీవారిని ఎంపీ సీఎం రమేశ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రమేశ్కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ సందర్భంగా సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం తలపెట్టిన దీక్షను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రేపు అనంతపురంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. కర్మాగారం నిర్మాణానికి పునాది వేసే వరకు గడ్డం తీయనని శపధం చేశారు
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'అప్పటి వరకు గడ్డం తీయను : సీఎం రమేశ్'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: విజయవాడ: గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నైకు మరో సర్వీసు అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం విమానాశ్రయం నుంచి నిత్యం రెండు సర్వీసులు నడుస్తున్నాయి. వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోంది. టిక్కెట్లు సైతం దొరకని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నైకు నూతన సర్వీసును నడిపేందుకు ఎయిరిండియా ముందుకొచ్చింది. ఆగస్టు 30 నుంచి ఈ సర్వీసు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం చెన్నైకు నడుస్తున్న స్పైస్జెట్, ట్రూజెట్ సర్వీసులు రెండూ సాయంత్రం ఒకటి, రాత్రి 10 గంటలకు మరొకటి ఉన్నాయి. పగటి వేళ చెన్నైకు వెళ్లాలనుకునే వారికి విమాన సౌకర్యం లేదు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం సమయంలో ఎయిరిండియా నూతన సర్వీసును చెన్నైకు నడపాలని భావిస్తున్నారు. గన్నవరం-చెన్నై ఎయిరిండియా సర్వీసుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో రానుందని విమానాశ్రయం డైరెక్టర్ జి.మధుసూదన్రావు స్పష్టం చేశారు. ప్రస్తుతం చెన్నైకు నడుస్తున్న రెండు సర్వీసుల్లోనూ టిక్కెట్ల ధరలు భారీగా ఉంటున్నాయి. ఒక్కోసారి రూ.11వేల వరకూ ధర ఉంటోంది. ఎయిరిండియా సర్వీసు వచ్చాక. పోటీ పెరిగి టిక్కెట్ ధరలు రూ.3వేల వరకూ దిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'చెన్నైకు ఎయిరిండియా సర్వీసు'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: హైదరాబాద్లో కోపార్ట్ ఇండియా టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించారు మంత్రి కేటీఆర్. మాదాపూర్ మైండ్స్పేస్లో కంపెనీ ప్రతినిధులతో కలిసి లాంచ్ చేసారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్లో కొలువుదీరడం హర్షనీయమన్నారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతుండడంతోనే ప్రపంచ స్థాయి కంపెనీలు భాగ్యనగరానికి వస్తున్నాయని చెప్పారు. కోపార్ట్ కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని స్పష్టం చేసారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'కోపార్ట్ ఇండియా టెక్నాలజీ సెంటర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: తక్కువ పెట్టుబడితోనే ఏదో ఒక వ్యాపారం చేసి స్వయం ఉపాధి పొందాలని చాలా మంది భావిస్తారు. అలాంటి వారికోసమే Lokal యాప్ ఈరోజు ఒక చక్కటి, తక్కువ పెట్టుబడితో చేయగలిగే స్వయం ఉపాధి మార్గాన్ని తీసుకువచ్చింది. అదే జన్ ఔషధి బిజినెస్. జన్ ఔషధి కేంద్రాల్లో మార్చిలో రూ.42 కోట్లు, ఏప్రిల్లో రూ.52 కోట్ల వ్యాపారం జరిగింది. ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి యోజన పథకంలో భాగంగా ఈ మెడికల్ షాపులు ఏర్పాటవుతున్నాయి.ఈ వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా ఉంటుంది. మరి ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి ప్రాజెక్ట్నే జన్ ఔషధి యోజన అంటారు. 2015 లో ఈ స్కీమ్ ప్రారంభమైంది. తక్కువ ధరకే జనరిక్ మెడిసిన్స్ అమ్మడం ఈ కేంద్రాల ప్రత్యేకత. మార్కెట్ రేటు కన్నా 90 శాతం తక్కువ ధరకే ఇక్కడ మందులు దొరుకుతాయి. మీరు జన్ ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే రూ.3.50 లక్షల పెట్టుబడి అవసరం. ప్రభుత్వం కొంతమేర ఆర్ధిక సాయం చేస్తుంది. జనఔషధి కేంద్రాలు మూడు రకాలుగా ఉంటాయి. మొదటి కేటగిరీలో ఎవరైనా వ్యక్తిగతంగా లేదా ఫార్మాసిస్ట్, డాక్టర్, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ జనఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయొచ్చు.రెండో కేటగిరీలో ట్రస్టులు, ఎన్జీఓలు, ప్రైవేట్ ఆస్పత్రులు, సొసైటీలు, స్వయం సహాయక గ్రూపులు జనఔషధి కేంద్రాన్ని తెరవచ్చు. మూడో కేటగిరీలో రాష్ట్ర ప్రభుత్వాలు నామినేట్ చేసిన ఏజెన్సీలు ఏర్పాటు చేయొచ్చు. మీరు జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 120 చదరపు అడుగుల స్థలం చాలు. జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేసినవారికి ప్రభుత్వం 900 రకాల మందులను సప్లై చేస్తుంది. మీరు నెలకు రూ.1,00,000 మందులు అమ్మితే మీకు రూ.20,000 లాభం వస్తుంది. వికలాంగులు, ఎస్సీ, ఎస్టీలకు రూ.50,000 మెడిసిన్ అడ్వాన్స్గా ఇస్తుంది ప్రభుత్వం. వాట్సప్, ఇమెయిల్ ద్వారా పేషెంట్ల నుంచి ఆర్డర్స్ తీసుకొని మెడిసిన్ సరఫరా చేయొచ్చు. జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రీటైల్ డ్రగ్ సేల్స్ లైసెన్స్ ఉండాలి.ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తప్పనిసరి. జనఔషధి అధికారిక వెబ్సైట్ janaushadhi.gov.in నుంచి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ను బ్యూరో ఆఫ్ ఫార్మా జనరల్ మేనేజర్కు పంపాలి. ప్రధాన మంత్రి భారతీయ జనఔషధి పరియోజన-PMBJP పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు janaushadhi.gov.in వెబ్సైట్లో ఉంటాయి.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'ఈ వ్యాపారానికి ప్రభుత్వం నుంచి కూడా ఆర్ధిక సాయం'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. పెనుకొండ మండలం మక్కాజిపల్లి తండాలో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. భార్య శ్రావణిని భర్త రాజేష్ నాయక్ రోకలిబండతో కొట్టి చంపేశాడు. రెండో పెళ్లి చేసుకోవాలని దుర్బుద్ధితో హత్య చేసినట్లుగా మృతురాలి బంధువులు చెబుతున్నారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'అనంతపురం జిల్లాలో దారుణం... దుర్బుద్ధితో భార్యను చంపేసిన భర్త'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి: ప్రస్తుతంఅమెరికా పర్యటనలో ఉన్నఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడనుంచే శనివారంఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంఓ అధికారులు పంపిన నివేదికలను .నిశితంగా పరిశీలించారు. కాగా ఎగువ ప్రాంతాల నుండి వస్తున్నటువంటి వరదలు,విడుదల చేస్తున్నటువంటి జలాలపై ఆరా తీశారుముంపు బాధిత ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై సమీక్షిస్తూ, బాధితులకు సాయం అందించడంలో ఎలాంటి జాప్యం ఉండరాదని అధికారులకు ఆదేశాలిచ్చారు.ప్రస్తుతానికి వరదలు తగ్గుతున్నాయని, ఇకమీదట ఎలాంటి సమస్యలు ఉండవని సీఎంవో అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి వివరించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'వరద పరిస్థితిపై అమెరికా నుంచే సీఎం జగన్ ఫోన్ సమీక్ష'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: నల్ల చొక్కాలతో సభకు హాజరుకానున్న టీడీపీ సభ్యులు...
అమరావతి : ఇవాళ మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు. ప్రత్యేక హోదా బంద్ కు మద్దతుగా నల్ల చొక్కాలతో సభకు హాజరుకానున్న టీడీపీ సభ్యులు. అసైన్డ్ భూముల బదలాయింపు ఆర్డినెన్సు ను సభలో ప్రవేశ పెట్టనున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి. ఇవాళ అసెంబ్లీలో ప్రత్యేక హోదా,విభజన సమస్యలు పై చర్చ.తీర్మానం చేయనున్న అసెంబ్లీ. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీలో ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: శ్రీకాకుళం జిల్లా, గార పరిధిలోని శ్రీకూర్మం పంచాయతీ నగిరెడ్లపేట సమీపంలో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసినట్టు సీఐ కామేశ్వరరావు తెలిపారు. పక్కా సమాచారం మేరకు ఆదివారం సిబ్బందితో దాడి చేసినట్టు చెప్పారు. వారి నుంచి రూ.17,200 నగదుతోపాటు 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'పేకాట ఆడుతున్న వ్యక్తులని అరెస్ట్ చేసిన పోలీసులు'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: డిఎంకె పిటిషన్ త్రోసిపుచ్చిన మద్రాసు హైకోర్టు
చెన్నై : తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఒ పన్నీర్ సెల్వం సహా 11 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. గత ఏడాది ఫిబ్రవరి 17న ఎడప్పడి కె పళనిస్వామి ముఖ్యమంత్రిగా శాసనసభలో తన బలాన్ని నిరూపించుకును సమయంలో ఆయనకు వ్యతిరేకంగా పళనిస్వామితో సహా 11 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీనితో పళనిస్వామి సహా 11 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ డిఎంకె నాయకుడు ఆర్ సక్కరపణి హైకోర్టులో కేసు వేశారు. దీనిని హైకోర్టు కొట్టివేసింది.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: గుంటూరు జిల్లా, తెనాలి పట్టణoలో కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనల అమలు తీరును గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ పరిశీలించారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణములో కర్ఫ్యూ నిబంధనలను గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ ఆదివారం రాత్రి పరిశీలించారు. పలు ప్రాంతాలలో రాత్రి అరుగంటలు దాటినా తర్వాత తెరిచి ఉండటంతో ఎస్పీ వారి వద్దకు వెళ్లి వ్యాపార సముదాయాలను సాయంత్రం 5 గంటలలోపు మూసివేయాలని, కర్ఫ్యూ నిబంధనల అమలులో పోలీస్ వారికి సహకరించాలని వ్యాపారస్తులకు ఎస్పీ హెచ్చరించారు. ప్రతీ ఒక్కరి సమిష్టి కృషితో మాత్రమే ఈ కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టగలమని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ వ్యాపారస్తులకు వెల్లడించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు కర్ఫ్యూ నిబంధనలను పటిష్టంగా అమలు పరచాలని, కరోనా కేసులు తగ్గుతున్నప్పటికి అత్యంత అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ప్రజలకు మరియు పోలీసులకు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ అదేశాలు జారీ చేశారు. ఎస్పీ పర్యటన లో తెనాలి డిఎస్పీ స్రవంతి రాయ్, పలువురు సిఐలు, యస్ఐలు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'కర్ఫ్యూను ఉల్లంఘిస్తే చర్యలు: ఎస్పీ'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: బెంగుళూరు : కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా దినేశ్ గుండు రావు నియమితులయ్యారు. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయన్నుకర్ణాటక అధ్యక్షుడిగా నియమించారు. ప్రస్తుతం బెంగుళూరులోని గాంధీనగర్ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇంజినీరింగ్లో పట్టాపొందిన దినేశ్. గతంలో ఆహార, పౌర సరఫరాల మంత్రిగా చేశారు. కర్నాటక మాజీ సీఎం గుండురావు కుమారుడే దినేశ్. జేడీఎస్-కాంగ్రెస్ పొత్తు ప్రభుత్వం ఏర్పడడంతో కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పరమేశ్వర. డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన కేపీసీసీ పదవికి రాజీనామా చేయాల్సి ఉంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా దినేశ్ గుండు రావు'.
2
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: పినపాక మండల పరిధిలోని సీతంపేట గ్రామానికి చెందిన మాటూరి నర్సింహారావుకి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజరు అయిన 44, 000 వేల రూపాయల చెక్కును గురువారం పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి లు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీతంపేట ఉపసర్పంచ్ కొండేరు నాగభూషణం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కటకం గణేష్, వారా నర్సింహారావు, గుండారపు శ్రీను, ప్రవీణ్, రేగళ్ల సాంబశివరావు, గుడికందుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ'.
2
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: మొరాకోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్పెయిన్ లోని కెనరీ దీవులకు 45 మందితో వెళ్తున్న బోటు ప్రమాదానికి గురైంది. బోటు ప్రయాణం ప్రారంభించిన 10 నిమిషాలకే రాయిని ఢీకొని మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. బోటులో ఉన్న 45 మందిలో సహాయక బృందాలు 24 మందిని కాపాడాయి. మరో 8 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'ఘోర ప్రమాదం... 13 మంది మృతి'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: ఉపాధి దొరక్క సొంత రాష్ట్రాలకు తిరిగి వచ్చేసిన కూలీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. రూ.50వేల కోట్లతో వారికి ఉపాధి కల్పించేందుకు ఓ పథకాన్ని ప్రారంభించనుంది. గరీబ్ కళ్యాన్ రోజ్గార్ యోజన పేరుతో పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జూన్ 20వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. వలస కార్మికులు భారీగా తిరిగి వచ్చిన 116 జిల్లాలను కేంద్రం గుర్తించింది. ఆ జిల్లాల్లో మొదటగా ఈ పథకాన్ని అమలు చేస్తారు. దీనివల్ల మొత్తం ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో వలస కార్మికులు లబ్ధిపొందనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకానికి బీహార్తో పాటు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలు ఎంపికైనట్టు తెలిపారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'కూలీల కోసం భారీ ప్యాకేజీ ప్రకటించిన మోడీ'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: గల్ఫ్ దేశం ( యూఏఈ ) అబుదాబి లో (బ్యాప్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న దేవాలయం) అంతర్జాతీయంగా నిర్మిస్తున్నహిందూ దేవాలయానికి పునాది పూజ ( ఫౌండేషన్ సెర్మనీ ) కోసం ప్రత్యేక ఆహ్వానం అందింది . ప్రపంచం నలుమూలల నుండి ఈ కార్యక్రమానికి అతి తక్కువ మందికి ఆహ్వానం అందింది . అందులో ఆంధ్రప్రదేశ్ నుండి టీటీడీ జెఈవో లక్ష్మికాంతంకు ఆహ్వానం రావడం ప్రత్యేకమని చెప్పాలి. లక్ష్మికాంతం విజయవాడ కలెక్టర్గా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఫలాలను పేదలకు అందించడంలో ముందంజలో నిలిచారు. భారతదేశం నుండి అతి కొద్దిమందికి ఈ ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా లక్ష్మీకాంతంకు అరుదైన అవకాశం రావడం అభినందనీయమని యూఏఈలో ఉన్న కటారి సుదర్శన్, ముక్కు తులసీకుమార్లు అభినందించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'టీటీడీ జెఈవో లక్ష్మికాంతంకు అబుదాబిలో అరుదైన గౌరవం .'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: గొల్లపూడి నుంచి చినకాకాని వద్ద చెన్నై హైవేలో కలిసేలా కృష్ణానదిమీద రూ. 650 కోట్లతో 18 కిమీ విస్తీర్ణంతో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. అలానే విజయవాడ తూర్పు వైపున చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయని త్వరలో ప్రారంభించి ఆరు నెలల్లో పనులు కూడా ప్రారంభిస్తాం అని తెలియజేసారు. చంద్రబాబు ఐదేళ్లలో పూర్తి చేయలేని కనకదుర్గ ఫ్లై ఓవర్ ను అధికారంలోకి వచ్చాక పూర్తి చేశాం. బెంజ్ సర్కిల్ వద్ద మొదటి ఫ్లై ఓవర్ను ఐదేళ్లు పాలించినా కూడా చంద్రబాబు పూర్తి చేయలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక మొదటి ఫ్లైఓవర్ పూర్తి చేయడమే కాకుండా రెండో ఫ్లై ఓవర్ను ప్రారంభించి పూర్తి చేయడం జరిగింది. విజయవాడ అభివృద్ధి కోసం రూ. 100 కోట్ల స్పెషల్ గ్రాంట్ తో మున్సిపాలిటీ ని డెవలప్ చేస్తున్నాం.కృష్ణానదికి వరదలొచ్చినప్పుడల్లా కృష్ణ లంక ప్రాంత వాసులు మునిగిపోయేవారు. వారిని కాపాడటానికి 1.5 కిమీల మేర రూ. 137 కోట్లతో రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశాం. మరో వైపున కిలోమీటర్ పొడవున మరో రిటర్నింగ్ నిర్మాణానికి పనులు మొదలు పెడుతున్నాం. చంద్రబాబు నివసించే కరకట్ట రోడ్డు విస్తరణకు రూ. 150 కోట్లతో పనులు మొదలు పెట్టాం. బందర్ రోడ్డు వద్ద రూ. 260 కోట్లతో అంబేడ్కర్ పార్కు నిర్మాణ పనులు చేపట్టాం అని సీఎం జగన్ తెలియజేసారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'విజయవాడకు రూ. 1,321 కోట్లతో 30 కిలోమీటర్ల మేర వెస్ట్రన్ బైపాస్ను ఏర్పాటు'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ పొడిగింపు
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) సోమవారం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (IPE) ఏప్రిల్, 2022 ఫీజు చెల్లింపు కోసం చివరి తేదీని రూ. 3,000 ఆలస్య రుసుముతో మార్చి 10 వరకు పొడిగించింది. పరీక్ష ఫీజు చెల్లించని ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కళాశాలల్లోనే ఫీజు చెల్లించాలని కోరారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: బండిలో పెట్రోల్ అయిపోయి. అది ఎక్కడైనా ఆగిపోయిందంటే. అప్పుడప్పుడూ ఇలా జరగడం మామూలే కదా అనుకుంటాం. అదే కారు వున్నవాళ్లయితే. ముందుగానే పెట్రోల్ చూసుకోవాలి కదా. అని అనుకుంటాం. ఏకంగా విమానం కూడా ఇంధనం లేక ఆగిపోతే. ఏం చేస్తాం. ఇలాంటి సంఘటనే ఇప్పుడు అనంతపురం జిల్లాలో జరిగింది. బ్రహ్మసముద్రం మండలం ఎరడికేర దగ్గర ఓ జెట్ విమానం పొలాల్లో దిగింది. జిందాల్ కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు బళ్లారి నుంచి బెంగళూరుకి వెళ్తుండగా విమానంలో ఇంధన సమస్య ఏర్పడడంతో అత్యవసరంగా దిగినట్లు సమాచారం. విమానం వెళ్తున్నప్పుడు అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా, విమానం మాత్రం అటూ ఇటూ ఊగుతూ ఉంది. దాంతో పైలట్కి అనుమానం వచ్చింది. అది కూలిపోతుందేమో అనుకున్నాడు. అందుకే హడావుడిగా దాన్ని ఎక్కడైనా ల్యాండ్ చెయ్యాలనుకున్నాడు. కింద చూస్తే పొలాలు తప్ప ఏమీ లేవు. ఇక దేవుడే దిక్కనుకుంటూ పొలాల్లో దింపేశాడు. లక్కీగా ఆ విమానం పొలాల్లో పద్ధతిగా దిగింది. దాంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. జరిగిన ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'పొలాల్లో ల్యాండ్ అయిన విమానం...'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​ నగర్​, ఆసిఫాబాద్​లో కరోనా నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా తెలిపారు. జిల్లాలో ఉన్న క్వారంటైన్ కేంద్రాల్లో హాజరు రిజిస్టర్, సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కొవిడ్ బారిన పడ్డ వ్యక్తులు బయటకు వెళ్లకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.అలాగే క్వారంటైన్ కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు చేశాక. నెగిటివ్ వచ్చిన వారిని డిశ్ఛార్జి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వాంకిడి చెక్​పోస్ట్ నుంచి ఆసిఫాబాద్​కు వచ్చిన 12 వాహనాల్లోని 41 మంది ప్రయాణికుల్లో. ఏడుగురిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించామన్నారు. గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో మొత్తం 2405 నమూనాలు గాంధీ ఆస్పత్రికి పంపగా. 2192 నెగిటివ్ వచ్చాయన్నారు. 158 పాజిటివ్ వచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇంకా 55 మంది ఫలితాలు రావాల్సి ఉందన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'క్వారంటైన్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి''.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: జరగనున్న హుజారాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈటలను రకరకాలుగా రాజకీయ కక్షతో వేధిస్తున్నారని. అక్రమంగా జైల్లో ఉంచిన ఈటలను హుజురాబాద్ లో గెలిపిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంచి, నీతివంతమైన, కమీషన్లు లేని, ప్రజల ప్రజాస్వామ్య ప్రభుత్వం బీజేపీ ఇస్తుందన్నారు. హుజురాబాద్ ఎన్నికలను ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఎన్నికలుగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు, అవకాశ వాదులకు మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ప్రజాస్వామ్యానికి, అప్రజాస్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ప్రజలు, తెలంగాణ ఉద్యమ కారులు ఎటు నిలబడతారో తేల్చుకోవాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'ఈటలను రకరకాలుగా రాజకీయ కక్షతో వేధిస్తున్నారు: కిషన్ రెడ్డి'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: పవన్ కల్యాణ్ తో మరోసారి వంగవీటీ రాధా భేటీ
టీడీపీ నేత వంగవీటి రాధా ఇవాళ మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. పార్టీలో చేరిక తేదీపై వంగవీటి రాధా పవన్ కల్యాణ్ తో చర్చిస్తున్నారు. సోమవారం మొదటిసారిగా వీరిరువురు సమావేశం కాగా… ఇవాళ రెండోసారి సమావేశమయ్యారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో తొలి సై్వన్ఫ్లూ కేసు నమోదు
విజయవాడ, సూర్య బ్యూరో : గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఈ సీజనలో తొలి సై్వన్ఫ్లూ కేసు నమోదైంది. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొబ్బే పల్లికి చెందిన పఠాన జుబేదా అనే రెండేళ్ల చిన్నారి సై్వన్ఫ్లూ బారిన పడింది. మూడురోజులుగా బాలిక శ్వాస పీల్చుకోలేక పోవడంతో మెరుగైన వైద్యం కోసం ఈ నెల 18న గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తెచ్చారు. శిశు వైద్య విభాగంలో చేర్చుకుని కత్రిమ శ్వాస కల్పించారు. నాజిల్ స్వా్యబ్స సేకరించి మైక్రో బయాలజీ ల్యాబ్లో పరీక్షించారు. సోమవారం వెలువడిన ఫలితంలో బాలికకు సై్వన్ఫ్లూ ఉన్నట్లు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో జుబేదాను ఇతర చిన్నారుల నుంచి వేరు చేసి ప్రత్యేకంగా ఐసోలేషన వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఈ సమాచారం సూపరింటెండెంట్ డీఎస్ రాజునాయుడుకు అందించారు. ముందస్తు జాగ్రత్తగా ఆరోగ్య శాఖ సిబ్బంది, కుటుంబ సభ్యులతో ట్యామీఫ్లూ మా్తల్రు మింగించారు. అదే విధంగా మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామంలో సర్వెలెన్స చేయాలని ప్రకాశం జిల్లా డీఎంహెచవో డాక్టర్ జే యాస్మీన, ఎపి డమాలజిస్ట పుల్లారావుకు సమాచారం అందించారు. జుబేదాసై్వన్ఫ్లూ బారిన పడినట్లు తెలియడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి గ్రామంలో సై్వనఫ్లూ సర్వెలెన్స చేయిం చాలని పలువురు కోరుతున్నారు.
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: స్టేషన్ ఘన్పూర్ టికెట్ పంచాయితీకి కేటీఆర్ పుల్స్టాప్
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో. అసంతృప్తులపై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే గెలుపు గుర్రాల జాబితాను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించగా. టికెట్లు ఆశించి భంగపడిన వాళ్లంతా అలక పూనారు. కొందరైతే. తమ అక్కస్సును బహిరంగంగానే వెల్లగక్కుతున్నారు. అలా అయినా. అధిష్ఠానానికి తమ బాధ తెలియాలని వాళ్ల ప్లాన్ కాబోలు. అయితే. వీటన్నింటినీ గమనిస్తున్న పార్టీ నాయకత్వం. ఎవరికి బుజ్జగిస్తే తమ దారికి వస్తారు. ఎవరిని పట్టించుకోకూడదు అన్న అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో. కేటీఆర్ స్వయంగా ఈ అసంతృప్తి పంచాయితీలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా స్టేషన్ ఘన్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తాటికొండ రాజయ్య విషయంలోనూ కేటీఆర్ రంగంలోకి దిగారు. వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి సీటు ఖరారు చేయడంతో. ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. నియోజకవర్గంలో కార్యకర్తలను కలిసి భావోద్వేగానికి గురై. కన్నీళ్లు పెట్టుకున్నారు. బహిరంగంగానే. కడియం శ్రీహరిపై విమర్శలు గుప్పించారు. నాయకత్వంపై కూడా పరోక్షంగా విమర్శలు చేశారు. రెబల్గా మారే ఛాన్స్ ఉండటంతో. కేటీఆరే స్వయంగా రంగంలోకి దిగి ఈ పంచాయితీని తేల్చారు. తాజాగా ప్రగతి భవన్లో తాటికొండ రాజయ్య, శ్రీహరితో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జరిగిన భేటీలో రాజయ్యను కేటీఆర్ బుజ్జగించారు. తనకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు సీఎం కేసీఆర్, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో కడియం గెలుపు కోసం పనిచేయాలని కోరారు. దీంతో. కేటీఆర్ ఇచ్చిన హామీలతో సంతృప్తి చెందిన రాజయ్య. పార్టీ కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. కడియం శ్రీహరికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు రాజయ్య తెలిపారు. దీంతో. ఇన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన స్టేషన్ ఘన్పూర్ పంచాయితీకి పుల్స్టాప్ పెట్టినట్టయింది.
1
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పనపల్లి గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు . మంగళ హారతులు, బతుకమ్మ, బోనాల తో ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు'.
2
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: సిట్ ముందు హాజరయిన ఆర్ట్ డైరెక్టర్ చిన్నా
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఆరో రోజు సిట్ విచారణ ప్రారంభమైంది. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ఇవాళ సిట్ ముందు హాజరయ్యాడు. డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవ్వాలని ఆయనకు సిట్ నోటీసులు అందజేసింది. ఉదయం 10 గంటల కు ఎక్సైజ్ కార్యాలయంలో చిన్నా విచారణ ప్రారంభం అయింది. నిన్న నటుడు నవదీప్ ను సిట్ అధికారులు రాత్రి 9.45 వరకు విచారించారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: బ్యాలెట్ బాక్స్కు చెదలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్కు చెదలు పట్టాయి. బ్యాలెట్ బాక్స్లో బ్యాలెట్ పేపర్లు చిరిగిపోవడంతో మహదేవాపూర్ మండలం సురారం, అంబటిపల్లి గ్రామాల ఎంపీటీసీలు, మహదేవాపూర్ జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు నిలిపివేశారు. ఎన్నికల అధికారి ఎదుట చిరిగిన బ్యాలెట్ పత్రాలను పరిశీలిస్తున్నారు.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల మధ్య కాసేపు శాంతి నెలకొంది. వాఘా సరిహద్దులో ఘనంగా గణతంత్ర వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న సైనికులు. పాక్ జవాన్లకు స్వీట్స్ పంచారు. ఒకరికొకరు అభినందనలు తెలపుకున్నారు.ఇటు పశ్చిమ బెంగాల్ సిలిగురిలో భారత్, బంగ్లా సరిహద్దు వద్ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఫుల్బారీలో బిఎస్ఎఫ్ అధికారులు బంగ్లాదేశ్ జవాన్లకు మిఠాయిలు పంచిపెట్టారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'వాఘా బార్డర్ లో రెపరెపలాడిన మువ్వెన్నల జెండా'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు సెబ్ అధికారుల సూచనల మేరకు సెబ్ స్పెషల్ టీం మరియు కళ్యాణదుర్గం సెబ్ ఎక్సైజ్ పోలీసులు విస్తృత దాడులు నిర్వహించగా బ్రహ్మసముద్రం మండలం జింకల దొడ్డి క్రాస్ వద్ద కే. తిమ్మారెడ్డి అనే వ్యక్తి నుండి నాకౌట్ 786 బీర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకుని. ఫ్యాషన్ ప్రో ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కడైనా అక్రమ మద్యం తరలిస్తున్నట్లు మా దృష్టికి వస్తే వారు ఎంతటి వారైనా అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ '768 టిన్ బీర్ బాటిల్లు స్వాధీనం'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో జడ్చర్ల నియోజకవర్గం పెద్దయిపల్లి రైతు వేదిక వద్ద సోమవారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ప్రభుత్వము ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తమ ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే'.
2
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: మహిళను దారుణంగా రేప్ చేసిన బస్సు డ్రైవర్
ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కిన తనపై బస్సు డ్రైవర్ రేప్ చేశాడని ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. హైదరాబాద్ ​లోని కూకట్​పల్లి నుంచి ఏపీలోని సొంత గ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 23న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కినట్లు బాధితురాలు తెలిపింది. బస్సులో లగేజీ మాత్రమే తరలించి రైలు ఎక్కాల్సి ఉన్నా బస్సులో సీటు కేటాయిస్తామని డ్రైవర్ రాజేష్ చెప్పడంతో బస్సు ఎక్కినట్లు ఆమె పేర్కొంది.బస్ డ్రైవర్ రూ.3 వేలు తీసుకుని తనకు చివరి స్లీపర్ బెర్త్ కేటాయించాడని బాధిత మహిళ తెలిపింది. అర్థరాత్రి ఆమె వద్దకు వెళ్లి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. బస్సు దిగే సమయంలో దొంగతనం నెపంతో రూ.7 వేలను తన వద్ద నుంచి లాక్కున్నట్లు ఆరోపించింది. నిందితుడు రాజేష్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కూకట్పల్లి సీఐ నర్సింగరావు తెలిపారు. నిందితుడు రాజేష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఎన్నికల వేళ మోడీ మేజిక్
ఎన్నికల వేళ ఓట్ల వేటకు ప్రధాని మోడీ తెరలేపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వివిధ వర్గాలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వరాల జల్లు కురిపించారు. ఏకంగా 30 కోట్ల ఓట్లను కొల్లగొట్టేలా రూపొందించిన మూడు పథకాలు ఇప్పడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దేశంలో బీజేపీ వ్యతిరేక గాలి వీస్తుందన్న సర్వేలా ఫలితాలతో మేల్కొన్న మోడీ సర్కారు ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్తో రైతులు, వేతనజీవులు, శ్రమజీవుల మనసు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మూడు వర్గాల్లో ఉన్న 30 కోట్ల మందికి లబ్ధి చేకూరేలా పథకాలు తీసుకువచ్చింది. ఇప్పుడు వారి, వారి కుటుంబాల ఓట్లు తమకేనని బీజేపీ ఆశపడుతోంది. వాస్తవానికి ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని చెప్పినప్పటికీ.పూర్తి స్థాయి బడ్జెట్గా ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొత్తగా పథకాలు ప్రవేశపెట్టి మోడీ సర్కారు సరికొత్త సంప్రదాయానిక తెరలేపింది. కొత్త పథకాలకు కేటాయింపులు లేకున్నప్పటికీ మళ్లీ అధికారంలోకి వస్తే పూర్తిస్థాయి కేటాయింపులు జరుపుతామన్న ధీమా కల్పించింది. దేశవ్యాప్తంగా మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే దక్షిణాదిలో కమలం పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉంది. ఏపీ, తెలంగాణలో ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితి లేదని సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ పొత్తు కారణంగా ఆ కూటమి ఎక్కువ స్థానాలు గెలచుకుంటుదని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రజాకర్షక పథకాలే శ్రీరామరక్ష అని భావించిన మోడీ సర్కారు అటువైపు మొగ్గుచూపింది. ఏకంగా 30కోట్ల మందికి లబ్ధి చేకూరేలా ఒకేసారి మూడు వరాలను ఇన్ఛార్జి ఆర్థికమంత్రి పీయుష్గోయల్ ప్రకటించారు. ఇప్పటికే అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు, ప్రణబ్ముఖర్జీకి భారతరత్న ఇవ్వడం ద్వారా బెంగాల్, యూపీ ప్రజల మనసు దోచుకున్నామని మోడీ సర్కారు భావిస్తోంది. తాజా బడ్జెట్తో ఆ పరిధిని మరింత విస్తృతం చేయగలిగింది. 12 కోట్ల మంది రైతులు-తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకానికి మార్పులు చేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకాన్ని కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో బాగంగా అయిదు ఎకరాలలోపు ఉన్న రైతులకు ఏటా రూ.6వేల చొప్పున అందించనుంది. ఇది గతేడాది డిసెంబరు నుంచి అమలలోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ సాయం కూడా నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున విడతల వారీగా అందించనుంది. ప్రస్తుతం ప్రవేశపెట్టని బడ్జెట్ ఈ సమావేశాల్లో ఆమోదం పొందితే వెంటనే రైతుల ఖాతాల్లో మార్చి నెలాఖరులోగా రూ.2వేలు పడనున్నాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 12కోట్ల చిన్నసన్నకారు రైతులు లబ్ధిపొందుతారని కేంద్రం భావిస్తోంది. ఆయా రైతు కుటుంబాల ఓట్లు తమకే పడతాయన్న ధీమా బీజేపీ వ్యక్తం చేస్తోంది.3కోట్ల మంది ఉద్యోగులకు లాభం-దేశంలో వేతన జీవులు కేంద్ర బడ్జెట్ వస్తోందంటే టాక్సు స్లాబ్ మారుస్తారేమోనని ఆశగా ఎదురుచూస్తారు. గత నాలుగేళ్లుగా టాక్సు స్లాబులు కేంద్రం మార్చడం లేదు. ఇప్పుడు ఏకంగా 2.50లక్షల ఆదాయం నుంచి 5లక్షలకు స్లాబును కేంద్రం పెంచింది. ఏటా రూ.5లక్షల ఆదాయం ఉన్న ఉద్యోగులు ఇక ట్యాక్సు చెల్లించనక్కర్లేదు. ఆపైన ఉంటేనే చెల్లించాలి. దీనివల్ల వేతన జీవులు పెద్ద ఎత్తున ఊరట చెందుతారు. ట్యాక్సు స్లాబ్ మార్చడం కారణంగా ప్రభుత్వంపై సుమారు 18వేల కోట్ల భారం పడే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇదే సమయంలో దీనివల్ల 3కోట్ల మంది ఉద్యోగులు లబ్ధి పొందారు. అంటే ఆ మేరకు తమకు ఓట్లు కలిసి వస్తాయని బీజేపీ ధీమాగా ఉంది. 15 కోట్ల మంది కార్మికులు -అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల బతుకులు ఈ దేశంలో ఎంతో దుర్భరం. పనులు దొరక్క వారు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ఇక ఇలాంటి వారు 60ఏళ్లు దాటాక వృద్ధాప్యం మీద పడి ఏ పని చేయలేక పస్తులు ఉండాల్సి వస్తోంది. ఏవైనా చిన్న పనులు చేసినా చాలీచాలని కూలీనే వస్తోంది. కడుపు నింపుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. దేశంలో 40 కోట్ల మంది అసంఘిత రంగంలో కార్మికులుగా ఉన్నారని ప్రభుత్వ అంచనా. ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకాన్ని వీరి కోసం తీసుకువచ్చింది. నెలకు రూ.15వేలలోపు ఆదాయం ఉన్న వారు నెలకు రూ.100 చొప్పున ప్రీమియం కడితే 60ఏళ్లు నిండిన తర్వాత ఏటా రూ.3వేల పింఛను లభిస్తుంది. ఈ ప్రీమియం పోస్టీఫీసుల ద్వారా కట్టించుకునే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా 15 కోట్ల మంది లబ్ధి పొందుతారని అంచనా.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: జాతీయ రహదారి పంజాబ్ హోటల్ కూడలి వద్ద బుదవారం పెను ప్రమాదం తప్పించి మినివ్యాన్ లో తరలిస్తున్న ఐరన్, అల్యూమినియం రాడ్లు ఒక్కసారిగా జారి రోడ్డుపై పడిపోయాయి. ఆసమయంలో వెనుక నుంచి ఎటువంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్అండ్ నుంచి బిర్లా కూడలి వైపు వెళ్తున్న మిని వ్యాన్ పంజాబ్ హోటల్ సిగ్నల్స్ వద్ద ఆగేందుకు డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో వ్యాన్ లోని రాడ్లన్నీ జారి రోడ్డపై పడిపోయాయి.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'జాతీయ రహదారిపై తప్పిన ప్రమాదం'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది
తూర్పు గోదావరి: కిర్లంపూడి మండలంలో మానవత్వం మసకబారింది. గత ఐదు రోజుల నుండి మండల గ్రామమైన జగపతినగరం గ్రామంలో ఉన్న పెట్రోల్ బంకు ఎదురుగా ప్రధాన ఆర్. అండ్. బి రహదారి చెంతన అచేతనంగా ఒక వృద్ధుడు అహకారాలు చేస్తూ పడి ఉన్నప్పటికీ గ్రామస్తులు ఎవరికి ఆ సన్నివేశం కనిపించకపోవడం చాలా దురదృష్టకరం. ఐదు రోజుల నుండి అన్నపానీయాలు లేకుండా రహదారి చెంతనే బిక్కుబిక్కుమంటూ దోమలు పురుగులు చేసిన గాట్లకు ఆ వృద్ధుడు మూలుగుతూ కనబడుతున్నప్పటికీ ఆ దారిన వెళ్లేవారు చూస్తూ పోతున్నారే తప్ప కనీసం ఆ అభాగ్యుడు పట్ల కనికరం కూడా చూపకపోవడం ప్రస్తుత తరుణంలో మానవత్వం ఏవిధంగా తయారయ్యిందో తేటతెల్లం కానుంది. ఇప్పటికైనా ఈ చలి కాలంలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ వృద్ధునికి ఎవరైనా సహాయం చేయాలని అన్నారు.
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: అధికారి అంటే ఇలా...సైకిల్ పై ఐపీఎస్ విధి నిర్వాహణ
కొందరు ఉన్నతాధికారులు తమ పాలనపై తనదైన ముద్రవేసుకొంటూవుంటారు. ఐపీఎస్ అధికారిణి, చెన్నై నార్త్ జాయింట్ కమిషనర్ రమ్య భారతి అర్ధరాత్రి సమయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చీకటిలో ఒంటరిగా సైకిల్పై వెళ్లి పెట్రోలింగ్ నిర్వహించారు. తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 4 గంటల వరకు సైకిల్ తొక్కుతూ తన ఆధీనంలోని ప్రాంతాలను పర్యవేక్షించారు. రాత్రి విధుల్లో ఉన్న గార్డులతో మాట్లాడి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. చెన్నై బరిమునై ఫ్లోరిస్ట్ నుంచి వాషర్మెన్పేట వరకు ఎనిమిది పోలీస్ స్టేషన్లను రమ్య భారతి తనిఖీ చేశారు. పోలీసులు ఎలా పని చేస్తున్నారో పర్యవేక్షించారు. అలాగే రాత్రి గస్తీలో ఉన్న గార్డుల పనితీరును పరిశీలించారు. అనంతరం రాత్రంతా నిద్రపోకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని గార్డులకు సూచించారు. రమ్య భారతి అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహణకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇదిలావుంటే రమ్య భారతి 2008లో తమిళనాడు విభాగానికి చెందిన ఐపీఎస్ అధికారిణి. తమిళనాడు ప్రభుత్వం గత జనవరిలో ఆమెను చెన్నై నార్త్ జాయింట్ కమిషనర్గా నియమించింది. అప్పటి నుంచి ఎంతో నిజాయితీగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ఆమె పని తీరుతో ప్రజల మన్ననలను కూడా పొందారు. రాత్రిపూట రమ్య భారతి గస్తీపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా స్పందించారు. ఆమెను అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణకు తమిళనాడు పోలీసులు ఉక్కు హస్తంతో పనిచేస్తారని ముఖ్యమంత్రి తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనతో భేటీ అయ్యాయి. రేపు ఉదయం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ కీలకమైంది. కూటమి అభ్యర్థుల విజయావకాశాలు, జాతీయ స్థానిక సంస్థల ఎగ్జిట్ పోల్స్ పై వీరిద్దరూ చర్చించనున్నారని, కూటమిలోని పార్టీలకు మెజారిటీ సీట్లు రాకుంటే ఏం చేయాలన్న విషయమై కూడా వీరు సమాలోచనలు జరపనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలవకుండా, కూటమి మొత్తం కలిపి మెజారిటీ సాధించిన పక్షంలో తమనే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ నేతలు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిసి విన్నవించనున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా రాహుల్ వద్ద ఉత్తమ్ చర్చిస్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ తో చర్చల అనంతరం మధ్యాహ్నం తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగి హైదరాబాద్ కు చేరనున్నారు. ఆపై ఆయన అందుబాటులోని కాంగ్రెస్ నేతలతో సమావేశమై రేపటి కౌంటింగ్ ప్రక్రియపై చర్చిస్తారని తెలుస్తోంది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'రాహుల్ తో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ అత్యవసర భేటీ'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: అమరావతి :ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12గంటల వరకు జరగనుంది. ఏపీలో 1435 పరీక్షా కేంద్రాలు, తెలంగాణలో 1291 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. కాగా. ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు సెట్-3 ప్రశ్నాపత్రం ఎంపిక చేయగా తెలంగాణలో ఇంటర్ పరీక్షకు సెట్-సీ ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12గంటల వరకు జరగనుంది. ఏపీలో 1435 పరీక్షా కేంద్రాలు, తెలంగాణలో 1291 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. కాగా. ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు సెట్-3 ప్రశ్నాపత్రం ఎంపిక చేయగా తెలంగాణలో ఇంటర్ పరీక్షకు సెట్-సీ ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఏపీ, తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: ఇవిఎంకు పూజ చేసిన మంత్రి దయాళ్దాస్
ఛత్తీస్గఢ్ మంత్రి దయాళ్దాస్ బాఘెల్ పోలింగ్ బూత్లో ఇవిఎంకు పూజలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బిజెపి తరఫున నవాగఢ్నుంచి బాఘెల్ పోటీ చేస్తున్నారు. నవాగఢ్ రిటర్నింగ్ అధికారి ఈ ఘటనపై మంత్రినుంచి వివరణ కోరుతూ నోటీస్ జారీ చేశారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: ఆదిలాబాద్ లో పోలీసుల కార్డన్ సెర్చ్
అదిలాబాద్ జిల్లాలో శాంతిభద్రతలు పరిరక్షించడానికి కార్డన్ అండ్ సేర్చ్ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. ఆదివారం స్థానిక పట్టణంలోని జీడీసీ కాలనీలో డిఎస్పి కె నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 70 మంది పోలీసు సిబ్బంది ఇంటింటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఎటువంటి నిజ ధ్రువపత్రాలు లేని 18 ద్విచక్ర వాహనాలు, ఒక మ్యాక్స్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కాలనీ శివారులో లక్ష రూపాయల విలువైన అక్రమంగా నిల్వ చేసిన కలపను సైతం స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా బెల్లంపల్లి శాంతినికేతన్ బస్తీలో ఏసీపీ బాలు ఆధ్వర్యంలో చేపట్టిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో సరైన పత్రాలు లేని 13 ఆటోలు, 26 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: రాజ్యసభ సీట్ల కేటాయింపులో ఇప్పటికే బీద మస్తాన్ మరియు కృష్ణయ్య సీఎం జగన్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. ఐతే ఇదే క్రమంలో తాజాగా వైయస్ఆర్ సీపీ రాజ్యసభ అభ్యర్థి ఎస్. నిరంజన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తనను రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా బీ ఫామ్ అందుకున్నారు. ఇంకా పోతే నాల్గవ వ్యక్తి విజయ్ సాయి రెడ్డి మొదటిలోనే సీఎం జగన్ మరియు భారతి దంపదులకి ధన్యవాదాలు తెలిపిన సంగతి తెలిసిందే.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఎమ్మెల్యేకు సమస్యలతో స్వాగతం పలికిన జనం
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డిని ప్రజలు సమస్యలతో స్వాగతం పలికారు. కలికిరి మండలం, గుట్టపాలెం పంచాయతీ, సి. బరిణేపల్లి, జి. బరిణేపల్లి, గుట్ట పాలెం కస్పాల్లో ఎమ్మెల్యే చింతల, వైసిపి నాయకులు, అధికారులు పర్యటించారు. ఆయన గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను పిలిచి, వాటిని అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేశారు. ప్రజలు తమకు జగనన్న ఇళ్లకు సంబంధించిన బిల్లులు రాలేదని, పింఛన్లు కావాలని ఎమ్మెల్యేకు దృష్టికి తెచ్చారు. అలాగే రేషన్ సకాలంలో ఇంటి వద్దకు అందలేదని తెలియజేశారు. ఎంఎల్ఏ వెంటనే స్పందించి ఆ సమస్యల పరిష్కారానికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గుట్టపాలెం గ్రామ సర్పంచ్ రెడ్డి వారి వెంకట్ రెడ్డి, ఎంపిటిసి శ్రీకాంత్, తహశీల్దార్ రమణి, ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ సెక్రెటరీ గోపి, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
భారత్-వెస్టిండీస్ మధ్య బుధవారం తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది.భారత తుది జట్టు : రోహిత్ (సి), యశస్వి జైస్వాల్, గిల్, కోహ్లి, రహానే, జడేజా, ఇషాన్ కిషన్ (W), అశ్విన్, శార్దూల్, ఉనద్కత్, సిరాజ్ వెస్టిండీస్ తుది జట్టు : బ్రాత్వైట్ (సి), చందర్పాల్, రీఫర్, బ్లాక్వుడ్, అతానాజ్ , జాషువా (W), జాసన్ హోల్డర్, కార్న్వాల్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలలో శనివారం నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది. కృష్ణా ఫేజ్-2, 1400 ఎంఎం డయా మెయిన్ రింగ్-1 పైపులైన్కు శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు 24 గంటల పాటు మరమ్మతు పనులు జరగనున్నాయి. దీంతో మెహిదీపట్నం, కార్వాన్, లంగర్హౌజ్, కాకతీయనగర్, హుమాయున్నగర్, తల్లాగడ్డ, ఆసి్ఫనగర్, ఎంఈస్, షేక్పేట్, ఓయూ కాలనీ, టోలిచౌకి, మల్లేపల్లి, విజయ్ నగర్ కాలనీ, భోజగుట్ట, జియాగూడ, రెడ్హిల్స్, సచివాలయం, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, గగన్మహల్, హిమయత్నగర్, బుద్వేల్, హైదర్గూడ, రాజేంద్రనగర్, ఉప్పర్పల్లి, సులేమాన్నగర్, ఎంఎం పహాడి, అత్తాపూర్, చింతల్మెట్, కిషన్బాగ్, గంధంగూడ, కిస్మత్పూర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని అధికారులు తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: రూ.2కోట్లు విలువైన స్థలాన్ని కాజేసి...
నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించి, అక్రమాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు(Arrest) చేశారు. ముగ్గురు మహిళలు కలిసి సుమారు రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేశారు.బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్(Hyderabad) నగరంలోని సరూర్నగర్ ఆర్కే పురం ప్రాంతానికి చెందిన వరలక్ష్మికుమారికి. రామంతాపూర్లోని శ్రీరమణపురంలో 267 గజాల ఇంటి స్థలం ఉంది. దీనిని 1983లోనే కొనుగోలు చేసి ప్రహరీ నిర్మించారు. 2011లో ఆమె భర్త మృతి చెందడంతో అప్పటి నుంచి ఆమె సోదరుడు స్థలాన్ని చూసుకుంటున్నారు. ఈ స్థలంపై ఉప్పల్ డివిజన్లోని చర్చికాలనీలో ఉండే జ్యోతి, మరో కొందరికి కన్ను పడింది. ఎలాగైనా స్థలాన్ని కాజేయాలని పన్నాగం పన్నారు. దీంతో 2014లోనే వరలక్ష్మి మృతి చెందినట్లు ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు. వరలక్ష్మి ఏకైక కూతురిని తానేనంటూ జ్యోతి నటించడం ప్రారంభించింది. గతేడాది డిసెంబరు 3న జ్యోతి తన కూతురు వెన్నెలకు ఈ స్థలాన్ని గిఫ్ట్ డీడ్ చేసింది. అదే నెల 9న వెన్నెల మరియమ్మ అనే మహిళకు సేల్ డీడ్ చేసింది. అంతటితో ఆగకుండా 18న మరియమ్మ బల్ల జ్యోతికి సేల్ డీడ్ చేసింది. విషయం తెలుసుకున్న వరలక్ష్మి బంధువులు. ఉప్పల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లగా అసలు విషయం బయటపడింది. వరలక్ష్మికి కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై ఉప్పల్ పోలీసులకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో శుక్రవారం ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 12 మందిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను రాయండి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే గారిని కలిసేందుకు కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, నాయకులకు తన నివాసం వద్ద ఉన్న కార్యాలయంలో అందుబాటులో ఉంటూ స్వయంగా వారి సమస్యలను తెలుసుకుంటూ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి : కేపి వివేకానంద్'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు పునఃప్రారంభంకానున్నది. కరోనా సంక్షోభ సమయంలో రైల్వే శాఖ అనేక రైళ్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా పరిస్థితులు శాంతించడంతో క్రమంగా రైళ్లను పునరుద్ధరిస్తోంది. తాజాగా, గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలును పునఃప్రారంభిస్తోంది. ఆగస్టు 18 నుంచి ఈ ఎక్స్ ప్రెస్ రైలు పరుగులు తీయనుంది. గుంటూరులో సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడప, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా ప్రయాణిస్తుంది. ఇదిలావుంటే గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలును పునరుద్ధరించడంపై ఏపీ బీజేపీ నేతలు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'గుంటూరు-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు పునఃప్రారంభం'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: యూట్యూబ్ ద్వారా ఏకంగా అంతగా సంపాధించాడు... ఆడికారునే కొనేశాడు
క్రియేటర్ కు యూట్యూబ్ ఓ ఆదాయ వనరుగా మారుతోంది. దీంతో యూట్యూబ్ ఎంతో మంది జీవితాలను మార్చేస్తోంది. యూట్యూబ్ వీడియోలు చేస్తూ. ఉద్యోగులకే కంటే ఎక్కువగా సంపాదించే వారు ఎంతో మంది ఉన్నారు. చిన్న క్రియేటివిటీతో తమ జీవితాలను సమూలంగా మార్చేసుకుంటున్నారు. దీనికి తోడు పాపులారిటీ, అభిమానం కూడా సంపాదించుకునే వారు ఎంతో మంది ఉన్నారు. బిహార్కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్లో వీడియోలు చేస్తూ వచ్చిన సంపాదనతో ఏకంగా ఆడీ కారు కొన్నాడు. ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా నిలిచాడు. ఆ కొత్త కారును పశువుల పాక పక్కనే పార్క్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. బిహార్లోని ఔరంగాబాద్ పరిధిలోని జసోయా గ్రామానికి చెందిన 27 ఏళ్ల ఆ యువకుడి పేరు హర్ష్ రాజ్పుత్ . జాతీయ వార్తా కథనాల ప్రకారం. యూట్యూబ్ వీడియోల ద్వారా అతడు నెలకు 8 లక్షల రూపాయల వరకూ సంపాదిస్తున్నాడు. కరోనా లాక్డౌన్ సమయంలో కామెడీ వీడియోలు చేసి యూట్యూబ్లో పోస్టు చేయడం మొదలుపెట్టాడు హర్ష. అతడి కామెడీ టైమింగ్ చాలా మందిని ఆకట్టుకుంది. కొన్ని వీడియోలు బాగా పేలాయి. 10 నిమిషాల నిడివి గల ఓ కామెడీ వీడియోకు 20 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చిన సంపాదనతో సుమారు రూ. 50 లక్షల విలువైన ఆడీ కారు కొన్నాడు. రకరకాల సమస్యలపై ఫన్నీగా వీడియోలు చేయడం హర్ష్ రాజ్పుత్ ప్రత్యేకత. అతడు చేసిన కొన్ని వీడియోల్లో కొంత భాగం వైరల్ అయిన సందర్భాలు అనేకం. ప్రస్తుతం హర్ష్ రాజ్పుత్ యూట్యూబ్ ఛానల్కు 33 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. జూన్ 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు హర్ష్ నెలకు సగటున రూ. 4.5 లక్షలు సంపాదించాడు. హర్ష్ నిరుపేద కుటుంబంలో పుట్టాడు. అతడి తండ్రి బీహార్ పోలీసులకు హోంగార్డుగా, పోలీసు అధికారులకు డ్రైవర్గా పనిచేశాడు. నటనపై ఆసక్తితో హర్ష్. ముంబైకి వెళ్లాడు. అంతకుముందు ఢిల్లీలో థియేటర్ కోర్సు చేశాడు. అయితే, కోవిడ్ లాక్డౌన్ అతడి ఆశలపై నీళ్లు చల్లింది. కానీ, అదే సమయం అతడికి కొత్త జీవితాన్ని ఇచ్చింది. లాక్డౌన్ సమయంలోనే అతడు తన యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించాడు. తనదైన కామెడీతో వీడియోలు చేసి పోస్టు చేయడం మొదలుపెట్టాడు. అవి బాగా వర్కవుట్ అయ్యాయి. బ్యాంక్ రుణం తిరిగి చెల్లించని కారణంగా ఒకనాడు హర్ష్ ఇంటిని అధికారులు వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. హర్ష్ తన యూట్యూబ్ సంపాదన ద్వారా ఆ ఇంటిని కూడా దక్కించుకున్నాడు. నటుడిగా అవకాశాలు వచ్చినా ఇంత షార్ట్ పీరియడ్లో ఈ స్థాయిలో సంపాదించేవాడో, లేదో.!
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: లలితా జ్యూవెలరీ చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్
చెన్నైలోని తిరుచ్చి లలితా జ్యూవెలరీ చోరీ కేసులో పోలీసులు ఐదుగురు నిందితులను గురువారం అరెస్టు చేశారు. పుదుకొట్టైలోని ఓ లాడ్జిలో తిరుచ్చి పోలీసులు దొంగలను పట్టుకున్నారు. పోలీసులను చూసి లాడ్జిపై నుంచి దొంగలు కిందికి దూకారు. ఈ ఘటనలో ఓ దొంగకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన దొంగను చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని రాజాపూర్ గ్రామంలో గుంటి రంగనాథ స్వామి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీలను అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్. అబ్రహం తనయుడు డాక్టర్. అజయ్ ప్రారంభించారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి పోటీలను తిలకించేందుకు జనం తరలివచ్చారు. ఆలయ సమీపంలోని శసువిశాలమైన మైదానంలో పోటీలను ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పోటీల్లో పాల్గొనేందుకు ఎద్దులను తీసుకొచ్చారు. మైదానంలో పోటీలు ఆసక్తికరంగా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో ఉత్సవాల నిర్వాహకులు, బీఆర్ఎస్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'ఆకట్టుకున్న బండలాగుడు పోటీలు'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: ప్రభుత్వంలో చేరేందుకు రండి అని ఎవరైనా ఎవర్ని పిలుస్తారో తెలుసా.? కానీ భిన్నంగా శ్రీలంకదేశాధినేత ప్రతిపక్ష పార్టీలను ప్రభుత్వంలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక, ఆహార సంక్షోభం ఆ దేశాన్ని పతనావస్థకు తీసుకుపోతోంది. ప్రజాగ్రహంతో లంక అట్టుడుకుతోంది. మరోవైపు ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక శ్రీలంక పార్లమెంటులోని కేబినెట్ మంత్రులందరూ నిన్న రాజీనామా చేశారు. ఈ క్రమంలో కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మంత్రివర్గంలో చేరాలంటూ ప్రతిపక్ష పార్టీలకు దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స లేఖలు రాశారు. ప్రపంచంలో చోటు చేసుకున్న పరిణామాలు, దేశంలోని అనేక ఆర్థిక కారణాల వల్ల శ్రీలంకలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని లేఖలో గొటబాయ తెలిపారు. ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే మనమందరం కలసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. భావి తరాల అభ్యున్నతి, దేశ ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని కోరారు. కేబినెట్ లో చేరి, మంత్రి పదవులు స్వీకరించాలని అన్నారు. మరోవైపు, శ్రీలంక కేంద్ర బ్యాంకు గవర్నర్ అజిత్ నివర్ద్ కాబ్రాల్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రులందరూ రాజీనామా చేసిన నేపథ్యంలో, తాను కూడా తప్పుకుంటున్నానని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'ప్రభుత్వంలో చేరేందుకు రండి: శ్రీలంక దేశాధినేత పిలుపు'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను ఆదివారం రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ ఎం. హరిజవహర్లాల్ దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన కమిషనర్కు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థానం అధికారులు, అర్చకులు, వేదపండితులు ఆల య మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం హరిజవహర్లాల్ స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'మల్లన్న సన్నిధిలో దేవదాయశాఖ కమిషనర్'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: మహిళా సంక్షేమ సంబరాల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దశాబ్ది ఉత్సావాలలో భాగంగా మహిళా సంక్షేమ దినోత్సవ సంబురాలు జి ఆర్ కె గార్డెన్స్ లో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాహిళా లోకం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. మహిళా సంక్షేమం గురించి వివరించే పథకాల స్టాళ్లను సందర్శించారు. అనంతరం జ్యోతిని వెలిగించి మహిళా సంక్షేమ దినోత్సవం సంబురాలను ప్రారంభించారు. చిన్నారుల ఆట-పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మంగళవారం తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సంక్షేమానికి దేశంలో మరే ఇతర రాష్ట్రం ప్రవేశపెట్టని విప్లవాత్మక పథకాలను, కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నదనారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు, భద్రతకు, వారు అన్ని రంగాలలో రాణించేందుకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో చంద్రకళ, బండ్లగూడ మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, నార్సింగ్ చైర్ పర్సన్ రేఖ, జడ్పిటిసి తన్విరాజ్, ఎంపీపీ జయమ్మ, ఎంపీటీసీలు, సర్పంచులు, మహిళా సంఘాలు, ఆశ వర్కర్లు, మహిళా ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, బారాస నాయకులు పాల్గొన్నారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరిన గులాబీ నేత పొంగులేటి బాటలో మరో ఇద్దరూ నేతలు నడవనున్నారు. మాజీ మంత్రి తుమ్మల, జలగం వెంకట్రావ్ కాంగ్రెస్లోకి వెళ్లనున్నట్లు ప్రచారం నడుస్తుంది. అలా జరిగితే కొత్తగూడెంలో జలగం, ఖమ్మంలో పొంగులేటి, పాలేరులో తుమ్మల పోటీ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కొద్దిరోజుల్లో ప్రకటన వెలువడనుంది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'ఖమ్మం కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరిగే చాన్స్'.
2
['tel']
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: సీఎం పదవి కోసం పన్నీర్ వర్గం పట్టు
చెన్నై :అన్నాడీఎంకేలోని రెండు గ్రూపుల మధ్యా చర్చలు ప్రారంభమయ్యాయి. సమష్టిగా పని చేసి ప్రభుత్వం, పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో రెండు గ్రూపులూ సమావేశమయ్యాయి. అయితే సీఎం పదవి కోసం పన్నీర్ సెల్వం వర్గం పట్టుబడుతుండగా పళని స్వామి వర్గం మాత్రం అందుకు ససేమిరా అంటున్నది. అలాగే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి విషయంలో కూడా ఇరు వర్గాల మధ్యా చర్చలలో పీటముడి పడినట్లు తెలుస్తోంది.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: దేశ చరిత్రలో నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు. మహిళలకు రిజర్వ్ చేస్తూ చట్టం చేసి మరీ పదవులు ఇచ్చిన ఘనత ఒక్క సీఎం వైఎస్ జగన్దేనని కొంతమంది రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. వైసీపీ ప్లీనరీ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. 2019 ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే సామాజిక న్యాయ సాధనకు నడుం బిగించారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందించి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో పేదరికాన్ని నిర్మూలించాలని, ఆ వర్గాల పిల్లలకు ఉన్నత విద్య అందించాలని ప్రణాళిక రచించి, వాటిని ఆచరణలోకి తెచ్చారు. 2019 జూన్ 8న తొలిసారి 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో (14 మందితో 56 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశం ఇచ్చి, సామాజిక విప్లవానికి తెరతీసి. నవశకానికి నాంది పలికారు. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు (80 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. దేశ చరిత్రలో తొలి సారిగా ఎస్సీ మహిళను హోం శాఖ మంత్రిగా నియమించారు. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గాలకు అవకాశం ఇచ్చారు. ఎలా ఎన్నో చేసి చరిత్రలో నిలిచిపోయారు అని తెలియజేసారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'ఎస్సీ మహిళను హోం శాఖ మంత్రిగా నియమించింది జగన్ ప్రభుత్వమే'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: శ్రీలంక దేశంలో చెయిదాటిన పరిస్థితులు నియంత్రణలోకి మాత్రం రావడంలేదు. దీంతో శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ విధించారు. ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళన మరింత ఉధృతమైంది. ఈ క్రమంలో అధ్యక్షుడు గోటబయ రాజపక్ష ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ప్రకటించారు. దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక , విద్యార్థి సంఘాలు శుక్రవారం దేశవ్యాప్త సమ్మెను చేపట్టాయి. ఇందులో భాగంగా పార్లమెంట్ను ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ గన్స్ను ప్రయోగించారు. అయినా వారిని నిలవరించడం పోలీసులకు కష్టమైంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని రాజపక్సే ప్రభుత్వాన్ని దిగిపోవాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు దేశంలోని లక్షలాది మంది కార్మికులు విధులు బహిష్కరించారు. ఒక్కటి తప్ప మిగిలిన అన్ని రైలు సర్వీసులు రద్దు చేయబడ్డాయి. చాలా బస్సులు రోడ్లు ఎక్కలేదు. కార్మికులు తమ ఫ్యాక్టరీల్లో ప్రదర్శనలు చేశారు. దేశవ్యాప్తంగా నల్ల జెండాలు వేలాడదీశారు. కొన్ని నెలలుగా అక్కడ ఆహారం, ఇంధన, ఔషధాల కొరత ఉంది. దీంతో నిత్యావసరాల వస్తువులు ఆకాశాన్నంటాయి. ఫలితంగా 22 మిలియన్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాంతో సామాన్య ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా అస్తవ్యస్థం కావడానికి అధ్యక్షుడి విధాన తప్పిదాలే కారణమని మండిపడ్డారు. దీంతో శ్రీలంక రాజధాని కొలంబోలో ఎప్పటి నుంచో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని తక్షణం దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాగ్రహాన్ని గుర్తించిన ప్రతిపక్షాలు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయి. ప్రభుత్వంపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. స్వతంత్రం వచ్చిన ఇన్నాళ్లకు శ్రీలంక దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ప్రభుత్వం చేసిన అప్పులు, కోవిడ్, లాక్డౌన్ వంటి పరిణామాలతో శ్రీలంక ఆదాయానికి గండి పడింది. దాంతో విదేశీ కరెన్సీ నిల్వలు తరిగి. తీవ్రమైసన ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలో మొదటిసారి ప్రభుత్వం ఏప్రిల్ ఒకటో తేదీన ఎమర్జెన్సీ విధించింది. తర్వాత ఐదు రోజుల్లోనే ఉపసంహరించుకుంది. మళ్లీ ఇప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'నియంత్రణలోనికి రాని పరిస్థితులు...శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: కన్నాలక్ష్మీనారాయణపై మండిపడ్డ మల్లాది విష్ణు
వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై మండిపడ్డారు .కన్నా లక్ష్మీనారాయణ టీడీపీకి బీ టీమ్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అద్భుతమైన పాలన అందిస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ విధి విధానాలను కన్నా లక్ష్మీనారాయణ పరిశీలిస్తే బాగుండేదన్నారు. నాలుగున్నర నెలల్లోనే గవర్నర్ కు ఫిర్యాదు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈబీసీ రిజర్వేషన్లపై కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటిస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. కన్నా లక్ష్మీనారాయణ గత ప్రభుత్వంలో వైఫల్యాలపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు. బీజేపీలో చేరిన తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. వారి వల్లే బీజేపీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం పారదర్శకమైన ఇసుక విధానాన్ని అమలు చేస్తుందని తెలిపారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: టోల్ గేట్ వద్ద భారీ బందోబస్తు
నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద గన్నవరం డిఎస్పీ విజయపాల్ ఆధ్వర్యంలో, పోలీసు భారీ బందోబస్తు తో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
1
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: మోకాళ్లపై నిలబడి జీపే కార్మికుల నిరసన ఎన్కూరు మండల కేంద్రంలో 30 రోజులుగ సమ్మె చేస్తున్న కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం ప్రధాన రహదారిపై మోకాళ్లమీద నిలబడి నిరసన వ్యక్తంచేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. అనంతరం కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుర్రం రవి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. కనీస వేతన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'మోకాళ్లపై నిలబడి జీపే కార్మికుల నిరసన'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: జీహెచ్ఎంసీలో బతుకమ్మ వేడుకలకు మేయర్
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. మంగళవారం సాయంత్రం జరిగిన బతుకమ్మ సంబరాలకు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి, హబ్సిగూడ కార్పొరేటర్ చేతన, రామంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి నగరంలోని ఇతర కార్పొరేటర్లు, మహిళా అధికారులు పాల్గొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: ఏపీ రాజధాని కోసం పోరాడుతున్న 'అమరావతి పరిరక్షణ సమితి'కి పలు రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతూ ఏర్పడ్డ జేఏసీ పోరాటాన్ని ఉద్ధృతం చేసింది. తాజాగా విజయవాడలో జరిగిన జేఏసీ సమావేశంలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ. వైసీపీ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. రాజధానిపై మాట్లాడకూడదా ?. ప్రతిపక్షాలు సమావేశాలు జరుపుకోకూడదని కాని, బస్సు యాత్రలు జరుపుకోకూడదని కాని ఎక్కడైనా వుందా? అని ప్రశ్నించారు. నిన్న రాత్రి రైతుల బస్సుయాత్రను అడ్డుకున్న ప్రభుత్వం తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. సమస్య వచ్చిందని జేఏసీని ఏర్పాటు చేసుకున్నామన్నారు. జేఏసీ ఏర్పాటుపై చంద్రబాబుపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ మెయిల్ చేయడం మానాలని పేర్కొన్నారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని అసెంబ్లీలో పేర్లను చదివిన మంత్రులు కేసులు నమోదుచేసి ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ. వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధిని కొనసాగించాలన్నారు. సీఎం జగన్ సహనంతో ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'రాజధానిపై మాట్లాడకూడదా ? : సిపిఐ నేత రామకృష్ణ'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్
తెలంగాణలో గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాల కోసం ప్రిపేరవుతున్న మైనారిటీ అభ్యర్ధులకు ఉచితంగా కోచింగ్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇందుకోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ డిస్ట్రిక్ట్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్ మహమ్మద్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. మొత్తం 90 రోజుల పాటు హైదరాబాద్ లో ఈ కోచింగ్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. మే మొదటి వారంలో కోచింగ్ క్లాసులు ప్రారంభం అవుతాయని తెలిపారు. గ్రూప్ 1,2,3 అభ్యర్ధులకు ఉమ్మడిగా, గ్రూప్ 4 అభ్యర్ధులకు విడిగా తరగతులు నిర్వహించనున్నారు. ముందస్తు దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఏప్రిల్ 18 ఉ.10.30 గంటల నుంచి ఏప్రిల్ 30 సా.5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన మైనారిటీ అభ్యర్ధులు పోస్టు లేదా ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా: ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ మైనారిటీస్ వెల్ఫేర్ ఆఫీసర్, హైదరాబాద్ #606, 6వ ఫ్లోర్, హజ్జీ హౌస్, ఆపోజిట్ పబ్లిక గార్డెన్, నాంపల్లి, హైదరాబాద్. లేదా తెలంగాణ స్టేట్ మైనారిటీస్ స్టడీ సర్కిల్, 3మ ఫ్లోర్, జామియా నిజామియా కాంప్లెక్స్, గన్ఫౌండ్రీ, హైదరాబాద్ అడ్రస్లకు దరఖాస్తులు పోస్టు చేయవచ్చు. ఈమెయిల్: [email protected]
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: దాల్చిన చెక్కతో అనేక లాభాలు
దాల్చిన చెక్కలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడంలో మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాల్చిన చెక్కను ఆహారంలో తీసుకోవడం వల్ల జీవక్రియ పెరగడమే కాకుండా ఊబకాయాన్ని త్వరగా దూరం చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు దాల్చిన చెక్కను తీసుకోవచ్చు. జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం హైదరాబాద్లోని లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షురాలు వైయస్ షర్మిలతో కలిసి ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఇలా చేస్తే కరోనాను తరిమికొటొచ్చు అంటున్న సైకాలజిస్టులు
మనందరికీ తెలుసు. కరోనా వైరస్ పెద్ద మేటరేమీ కాదని. జాగ్రత్తలు తీసుకుంటే అది మన జోలికి రాదు. ఒకవేళ వచ్చినా ఏమీ కాదంటున్నారు సైకాలజిస్టులు. తాము చెప్పినట్లు చేస్తే. చాలా ఈజీగా ఈ వైరస్ బాడీ లోంచీ బయటకు వెళ్లిపోతుందని అంటున్నారు. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ పాజిటివ్గా ఉండాలంటున్నారు. ఎన్ని మందులు వాడినా తగ్గని రోగాలు. సంతోషంతో, పాజిటివ్ ఎనర్జీతో ఉంటే తగ్గుతున్నాయనీ, ఇదే ఫార్ములా కరోనా వైరస్కి కూడా పనిచేస్తుందని అంటున్నారు. ఇందులో సైన్స్ కూడా ఉంది. మనం సంతోషంగా, పాజిటివ్గా ఉన్నప్పుడు మన బాడీలో కణాలన్నీ ఉత్తేజంతో ఉంటాయి. అలాగే బాడీలోని మంచి బ్యాక్టీరియా కూడా ఫుల్ ఎనర్జీతో ఉంటుంది. ఇలాంటప్పుడు కరోనా వైరస్ బాడీలోకి వెళ్తే. మంచి బ్యాక్టీరియా బలంగా పోరాడి వైరస్ను తరిమికొడుతుంది. కణాలు కూడా వైరస్కి సహకరించవు. అందుకే మనం పాజిటివ్గా ఉండాలంటున్నారు. అలా ఎలా ఉండాలో కూడా చెబుతున్నారు. 1. కరోనా న్యూస్ టీవీల్లో అతిగా చూడొద్దు. జస్ట్ అప్డేట్స్ తెలుసుకొని. వేరే ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ చూడండి. 2. గతంలో జరిగిన విపత్తుల్ని తలచుకోండి. ఆ తర్వాత మనం ఎంత బలంగా మారిందీ గుర్తుచేసుకోండి. ఇదీ అంతే అనుకోండి. 3. ఫన్నీ వీడియోలు బాగా చూడండి. ఇందుకు యూట్యూబ్, టిక్ టాక్ ఉండనే ఉన్నాయి. 4. ఇంట్లో బోర్ కొడితే. ఏ డాబాపైకో వెళ్లి. చుట్టూ చూడండి. ప్రకృతిని చూడండి. సూర్యోదయం చూడండి. పాజిటివ్ వైబ్రేషన్స్ కలుగుతాయి.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: బెంగళూరులో కొత్త అపార్ట్మెంట్లు నిర్మాణాన్ని ఐదేళ్లపాటు నిషేధం విధించాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. చాలామంది అపార్ట్మెంట్లు నిర్మించి, తాగునీటి సరఫరాపై సరైన ఏర్పాట్లు చేయకుండానే విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు గుర్తించడంతో పాటు అనేక ప్రాంతాల్లోని అపార్ట్ మెంట్ వాసులు మంచినీరు దొరక్క తీవ్ర అగచాట్లు పడుతున్నారని ప్రభుత్వానికి నివేదించారు. అలాగే నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడుతున్నామని, చర్మ వ్యాధులకు గురవుతున్నామని ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదుఉ చేసిన సందర్భాలను గమనించిన ప్రభుత్వం ఇకపై కొత్త అపార్టుమెంట్లకు అనుమతలు ఇవ్వరాదని నిర్ణయించింది. ఈ విషయమై స్పందించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర మీడియాతో మాట్లాడుతూ ‘అనేకమంది అపార్ట్ మెంట్ ఓనర్లు తాగునీటి సరఫరాకు తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో అంతా మంచినీటి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. దీంతో అందుబాటులో ఉన్న నీరంతా అపార్ట్ మెంట్లకే తరలిస్తున్నారు. డబ్బులు ఎవరెక్కవిస్తే వారికే నీరు అన్నచందంగా మారి కొన్ని ప్రాంతాల్లో అసలు తాగేందుకు నీరే దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సమస్యపై తర్వలోనే ఆయా భవంతులు నిర్మించిన బిల్డర్లు, డెవలపర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ఈ క్రమంలోనే. ఐదేళ్ల పాటు అపార్ట్మెంట్ల నిర్మాణాలపై నిషేధం కూడా విధించనున్నాం’ అని పరమేశ్వర పేర్కొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'అపార్టమెంట్ల నిర్మాణానికి అనుమతులు హుళక్కి'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో గందరగోళం
ఈరోజు తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ లో గందరగోళం నెలకొంది. ఒకవైపు పెద్దపల్లి జిల్లాలో ఒకటి మరియు నల్గొండ జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు చూపించారు. అదే బులిటెన్ లో మరో వైపు గత 14 రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కానీ జిల్లాల జాబితాలో పెద్దపల్లి మరియు నల్గొండ జిల్లా చూపించారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తప్పుని సరిదిద్దుకొని ఓ గంట వ్యవధిలో కొత్త హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: రైల్ విహార్ కాలనీలో సిలిండర్ పేలి యువకుడు మృతి
హైదరాబాద్ శివారు రైల్ విహార్ కాలనీలో సిలిండర్ పేలి యువకుడు మృతి చెందాడు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్ కు చెందిన అంబాల నాయక్ , కన్నయ్యలాల్ , మాధవ్ కుల్ఫీ ఐస్ క్రీమ్ విక్రయిస్తూ జీవిస్తున్నారు. వీరు రాత్రి ఐస్ క్రీమ్ , బాదంపాలు తయారు చేసిన తర్వాత.సిలిండర్ ఆపేయకపోవటంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగి పేలిపోయిందని వెల్లడించారు. పేలుడు ధాటికి ఇళ్లు పైకప్పు కూలిందన్నారు.
1
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: ఓ కేసులో కోర్టు విచారణకు పదేపదే డుమ్మా కొడుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 9వ తేదీలోపు వారెంట్ను అమలు చేయాలని ములుగు పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అలాగే, వేర్వేరు కేసుల్లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, మచ్చా నాగేశ్వరావు నిన్న కోర్టుకు హాజరయ్యారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డిలకు కోర్టు సమన్లు జారీ చేసింది. హెరిటేజ్ సంస్థ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావుపై నమోదైన మూడు కేసులను కోర్టు కొట్టివేసింది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'ఎమ్మెల్యే సీతక్కకి భారీ షాక్... నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ'.
2
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: మెదక్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ సోమవారం మెదక్ జిల్లా మనోహరబాద్ మండలంలోని పోతారం గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతు. తెలంగాణలోని ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరం ఉన్నవారికి కంటి ఆపరేషన్స్ కూడ నిర్వహించి పేదల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, కేసిఆర్ పాలనలో ప్రజలు సంతోషాలతో ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపిలు కల్లూరి హరికృష్ణ , నవనీత రవి, ఎంపిడివో యాదగిరి, వైస్ ఎంపిపి విఠల్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు మహేష్, పార్టీ సీనియర్ నాయకులు మన్నే నాగరాజు, సర్పంచ్ మాధవ రెడ్డి, ఉప సర్పంచ్ వీరేశం, నాయకులు ప్రభాకర్ రెడ్డి, మహేందర్, మహేందర్ గౌడ్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'కంటి వెలుగు ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న 45 రోజులకు చేరుకుంది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేరిస్తేనే. తాము సమ్మె విరమిస్తామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. అయితే కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు తమ నిరసనను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్టీసీ కార్మికులు. తెలంగాణ మంత్రులు తమ సమస్యలను పట్టించుకోకుండా సీఎం కేసీఆర్కు భజన చేస్తున్నారని ఆరోపిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్తో పాటు మంత్రుల ముఖాలతో కూడిన మాస్క్లు ధరించారు. మంత్రులంతా సీఎం కేసీఆర్కు భజన చేస్తున్నట్టుగా చిత్రీకరించారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'కేసీఆర్కు మంత్రుల భజన... ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన'.
2
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: సచివాలయ కన్వీనరు, గృహసారథలు పా ర్టీకి రథసారథులని మార్కాపురం ఎమ్మెల్యే కె.నాగార్జున రెడ్డి అన్నారు. డ్వాక్రా బజార్లో బుధ వారం 18 నుంచి 35 వార్డులకు చెందిన గృహ సారథులు, కన్వీనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికీ అందేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం వారికి కిట్లను పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిశీలకులు షేక్ హబీబుల్లా, చైర్మన్ సీహెచ్ బాలమురళీకృష్ణ, వైస్చైర్మన్ షేక్ ఇస్మాయిల్, అంజమ్మ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'మీరే మాకు అండ'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భారీ సంఖ్యలో బస్సు సర్వీసులను పెంచింది.ఈ సీజన్లో 6 వేల 970 ప్రత్యేక సర్వీసులను నడపనుంది.వాటిలో పండుగ ముందు 4 వేల 145 స్పెషల్ సర్వీసులు…ఫెస్టివల్ తర్వాత 2వేల 825 బస్సులు నడపనుంది. గత ఏడాది కంటే ఈసారి 35 శాతం అధికంగా బస్సులు రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు స్మారకార్థం ఈ నెల 28న ప్రత్యేకంగా రూ.100 నాణేన్ని ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా. కేంద్రం రూపొందించిన రూ.100 నాణేన్ని. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన అతిథుల జాబితాలో ఎన్టీఆర్ భార్య అయిన తన పేరు కూడా చేర్చాలని లక్ష్మీపార్వతిరాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఎన్టీఆర్తో తన వివాహం, ఎన్నికల్లో గెలుపు, చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యుల కుట్రలు అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ప్రస్తావించారు. ఆహ్వానితుల జాబితాలో తన పేరు చేర్చకుండా చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులను పిలవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ భార్యనైన తనను ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించలేదని. వెంటనే జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని లక్ష్మీపార్వతి లేఖలో కోరారు. భార్యగా తానే అసలైన వారసురాలినని లేఖలో పేర్కొన్న లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ పేరుపై రూ.100 నాణెం విడుదల చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబం ఈ నెల 28న ఢిల్లీకి తరలివెళ్తోంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ పిలిచే బాధ్యతను కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి అప్పగించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఎన్టీఆర్ కుటుంబంలో కొడుకులు, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం చంద్రబాబు ఈ నెల 27 సాయంత్రమే ఢిల్లీ వెళ్తున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులు 28న ఉదయం ఢిల్లీకి చేరుకొంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హాజరవుతారా లేదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. లోకేష్ మాత్రం తన పాదయాత్ర కార్యక్రమం వల్ల హాజరు కావడం లేదు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు ఆయనతో పరిచయం ఉన్న మరి కొందరు ప్రముఖులను కూడా పురందేశ్వరి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. నలభై నాలుగు మిల్లీ మీటర్ల చుట్టు కొలతతో ఉండే ఈ నాణాన్ని వెండి, రాగి, నికెల్, జింక్తో తయారు చేశారు. ఈ నాణేనికి ఒకవైపు మూడు సింహాలతోపాటు అశోక చక్రం ఉంటుంది. రెండో వైపు ఎన్టీఆర్ చిత్రం ముద్రించారు. దాని కింద హిందీ భాషలో నందమూరి తారక రామారావు శత జయంతి అని ముద్రించారు. మరోవైపు ఈ నెల 28న చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలవాలన్న ప్రయత్నంలో ఉన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ '28న ఎన్టీఆర్ నాణెం విడుదల,రాష్ట్రపతికి లక్ష్మీ పార్వతి లేఖ'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఏపీలో ఏరులై పారుతున్న నాటుసారా
జగన్ వరుస నిర్ణయాలతో మద్యం ప్రియులకు మింగుడుపడటం లేదు. ఇవన్నీ ఇలా ఉంటె "మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా. " ధరల పెంపు. బార్లలో మద్యం ధరలను ప్రభుత్వం మరింత భారీగా పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించడం. ఇప్పటి వరకు ఉన్న మద్యం దుకాణాలను 50 శాతానికి తగ్గించాలని నిర్ణయించడం, బార్ల సంఖ్యను కూడా మరో నలభైశాతానికి తగ్గించాలని ఆదేశాలివ్వటంతో రాష్ట్రంలోని 798 బార్లను ఇక 400 పైచిలుకు వరకు మాత్రమే ఉంటాయి. దీనికి తోడు ఇప్పటికే గతాన్ని మించిన ఎమ్మర్పీ ధరలు మద్యం బాటిళ్లపై ఉన్నా, అమ్మకాలలో మాత్రం మరి 30 రూపాయల వరకు హెచ్చుగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ విషయమై మద్య నిషేధ అధికారులని ప్రశ్నిస్తే. ప్రభుత్వం అమ్మమన్న ధరలకే అమ్ముతున్నామని తప్పించుకుంటున్నారు. అలాగే రాత్రి 8 గంటల వరకే మద్యం షాపులు ఉండటంతో కొందరి పంట పడినట్టే కనిపిస్తోంది. పరిమిత మద్యం అమ్మకాలని చెపుతున్నా కేసుల కొలది బాటిళ్లు కొందరి ఇళ్లకి తరలిపోతున్నాయని, వీరంతా ప్రతి మద్యం బాటిల్కు 30 నుంచి 50 వరకు అధికంగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అలాగే బార్లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం విక్రయాలు జరిగేలా నిర్నయించగా, రెస్టారెంట్లకు మాత్రం 11 గంటల వరకు అనుమతినిస్తారు. స్టార్ హోటళ్లలో రాత్రి 11 గంటల వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఉంది.దీంతో సమయపాలనతో మందుబాబుల జేబులు చిల్లయ్యి, మద్యం మానేస్తారని ప్రభుత్వం చెపుతుంటే. దీన్నే అందుకున్నకొందరు మద్యం వ్యాపారులు క్యాష్ చేసుకోవటం ఆరంభించారు. నాసిరకం నాటుసారాని తయారుచేసి బాటిళ్లలో నింపి తక్కువధరలకే అమ్మేస్తున్నారు. ఉదాహరణకు అనంతపురంలో ఒక మాజీ సర్పంచ్ మారుతి ప్రసాద్ దగ్గర 7వేల లీటర్ల నాటుసారాను ఏక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారంటే. పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇక గిరిసీమలకు దగ్గరలో ఉన్న పట్టణాలలో నాటు సారా ఏరులై పారుతోంది. మద్యం ధరలు పెంచి మద్య నియంత్రణ సాధించామని చంకలు గుద్దుకుంటున్న జగన్ సర్కార్ తీరు ఇలాగే కొనసాగితే మరింతగా ఈ నాటుసారా అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి "నాటుసారా" తయారీపై కఠినంగా వ్యహరించకపోతే మద్యం పాలసీ అబాసుపాలు అవడం ఖాయమన్నది నిపుణుల మాట.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: మురుకుల మిషన్లో బంగారం స్మగ్లింగ్
చెన్నై: మురుకులు ఒత్తే మిషన్లో బంగారం కడ్డీలను స్మగ్లింగ్ చేస్తూ ప్రయాణికుడు పట్టుబడ్డాడు. ఈ సంఘటన చెన్నై ఎయిర్పోర్టులో చోటు చేసుకుంది. రూ.21.3 లక్షల విలువైన 555 గ్రాముల బంగారంను ఆరు కడ్డీలుగా చేసి మురుకులు ఒత్తే పాత్రలో తీసుకొస్తుండగా చెన్నై ఎయిర్పోర్టులో కస్టమ్ అధికారులు పట్టుకున్నారు. బంగారం తరలిస్తున్న వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: విద్యుత్షాక్తో యువకుడు మృతి
ప్రకాశం జిల్లా, బల్లికురవ మండలంలోని నక్కబొక్కలపాడు సమీపంలో ఉన్న ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు విద్యుత్షాక్తో ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడు శివరాజ్ (28) మృతి చెందాడు. అందిన సమాచారం మేరకు గ్రానైట్ ఫ్యాక్టరీలో పనులు చేస్తుండగా మిషనరీకి విద్యుత్ ప్రసరణ కావడంతో గురువారం రాత్రి శివరాజ్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. వెంటనే తోటి కార్మికులు, ఫ్యాక్టరీ నిర్వాహకులు శివరాజ్ను మార్టూరు వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: జమ్మూకాశ్మీర్ లో ఒక ఉగ్రవాది అరెస్టు
జమ్మూకాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని సోపోర్లో ఉగ్రవాదిని పోలీసులు మరియు భద్రతా దళాలు అరెస్టు చేసారు. అతని వద్ద నుండి ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ పోలీసులు మంగళవారం తెలిపారు.ఉగ్రవాదిని వార్ మొహల్లా గుండ్ బ్రాత్ నివాసి ఒవైస్ అహ్మద్ మీర్గా గుర్తించారు.మ్యాగజైన్ మరియు ఒక చైనీస్ గ్రెనేడ్తో సహా నేరారోపణ చేసే పదార్థాలు, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటన పేర్కొంది.మదీనా బాగ్ మోహ్, డేంగర్పురా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికికి సంబంధించి నిర్దిష్ట ఇన్పుట్ ఆధారంగా, సోపోర్ పోలీసులు మరియు ఆర్మీ (22RR) సంయుక్తంగా కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించాయి.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: అయ్యన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనీ డిమాండ్
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. టీడీపీ నేతలకు దమ్ము, ధైర్యముంటే అయ్యన్నని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. నిర్భయ చట్టం కింద అయ్యన్నపై కేసు నమోదైతే ఎందుకు వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు.
1
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: డోక్లామ్లో గ్రామం ఖాళీ చేయించిన ఆర్మీ!
న్యూఢిల్లీ: ఇండియా యుద్ధానికి సిద్ధమవుతున్నదా? ఇండియన్ ఆర్మీ తీసుకుంటున్న చర్యలు ఆ దిశగా సంకేతాన్నిస్తున్నాయి. ఇండియా, చైనా, భూటాన్ ట్రైజంక్షన్ దగ్గర ఉన్న వివాదాస్పద ప్రాంతం డోక్లామ్ దగ్గర ఉన్న గ్రామాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఆర్మీ ఆదేశించింది. నాతంగ్ అనే ఈ గ్రామంలో కొన్ని వందల మంది నివసిస్తున్నారు. వీళ్లంతా వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆర్మీ స్పష్టంచేసింది. డోక్లామ్కు ఈ గ్రామం 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవేళ యుద్ధం జరిగితే పౌరులు గాయపడకుండా ముందు జాగ్రత్తగా గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నారా లేదా సుక్నా నుంచి డోక్లామ్ వైపు వెళ్తున్న 33 కార్ప్కు చెందిన వేల మంది సైనికులకు ఇక్కడ బస ఏర్పాటు చేస్తారా అన్నది స్పష్టంగా తెలియలేదు. ఈ ప్రాంతంలో భారీగా బలగాలు వస్తున్నాయని గ్రామస్థులు వెల్లడించారు. అయితే ప్రతి ఏడాది సెప్టెంబర్లో ఇలా బలగాల తరలింపు జరగడం సాధారణమేనని, ఈసారి మాత్రం కాస్త ముందుగానే తరలిస్తున్నట్లు సీనియర్ మిలిటరీ అధికారులు చెప్పారు. అయితే మిలిటరీ మాత్రం నో వార్ (యుద్ధం), నో పీస్ (శాంతి) అన్న మూడ్లో ఉన్నారని వాళ్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా చైనీస్ మీడియా యుద్ధానికీ సిద్ధమంటూ ఊదరగొడుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కూడా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నది. రెండు దేశాల బలగాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి అని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ తమ ఎడిటోరియల్లో రాసింది.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాదరావులు పాల్గొన్నారు. దాదాపు 50 ఎకరాల చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన చెరువుకి తారకరామా సాగరంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల ఎన్టీఆర్ సాగర్లో బోటులో విహరించారు. అనంతరం చెరువు పక్కనే పది ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్, వావిలాల ఘాట్లను చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రాయపాటి, మంత్రి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: న్యూఢిల్లి : బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ 186 దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపామని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. 192 దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరపాలని ఆలోచించామని, 186 దేశాలతో చర్చలు జరిపామని ఆమె అన్నారు. విదేశాంగ శాఖవిజయాలపై ప్రచురించిన గ్రంథాన్ని సుష్మా స్వరాజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వికె సింగ్, ఎంజె అక్బర్ తదితరులు పాల్గొన్నారు. మన నేతలు చాలా దేశాల్లో పర్యటించలేదని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యామని ఆమె చెప్పారు. వివిధ దేశాల్లో చిక్కుకున్న 90 వేల మంది భారతీయులను రక్షించామని ఆమె చెప్పారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ '186 దేశాలతో ద్వైపాక్షిక చర్చలు జరిపాం : సుష్మా స్వరాజ్'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: భారత దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,15,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 630 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,28,01,785కు చేరినట్లు బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 8,43,473 యాక్టివ్ కేసులుండగా. కరోనా నుండి ఇప్పటి వరకు 1,17,92,135 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటి వరకు 1,66,177 మంది మృతి చెందారు. కాగా ఇప్పటి వరకు 8,70,77,474 మంది టీకా వేసుకున్నారని అధికారులు తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'భారత్లో గడిచిన 24 గంటల్లో 1,15,736 కరోనా కేసులు'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను రాయండి: వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించే బాధ్యత సీఎం కేసీఆర్ తనకు అప్పగించారని ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి తెలిపారు. యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని సూచించారన్నారు. ఇవాళ అధికారులతో కలిసి ఆలయ మాస్టర్ లేఅవుట్ను పరిశీలించిన ఆనందసాయి. సీఎంతో కలిసి మరోసారి వస్తానని చెప్పారు. మరో 15 రోజుల్లో ఆలయ అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేస్తానని పేర్కొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'ఆనందసాయికి వేములవాడ అభివృద్ధి బాధ్యతలు'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: అమరావతి ప్రాముఖ్యతను తెలిపేలా ఏపీలో పదో తరగతి తెలుగు పుస్తకంలో రూపొందించిన పాఠాన్ని అధికారులు సిలబస్ నుంచి తొలగించారు. తెలుగు పుస్తకంలో రెండో పాఠంగా అమరావతిని గత ప్రభుత్వ హయాంలో ముద్రించారు. ప్రస్తుత ప్రభుత్వం 3 రాజధానులను తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు అమరావతి పాఠాన్ని ఈ ఏడాది సిలబస్ నుంచి తొలగించారు. ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున విద్యార్థులపై భారం పడకూడదని వివిధ సబ్జెక్టుల్లో కొన్ని పాఠాలను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. సిలబస్ భారం తగ్గించాలంటే పుస్తకం చివర్లోని పాఠాలను తొలగించే వీలుండగా కావాలనే అమరావతిని తీసివేశారని పలువురు అంటున్నారు. టెన్త్ విద్యార్థులకు ఈ నెల 4 నుంచి ప్రీ పబ్లిక్ పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి, వెన్నెల పాఠాలు మినహాయించి మిగిలినవి చదువుకుని పరీక్షలకు సిద్ధం కావాలని టీచర్లు చెబుతున్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: బందరు పోర్టు పనులకు ముహూర్తం ఖరారు
మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల ప్రారంభానికి ఎట్టకేలకు మహూర్తం ఖరారైంది. పోర్టు పనులను 2023 జనవరి 15న ప్రారంభించాలని ఏపీ మారిటైం బోర్డు నిర్ణయించింది. దీనిపై ముఖ్యమంత్రి అనుమతి కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ పోర్టును రూ.5300 కోట్ల వ్యయంతో మేఘా కంపెనీ నిర్మించనుందని సమాచారం. ఈ పోర్టు నిర్మాణానికి గతంలో 3 సార్లు టెండర్లను పిలవగా, ఏటా డ్రెడ్జింగ్ పనులపై భారీగా ఖర్చు చేయాలని ఏ సంస్థ ముందుకు రాలేదు. దీనిపై విదేశాల్లో అనుసరించే విధానాలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య
మానసిక స్థితి బాగోలేని తల్లి బిడ్డను చంపి తానూ ఉరి వేసుకుంది. ఈ విషాదకర ఘటన నిజామాబాదు జిల్లా హుకుంపేట మండలంలో చోటుచేసుకుంది. తడిగిరిలో అరిచేల వాసుదేవ్, భార్య రాధిక (31), నాలుగు నెలల కుమార్తెతో కలిసి జీవిస్తున్నాడు. కొన్నాళ్లగా రాధిక మానసిక స్థితి సరిగ్గా లేదు. ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గడిపేది. మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో 4 నెలల చిన్నారిపై తలగడ పెట్టి చంపి తాను దూలానికి చీరతో ఉరేసుకుంది.
1
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: మేడ్చల్ జిల్లా, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ ఈదమ్మ ఆలయాన్ని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కౌన్సిలర్లు, ఆలయ కమిటీ చైర్మన్ బోదాస్ వెంకటేశ్ తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఇదమ్మ తల్లి దయతో ప్రజలు ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని. రైతు బాంధవుడు అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అమ్మవారిని కోరుకున్నారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి మంత్రి చామకూర మల్లారెడ్డి వచ్చే ఎలక్షన్లలో భారీ మెజారిటీతో గెలవాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈదమ్మ దేవాలయం కమిటీ సభ్యులు, తెరాస సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'ఈదమ్మ దేవాలయాన్ని దర్శించిన మంత్రి మల్లారెడ్డి'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: ఇల్లందు పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని 3వార్డులో 13 లక్షలతో అలాగే 12 వార్డులో 13 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ బస్తీ దావఖానాలు ఇల్లందు శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ నిరుపేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా బస్తి దవాఖానాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉచిత వైద్యం, సంప్రదింపులు, నిపుణుల సేవలు, రోగనిర్ధారణ పరీక్షలు, టెలిమెడిసిన్ సౌకర్యాలు కూడా అందిస్తూ బస్తీ దావఖానాలు పేదలకు వరంగా మారాయి అన్నారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలను అమలు చేస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తూ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పథకాలు చేరుతున్నాయి అంటే అది ఒక సీఎం కేసీఆర్ ప్రభుత్వం వల్ల సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి పులిగండ్ల మాధవరావు, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ అంకుశవాలి, స్థానిక12వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి సిలివేరి అనిత, 3 వార్డు కౌన్సిలర్ మరియు ఫ్లోర్ లీడర్ కొకు నాగేశ్వరావు, డిస్టిక్ మెడికల్ & హెల్త్ ఆఫీసర్, శిరీష్, ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ కవిత, 11 వార్డ్ కౌన్సిలర్ J. K శీను, 13 వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి కడగంచి పద్మా, ఇల్లందు పట్టణ నాదెండ్ల శ్రీనివాస్ రెడ్డి, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి జిల్లా నాయకులు సిలివేరి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు పెండ్యాల హరికృష్ణ, పివి కృష్ణారావు, పర్రె శీను. ఎస్కే పాషా, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారవు రాజేష్, రాకేష్, సతీష్, ఇల్లందు పట్టణ అధ్యక్షురాలు శ్రీమతి నెమలి ధనలక్ష్మి, కో ఆప్షన్ సభ్యులు కొక్కు సరిత , మరియు ఇల్లందు పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'పేద ప్రజలకు నిరంతరం బస్తి దవాఖానాతో వైద్య సేవలు: ఎమ్మెల్యే'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: కూలిన మిగ్-21 యుద్ధవిమానం
శ్రీనగర్: ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన మిగ్-21 యుద్ధవిమానం బుధవారం ఉదయం కుప్పకూలిపోయింది. జమ్ము కశ్మీర్ బుద్గాం జిల్లాలోని గారెండ్ కలాన్ గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. సాంకేతిక సమస్యల కారణంతోనే ఫైటర్ జెట్ క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్మీ ఎయిర్బేస్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలిన ఘటనపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ దర్యాప్తునకు ఆదేశించింది.
1
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: అదృశ్యమైన సుమేధా సైకిల్ నాలా వద్ద లభ్యం...
మేడ్చల్, మల్కాగ్జిరి జిల్లాలో పదేళ్ల బాలిక అదృశ్యమైంది. నిన్న సాయత్రం సైకిల్ తీసుకుని బయటకు వెళ్లిన సుమేధా కాపూరియా మళ్లీ ఇంటికి రాలేదు. నెరేడ్మెట్ నాలా వద్ద బాలిక కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. బాలిక సైకిల్ను నాలా వద్ద గుర్తించారు. సుమేధా కాపూరియా కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమీపంలోని సీపీ కెమెరాల పుటేజీలను పరిశీలించినప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదు. ఆమె కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: అశ్వర్తమ్మ మృతి కి నివాళులర్పించిన సవితమ్మ
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం పెద్దగువ్వలపల్లి గ్రామం టీడీపీ కుటుంబ సభ్యులు ఉప్పర సుబ్బరాయుడు భార్య అశ్వర్తమ్మ అనారోగ్యంతో బాధపడుతూ చనిపోగా విషయం తెలుసుకున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ సుబ్బరాయుడు ఇంటికి వెళ్లి అశ్వర్తమ్మ భౌతిక కాయనికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె వెంట టీడీపీ నాయకులు మాధవ నాయుడు, మాజీ ఎంపీపీ నరసింహులు, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి వీరాంజీనేయులు, తిరుపాల్ నాయుడు, క్రిస్టప్ప, మాజీ ఎంపీటీసీ చేన్నకేశవులు, అక్బర్, తిమ్మయ్య, అంజి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
1
['tel']