inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: టీడీపీ నేతలపై వైసీపీ అధికార ప్రతినిధి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంశంపై స్పందిస్తూ ఆయన టీడీపీ నేతలపై విమర్శలు చేశారు. ఇదిలావుంటే గోరంట్లా మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం కావడం తెలిసిందే. ఇదే అదనుగా టీడీపీ నేతలు వైసీపీ నాయకత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అంశంపై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, మాధవ్ తప్పు చేశాడని తేలితే అతడిపై పార్టీపరమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు. అయినా టీడీపీ వాళ్లు గాంధీ మహాత్ముల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు ఏంచేశారో అందరికీ తెలుసన్నారు. నాడు టీడీపీ ప్రజాప్రతినిధులే విజయవాడలో కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారాల్లో కీలకంగా ఉన్నారని, ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. అలాంటి కేటుగాళ్లు మాపై విమర్శలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'అలాంటి కేటుగాళ్లు మాపై విమర్శలు చేయడమా: శ్రీకాంత్ రెడ్డి'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 479 పాయింట్లు లాభపడి 57,626 వద్ద ముగిసింది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 17,123 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (3.60%), యాక్సిస్ బ్యాంక్ (2.89%), ఎన్టీపీసీ (2.42%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.33%), ఎల్ అండ్ టీ (1.70%). టాప్ లూజర్స్ : ఏషియన్ పెయింట్స్ (-1.51%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-1.25%), భారతీ ఎయిర్టెల్ (-0.60%), టైటాన్ (-0.24%), ఐసిఐసిఐ బ్యాంక్ (-0.22%).
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: ఏకపక్షంగా నిర్మించిన రాజధానులు విజయవంతం కాలేదని ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ రాజధానిని అందరి అంగీకారంతోనే నిర్మించాలని, రాజధానులు మహానగరాలుగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. మహానగరమే అవసరం అనుకుంటే విశాఖపట్టణాన్ని ఎంపిక చేసి ఉండాల్సిందని అన్నారు. ల్యాండ్ పూలింగ్ భవిష్యత్ లో ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతుందని, శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాజధానిని ఎంపిక చేసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఏపీ రాజధానిగా అమరావతి కన్నా దొనకొండ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేదని, దొనకొండలో ప్రభుత్వ భూములతో పాటు అన్ని వసతులు ఉన్నాయని అన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'ఏకపక్షంగా నిర్మించిన రాజధానులు విజయవంతం కాలేదు: ఐవైఆర్ కృష్ణారావు'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా ప్రగతిని సాధిస్తున్నందున గ్రామీణ సహకార సంస్థలు తమ వ్యాపార లావాదేవీలను అదే స్థాయిలో మెరుగు పర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచించారు. గురువారం బిఆర్కెఆర్ భవన్లో కో-ఆపరేటివ్ క్రెడిట్ సంస్థల ఆర్థిక పరిపుష్టి పర్యవేక్షణపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సోమేశ్కుమార్ అధ్యక్షత వహించి రాష్ట్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార బ్యాంకుల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా పురోగతిని సాధిస్తున్నందున సహకార సంస్థలు తమ వ్యాపార లాభాలలను పెంచుకోవడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. సహకార బ్యాంకుల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో బ్యాంకర్లు మరిన్ని వినూత్న విషయాలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. తెలంగాణా కేంద్ర వ్యవసాయ సహకార బ్యాంకు మొత్తం వ్యాపార లావాదేవీలు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 22. 8 శాతం ఎక్కువగా ఉందని గతేడాది రూ. 13, 245 కోట్ల వ్యాపారం కాగా ఈ ఏడాది రూ. 16, 276. 71 కోట్లకు చేరిందన్నారు.2021-22 సంవత్సరంలో టిఎస్సిఎబి షేర్ క్యాపిటల్లో 25. 41 శాతం వృద్ధి ఉంది. నిల్వలు 2020-21లో రూ. 556. 53 కోట్ల నుంచి 2021-22లో రూ. 615 కోట్లకు పెరిగాయి, ఇది 10. 6 4 శాతం వృద్ధి. 2020-21లో డిపాజిట్లు రూ. 5466. 41 కోట్ల నుంచి రూ. 6941. 95 కోట్లకు పెరిగాయి, ఇది 26. 99 శాతం వృద్ధి. రుణాలు 15. 67 శాతం పెరిగి రూ. 6261. 80 కోట్లకు చేరుకోగా, పెట్టుబడులు 40. 27 శాతం పెరిగి రూ. 2058. 52 కోట్లకు చేరాయని వెల్లడించారు. టిఎస్సిఎబి నిర్వహణ లాభం 2022 మార్చి 31 నాటికి రూ. 100. 89 కోట్లుగా ఉందన్నారు. గత సంవత్సరం లాభం రూ. 59. 38 కోట్లతో పోలిస్తే 69. 90 శాతం పెరిగిందన్నారు. నికర లాభం 66. 82 శాతం పెరిగి రూ. 77. 29 కోట్లుగా ఉంది. దేశంలోనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి ఎం. రఘునందన్రావు, ఆర్థిక శాఖ కార్యదర్శి టి. కె. శ్రీదేవి, సహకార శాఖ కమిషనర్ ఎం. వీరబ్రహ్మయ్య, టిఎస్సిఎబి చైర్మన్ కొండూరు రవీందర్రావు, టిఎస్సిఎబి ఎండి నేతి మురళీధర్, ఆర్బిఐ రీజినల్ డైరెక్టర్ కె. నిఖిల, నాబార్డ్ సిజిఎం సుశీల చింతల, నాబార్డు జిఎం వై. హరగోపాల్, అధికారులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'గ్రామీణ వ్యాపార లావాదేవీలు పెరగాలి'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: తెలంగాణలో సోమవారం 3,980 కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, అందులో 1,439 పాజిటివ్ కేసులు GHMC పరిధిలోని ప్రాంతాల నుండి వచ్చాయి. ఆరోగ్య అధికారులు కూడా సోమవారం మూడు కోవిడ్ -19 మరణాలను నివేదించారు, TS లో మొత్తం మరణాల సంఖ్య 4,075 కు చేరుకుంది. సోమవారం నాటికి రాష్ట్రంలో క్రియాశీల కోవిడ్-19 పాజిటివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 33,673కి పెరిగింది.హైదరాబాద్తో పాటు, ఇతర పట్టణ కేంద్రాల్లో ఓమిక్రాన్ నడిచే కోవిడ్ ఇన్ఫెక్షన్లు గణనీయంగా పెరుగుతున్నాయి, అధికారులు మేడ్చల్-మల్కాజిగిరిలో 344, రంగారెడ్డి జిల్లాలో 234, హన్మకొండలో 159, ఖమ్మంలో 110, భద్రాద్రి కొత్తగూడెంలో 95, కరీంనగర్లో 92 కేసులు నమోదయ్యాయి. మహబూబ్ నగర్ నుండి.ఆరోగ్య శాఖ సోమవారం 97,113 కోవిడ్ పరీక్షలను నిర్వహించింది, వాటిలో 7,852 నమూనాల ఫలితాలు వేచి ఉన్నాయి. సోమవారం, 2,398 మంది వ్యక్తులు 94.89 శాతం రికవరీ రేటుతో కోలుకున్నారు. ఇప్పటివరకు, రాష్ట్రంలో మొత్తం 3,14,75,932 కోవిడ్ -19 పరీక్షలు నిర్వహించబడ్డాయి, వాటిలో సోమవారం 7,38,795 పాజిటివ్ పరీక్షించబడ్డాయి మరియు 7,01,047 వ్యక్తులు కోలుకున్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'తెలంగాణలో కొత్తగా 3,980 కరోనా కేసులు... ముగ్గురు మృతి'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఈ వాట్సాప్ యూజర్లకు గుడ్న్యూస్...హాయ్ చెబితే చాలు రుణం
ఫైనాన్స్ కంపెనీల తీరుమారుతోంది. గతంలో అప్పు అంటే సవాలచ్చ ప్రశ్నలు వేసే పరిస్థితి ఉండేది. కానీ మారుతున్న పరిస్థితుల కారణంగా ఫైనాన్స్ కంపెనీలు రుణం ఇచ్చేందుకు ఎగబడుతున్నాయి వసూళ్లు చేసే క్రమంలో ముక్కుపిండుతున్నాయి కూడా. ఇదిలావుంటే ఏఐ ఆధారితంగా నడిచే ఫైనాన్సియల్ వెల్నెస్ ప్లాట్ఫామ్ క్యాష్ఈ వాట్సాప్ యూజర్లకు గుడ్న్యూస్ చెప్పింది. వాట్సాప్ యూజర్లకు తేలిగ్గా, వేగంగా ఇన్స్టాంట్ క్రెడిట్ను అందించేందుకు ప్రత్యేక సర్వీసులను లాంచ్ చేసింది. ఈ సర్వీసుల కోసం వాట్సాప్ యూజర్లు తమ పేరును చెప్పి, కేవైసీ కంప్లియెంట్ ఇస్తే చాలు. అకౌంట్లలోకి డబ్బులు వస్తాయి. ఎలాంటి డాక్యుమెంట్లు, యాప్ డౌన్లోడ్లు, దరఖాస్తు ఫామ్లు నింపాల్సినవసరం లేకుండా. ఇన్స్టాంట్ క్రెడిట్ లిమిట్ను ఆఫర్ చేస్తోన్న తొలి ఫిన్టెక్ సంస్థ క్యాష్ఈనే అని కంపెనీ చెబుతోంది. ఈ సర్వీసుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది వాట్సాప్ యూజర్లు ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ లిమిట్ను నిమిషాల్లో పొందవచ్చని పేర్కొంది. ఎవరైనా కస్టమర్లు ఈ సర్వీసును పొందాలంటే. క్యాష్ఈ వాట్సాప్ నెంబర్ +918097553191కి ‘హాయ్’ అని తమ పేరుతో మెసేజ్ పెడితే చాలు. వేతన జీవులందరికీ ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. ఇటీవల కాలంలో స్మార్ట్ కస్టమర్లు తక్షణ సాయం కోసం, కాంటాక్ట్లెస్ సపోర్టు కోసం చూస్తున్నారని, దీని కోసమే తాము ఏఐ ఎనాబుల్డ్ చాట్ ప్రొడక్టును వాట్సాప్పై ప్రవేశపెట్టామని CASHe ఫౌండర్ ఛైర్మన్ వీ రమన్ కుమార్ తెలిపారు. ఈ సర్వీసు కేవలం తమ కస్టమర్లకు సాధికారత కల్పించడం మాత్రమే కాక, వారి డిమాండ్కు అనుగుణంగా అధునాతన అనుభవాన్ని అందించడానికి దోహదం చేస్తుందన్నారు. వాట్సాప్ యూజర్ బేస్తో తమ క్రెడిట్ ఫుట్ప్రింట్ను కూడా విస్తరించుకోనున్నామని పేర్కొన్నారు. ఆర్థిక చేరిక లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇది సాయపడనుందని పేర్కొన్నారు. క్యాష్ వాట్సాప్ చాట్ సర్వీసులు వాట్సాప్ బిజినెస్ ప్లాట్ఫామ్పై రూపొందాయి. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ పొందిన 200 కోట్ల మంది యూజర్లలో మిలియన్ల మంది యూజర్లు భారత్ నుంచే ఉన్నారు. ఏఐతో ఛాట్బోట్ సౌకర్యాలను అందిస్తోన్న తొలి పిన్టెక్ ప్లేయర్గా CASHe నిలిచింది. బీటా దశలోనే కస్టమర్ల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని, కేవైసీ కంప్లియెంట్ యూజర్లకు క్షణాల్లో రుణాలను ఆమోదించినట్టు క్యాష్ఈ తెలిపింది.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: పురుడు పోసుకునేందుకు భార్య పుట్టింటికి వెళ్లడంతో ఈ గ్యాప్లో మరో పెళ్లికి సిద్ధమయ్యాడో భర్త. ఈ విషయం తెలుసుకున్న నూతన వధువు బంధువులు ఆ ప్రబుద్ధుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నగరంలోని పహాడీషరీప్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జావిద్ అనే వ్యక్తికి ఇదివరకే పెళ్లైంది. డెలివరీ కోసం భార్య పుట్టింటికి వెళ్లడంతో ఇదే అదునుగా చూసి జగద్గిరిగుట్టకు చెందిన అమ్మాయితో రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. ఈ నెల 25న పెళ్లి చేసుకుంటున్నట్లు తెలుసుకున్న మొదటి భార్య. నూతన వధువు బంధువులకు సమాచారం ఇచ్చింది. దీంతో జావిద్ నిజస్వరూపం తెలుసుకున్న బంధువులు పెళ్లికి నిరాకరించి. అతడ్ని పట్టుకుని పహాడీషరీప్ పోలీస్స్టేషన్లో అప్పగించారు. బంధువుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జావిద్ను కఠినంగా శిక్షించాలని ఇటు భార్య తరపు బంధువులు. అటు నవ వధువు తరపు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'డెలివరీకి పుట్టింటికెళ్లిన భార్య... ఈ గ్యాప్లో మరో పెళ్లికి రెడీ అయిన భర్త...!'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: ఇంట్రెపిడ్ అనే బ్రాండ్ తయారు చేసిన ఈ భారీ సీసాను గత బుధవారం ల్యోన్ అండ్ టర్న్బుల్ సంస్థ వేలం వేసింది. వేలంలో ఈ సీసా 14 లక్షల డాలర్ల (రూ.11.2 కోట్లు) ధర పలికింది. ఈ సీసా ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. ఇందులో 311 లీటర్ల స్కాచ్ విస్కీ పడుతుంది. గతేడాది సెప్టెంబర్ లో ఈ సీసాలో మెకాలాన్ వైన్ కంపెనీ తయారు చేసిన 32 ఏళ్ల కిందటి స్కాచ్ నింపారు. ఈ సీసా గిన్నిస్ రికార్డు సృష్టించింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'ఈ సీసా ఖరీదు రూ.11.2 కోట్లు'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: హైదరాబాద్: పహడీషరీఫ్ ఆర్ఆర్ ఫామ్హౌజ్ గుట్కా గోడౌన్పై ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా చేపట్టిన సోదాల్లో గుట్కా తయారీ ముడిసరుకు నిల్వలను గుర్తించి సీజ్ చేశారు. పట్టుబడిన ముడి సరుకు విలువ రూ. 4 లక్షలుగా సమాచారం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పహడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'గుట్కా గోడౌన్పై పోలీసుల దాడి'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆయా రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా పంజాబ్ ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించింది. పెట్రోల్ పై రూ.10, డీజిల్ పై రూ.5 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తాజా ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీనిపై పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ మాట్లాడుతూ, గత 20 ఏళ్లలో పంజాబ్ లో చమురు ధరలు తగ్గడం ఇదే ప్రథమం అని వెల్లడించారు. కాగా పంజాబ్ ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించింది. పెట్రోల్ పై రూ.10, డీజిల్ పై రూ.5 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తాజా ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీనిపై పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ మాట్లాడుతూ, గత 20 ఏళ్లలో పంజాబ్ లో చమురు ధరలు తగ్గడం ఇదే ప్రథమం అని వెల్లడించారు. అటు, పంజాబ్ మంత్రి మన్ ప్రీత్ సింగ్ బాదల్ స్పందిస్తూ, తాజాగా పన్నుల తగ్గింపు నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు రూ.900 కోట్ల మేర నష్టం వాటిల్లనుందని తెలిపారు.ఇటీవలే చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం. వినియోగదారులకు ఊరట కలిగించేలా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. ఈ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించిన పంజాబ్ ప్రభుత్వం'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య 519 వ వర్ధంతి ఉత్సవాలు మార్చి 28 నుండి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు అన్నమయ్య జన్మస్థలమైన రాజంపేట మండలం తాళ్ళపాక ధ్యాన మందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించనున్నట్లు టిటిడి అధికారులు తెలియజేశారు. ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం వేళ ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'మార్చి నెల 28 నుంచి అన్నమయ్య 519వ వర్ధంతి ఉత్సవాలు'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: హైదరాబాద్ లో ఓ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. 2018 బ్యాచ్కు చెందిన సురేఖ చత్రినాక పోలీస్ స్టేషన్ లో ఉమెన్ పీసీగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తన గదిలో సూసైడ్ చేసుకున్నారు. గమనించిన ఇంటి ఓనర్ శాలిబండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలు ఫ్యామిలీతో గత కొన్నేళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వీరి స్వస్థలం రంగారెడ్డి జిల్లా, కందుకూరు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'మహిళా కానిస్టేబుల్ సూసైడ్'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: విద్యార్థులు విద్యకు అధిక ప్రాధాన్యత
విద్య. వైద్యం ప్రభుత్వానికి రెండు కళ్లుఅని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యానారాయణఅన్నారు. ప్రజా ఆరోగ్యానికి. పిల్లల చదువుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని ఉద్ఘాటన. కొత్తపేట కుమ్మరవీధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి, పాఠశాల అదనపు గదులకు ప్రారంభోత్సవం నిర్వహించారు.విద్య, వైద్యం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్లులాంటివని అందుకే వాటికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్లు వెచ్చిస్తోందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు. ప్రజా ఆరోగ్యానికి. సంక్షేమానికి ప్రాధాన్యం కల్పిస్తూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నామని గుర్తు చేశారు. విద్య, వైద్య రంగంలో మరింత ప్రగతి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని కొత్తపేట కుమ్మరవీధి 14వ వార్డులో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల అదనపు గదులను, రూ. 98 లక్షలతో నిర్మించిన వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన స్థానిక ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ రఘురాజు, జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి, వార్డు కార్పొరేటర్ రాజేష్లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా నాడు-నేడు నిధులు, కార్పొరేషన్ నిధులతో అభివృద్ధి చేసిన కుమ్మరవీధిలోని స్వామి వివేకానంద ప్రాథమిక పాఠశాల గదులను పరిశీలించారు. ఆధునిక వసతులతో కూడిన ఇంగ్లీషు, కంప్యూటర్ ల్యాబ్లను చూసిన మంత్రి మంత్ర ముగ్ధులయ్యారు. పాఠశాలలో అన్ని గదులకు ఏసీ పెట్టించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ పాఠశాల రాష్ట్రంలోనే తలమానికమైనదని కితాబిచ్చారు. ఈ క్రమంలో పాఠశాల విద్యార్థులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. పుస్తకంలోని అక్షరాలను, బొమ్మలను చూపించి ఇవేంటి అని చిన్నారిని అడిగారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: 700 రోజులకు చేరుకున్న రైతుల పాదయాత్ర
ప్రజా రాజధాని అమరావతి కోసం రైతులు చేపట్టిన మహోద్యమం 700 రోజులకు చేరుకుంది. ఉద్యమంలో భాగంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర కూడా 16వ రోజుకు చేరుకుంది.అమరావతి ఉద్యమంలో అమరులైన 189 రైతులకు ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతినే తమ రాజధానిగా కోరుకుంటున్న విషయం మహా పాదయాత్రకు లభిస్తోన్న మద్దతు చూస్తే తెలుస్తోంది. ఈ ప్రభుత్వం మాత్రం ప్రజల ఆకాంక్షలతో తమకు పనిలేదన్నట్టు పాదయాత్రపై అడుగడుగునా ఆంక్షలు పెడుతోంది. మద్దతు తెలిపిన ప్రజలపై లాఠీ ఛార్జ్ చేయిస్తోంది. ఎంత దౌర్జన్యం చేసినా ప్రజల ఆకాంక్షను అణగదొక్కలేరు. అంతిమ విజయం ప్రజలదే. ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి తప్పకుండా దక్కుతుంది. అందుకు వెంకన్న ఆశీర్వాదం ఉంది. తెలుగుదేశం పార్టీ మద్దతు ఎల్లవేళలా ఉంటుంది.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: బైక్ పైనుంచి జారిపడి మహిళ మృతి
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(టి) మండలం పారిగాం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ మహిళ బైక్ పైనుంచి జారిపడి మృతిచెందింది. మృతురాలు కాగజ్నగర్ మండలం గన్నారం వాసి తులసి(49). సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: తొలి సోమవారం... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
కార్తీకమాసం తొలి సోమవారం, నాగులచవితి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు శైవక్షేత్రాలకు పోటెత్తారు. చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయం, కురవి వీరభద్రస్వామి ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. మహిళలు ఆలయాల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు రద్దీ నెలకొంది. తొలి సోమవారం రోజున స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకుంటున్నారు. వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి పెరిగింది. స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి క్యూలైన్‎లు మొత్తం భక్తులతో నిండిపోయాయి. ఆలయ ముందు భాగంలో కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారికి మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి ప్రత్యేక పూజలను ఆలయ అర్చకులు నిర్వహించారు.
1
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు ను మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ ఆద్వర్యంలో జిల్లా ఎంహెచ్డి బృందం సభ్యులు శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అంశం పై చర్చించారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ అంశం ప్రస్తావించాలని ఎంపీని కోరారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి వర్గీకరణ విషయాన్ని మరొసారి తీసుకెల్లాలని పేర్కొన్నారు.సానుకూలంగా స్పందించిన ఎంపీ మొదటి నుండి వర్గీకరణ అంశంలో తాము కట్టుబడి ఉన్నామని, తప్పకుండా ఎస్సీ వర్గీకరణ అంశం మాట్లాడతామని, అవసరమైతే మాదిగ హక్కుల దండోరా బృందాన్ని తమ నాయకత్వంలో కేంద్ర పెద్దల దగ్గరకు తీసుకువెల్లి కలిపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మాదిగ హక్కుల దండోరా ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ పెర్క రాజేశ్వర్ మాదిగ, నాయకులు బట్టు మహేందర్, నరికుంటి పెంటన్న, గణేష్ , రజీనిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'ఎంపీ ని కలిసిన మాదిగ హక్కుల దండోరా నాయకులు'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: జోగులాంబ గద్వాల జిల్లా పట్టణ ప్రాంతాల్లో నోటరీ ద్వారా(రిజిస్ట్రేషన్ కాకుండా) కొన్న వ్యవసాయేతర ఆస్తుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రమబద్ధీకరణకు మీసేవా కేంద్రాలలో దరఖాస్తుతో పాటు నోటరీ పత్రం, లింక్ డాక్యుమెంట్స్, ఆస్తి పన్ను, విద్యుత్, నీటి వాడకం రసీదులు, ఇతర పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'వ్యవసాయేతర ఆస్తుల క్రమబద్ధీకరణకు అవకాశం'.
2
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, టైమ్ స్లాట్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను రాయండి: మర్దన పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్న 2 స్పా కేంద్రాల పై పోలీసులు సోమవారం రాత్రి దాడులు జరిపారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని హెవెన్ ఫ్యామిలీ స్పాపై, అదే మార్గంలోని వెల్వెట్ స్పా కేంద్రంపై ఎస్ఐ కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. రెండు చోట్ల 17 మంది యువతులను రెస్క్యూ చేసి, పునరావాస కేంద్రానికి తరలించారు. ఇద్దరు మేనేజర్లను, నిర్వాహకురాలు, విటులను అరెస్ట్ చేశారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'స్పా పేరిట వ్యభిచారం...పోలీసుల దాడులు'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. కోవిడ్ సామాన్యుల రాజకీయ నాయకులు, పోలీసులు, సెలబ్రిటీలు ఇలా వైరస్ ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. తాజాగా కరోనాతో జగిత్యాల అదనపు ఎస్పీ దక్షిణమూర్తి మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దక్షిణమూర్తి ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ నెలాఖరులో ఆయన పదవీ విరమణ పొందనున్నారు.1989 బ్యాచ్కు చెందిన దక్షిణమూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పని చేశారు. మావోయిస్టుల ఆపరేన్స్తో పాటు వరంగల్లో సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్కౌంటర్లో కూడా ఆయన పాల్గొన్నట్లు తెలుస్తోంది. అలాగే కరీంనగర్ సవారాన్ స్టీట్ కు చెందిన దక్షిణ మూర్తి జిల్లాల పునర్విభజనతో జగిత్యాల అడిషనల్ ఎస్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల జిల్లాలో కరోనా సోకి అనారోగ్యం పాలై పోలీసులు చికిత్స పొంది తిరిగి విధుల్లో చేరిన సమయంలో వారికి ఘన స్వాగతం పలికి పోలీసుల్లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఆయన మృతితో జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి పలువురు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'కరోనాతో జగిత్యాల అడిషనల్ ఎస్పీ మృతి'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: బీసీ గణన చేపట్టండి
సీఎం జగన్ కి బీసీలు అంటే చులకన భావం అని అందుకుగాను త్వరలో బీసీలు వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్తారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. పులివెందులలో చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఈ సారి పులివెందుల టీడీపీదేనని అన్నారు. జగన్రెడ్డి ప్రభుత్వం బీసీ గణన చేపట్టకుండా బీసీ లకి అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
1
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: కాలం మారుతోంది. పెళ్లి విషయంలో అమ్మాయిలు సైతం నిర్బయంగా నిర్ణయం తీసుకొంటున్నారు. ఇదిలావుంటే కళ్యాణవేదికపై వధూ వరులు కూర్చుని ఉండగా. పెళ్లికి వచ్చిన బంధు మిత్రులు అతిథులతో సందండిగా ఉంది. పురోహితుడు వేదమంత్రాలతో పెళ్లి జరిపిస్తున్నాడు కానీ, శాస్త్రోక్తంగా ఆయన చెప్పే మాటలను వరుడు (Groom) వినే పరిస్థితిలో లేడు. ఫుల్లుగా మద్యం సేవించిన అతడు. మండపానికి వచ్చినప్పటి నుంచే విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. మద్యం మత్తులో కారులోంచి తూలుతూ దిగిన పెళ్లి కొడుకు. పెళ్లిపీటలపైనే నిద్రపోయాడు. అతడి తీరుతో వధువుకు చిర్రెత్తుకొచ్చి పెళ్లిపీటల మీద నుంచి లేచి వెళ్లిపోయింది. విస్తుగొలిపే ఈ ఘటన అసోంలోని నల్బరి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే. నల్బరి పట్టణానికి చెందిన ప్రసేన్జీత్ హలోయ్ అనే యువకుడికి ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ వివాహానికి కుటుంబసభ్యులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఊరేగింపుగా కళ్యాణ వేదికకు వరుడు. ఫుల్లుగా మద్యం సేవించి వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న వరుడిని చూసి వధువు పెళ్లికి నిరాకరించింది. అతడే కాదు, వరుడి తండ్రి సహా అతడి తరఫు వచ్చిన వారిలో 95 శాతం మంది బంధువులది ఇదే పరిస్థితి. అయితే, కుటుంబసభ్యులు తమ కుమార్తెను ఒప్పించడంతో ఆమె పెళ్లి పీటలపై కూర్చుంది. వరుడు మద్యం మత్తులో తూగుతూనే ఆమె పక్కన కూర్చున్నాడు. పురోహితుడు చెప్పే మాటలను కూడా వినే పరిస్థితుల్లో లేని అతడు. పెళ్లిపీటలపైనే నిద్రపోయాడు. పెద్దలు చెప్పడంతో అప్పటి వరకూ సహనంతో ఉన్న వధువు. అతడి తీరుతో విసిగిపోయింది. దీంతో కోపంతో పెళ్లిపీటల నుంచి లేచి వెళ్లిపోయింది. ఇలాంటి వాడ్ని పెళ్లిచేసుకుంటే తన భవిష్యత్తు ఎలా ఉంటుందో అర్ధమైపోయిందని వధువు వ్యాఖ్యానించింది. ‘‘పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. శాస్త్రోక్తంగా పండితుడు అన్ని చేయిస్తున్నాడు. వివాహం కోసం మా కుటుంబం వీలైనంత మేర భారీ ఏర్పాట్లు చేసింది. కానీ, వరుడి ప్రవర్తనకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వధువు పెళ్లిపీటల మీద నుంచి దిగిపోయింది. దీంతో అక్కడ గందరగోళం నెలకుంది. ’’ అని వధువు బంధువు ఒకరు తెలిపారు. పెళ్లి కొడుకు ప్రవర్తనపై వధువు తరఫు బంధువులు గ్రామపెద్దలను ఆశ్రయించారు. అలాగే, నల్బరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమకు పరిహారం చెల్లించాలంటూ వరుడి కుటుంబాన్ని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'తాగొచ్చిన వరుడు,పీటల మీద నుంచి దిగిపోయిన వధువు'.
2
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: ప్రజలకు ఏనాడు టీడీపీ ప్రభుత్వం మేలు చేయలేదు
టీడీపీ హయాంలో ఏ సంక్షేమ కార్యక్రమం పెట్టినా కూడా ఎన్నికల కోసమే వాడుకున్నారు అని మంత్రి ఆదిమలపు సురేష్ అన్నారు. నిజంగా పేద, బడుగు, బలహీన వర్గాలకు, యువత, మహిళలకు మేలు చేయలేదు. అన్నా క్యాంటీన్లు ఎన్నికలకు ఆరు నెలల ముందు టీడీపీ ప్రారంభించింది. పూర్తిగా అవినీతిమయం అయ్యింది. ఒక్కో దానికి రూ.40 లక్షలు పెట్టారు. ప్రభుత్వం ఒక్కో భోజనానికి రూ.75 ఇస్తే, వాళ్లు రూ. 15లకు పెట్టారు.ఏడు నెలల కాలంలో రూ.90 కోట్లు ఖర్చు చేశారు. టీడీపీ దిగిపోతూ అన్ని బకాయిలు పెట్టి వెళ్లారు. రాజధాని నిర్మాణంలో అడ్డగోలుగా దోచుకున్నారో వాళ్లకే అన్నా క్యాంటీన్లకు ఇన్ఫ్రాక్చర్ ఏర్పాట్లకు డబ్బులు ఇచ్చారు. కేవలం ఎన్నికల కోసమే అన్నాక్యాంటీన్లు ఏర్పాటు చేశారు. రుణమాఫీచేస్తామని మహిళలను మోసం చేశారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ ఇచ్చారు. పింఛన్ల పెంపు కూడా వైయస్ జగన్ పాదయాత్రలో ప్రకటిస్తే. ఆ తరువాత ఎన్నికల ముందే చంద్రబాబు పింఛన్లు పెంచారు.మన ప్రభుత్వం వరుసగా నాలుగేళ్లు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. వైయస్ఆర్ చేయూత అన్న ఆలోచన వైయస్ జగన్కు మాత్రమే వచ్చింది. సంక్షేమం, అభివృద్ధి అన్నది రాష్ట్రానికి రెండు కళ్లుగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: టెక్నాలజీ సాయంతో తెలంగాణలో 30 లక్షల బోగస్ ఓట్లను తొలగించామని హైకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయన్న పిటిషన్ ను హైకోర్టు ఈరోజు విచారించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా బోగస్ ఓట్లు అన్నింటినీ తొలగించామని ఈసీ చెప్పింది. ఈ నెల 12న ఓటర్ల తుది జాబితాతో పాటు నోటిఫికేషన్ ను విడుదల చేస్తామని తెలిపింది. ఓటర్ల జాబితాలో ఫిర్యాదులపై విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదనలను వినిపించారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'టెక్నాలజీ సాయంతో బోగస్ ఓట్లను తొలగించాం: ఈసీ'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: ఒకే రిజిష్టర్ నెంబరుతో నాలుగు బస్సులను నడుపుతూ ప్రభుత్వానికి రూ.10 లక్షల మేరకు పన్ను టోకరా వేసిన ప్రైవేటు బస్సుల నిర్వహకులకు రవాణాశాఖాధికారులు నోటీసులను జారీ చేశారు. కోలారు ప్రాంతీయ రవాణా అధికారులు మంగళవారం ముళబాగిలు తాలుకా బేతమంగలంలో మెరుపుదాడులు నిర్వహించిన సమయంలో ఈ భాగోతం వెలుగు చూసింది. రవాణా శాఖ అదనపు కమీనర్ నరేంద్ర హోళ్కర్, జా యింట్ కమీషనర్ ఓంకారేశ్వరిల నాయకత్వంలో జరిపిన దాడుల్లో ఒకే నెంబరు వినియోగిస్తూ కెఎ 06 4815 'రెండు బస్సులు', కెఎల్ 05 క్యూ 2140 'రెండు బస్సులు' నడుపుతున్నట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఇందుకుగాను నకిలీ నెంబర్ ప్లేట్లను వినియోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. కోలారు ప్రాంతీయ రవాణా కమీషనర్ కార్యాలయం మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లు సి తిప్పేస్వామి, టి సుధీర్బాబు దాడుల్లో పాల్గొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నామని ఆర్టీవో కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'ఒకే నెంబరుతో... నాలుగు బస్సులు'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: విశాఖ రైల్వే స్టేషన్లో ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. గురువారం వెలుగు చూసిన ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలోని యాదాద్రి జిల్లా నుంచి బుధవారం రాత్రి రైల్లో ఏడాదిన్నర కుమారుడితో కలిసి గర్భిణి విశాఖ చేరుకుంది. బుధవారం రాత్రి నుంచి విశాఖ రైల్వే స్టేషన్లోనే ఉంది. ఇదిలా ఉండగ రైల్వే స్టేషన్లో తల్లి నిద్రపోయిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని అపహరించారు. తనతో పాటు స్టేషన్లో ఉన్న ఒడిశా జంట బాలుడిని కిడ్నాప్ చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'కలకలం రేపిన బాలుడి కిడ్నాప్'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కోసమే గ్రామదర్శిని : చంద్రబాబు
అమరావతి : ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే గ్రామదర్శిని కార్యక్రమం చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. గ్రామదర్శిని కార్యక్రమానికి అధికారులు కచ్చితంగా హాజరు కావాలని ఆయన ఆదేశించారు. అధికారులు వారానికి రెండు రోజులు గ్రామదర్శినిలో పాల్గొనాలన్నారు. అధికారులు బుధ, గురు వారాల్లో గ్రామదర్శిని కార్యక్రమాల్లో పాల్గొనాలని, ప్రతి సోమ, శనివారాల్లో కార్యాలయాల్లో విధులకు హాజరు కావాలని ఆయన అన్నారు. అవసరమైతే గ్రామాల్లో బస చేసి సమస్యలపై అవగాహన పెంచుకోవాలని, పెండింగ్ సమస్యలపై వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని, జనవరిలో జరిగే జన్మభూమి గ్రామసభల్లో విజన్ డాక్యుమెంట్ ప్రకటించాలని ఆయన అన్నారు. ఆరు నెలలపాటు ఈ కార్యక్రమం జరిపేలా ప్రణాళిల రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అందరూ కలిసికట్టుగా పనిచేసుకోవాలన్నారు. ఏమైనా విభేదాలుంటే విడనాడాలని సీఎం చంద్రబాబు ఆ నియోజకవర్గ నేతలకు సూచించారు. కలిసికట్టుగా పనిచేసి గ్రామదర్శిని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం నేతలకు సూచించారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్ అంతిమయాత్రలో పోలీసుల అత్యుత్సాహంతో గందరగోళం చోటుచేసుకుంది. ఆదివారం జరిగిన రవీందర్ అంతిమయాత్రను త్వరగా ముగించాలంటూ పోలీసులు కుటుంబ సభ్యులు, ఆర్టీసీ కార్మికులపై ఒత్తిడి తీసుకువస్తూ, ఎక్కడా యాత్ర ఆగకుండా, ఎవరినీ నివాళులర్పించనీయకుండా ముందుకు సాగించారు. దీంతో అసహనం వ్యక్తంచేసిన ఆర్టీసీ కార్మికులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఓ దశలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆగ్రహించిన సీపీ మధు కొందరు ఆర్టీసీ కార్మికులపై చేయి చేసుకోవటంతో కార్మికులు ఆగ్రహించి అంతిమయాత్రను అక్కడికక్కడే నిలపివేసారు. రవీందర్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి, పోలీసులు క్షమాపణ చెప్పాలంటూ ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రవీందర్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తు నినాదాలు చేస్తున్న వారిని సముదాయించేందుకు పోలీసులు నానా పాట్లు పడాల్సి వచ్చింది.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'ఆర్టీసీ కండక్టర్ అంతిమయాత్రలో కార్మికులపై సిపి జులూం'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: దేశమంతా వినిపిస్తున్న పేరు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. శుక్రవారం జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ వెనుక ఉన్న కీలక వ్యక్తి ఈయనే. 27ఏళ్ల పశువుల డాక్టర్ను అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనలో విచారణ జరుపుతుండగా నిందితులపై ఎన్ కౌంటర్ జరిగిందని ఆయనే వెల్లడించారు. అసలు సజ్జనార్ ఎవరు. ఈయన కెరీర్లో ఇలాంటి నిర్ణయాలు ఇంతకుముందు తీసుకున్నారా. అని తెలుసుకోవాలంటే. కర్ణాటక నుంచి 1996 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆఫీసర్. 2008వరంగల్లో సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా వ్యవహరించారు. ఇద్దరు బాలికలపై యాసిడ్ దాడికి పాల్పడిన ముగ్గురిని ఎన్కౌంటర్ చేసిన సమయంలో ఆ ప్రాంతానికి ఎస్పీగానే ఉన్నారు.ఆ తర్వాత యాంటీ నక్సలైట్ యూనిట్కు స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ ఐజీగా నియమితులైయ్యారు సజ్జనార్.చాలా మంది మావోయిస్టుల ఎన్కౌంటర్, మావోయిస్టుల లొంగుబాటులో ఈయన పాత్ర చాలా ఉంది. ఆగష్టు 2016లో యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ యూనిట్కు హెడ్గా నియమించారు. గ్యాంగ్స్టర్ నయూముద్దీన్ పారిపోయే ప్రయత్నం చేయబోతుండగా ఎన్కౌంటర్ జరిగింది.మరోసారి పశువుల డాక్టర్ పై జరిగిన ఘటనను సజ్జనార్ సీరియస్ గా తీసుకున్నారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాల కోసం రీ కన్ స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులను ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు షూట్ చేసినట్లు సజ్జనార్ తెలిపారు.హైదరాబాద్ లో దిశ నిందితుల ఎన్కౌంటర్పై సీపీ సజ్జనార్ స్పందించారు. కేస్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా నిందితులు ఫోన్తో పాటు మరికొన్ని కీలక ఆధారాలు ఉన్నాయని చెప్పడంతో షాద్నగర్కు తీసుకొచ్చాం. ఆధారాలు సేకరించే పనిలో ఉండగా నిందితులు రాళ్లు రువ్వుతూ. పోలీసు రివాల్వర్ లాక్కొని దాడి చేయాలనుకున్నారు. ఎదురెదురు కాల్పులు జరగడంతో నలుగురు నిందితులు మరణించారు. ఈ ఘటన ఉదయం 5గంటల 15నిమిషాల నుంచి 6గంటల మధ్యలో జరిగింది.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'సీపీ సజ్జనార్ గురించి తెలుసుకోవాలంటే...'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఢిల్లీలో 247 కొత్త కరోనా కేసులు నమోదు
ఢిల్లీలో గత 24 గంటల్లో 247 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.ఢిల్లీ ప్రభుత్వ హెల్త్ బులెటిన్ ప్రకారం, నగరంలో గత 24 గంటల్లో 1,349 యాక్టివ్ కేసులు మరియు 320 రికవరీలు నమోదయ్యాయి మరియు ఈ కాలంలో వ్యాధి కారణంగా మరణాలు సంభవించలేదు.సానుకూలత రేటు 3.47 శాతంగా ఉంది.ఇప్పటివరకు 3,86,31,003 కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: సీఎం జగన్తో ముగిసిన హైపవర్ కమిటీ భేటీ
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో హైపవర్ కమిటీ భేటీ ముగిసింది. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ, సమగ్రాభివృద్ధిపై చర్చించేందుకు ఏర్పాటైన హైపవర్ కమిటీ శుక్రవారం సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా జీఎన్ రావు, బీసీజీ నివేదికలపై. హైపవర్ కమిటీ సభ్యులు సీఎం వైఎస్ జగన్కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. భేటీ అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ. అమరావతి రైతుల అంశంపైనా సీఎం వైఎస్ జగన్తో చర్చించినట్టు తెలిపారు. కమిటీ రిపోర్ట్లోని అంశాలను కూడా సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సమగ్ర ప్రణాళికలతో రాష్ట్ర అభివృద్ధిపై ప్రజల మనోభావాల మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ప్రాంతీయ అసమానతలపై దృష్టి సారించినట్టు వివరించారు. అమరావతి రైతులకు మరింత లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం వైఎస్ జగన్ సూచనలు చేశారని బొత్స వెల్లడించారు. కమిటీ రిపోర్ట్ను కేబినెట్ ముందు ఉంచుతామని తెలిపారు. కేబినెట్ భేటీలో అన్ని విషయాలను సీఎంకు చెబుతామని అన్నారు. అన్నివర్గాలు బాగుపడాలన్నదే తమ తాపత్రయమని చెప్పారు. మూడు రోజుల అసెబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తామని స్పష్టం చేశారు. అమరావతి రైతులు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాయలో పడొద్దని సూచించారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: హాస్టళ్లలో ఉండేవారికి షాక్
చదువు లేదా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాల్లో ఉండేవారు హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ లలో ఉంటారన్న విషయం తెలిసిందే. త్వరలో వీరికి షాక్ తగలనుంది. హాస్టల్ అకామిడేషన్కు చెల్లించే అద్దెపై 12 శాతం జీఎస్టీ వర్తిస్తుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ వెల్లడించింది. పేయింగ్ గెస్ట్ (పీజీ), హాస్టళ్లు, గృహ వసతి కిందకు రావని, కాబట్టి వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉండదని ఏఏఆర్ కర్ణాటక బెంచ్ స్పష్టం చేసింది.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: బాలిస్టిక్ క్షిపణి ఇంటర్సెప్టార్ టెస్ట్ విజయవంతం
బాలిస్టిక్ క్షిపణి ఇంటర్సెప్టార్ టెస్ట్ను భారత్ విజయవంతంగా నిర్వహించింది. తొలిసారి సముద్ర ప్రాంతంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ, భారత నౌకాదళం కలిసి శనివారం పరీక్షను నిర్వహించాయి. శత్రు దేశాలకు చెందిన బాలిస్టిక్ క్షిపణి ముప్పును పసిగట్టి నాశనం చేయడం ముఖ్య ఉద్దేశమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో నౌకాదళంలో బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ నిలిచింది.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరున లేదా, మార్చి మొదటివారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలాఖరులోగా 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు లాంటివన్నీ సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మున్సిపల్ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో జరిగేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో రాజకీయ వేడి కూడా మళ్లీ రగిలే అవకాశం ఉంది
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం'.
2
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం
కడప నగరంలోని 15వ డివిజన్లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి. సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అయన మాట్లాడుతూ.అర్హత ఒక్కటే ప్రామాణికంగా అందరికీ సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని, పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ అమలు చేస్తున్న పథకాలతో ఏ మేరకు లబ్ధిపొందారో ప్రతి గడపకూ వివరించారు. ప్రజలు ఇంకేమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప మేయర్ సురేష్బాబు, డివిజన్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: రైతుల ఆదాయాన్ని 2022 నాటి కల్లా రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది. అందులో సోలార్ స్కీమ్ (కుసుమ్ స్కీమ్) ఒకటి. ఈ పథకంలో భాగంగా రైతులు వారి పొలంలో సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసుకొని మంచి రాబడి పొందొచ్చు. సోలార్ కంపెనీలు దీనికి గానూ రైతులకు అద్దె చెల్లిస్తాయి. లేదంటే మీరే సోలార్ కరెంట్కు కంపెనీలకు విక్రయించుకొని మంచి రాబడి పొందొచ్చు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. రైతులు వారి పొలాన్ని సోలార్ ప్యానెల్స్ కోసం అద్దెకు ఇస్తే కంపెనీలు ఎకరాకు రూ.లక్ష చెల్లిస్తాయి. అయితే దీనికి అగ్రిమెంట్ ఉంటుంది. 25 ఏళ్ల పాటు పొలాన్ని అద్దెకు ఇవ్వాలి. అంటే కంపెనీలు మీకు 25 ఏళ్ల పాటు సోలార్ ప్యానెల్స్ కోసం అద్దె చెల్లిస్తూనే వస్తాయి. 25 ఏళ్ల తర్వాత రైతులకు ఎకరాకు రూ.4 లక్షల అద్దె లభిస్తుంది. మరిన్ని వివరాలకు ఈ లింకుపై క్లిక్ చేయండి. https://solarrooftop.gov.in/
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'ఎకరాకు రూ.4 లక్షలు పొందండిలా'.
2
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను రాయండి: పదవతరగతి పరీక్ష ఫలితాలు నిన్న విడుదలైన సందర్భంగా , దాదాపుగా 2 లక్షల మంది పిల్లలు ఫెయిల్ ఐనట్లు విద్యాశాఖ తెలియచేసింది. దీనిపై స్పందించిన నారా లోకేష్ మాట్లాడుతూ. టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదు. ఇది జగన్ రెడ్డి సర్కారు ఫెయిల్యూర్. అమ్మ ఒడి, సంక్షేమ పథకాలకి విద్యార్థుల్ని తగ్గించే కుట్ర జరిగింది. తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షలు పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీసులతో ప్రభుత్వం అభాసుపాలు అయ్యింది. టెన్త్ రిజల్ట్స్ వాయిదా.దిగజారిన ఫలితాలన్నీ సర్కారు కుతంత్రమే. నాడు నేడు పేరుతో 3500 కోట్లు మింగేసి విద్యావ్యవస్థ నిర్వీర్యం చేసారు. టీచర్లకి వైన్షాపుల వద్ద డ్యూటీ వేసే శ్రద్ధ విద్యపై పెట్టలేదు.ఒక్క డిఎస్సీ తీయకపోవడంతో హైస్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. 71 స్కూళ్లలో జీరో పాస్.20 ఏళ్లలో అతి తక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత నమోదు అవ్వడం వైసిపి ప్రభుత్వం పాపమే అని ధ్వజమెత్తారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'టెన్త్ స్టూడెంట్స్ ఫెయిల్ కాదు... ఇది జగన్ రెడ్డి సర్కారు ఫెయిల్యూర్'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను రాయండి: మహారాష్ట్రలోని ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో వరదలు వస్తున్నాయి. రహదారులన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. వరదల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'ముంబైలో భారీ వర్షాలు'.
2
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: మోగిలయ్యకు స్థలం,కోటి నగదు...సీఎం
కిన్నెర వాయిద్య కళాకారులు పద్మశ్రీ దర్శనం. మొగిలయ్యకు హైదరాబాద్ లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం ఒక కోటి రూపాయలను ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు శ్రీ దర్శనం మొగిలయ్య ఈ రోజు ప్రగతి భవన్ లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం శాలువాతో సత్కరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. పద్మశ్రీ మొగిలయ్యకు నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు కోటి రూపాయలను ఈ సందర్భంగా సీఎం ప్రకటించారు. ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని, ఎమ్మెల్యే శ్రీ గు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: పగతో కుటుంబం మొత్తాన్ని లేపేసాడు
పాత పగతో ఓ యువకుడు ఓ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్లో ఓ కుటుంబ హత్య ఆగష్టు 9 న జరిగింది. ఈకేసు వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని బర్వానీ ప్రాంతంలో రాయసింగ్ కుటుంబం నివాసముంటున్నారు. పెద్ద కుమారుడు వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తుండటంతో ఈనెల 11న ఇంటికి వచ్చిన అతడికి కుటుంబ సభ్యలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తునుప్రారంభించారు. అదే సమయంలో ఈ కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు గోయి నదిలో లభించాయి. అదే రోజు సాయంత్రం రాయసింగ్ భార్య మృతదేహం మరోప్రాంతంలో లభించడంతో కుటుంబసభ్యులు హత్యకు గురైనట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు గ్రామ ప్రజలను, బంధువులను ప్రశ్నించారు. రాయా సింగ్ మేనల్లుడు చిచియాసింగ్ (22) పాత కక్షలతో ఆ కుటుంబాన్ని చంపేశాననిదర్యాప్తులో వెల్లదించడంతో పోలీసులు అవాక్కయ్యారు. తనసోదరుడి సహాయంతో రాయాసింగ్(45), అతని భార్య,ఇద్దరు కుమారులుతో పాటు రెండేళ్ల కూతురిని హతమార్చి వేర్వేరు ప్రాంతాల్లో పారేసినట్లు నిందితుడు అంగీకరించాడు. గతంలో రాయాసింగ్ తన అన్నను చంపాడని,అందుకే ప్రతికారంతో తన కుటుంబాన్ని అంతం చేసినట్లు వెల్లడించాడు.నిందితుడితోపాటు అతడి సోదరుడిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.తాజాగా పోలీసులు రాయాసింగ్, అతని కూతురు మృతదేహాన్ని కూడా గుర్తించారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: స్లామిక్ శక్తుల నుంచి తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని ఇటీవల మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ జిందాల్ వెల్లడించారు. ఇదిలావుంటే ప్రవక్తపై వ్యాఖ్యల నేపథయంలో నవీన్ జిందాల్ ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక వర్గం నుంచి తన కుటుంబానికి హాని ఉందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో తన కుటుంబానికి సంబంధించిన వివరాలను ఎవరూ బహిర్గతం చేయవద్దని కోరారు. తన గురించి కానీ, తన కుటుంబం గురించి కానీ ఎవరూ కూడా ఎలాంటి వివరాలను ఎవరికీ చెప్పవద్దని విన్నవించారు. తన నివాస చిరునామాను చాలా మంది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారని చెప్పారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'స్లామిక్ శక్తుల నుంచి తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంది'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: బాల్యంలో ఓ క్రీడాకారుడిగా, ఆతర్వాతా సివిల్స్ లో ర్యాంకు సాధించిన విద్యార్థిగా, పోలీసు అధికారిగా మీడియాతోనే సమాజంలో తనకు గుర్తింపు లభించిందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్ అన్నారు. శుక్రవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హాలులో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రూపొందించిన 2023 మీడియా డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ, మీడియాతో తనకు దాదాపు 40యేండ్ల అనుబంధం ఉందన్నారు. విధి నిర్వహణలో కొన్ని సందర్భాల్లో తమ నుండి దొర్లే తప్పులను తాము గ్రహించకపోవచ్చని, మీడియా ద్వారానే వాటిని గుర్తించి సరిచేసుకుంటామన్నారు. ఇదే క్రమంలో పోలీసుల పనితీరుపై పనిగట్టుకొని చేసే అసత్య ప్రచారాల్ని తాము అస్సలు పట్టించుకోమని, వాస్తవాలు ఉండే కథనాలనే పరిగణలోకి తీసుకుంటామని సీపీ ఆనంద్ స్పష్టం చేశారు. ఒకప్పుడు మీడియా సమాజానికి దిక్చూసిగా నిలబడేదని, ప్రస్తుతం దాని స్వరూపం మారిపోవడమే కాకుండా లక్ష్మణరేఖ దాటి పనిచేస్తున్నదన్నారు. ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకుండా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యతా మీడియా సంస్థలపై ఉంటుందన్నారు. సమగ్ర సమాచారంతో డైరీని రూపొందించిన హెచ్.యు.జెను ఆయన అభినందించారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్షులు కే.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పవిత్రమైన మీడియా పెడదారి పడుతుండడంతో ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతుందన్నారు. రాజకీయులు, వాణిజ్యవేత్తలు మీడియా యజమానులుగా కొనసాగడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారులు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో తన కెరీర్ హెచ్.యు.జే నుండే మొదలైందన్నారు. చంచల్ గూడ సెంట్రల్ జైల్ సూపరిండెంట్ శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ, తన 20ఏళ్ల సర్వీసులో మీడియాతో మంచి బంధాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలబడే మీడియా, సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలను నిర్మూలించే దిశలో సామాజిక స్పృహతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ మాట్లాడుతూ, తమ సంఘం అనుబంధ సంస్థ అయిన హెచ్.యు.జే గొప్ప చరిత్ర కలిగివుందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో జాతీయ స్థాయికి నాయకత్వాన్ని హెచ్.యు.జే అందించిందన్నారు. అంతేకాకుండా పలువురు సుప్రసిద్ధ పాత్రికేయులు హెచ్.యు.జేలో కొనసాగిన వారేనని ఆయన గుర్తుచేశారు. హెచ్.యు.జే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కే.సత్యనారాయణ, టీయుడబ్ల్యుజె ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, బొమ్మగాని కిరణ్ కుమార్, వి.యాదగిరి, మల్లయ్య, రియాజ్ అహ్మద్, హెచ్.యు.జే.కార్యదర్శి అబ్దుల్ హమీద్ షౌకత్, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి, సహాయ కార్యదర్శి రమేష్ వైట్ల, జాతీయ కౌన్సిల్ సభ్యుడు అయిలు రమేష్ లతో పాటు హెచ్.యు.జే కార్యవర్గం, పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'నాకు గుర్తింపు వచ్చింది మీడియాతోనే,సీపీ సి.వి.ఆనంద్'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్
జమ్మూ కాశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతం అయ్యారు. మృతుల్లో లష్కరే తొయిబా టాప్ కమాండర్ యూసఫ్ కంత్రు కూడా హతం అయ్యాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు ఆర్మీ సిబ్బందికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. బారాముల్లా జిల్లాలో గురువారం (ఏప్రిల్ 21,2022) భద్రత బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. పారిస్వానీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉన్నారనే పక్కా సమచారంతో గాలింపులు చేపట్టగా ఉగ్రవాదుల నుంచి కాల్పులు ప్రారంభం అయ్యాయి. ఈ ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ యూసుఫ్ కంత్రూతో పాటు మరో ఉగ్రవాదిని కూడా హతమార్చారు. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా. ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ఎన్ కౌంటర్ లో ఎల్ఇటీ టాప్ కమాండర్ యూసఫ్ కంత్రూను హతమార్చడం భద్రతా బలగాలకు పెద్ విజయం అని జమ్ముకాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ అన్నారు. కాంత్రూ గతంలో పౌరులు, భద్రతా సిబ్బంది హత్యలలో పాల్గొన్నాడని. ఇటీవల బుద్గామ్ లో జరిగిన సైనికుడు, పోలీస్ అధికారి, అతని సోదరుడి హత్యలో కాంత్రూ ప్రమేయం ఉందని ఆయన వెల్లడించారు. ఘటన స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: టీడీపీ ప్రభుత్వ అవినీతిని భరించలేకే ప్రజలు కొత్త ప్రభుత్వానికి పట్టం కట్టారని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. పార్టీ కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోతోందని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు తరహాలోనే జగన్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. గోదావరి జలాల పంపకం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయంగా చూడటం సరైందని కాదని హితవు పలికారు. రైతు సంఘాలు, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోవాలని సూచించారు. పీపీఏలలో అవినీతి జరిగితే సమీక్షించడం మంచిదేనన్నారు. కానీ రద్దు నిర్ణయం మాత్రం సరైంది కాదన్నారు. పీపీఏలపై కేంద్రం వైఖరిని ఇప్పటికే సృష్టం చేసిందని పేర్కొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'చంద్రబాబు తరహాలోనే జగన్:పురందేశ్వరి'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: మహిళా ఎమ్మెల్యే కి హెచ్చరిక జారీ
వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజినీకి ఒక దళితుడి నుంచి హెచ్చరిక జారీ అయ్యింది. తనకు ఎస్సీ కార్పోరేషన్ ద్వారా మంజూరైన కారును ఎమ్మెల్యే రాకుండా చేశారని ఆవేదన చెందుతూ ఒక వీడియోను తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అయియ్తే యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామానికి చెందిన శ్యామేల్ తనకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన కారును వైసీపీ ఎమ్మెల్యే విడదల రజినీ అధికారులకు ఫోన్ చేసి మరీ ఆపించారని ఇప్పటి వరకు ఆరు నెలలు గడిచినా తనకు ఇంకా ఆ కారు రాలేదని భార్య, పిల్లల పోషణ కష్టంగా మారిపోయిందని వీడియో ద్వారా తన ఆవేదనను వెల్లబుచ్చాడు. అయితే ఇక తిరిగే ఓపిక తనకు లేదని ఈ నెల 15లోపు సమస్యను పరిష్కరించకపోతే కుటుంబంతో సహా కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్యే గారికి ముందస్తు హెచ్చరిక అంటూ చేసిన వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాలలో వైరల్గా మారింది.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: మున్సిపాలిటీల్లో పారిశుద్ధ వ్యవహారాల నిర్వహణ సరిగాలేని కారణంగా వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు పాటించకపోవడం, తీర్పులు అమలు చేయకపోవవడం వంటి కారణాలతో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,800 కోట్ల భారీ జరిమానా వడ్డించింది. మున్సిపాలిటీల్లో పారిశుద్ధ వ్యవహారాల నిర్వహణ సరిగాలేదంటూ 1996లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పర్యావరణ సురక్ష అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు తదనంతర కాలంలో ఎన్జీటీకి బదిలీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఎన్జీటీ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు పంపింది. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు కూడా నోటీసులు పంపగా, ఆయన ఇచ్చిన వివరణ పట్ల ఎన్జీటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వేల కోట్ల భారీ జరిమానా విధించింది. రెండు నెలల్లో ఈ జరిమానా మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. అంతేకాదు, వ్యర్థాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని, వాటికి సంబంధించిన పురోగతిని తమకు నివేదించాలని కూడా తన ఆదేశాల్లో పేర్కొంది. ఇదిలావుంటే ఇదే అంశంలో గతవారం ఎన్జీటీ పలు రాష్ట్రాలకు భారీ జరిమానాలు విధించింది. వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానాల అమలులో విఫలమయ్యారంటూ మహారాష్ట్రకు రూ.12 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.3,500 కోట్లు, రాజస్థాన్ కు రూ.3 వేల కోట్ల జరిమానా విధించింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'తెలంగాణకు రూ.3,800 కోట్ల భారీ జరిమానా విధించిన ఎన్జీటీ'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: ఫిబ్రవరి 12 న విద్యుత్ సరఫరాకు అంతరాయం
వేమురునియోజకవర్గం, అమృతలూరు మండల పరిధిలోని అన్ని గ్రామాలకు ఫిబ్రవరి 12 వతేదీ రెండవ శనివారం ఉదయం 9 గంటల నుండి ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు అమృతలూరు మండల ట్రాన్స్కో ఏ. ఈ, నాంచారయ్య తెలిపారు. ఫిబ్రవరి 12 వతేదీ సబ్ స్టేషన్ మరమ్మత్తు పనులు నిర్వహించడం, మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని విద్యుత్ లైన్ల క్రింద ఉన్న చెట్లు తొలగింపు పనులు చేపట్టడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి విద్యుత్ వినియోగ దారులు గమనించి విద్యుత్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: చెన్నై: తమిళనాడులో రానున్న ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తమిళసూపర్స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. చెన్నై ఎయిర్పోర్టులో రజనీకాంత్ను ఎన్నికల పోటీ విషయమై రిపోర్టర్లు ప్రశ్నించారు. రజనీ స్పందిస్తూ.తమిళనాడులో నీటి సంక్షోభం నివారణ కోసం ఎవరైతే చిత్తశుద్ధితో కృషి చేస్తారో.ప్రజలు వారికే ఓటేయాలని రజనీ పిలుపునిచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని.అసెంబ్లీ ఎన్నికలే తమ లక్షమని రజనీకాంత్ ఇటీవలే స్పష్టం చేశారు. రజనీ మక్కల్ మండ్రమ్ అనే తన అభిమాన సంఘం పేరుతో రాజకీయ కార్యక్రమాలు జరుపుతున్న వారెవరూ.వేరే ఏ పార్టీ కోసం, ప్రచారం కోసం తన ఫొటోను ఉపయోగించొద్దని ఇప్పటికే కోరారు. రజనీకాంత్ మాత్రం ఇప్పటికి పార్టీ పేరు, కార్యాచరణని ప్రకటించని విషయం తెలిసిందే.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'ఉపఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న రజనీ'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: ఎల్లుండి హైపవర్ కమిటీ సమావేశం కానున్నది. జీఎన్ రావు, బోస్టన్ నివేదికలను అధ్యయనం చేసి ఈ హైపవర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. ఈ నెల 18లోగా నివేదిక సమర్పించే అవకాశం ఉన్నది.సచివాలయం లేదా సీఆర్డీఏ కార్యాలయంలో కమిటీ భేటీ కానున్నది.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'ఎల్లుండి హైపవర్ కమిటీ సమావేశం'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: తెలంగాణలో మరో 5 రోజులు వర్షాలు
తెలంగాణలో వచ్చే 5 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రమంతా వ్యాపించి ఉన్న నైరుతి రుతుపవనాల్లో చురుకుదనం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్లుగా తెలిపారు. తూర్పు విదర్భ, పరిసర ప్రాంతాల్లో 5.8 కిలో మీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో ఉపరిత ఆవర్తనం ఏర్పడిందన్నారు. అంతేకాక, ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో జూన్ 19న ఓ అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు. నిజామాబాద్, ములుగు, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్, కొమరంభీం, భద్రాద్రి, కొత్తగూడెం, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకటి రెండు చోట్ల మాత్రం భారీ వర్షం పడుతుందని వివరించారు. మరోవైపు మధ్యప్రదేశ్లోని పశ్చిమభాగం, తూర్పు మధ్యప్రదేశ్లోనూ వానలు పడతాయని తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: రాష్ట్రంలోని పట్టణ, స్థానిక సంస్థల్లో గురువారం జరిగిన పలు ఉప ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ జయకేతనం ఎగురవేసింది. ఒక మండలాధ్యక్ష పదవికి, మూడు మండల ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో రెండు డిప్యూటీ మేయర్ పదవులకు ఎన్నికలు జరిగాయి. అధికార వైయస్ఆర్సీపీకి చెందిన మాడపాటి విజయలక్ష్మి (26వ వార్డు కార్పొరేటర్), సీలం భారతీనాగకుసుమ (మూడో­వార్డు) ఈ పదవుల్ని గెల్చుకున్నారు. పెడన మున్సిపాలిటీ చైర్పర్సన్గా వైయస్ఆర్సీపీకి చెందిన కటకం నాగకుమారి (ఏడోవార్డు కౌన్సిలర్) గెలుపొందారు. మాచర్ల మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా మాచర్ల ఏసోబు (18వ వార్డు) ఎన్నికయ్యారు. ధర్మవరం మున్సిపాలిటీ వైస్ చైర్మన్లుగా వేముల జయరామిరెడ్డి (రెండోవార్డు), షేక్ షంసద్ బేగం (38వ వార్డు) గెలుపొందారు. 13 మండలాల్లో నాలుగు ఎంపీపీ, ఏడు మండల ఉపాధ్యక్ష, మూడు కో–ఆప్షన్ సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటిలో రామకుప్పం (చిత్తూరు జిల్లా) మండలాధ్యక్ష, ఉపాధ్యక్ష పద­వులకు, విజయాపురం (చిత్తూరు), రాయ­దుర్గం (అనంతపురం) మండలాల ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలు వాయిదాపడ్డాయి. తొండంగి (కాకి­నాడ), వత్సవాయి (ఎన్టీఆర్), చేజర్ల (నెల్లూరు) మండలాధ్యక్షులుగా, పెదకడబూరు (కర్నూలు), గాలివీడు (అన్నమయ్య), రాపూరు (నెల్లూరు), పార్వతీపురం (పార్వతీపురం మన్యం) మండల ఉపాధ్యక్షులుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు. చిత్తూరు (చిత్తూరు), రాజంపేట (అన్నమయ్య), బి.­మఠం (వైయస్ఆర్ జిల్లా) మండలాల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తయింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'మరోసారి హవా చూపిన వైసీపీ'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: నామినేషన్ల తిరస్కరణపై ఈసీని కలిసిన తెలంగాణ పసుపు రైతులు
ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్ సభ సీట్ నుంచి పోటీ చేయకుండా తమ నామినేషన్లను తిరస్కరించడం పై తెలంగాణ కు చెందిన పసుపు రైతులు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. నామినేషను వేయకుండా వారణాసి ఎన్నికల అధికారులు అడ్డంకులు సృష్టించిన తీరుపై కేంద్ర ఎన్నికల సంఘం కు వివరించామని, వారణాసి లో ఎదుర్కొన్న ఇబ్బందులను తెలియజేశామని పసుపు రైతు నరసింహం నాయుడు చెప్పారు.నామినేషన్లకు నగదు స్వీకరించకపోవడం, నామినేషన్ల ప్రక్రియలో విపరీతమైన జాప్యం,నామిషన్లను తిరస్కరించడం ల గురించి వివరించామన్నారు.బాద్యులైన అధికారుల పై చర్యలు చేపట్టాలనికోరామని,నివేదికలు తెప్పించుకొని బాద్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు హామీ ఇచ్చారన్నారు. వారణాసి లో పోటీ చేయడానికి కారణాలు ఏమిటని తమ సమస్యను తెలుసుకోడానికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రయత్నం చేసారని, పసుపు బోర్డు ఏర్పాటే తమ లక్ష్యమని , పసుపుబోర్డు ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ మోసపూరిత నిర్ణయాలను వారికీవివరించామని నరసింహం నాయుడు తెలిపారు.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: 28న మంత్రి మేకపాటి సంతాప సభ
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభ ఈనెల 28న నెల్లూరులో నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలియచేసారు. కనుపర్తిపాడులోని వి.పి.ఆర్. కన్వెన్షన్ హాలులో జరుగుతున్న ఏర్పాట్లు, పరిసర ప్రాంతాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనీల్ కుమార్ ,రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. సంతాప సభ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పార్కింగ్, సీటింగ్, భోజన సదుపాయాలు, బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్, ఏఎస్పి వెంకటరత్నం, ఆర్.డి.ఓ. హుస్సేన్ సాహెబ్, తదితర అధికారులు పాల్గొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్యను అభినందించిన మంత్రి కేటీఆర్
రాంగ్రూట్లో వస్తున్న తన కారును అడ్డుకున్న ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్యను మంత్రి కేటీఆర్ అభినందించారు. నిబంధనల ప్రకారం పని చేసిన ట్రాఫిక్ సిబ్బందిని సోమవారం తన కార్యాలయానికి పిలిపించుకున్న మంత్రి కేటీఆర్. వారి నిజాయితీని ప్రశంసించారు. నిబంధనలు ప్రజలకైనా, ప్రజా ప్రతినిధులకైనా ఒకటే అని మంత్రి కేటీఆర్ అన్నారు. నిబంధనల ప్రకారం పని చేసే ఐలయ్య లాంటి అధికారులకు తామెప్పుడూ అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని, చలాన్ విధించిన రోజున వాహనంలో తాను లేనని కేటీఆర్ అన్నారు. గాంధీ జయంతి రోజున బాపూ ఘాట్ వద్ద అనుకోని పరిస్థితుల్లో రాంగ్ రూట్లో వచ్చిన తన వాహనానికి నిబంధనల ప్రకారం చలాన్ విధించిన ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్ వెంకటేశ్వర్లను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. తన కారుకు విధించిన చలాన్ను చెల్లించినట్లు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం బాపూఘాట్ వద్ద మంత్రి కేటీఆర్ నివాళులర్పించేందుకు వెళ్లినప్పుడు ఆయన కారును ట్రాఫిక్ ఎస్ఐ అడ్డుకున్న విషయం తెలిసిందే. రాంగ్రూట్లో మంత్రి కారు రావడంతో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ ఐలయ్య అడ్డుకున్నారు. రాంగ్ రూట్లో ఎందుకొస్తున్నావు? వెనక్కి వెళ్లు అని డ్రైవర్కు సూచించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారడంతో ట్రాఫిక్ సిబ్బందిని అభినందించి మంత్రి కేటీఆర్ తన నిజాయితీని నిరూపించుకున్నారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: లారీని ఢీకొన్న కారు
పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు మృతులు పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన వారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వివరాలు చదువాల అరుణ్ కుమార్ (37) సౌమ్య (30) అకిలేష్ (10) శాన్వి (8). అరుణ్ కుమార్ మంథనిలో ఓ ప్రైవేట్ పాఠశాల నిర్వహకుడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: అరుణ్ జైట్లీ మృతి పై... జగన్
జైట్లీ మృతి పట్ల ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ స్పందించి తీవ్ర సంతాపం తెలిపారు. ‘నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జైట్లీ జాతికి ఎంతో సేవ చేశారు. విలువలకు కట్టుబడి ఉన్నారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని జగన్ ట్విట్టర్ లో తెలిపారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి
తిరుమల: ముక్కోటి ఏకాదశి వేడుకలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. అర్థరాత్రి తర్వాత స్వామివారికి ధనుర్మాస పూజలు, అభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే వీఐపీ దర్శనాలు ప్రారంభమయ్యాయి. వైకుంఠ ద్వారాలు ధనుర్మాస పూజల తర్వాత తెరుచుకున్నాయి. జస్టిస్ ఎన్వీ రమణ. మంత్రులు మహేందర్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట 4 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. మలయప్పస్వామి స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: అటవీ శాఖ అధికారులకు జింకను అప్పగించిన ఎమ్మెల్యే
గద్వాల మండలంలో జిల్లెడబండ గ్రామంలో శుక్రవారం ఉదాయం శివారులో గల పొలాల నుంచి ఓ జింక గ్రామంలోకి రాగ ఊర కుక్కల దాడి చేసి గాయపర్చాయి. జింకను గ్రామస్థుల సహకారంతో సర్పంచ్ కాపాడారు. అనంతరం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఆయన సూచన మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు గాయపడిన జింకను తీసుకొచ్చారు. సంబంధిత అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా స్వయంగా ఎమ్మెల్యే జింకను అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. వెంటనే పశు వైద్య అధికారుల ద్వారా గాయాలకు చికిత్స చేయించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. చికిత్స అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశారు. జింక ను కాపాడటంలో ఎమ్మెల్యే తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ పట్ల పలువురు హర్షిస్తున్నారు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: పెద్దపల్లిరూరల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు కరువయ్యాయని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కుల సురేష్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రి ఆవరణలో పారిశుధ్యం, వార్డుల్లో రోగులకు అందుతున్న మౌలిక సదుపాయాలను అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వార్డుల్లో రోగులకు తాగునీటి సౌకర్యం సరిగాలేదని తెలిపారు. ఫ్యాన్ల సౌకర్యం లేక దోమలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అన్ని విభాగాలకు చెందిన ప్రత్యేక వైద్యులు లేక పోవడంతో జనరల్ సర్జన్లతోనే రోగులకు సేవలందిస్తున్నారని మండిపడ్డారు. ఆస్పత్రిలోని వార్డుల్లో శానిటేషన్, ఇతర సౌకర్యాలను పూర్తిస్థాయిలో మెరుగు పర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలను మెరుగు పరిచి నిబంధనల మేరకు వైద్య ఖాళీలను భర్తీ చేయాలని, లేకుంటే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూషనవేన రమేష్గౌడ్, మంథని నర్సింగ్, సర్వర్పాషా, కావేటి రాజగోపాల్, బండి అనిల్, అస్లాంతోపాటు పలువురు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ప్రభుత్వాసుపత్రిలో సౌకర్యాలు కరువు : సురేష్ రెడ్డి'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: న్యూఢిల్లీ : ఢిల్లీకి చెందిన పోలీస్ అధికారి కొడుకు ఓ యువతిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇష్టం వచ్చినట్లుగా కొడుతూ ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. దాడి చేసిన యువకుడిని ఢిల్లీ పోలీసు నార్కోటిక్ విభాగం ఏఎస్సై అశోక్ సింగ్ తోమర్ కుమారుడు రోహిత్ తోమర్గా గుర్తించారు. ఐపీసీ సెక్షన్ 354, 506 కింద అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా బాధిత యువతి ఢిల్లీలోని తిలక్ నగర్లో గల ఓ బీపీఓలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆఫీసులో ఎవరూ లేని సమయంలో స్నేహితులతో సహా అక్కడికి చేరుకున్న రోహిత్. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై దాడికి పాల్పడ్డాడు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'యువతిపై ఏఎస్సై కొడుకు దాడి'.
2
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: జగన్ ప్రభుత్వం అభివృద్ధికి ఆదర్శ్యం
రాష్ట్రంలో విద్యావిప్లవం తీసుకొచ్చిన జగన్ గారి ప్రభుత్వం వివిధ విద్యాపథకాల ద్వారా 1,99,38,694 మందికి రూ.34,619.24 కోట్లమేర లబ్ధి చేకూర్చింది. నాడు–నేడు ద్వారా పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేస్తోంది. తెలుగు సబ్జెక్టును తప్పనిసరిచేస్తూనే ఇంగ్లిష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చింది.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్... టికెట్ కౌంటర్స్ లేక ఫ్యాన్స్ నిరాశ
భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ సెప్టెంబర్ 25న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ టికెట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జింకానా గ్రౌండ్స్ లో టికెట్లు ఇస్తారని చర్చ జరగ్గా చాలా మంది అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ టికెట్ కౌంటర్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. భారీగా క్రికెట్ అభిమానులతో ఆ ప్రాంతం నిండిపోయింది.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈరోజు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. భారీగా తరలిరావడంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలు రోడ్డుపక్కన ఉన్న గుండం కట్ల అవుట్లెట్ కాలువలో పడిపోయారు. వారిలో కొందరు స్పృహ కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన కార్యకర్తలను ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని, వారిని కాపాడాలని తాను ఎప్పుడూ కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించిన చంద్రబాబు'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: ఏపీని కరోనా పరేషాన్ వెంటాడుతోంది. కర్నూలులో ఏకంగా 53 పాజిటివ్ కేసులు నమోదుకావడం సంచలనంరేపుతోంది. ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాధితుల్లో ఓ రైల్వే ట్రాక్మెన్ కూడా ఉండటం కలకలంరేపుతోంది. అతడు ఎవరెవర్ని కలిశాడు. ఎక్కడ తిరిగాడు అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అతడు గత నెలలో ఢిల్లీ నుంచి కర్నూలు వచ్చినట్లు గుర్తించారు ట్రాక్మెన్ గత నెల 17న రాత్రి 8గంటలకు ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్లో బయలుదేరి 18న రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్ వచ్చాడు. తర్వాత 7.10 గంటలకు ఫలక్నుమా ఎంఎంటీఎస్ రైలు ఎక్కి 7.30 గంటలకు కాచిగూడ వెళ్లాడు. తర్వాత రాత్రి 8.05 గంటలకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో కర్నూలు చేరుకున్నాడు. అక్కడ తన విధులకు హాజరైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాచిగూడ స్టేషన్లో ఉన్న అతడు 35 నిమిషాలు ఎక్కడెక్కడ తిరిగాడనే విషయమై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. ప్లాట్ఫాంపై టిఫిన్ సెంటర్లు, స్టాళ్లు, అక్కడ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలని అధికారులు సూచించారు. ట్రాక్మెన్ టిక్కెట్ రిజర్వేషన్ లేకుండానే కర్నూల్కు వెళ్లినట్లుగా తేలిందట. ఎస్2, ఎస్5 బోగీల్లో ప్రయాణించినట్లు గుర్తించారట. ఎస్5 బోగీలో ప్రయాణించిన 77 మంది జాబితా సేకరించి వివరాలు ఆరా తీస్తున్నారు. వారిలో ఎవరిలోనూ వ్యాధి లక్షణాలు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ట్రాక్మెన్ రాజస్థాన్కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి పాజిటివ్ రాగా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'కర్నూలులో కరోనా టెన్షన్'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: మూడోసారి సీఎం అయినా తర్వాత అమిత్ షాతో భేటీ కానున్న కేజ్రీవాల్ !
తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి సీఎం సీటును ఎక్కిన కేజ్రీవాల్ . అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీలను ఓడించి మరోసారి సీఎం అయ్యారు. గత ఆదివారంనాడు ఆయన ప్రమాణస్వీకారం చేశారు. మూడోసారి సీఎం అయిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కేజ్రీవాల్ తొలిసారి భేటీ కాబోతున్నారు. కాసేపట్లో వీరి సమావేశం ప్రారంభంకానుంది. ఎన్నికల ప్రచార సమయంలో ఆప్, బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు గుప్పించుకున్నారు. ఎన్నికల ప్రచారం యుద్ధాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో, వీరిద్దరి భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. మరోవైపు తన ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీని కేజ్రీవాల్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, తన సొంత నియోజకవర్గం వారణాసిలో పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్న మోదీ. కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి హాజరుకాలేకపోయారు. అయితే, ట్విట్టర్ ద్వారా కేజ్రీవాల్ కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ శుభాకాంక్షల పట్ల కేజ్రీవాల్ కూడా హుందాగా తన ప్రతిస్పందనను తెలియజేశారు. 'మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు సార్. ప్రమాణస్వీకారానికి మీరు వస్తారని భావించా. మీరు ఎంతో బిజీగా ఉన్న విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. భారతీయులంతా గర్వించే విధంగా ఢిల్లీ నగరాన్ని తీర్చిదిద్దేందుకు కలిసి అడుగులు వేద్దాం' అని కేజ్రీవాల్ తెలిపారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: ఎన్నికలు వచ్చిన ప్రతిసారి మాయమాటలతో మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ పై టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు ప్రశ్నల వర్షం కురిపించారు. ఎప్పుడైనా మునిసిపాలిటీల్లో తనిఖీలు చేశారా? డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఏమయ్యాయి? ఏ మునిసిపాలిటీలో అయినా మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజాకోర్టు నిర్వహించేందుకు కేటీఆర్ సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'కేటీఆర్ కు ప్రశ్నల వర్షం కురిపించిన రేవంత్ రెడ్డి'.
2
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: హైదరాబాద్ నగరంలో రాత్రుళ్లు ఏ కారణంగా లేకుండా విచ్చల విడిగా బయట తిరుగుతున్న యువకులను కట్టడి చేసేందుకు సౌత్జోన్ పోలీసులు చబుత్రా మిషన్ చేపట్టారు. ప్రత్యేకంగా పాతబస్తీ కాలాపత్తర్ పొలీసు పరిధిలోని పలు ప్రాంతాల్లో అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ గుమ్మి చక్రవర్తి ఆధ్వర్యంలో ఈ మిషన్ను నిర్వహించారు. ఈ క్రమంలో బయట తిరుగుతున్న 35 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. నేరాలను అరికట్టడం, యువతను సక్రమమార్గంలో పెట్టడంతో పాటు వాహనాలను ర్యాష్గా నడపవద్దంటూ యువతకు కౌన్సిలింగ్లో కోరుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా పెట్టాలని అడిషనల్ టాస్క్ ఫోర్స్ డీసీపీ గుమ్మి చక్రవర్తి కోరారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'ఆపరేషన్ 'చబుత్రా' మిషన్ ... పోలీసుల అదుపులో 35 మంది యువకులు'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: బాబు తుగ్లక్ చర్యలు తమ ప్రభుత్వానికి గుదిబండగా మారాయి : ఎమ్మెల్యే పార్థసారథి
అమరావతిని కేవలం ఆదాయ వనరుగా పరిగణించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరువల్లే నేడీ పరిస్థితి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. బాబు తుగ్లక్ చర్యలు తమ ప్రభుత్వానికి గుదిబండగా మారాయని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆధారాలతో సహాయ బయటపెట్టామని, దాని వెనుక మరమ్మమేమిటో ప్రత్యేకించి చెప్సాల్సిందేముందన్నారు. రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే లక్షా పది వేల కోట్ల రూపాయలు కావాలని, అంతమొత్తం పెట్టుబడి పెట్టే స్థోమత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదన్నారు. ఈ పరిస్థితుల్లో అమరావతిని పట్టుకుని ముందుకు సాగడం ఎలా? అని ఆయన ప్రశ్నించారు. అందుకే వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అడుగు వేస్తోందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఇక, తిరుమలలోని గొల్లమండపం కూల్చివేత నిర్ణయంపై పార్థసారధి తీవ్రంగా స్పందించారు. దేశవ్యాప్తంగా ఉన్న యాదవుల మనోభావాలు దెబ్బతినే ఇటువంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న గొల్ల మండపాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని, ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లి పటిష్ట పరిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: జనసేన నేతలపై కేసులను తక్షణమే ఎత్తివేయాలని, జనసేన నేతలు, కార్యకర్తలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని బీజేపీ ఏపీ చీఫ్ సోమువీర్రాజు డిమాండ్ చేశారు. ఇదిలావుంటే పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో, జనసేన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. పితాని సత్యనారాయణ, పంతం నానాజీ తదితర అగ్రనేతలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. జనసేన నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడాన్ని ఏపీ బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఈ కేసులను తక్షణమే ఎత్తివేయాలని, జనసేన నేతలు, కార్యకర్తలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ వైఖరి మార్చుకోకుంటే జనసేనతో కలిసి ప్రతిఘటించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. అటు, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా పవన్ కల్యాణ్ కు మద్దతు పలికారు. పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఖండిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే కార్యక్రమాలను మానుకోవాలని స్పష్టం చేశారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'కేసులు ఎత్తివేసి...జనసేన నేతలను విడుదల చేయాలి: సోమువీర్రాజు'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: నోరు జారిన ఎమ్మెల్యే రోజా
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజా సెల్వమణి నోరు జారారు. ఆడవాళ్ల పుట్టుకను ముఖ్యమంత్రి అవమానిస్తాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్గా వాసిరెడ్డి పద్మ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోజా మాట్లాడుతూ. ప్రతిపక్ష టీడీపీపై ఆరోపణలు చేసే క్రమంలో పలు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రి అని ఆమె అనుకుంటున్నారేమో అన్నట్లు ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే. ‘కారు షెడ్డులో ఉండాలి. ఆడది ఇంట్లో ఉండాలి అని చెప్పిన పెద్ద మనిషి పరిపాలనలో మహిళలకు ఏం న్యాయం జరుగుతుందో మనం అందరం చూశాం. ముఖ్యమంత్రి ఉన్నాడు అసలు. ఆడవాళ్ల పుట్టుకనే అవమానిస్తాడు’ అని రోజా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆమె ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారంటూ ఆశ్చర్యకరంగా కనిపించారు. ముఖ్యమంత్రిని అలా అంటున్నారేంటని షాక్ అయ్యారు. అలా ఆమె ప్రసంగిస్తూనే తర్వాత జగన్ను పొగిడారు. దీంతో ఓహో. ఇప్పటి వరకు విమర్శించింది చంద్రబాబునా. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే. ఆమె చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను కాసేపు విస్మయానికి గురి చేశాయి.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. మెదక్ ఏరియా ఆస్పత్రిలో రోగులకు, చర్చి కాంపౌండ్లోగల ఓల్డేజి హోంలో వృద్ధలకు పండ్లు పంపిపెట్టారు. అలాగే స్థానిక రాజీవ్భవన్, ఏరియా ఆస్పత్రిలో కేక్కట్ చేసి శశిధర్రెడ్డి లాంగ్లీవ్ అంటూ నినాదాలుచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మామిళ్ల ఆంజనేయులు, మేడి మధుసూదన్రావు, గూడూరి ఆంజనేయులు రవి, నరేందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, కొండ శ్రీనివాస్, జట్కా సందీప్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ మాజీ ఎమ్మేల్యే శశిధర్ రెడ్డి జన్మదిన వేడుకలు శుక్రవారం రామయంపేట నాయకులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అహ్మద్, రొయ్యల పాచయ్య, కర్రె రమేష్, దోమకొండ వెంకటి, గౌస్ తదితరులు ఉన్నారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: సత్యనారాయణ మర్డర్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
గత వారం హత్యకు గురైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగి సత్యనారాయణ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. మద్యం అలవాటే ఆయన దారుణ హత్యకు కారణమైనట్లు తేల్చారు. హెచ్సీయూలో పనిచేస్తున్న సత్యనారాయణ వారం రోజుల క్రితం నార్సింగి లోని హైదర్ షా కోట నుంచి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు హిమాయత్ సాగర్ సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సత్యనారాయణ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. సత్యనారాయణది సహజ మరణం కాదని. ఎవరో హత్య చేసినట్లుటీ గుర్తించిన పోలీసులు హత్య కేసుగా మార్చి దర్యాప్తు కొనసాగించారు. మృతదేహం లభ్యమైన హిమాయత్ సాగర్ ప్రాంతానికి అన్ని రహదారులలో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో చిన్న క్లూ లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హత్య జరిగిన రోజు సత్యనారాయణ మరో వ్యక్తితో కలసి వెళ్తున్నట్లుగా ఉన్న గుర్తించారు. ఆ వ్యక్తి ఎవరనే విషయంపై ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. మద్యం తాగే అలవాటున్న సత్యనారాయణ తరచూ సమీపంలోని కల్లు కాంపౌండ్కి వెళ్లేవాడు. ఆ సమయంలో కల్లు తాగేందుకు వచ్చే అజీమ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. లాక్డౌన్తో పనిలేక ఇబ్బందులు పడుతున్న అజీమ్ కన్ను సత్యనారాయణపై పడింది. అతని వద్దనున్న బంగారం, డబ్బు కాజేయాలని ప్లాన్ చేశాడు. కల్లు కాంపౌండ్ సమయం దాటిపోయిందని యజమాని చెప్పడంతో బయటికి వెళ్లి తాగుదామని అజీమ్ నమ్మబలికాడు. హోండా యాక్టివా వాహనంపై ఎక్కించుకుని హిమాయత్సాగర్ వైపు తీసుకెళ్లాడు.అక్కడికి వెళ్లిన తర్వాత సత్యనారాయణపై ఒక్కసారిగా దాడి చేసి అంతమొందించాడు. సత్యనారాయణ ఒంటిపై ఉన్న బంగారం, నగదు, బైక్ అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ముగ్గురు మావోయిస్టు కొరియర్లు అరెస్ట్
మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా సుపరిండెంట్ ఆఫ్ పోలీస్ కోటిరెడ్డి నిందితులను మీడియా ఎదుట హాజరుపర్చి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: రాష్ట్రంలో గ్రూప్-1 దరఖాస్తులు 2 పక్షలు దాటాయి. ఈ నెల 2న్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవగా మంగళవారం రాత్రి వరకు 2, 00, 428 దాటినట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుల సమర్పణకు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇటీవల ప్రభుత్వం గ్రూప్-1లో యూనిఫామ్ పోస్టులైన డీఎస్సి, డిఎస్జే, ఏఈఎస్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 31 ఏళ్ల నుంచి 33 ఏళ్లకు పెంచింది. డీఎస్సి, ఏఈఎస్ పోస్టులకు పోటీపడే పురుష, మహిళ అభ్యర్థులకు ఎత్తును తగ్గించింది. అర్హులైన అభ్యర్థులు చివరిరోజు వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక '2 లక్షలు దాటిన గ్రూప్-1 దరఖాస్తులు'.
2
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: ఆంధ్రప్రదేశ్లో కరోనా తగ్గుముఖం పట్టింది. గత నెల రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు చాలా తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రోజులో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో డిశ్చార్జ్ అవుతున్నారు. గత 24 గంటలుగా ఏపీలో 3,224 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 7,58,951కు చేరింది. గత 24 గంటల్లో 5,504 మంది కరోనాను జయించారు. కాగా. గడిచిన 24 గంటల్లో కరోనాతో 32 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకూ 6,256 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 43,983 యాక్టివ్ కేసులు ఉండగా. 7,08,712 ఇప్పటివరకూ కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు ఏపీలో 66.30 లక్షల కరోనా టెస్టుల నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఉభయ గోదావరి జిల్లాలు, చిత్తూరు, అనంతపురంలో ఇదివరకూ పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు ఈ జిల్లాల్లో కరోనా ఉధృతి చాలా వరకూ తగ్గింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'ఏపీ కరోనా బులిటెన్...'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: కొద్ది నెలల క్రితం ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం స్పేసెస్ ఫీచర్​ ను ట్విట్టర్ పరిచయం చేసిన విషయం విధితమే. దీంతో యూజర్లు లైవ్లోనే ఆడియో చాట్ చేసుకునే సౌలభ్యం లభించింది. దీనికి తోడు ఈ స్పేసెస్ లోని ఆడియోను అందరితో షేర్ చేసుకునేలా ఓ క్లిప్పింగ్ టూల్ను ఆవిష్కరించినట్లు తాజాగా ట్విట్టర్ ప్రకటించింది. 30 సెకన్లను ఆడియోను షేర్ చేసిన 30 రోజుల వరకు అందుబాటులో ఉంటుంది.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'ట్విటర్ లో సరికొత్త ఫీచర్'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు శనివారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి భక్తులకు దర్శనమిచ్చారు. పుష్కరిణిలో చల్లటి సాయంత్రం వేళ స్వామివారు తెప్పపై విహరిస్తుండగా భక్తులు దర్శించుకుని పరవశించి పోయారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: పీఎం కిసాన్ రాలేదా...ఫిర్యాదు ఇలా
పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం 3 విడతల్లో రూ.6 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. చిన్న చిన్న తప్పుల వల్ల చాలా మంది రైతుల అకౌంట్లో నగదు జమ కావడం లేదు. స్పెల్లింగ్ మిస్టేక్స్, మీరు సమర్పించిన డాక్యుమెంట్లలో, బ్యాంకు అకౌంట్లలో పేర్లు వేర్వేరుగా ఉన్నాయేమో చెక్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ఆటోమెటిక్ సిస్టమ్ ద్వారా డబ్బుల్ని ఒకేసారి జమ చేస్తుంది.పేర్లు మ్యాచ్ కాకపోతే మనీ ట్రాన్స్ఫర్ జరగదు. డాక్యుమెంట్లో ఒక పేరు, బ్యాంకు అకౌంట్లో మరో పేరు ఉండటం వల్ల ఈ సమస్య వస్తోంది. మీ సమస్యను ఈజీగా పరిష్కరించుకోవచ్చు. ముందుగా పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in/ ఓపెన్ చేయండి. అందులో ఫార్మర్స్ కార్నర్ పైన క్లిక్ చేయండి. ఎడిట్ ఆధార్ డీటెయిల్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత వివరాలు కనిపిస్తాయి. వివరాలు చెక్ చేసుకొని సరిదిద్దుకోవాలి. ఇంకా ఏవైనా తప్పులు ఉంటే స్థానిక వ్యవసాయ అధికారుల్ని సంప్రదించాలి. పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్: 011-24300606, 155261, 0120-6025109, పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నెంబర్: 18001155266, పీఎం కిసాన్ ల్యాండ్ లైన్ నెంబర్: 011—23381092, 23382401 నెంబర్లను సంప్రదించొచ్చు. pmkisan- [email protected] మెయిల్ ఐడీకి కంప్లైంట్ చేయొచ్చు. రైతులారా మీరు పంటకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారా. మీ పంట సాగుకు సంబంధించి ఏ సమస్యలున్నా వెంటనే పరిష్కారం పొందవచ్చు. కింద ఇచ్చిన లింక్ ద్వారా యాప్ డౌన్ లోడ్ చేసుకొని మీ పంటను ఫోటో తీయండి. వెంటనే పంటకున్న వ్యాధి పేరు చూపబడుతుంది. ఆ తర్వాత దానికి మందులను కూడా చూపబడుతుంది. ఇదంతా మీరు ఉన్న ప్రదేశం నుంచే చేసి పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి యాప్ డౌన్ లోడ్ చేసుకొని మరిన్ని వివరాలు పొందవచ్చు. https://app.adjust.net.in/6ramofe
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: బంజారాహిల్స్ భూదందాలో ఏసీబీ అధికారుల దూకుడు పెంచారు. నేడు ముగ్గుర్ని కస్టడీ కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసులో షేక్ పేట్ ఎమ్మార్వో సుజాత, నాగార్జున, రవీందర్ ను అరెస్ట్ చేశారు. రూ. 40 కోట్ల భూవివాదంలో ముగ్గుర్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ ఆర్ఐ నాగార్జున రెడ్డి ఏసీబీకి చిక్కాడు. భూ వివాదంలో ఎమ్మార్వో సుజాత పాత్ర ఆధారాలు ఏసీబీ అధికారులు సేకరించారు. తన ఇంట్లో దొరికిన రూ. 30 లక్షలకు ఆధారాలు ఎమ్మార్వో చూపలేదు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'బంజారాహిల్స్ భూదందాలో ఏసీబీ అధికారుల దూకుడు'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: చిత్తూరు: శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి శ్రీనివాసులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాత్రూంలో వేడినీళ్ళతో గ్యాస్ తో పనిచేసే గీజర్ ను ఏర్పాటు చేసుకున్నాడు. గ్యాస్ సిలిండర్ పేలడంతో తీవ్ర గాయాలైన శ్రీనివాసులు శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'గ్యాస్ సిలిండర్ పేలి వ్యక్తికి గాయాలు'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: మానస సరోవర్ యాత్ర రిజిస్ట్రేషన్లు ప్రారంభం
న్యూఢిల్లీ: ఈ ఏడాది మానస సరోవర్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డోక్లాంపై ప్రతిష్టంభన నేపథ్యంలో అప్పట్లో చైనా నాథూలా మార్గాన్ని మూసివేసింది. ఇప్పుడా మార్గంలోనూ యాత్రికులు వెళ్లవచ్చునని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్లోని లిపులేఖ్ కనుమ మార్గంలో కూడా మానస సరోవర్ యాత్రకు వెళ్లవచ్చు. జూన్ 8నుంచి నాలుగు నెలలపాటు జరిగే యాత్ర కోసం మార్చి 23 తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్రం తెలిపింది.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: ఎడపల్లి మండలంలోని దుపల్లి గేటు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎడపల్లి ఎస్సై పాండేరావు తెలిపారు. రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన సుభాష్ అనే వ్యక్తి నిజామాబాద్ వెళ్లి తిరిగి దూపల్లికి వెళ్తుండగా దూపల్లి గేటు వద్ద తన టీవీఎస్ ఎక్స్ ఎల్ పై రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు మృతుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో సుభాష్ కు తీవ్ర గాయాలుకాగా చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎడపల్లి ఎస్సై పాండేరావు తెలిపారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను రాయండి: హైదరాబాద్: సిక్కీం ముఖ్యమంత్రిగా ప్రేమ్సింగ్ తమాంగ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ గంగా ప్రసాద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గ్యాంగ్టక్లోని పల్జోర్ స్టేడియంలో ఈ వేడుక జరిగింది. సిక్కిం క్రాంతికారి మోర్చా మద్దతు దారులు ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు. 51 ఏళ్ల తమాంగ్ నేపాలీ భాషలో ప్రమాణ స్వీకారం చేశారు. సిక్కీం అసెంబ్లీలో మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు ఉండగా. ఎస్కేఎం, ఎస్డీఎఫ్ పార్టీల మధ్య హోరాహోరి పోరు సాగింది. గురువారం అర్ధరాత్రి వరకు జరిగిన లెక్కింపులో ఎస్కేఎం 17 స్థానాల్లో మెజార్టీ సాధించగా. ఎస్టీఎఫ్ 15 స్థానాలతో తృటిలో అధికారాన్ని కోల్పోయింది.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'సిక్కీం సీఎంగా ప్రేమ్సింగ్ తమాంగ్ ప్రమాణం'.
2
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి
కడప జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే రోడ్డు అభివృద్ధి అనే ముద్దు పేరుతో రైతులకు న్యాయమైన నష్ట పరిహారం ఇవ్వకుండా బలవంతంగా భూములు తీసుకుంటున్నారని తక్షణమే ఆపాలని ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి తెలిపారు. మంగళవారం మైదుకూరు తహసిల్దార్ కార్యాలయంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులతో గ్రామసభ బద్వేల్ ఆర్డివో సమక్షంలో జరిగింది.ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే కోసం సేకరిస్తున్న భూములు పులివెందల ఎర్రగుంట్ల కమలాపురం చాపాడు మైదుకూరు బి. మఠం ప్రాంతాలలో చాలా విలువైన భూములని ఎకరా కోటి రూపాయలు పైగా ఉన్నాయని రెండు మూడు పంటలు పండే భూములని అటువంటి కి ఎకరానికి 10 నుంచి 15 లక్షల మాత్రమే ఇస్తామంటున్నారని , నోటీసులు ఇవ్వకుండా గ్రామ సభలు పెట్టకుండా రైతులు వ్యతిరేకించిన కూడా భూములలో బలవంతంగా సర్వే చేస్తూ నెంబర్ రాళ్లు పాతుతున్నారని ఆయన తెలిపారు. 2023 మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఈ నిరసన కార్యక్రమంలో మైదుకూరు రైతు సేవ సమితి అధ్యక్షులు ఏవి రమణ గారు నిరసనకు సంఘీభావం మద్దతు తెలియజేశారు రైతు సంఘం నాయకులు కొండారెడ్డి శ్రీనివాసులు రెడ్డి తో పాటు మరి కొంతమంది రైతులు రోడ్డు నిర్వాసితులు పాల్గొన్నారు
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: వారిని అదృష్టం వెంటాడింది...మూడు లాటరీ టిక్కట్లు దక్కిన బహుమతి
మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఒకటో, రెండో ఫలితస్తాయి. లేకపోతే అది కూడా లేదు. కానీ అమెరికాలోని ఓ వృద్ధ దంపతుల మూడు ప్రయత్నాలు ఒకేసారి ఫలించాయి. అదృష్టం కలిసొస్తే ఏం చేసినా డబ్బులు వచ్చిపడతాయన్నది సామెత. అమెరికాలోని వృద్ధ దంపతులకు అలాగే అదృష్టం వరించింది. ఏమరుపాటుతో మర్చిపోయి కొన్న మూడు లాటరీ టికెట్లలో మూడింటికీ లాటరీ తగిలింది. ఆ మూడు కూడా ఒకేసారి డ్రా తీసిన లాటరీవి కావడం మరింత విశేషం. మూడింటికీ కలిపి లక్షన్నర డాలర్ల బహుమతి వచ్చింది. అంటే మన కరెన్సీలో కోటీ 20 లక్షల రూపాయలపైనే. అమెరికాలోని టోసన్ ప్రాంతానికి చెందిన 67 ఏళ్ల పెద్దాయన. మేరీలాండ్ లాటరీకి సంబంధించి రెండు టికెట్లు కొన్నారు. ఆ సమయంలో ఆయనకు చిన్న సర్జరీ అవసరం ఉండటంతో చికిత్స కోసం వెళ్లారు. ఆ కుటుంబానికి అప్పుడప్పుడూ లాటరీ టికెట్లు కొనే అలవాటు ఉండటంతో. తన భర్త కొన్నాడో లేదో అని భార్య కూడా అదే లాటరీకి సంబంధించి మరో టికెట్ కొనుగోలు చేసింది. సర్జరీ పూర్తయిన తర్వాత వారు. తమ లాటరీ టికెట్ల పరిస్థితి ఏమిటో చూసుకున్నారు. చిత్రంగా మూడు లాటరీ టికెట్లకూ బహుమతి తగిలింది. లాటరీ తగిలిన దంపతులు వారి పేర్లను ప్రచురించడానికి ఇష్టపడలేదు. అయితే తన భార్య పుట్టిన రోజును తలపించేలా ఉన్న నంబర్లతో లాటరీ టికెట్లు కొన్నామని. వాటికి బహుమతి తగిలిందని సదరు పెద్దాయన ఆనందంగా చెప్తున్నారు. మూడింటికీ లాటరీ తగిలిన విషయాన్ని తొలుత నమ్మలేదని పేర్కొన్నారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఫణి తుఫాను వల్ల రాష్ట్రానికి నష్టం కలిగితే బాధ్యులెవరు?: యనమల
అమరావతి: ఫణి తుఫాను వల్ల రాష్ట్రానికి నష్టం కలిగితే బాధ్యులెవరు? అని ఆర్థిక మంత్రి యనమల ప్రశ్నించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ మోడీ, ఈసీ, సీఎస్లపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యానికే భంగం కలిగేలా ఈసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విడుదల చేయవచ్చా? అని ప్రశ్నించారు. బీజేపీయేతర ప్రభుత్వాల్లో ఈసీ నియమించిన సీఎస్ల జోక్యాన్ని ఎలా చూడాలన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సాధారణ పాలన చేయవచ్చు. కానీ ఇప్పుడున్నది ఆపద్ధర్మ ప్రభుత్వం కాదు. ప్రజా ప్రభుత్వమన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రభుత్వంపైనే ఉందన్నారు. అలాంటి పోలవరంపై చంద్రబాబు రివ్యూ చేయకూడదనడం విడ్డూరమన్నారు. ఈ సీజన్ కూడా కోల్పోతే రైతులకు కలిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అని ప్రశ్నించారు. ఎన్నికల విధానం చూడాల్సిన వ్యక్తి ప్రజా పాలనను ఎలా అడ్డుకుంటారు? అని ప్రశ్నించారు. బీజేపీయేతర ప్రభుత్వాలపై మోడీ వివక్షకు ఇది పరాకాష్ట అన్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: అమరావతి రైతులు ఆందోళన విరమించాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. అమరావతి రైతుల భూములను అభివృద్ధి చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. సోమవారం రాత్రి ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని పేరుతో గతంలో దోపిడీ జరిగిందని, ప్రతిపక్షనేత చంద్రబాబు మాటలకు ఇంకా మోసపోవద్దని రైతులకు సూచించారు. అమరావతి ప్రాంతంలో కొందరు నిరసన తెలియజేస్తుంటే, చంద్రబాబు ఆ ప్రాంతానికి వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఆర్డీఏ ప్రాంతంలో ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి కుమారుడి సంస్థకు 500 ఎకరాల భూములు ఏరకంగా కేటాయిస్తారని బొత్స ప్రశ్నించారు. ఆ భూముల వరకు సీఆర్డీఏ ప్రాంతాన్ని విస్తరించడం దోపిడీ కాదా అని నిలదీశారు. చంద్రబాబు సీఎం అయ్యాక హెరిటేజ్ సంస్థ భూములు కొనుగోలు చేసిందన్నారు. పత్రికల్లో వస్తున్నంత తీవ్రంగా అమరావతిలో ఆందోళనలు జరగడం లేదని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ, తాజాగా జి.ఎన్.రావు కమిటీలు ఒకే రకమైన సూచనలు చేశాయన్నారు. తాజాగా టిడ్కో ఇళ్ల నిర్మాణ రివర్స్ టెండర్లలో రూ.150 కోట్ల వరకు ఆదా అయిందన్నారు. ఆధారాలతో సహా గత ప్రభుత్వ అక్రమాలు వెలుగుచూస్తుంటే హైకోర్టు జడ్జితో విచారణ ఎందుకని ప్రశ్నించారు. సీఎం జగన్కు ఒక విజన్ ఉందని దాని ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ నెల 28న సీఎం విశాఖ పర్యటన సందర్భంగా రూ.1400 కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. దీనిలో రూ.వెయ్యికోట్ల పనులు 6 నెలల వ్యవధిలో పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించామని చెప్పారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'రైతులకిచ్చిన హామీలను నెరవేరుస్తాం: బొత్స'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన కాపు సంఘాలు
కృష్ణా జిల్లా: కాపు ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను తొలగించినందుకు ధన్యవాదాలు తెలిపిన కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఆధ్వర్యంలో కాపు సంఘాలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు వారు కృతజ్ఞతలు తెలియచేసారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం పిలుపు మేరకు ఉద్యమం చేస్తే కాపుల పై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్యాయంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. ఎన్నికలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ కేసులు తొలగించారని గుర్తు చేశారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: అమరావతి: ఏపీ డీఈఈసెట్-2017 ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపీ సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ. 72,259 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 53,962 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 39,632 మంది అర్హత సాధించినట్లు వెల్లడించారు. రెండు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.గణితంలో కృష్ణాజిల్లాకు చెందిన కె.దుర్గా పవన్కుమార్ 90 మార్కులతో ప్రథమస్థానంలో నిలువగా, అనంతపురానికి చెందిన కె.లత (85 మార్కులు), గుంటూరుకు చెందిన వైఎన్. కీర్తి (85 మార్కులు)ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. భౌతికశాస్త్రంలో తూర్పుగోదావరికి చెందిన ఏసీ సరోజ(78 మార్కులు) ప్రథమస్థానంలో నిలువగా. పశ్చిమగోదావరికి చెందిన టి.సాయిసంతోష్ ఆదిత్య (78 మార్కులు), అనంతపురానికి చెందిన టి.నూర్యాని (77మార్కులు) ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు. బయోలాజికల్ సైన్స్లో కృష్ణాజిల్లాకు చెందిన జి.తేజస్వి 84 మార్కులతో ప్రథమస్థానం సాధించగా, అదే జిల్లాకు చెందిన బి.లక్ష్మీనాథ్ 80 మార్కులతో రెండో స్థానం, చిత్తూరు జిల్లాకు చెందిన ఎం.సౌమ్య 78 మార్కులతో తృతీయస్థానం సాధించారు. సాంఘికశాస్త్రంలో తూర్పుగోదావరికి చెందిన టి.వనజ 72 మార్కులతో ప్రథమస్థానం సాధించగా, కృష్ణాజిల్లాకు చెందిన వి.సాయిబాబు 72 మార్కులతో రెండో స్థానం, గుంటూరు జిల్లాకు చెందిన పి.మహెముదా 69 మార్కులతో మూడో స్థానం సాధించారు. డైట్సెట్ 2017 వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం మొదటి విడత ఈ నెల 19 నుంచి 21 వరకు వెబ్ఆప్షన్ల నమోదు, 25న సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ నెల 26 నుంచి వచ్చేనెల 5వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. రెండో విడతలో భాగంగా అక్టోబర్ 9 నుంచి 12 వరకు వెబ్ఆప్షన్ల నమోదు అక్టోబర్ 13న సీట్ల కేటాయింపు చేయనున్నారు. అక్టోబర్ 16 నుంచి 18 వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించనున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'ఏపీడీఈ ఈసెట్-2017 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఆ కేసులో హోం మంత్రి మనవడుకి ఎలాంటి సంబంధం లేదు : డీసీపీ
హైదరాబాద్లోని అమ్నీషియా పబ్లో బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసివుల్లాఖాన్ కుమారుడు మహమూద్ ఖాదర్ ఖాన్, మరో బాలుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనుమానితుడు మహ్మద్ ఖాదర్ ఖాన్ ను హైదరాబాద్ శివారులో అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో హోంమంత్రి మనవడు ప్రమేయం ఉందనేది తప్పుడు ప్రచారమని, ఈ కేసుతో అతనికి ఎలాంటి సంబంధం లేదని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. అందుకే మనవడికి క్లీన్ చిట్ ఇచ్చామని వెల్లడించారు. అయితే బాలిక తెలిపిన వివరాల ప్రకారం ఐదుగురిని గుర్తించారు. వీరిలో ముగ్గురు మైనర్లేనని డీఎస్పీ స్పష్టం చేశారు. వారందరినీ త్వరలోనే అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేస్తామని తెలిపారు.
1
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: చిత్తూరు: తంబళ్లపల్లె మండలంలో మంగళవారం సాయంత్రం వీచిన ఈదురు గాలులు. మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈ ఏడాది మామిడి పూత అంతంత మాత్రమే. మండలంలోని కోసువారిపల్లె, కన్నె మడుగు, గోపిదిన్నె, తంబళ్లపల్లి, రేణుమాకులపల్లిలో మామిడికాయలు ఈదురుగాలులకు నేలరాలాయి. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'నేల రాలిపోయిన మామిడి'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: హైదరాబాద్లో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు,దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో ఓఆర్ఆర్
ప్రగతిపథంలో భాగ్యనగరం దూసుకెళ్లోంది. త్వరలో హైదరాబాద్లో ఔటర్ రింగు రైలు ప్రాజెక్ట్ రాబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ ఔటర్ రింగు రైలు ప్రాజెక్టును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రైల్వే శాఖ కసరత్తు ప్రారంభించింనట్టు తెలిపారు. ట్రిపుల్ ఆర్ రోడ్డుకు సమాంతరంగానే ఈ ఔటర్ రింగు రైల్ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. అయితే. ఈ ప్రాజెక్టు కోసం సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ట్రిపుల్ఆర్ రోడ్డుకు సమాంతరంగా ఔటర్ రింగు రైలును ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు తెలిపారు. అయితే. ఈ ప్రాజెక్టు సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల నిధులు కేటాయించినట్టు కిషన్ రెడ్డి తెలిపారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: అమిత్ షాకి బీజేపీ ఎంపీలు జీవీఎల్, టీజీ, సీఎం రమేశ్ లేఖ రాశారు. ఏపీలో స్థానిక సంస్థల నిర్వహణలో అక్రమాలు జరిగాయని పిర్యాదు చేశారు. పోలీసులు, వైసీపీ నేతల తీరుపై బీజేపీ ఎంపీల ఆరోపణలు చేశారు. పరిస్థితిపై జోక్యం చేసుకోవాలని లేఖలో బీజేపీ ఎంపీలు కోరారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'అమిత్ షాకి బీజేపీ ఎంపీలు జీవీఎల్, టీజీ, సీఎం రమేశ్ లేఖ'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: నీట్, ఎంసెట్లో ఉచిత కోచింగ్
మెహిదీపట్నం: ఎంసెట్, నీట్ 2018 రాసే విద్యార్థినిలకు ఉచిత కోచింగ్ ఇస్తున్నామని ఇక్రా ఎడ్యుకేషన్ సొసైటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఇక్రా సొసైటీ ప్రతినిధి మహ్మద్ హనీఫ్ ఉచిత కోచింగ్ వివరాలను తెలిపారు. ఈ నెల 19 వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే ఈ కోచింగ్ నీట్,ఎంసెట్ పరీక్షలు ముగిసే వరకు ఉంటుందన్నారు. టోలిచౌకిలోని మహబూబ్ కాంప్లెక్స్లో గల జీకే అకాడమీలో అదే విధంగా పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెం200 వద్దగల రిలయన్స్ డిగ్రీ కాలేజీలో ఈ ఉచిత కోచింగ్ ఉంటుందని అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు 9700685965, 040-23562025, రిలయన్స్ కాలేజీ లో 9000622342, 9885238353 నెంబర్లలో సంప్ర దించాలని సొసైటీ ప్రతినిధి హనీఫ్ సూచించారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: పైకి పుచ్చకాయల లోడు... క్రింద చూస్తే ఎర్రచందనం స్మగ్లింగ్... కంగుతిన్న పోలీసులు
ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. పుచ్చకాయల మాటున ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా చిక్కారు రెడ్ స్మగ్లర్లు. పుచ్చకాయల లోడ్ కింద ఎర్రచందనం దుంగలను తరలిస్తూ పట్టుబడ్డారు.నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెం చెక్పోస్ట్ వద్ద పుచ్చకాయల లోడులో ఎర్రచందనం తరలిస్తుండగా వాహనాన్ని పట్టుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది. చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా. అనుమానాస్పదంగా వాహనం స్పీడ్గా పోనిచ్చారు దుండగులు. పోలీసులు ఆ వాహనాన్ని ఛేజ్ చేయడంతో. డ్రైవర్, క్లీనర్ వాహనాన్ని వదిలి పరారయ్యారు. వాహనాన్ని తనిఖీ చేయగా. పుచ్చకాయల కింద సుమారు రెండున్నర లక్షల విలువ చేసే 30 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. టాటా ఏసీ వాహనం, ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. కడప జిల్లా కలసపాడుకి చెందిన వాహనంగా గుర్తించారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: బిగ్బాస్ పై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బిగ్బాస్ రియాలిటీ షో అనేది అశ్లీలత, అసభ్యతను ప్రోత్సహించే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. బిగ్ బాస్ షో వల్ల యువత పెడదారి పడుతున్నారంటూ దాఖలైన పిల్పై ఏపీ హైకోర్టు స్పందించింది. మంచి పిల్ వేశారంటూ పిటిషనర్ను ఏపీ హైకోర్టు ప్రశంసలు గుప్పించింది. అభ్యంతరకర షోల విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ టి.రాజశేఖరరావుతో కూడిన ధర్మాసనం తెలియజేసింది. బిగ్బాస్ షో అశ్లీలతను, అసభ్యతను ప్రోత్సహించేలా ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి 2019వ సంవత్సరంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణకు నోచుకోలేదు. నిన్న పిటిషనర్ తరపు న్యాయవాది గుండాల శివప్రసాద్రెడ్డి దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరడంతో న్యాయస్థానం స్పందించింది. సోమవారానికి విచారణ వాయిదా వేసింది.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని గుర్తించడానికి మరియు నియంత్రించడానికి చర్యలను వేగవంతం చేస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం తెలిపింది. ఓమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ఆఫ్రికన్ దేశాలలో కనుగొనబడింది, అవి బోట్స్వానా, దక్షిణాఫ్రికా, ఘనా మరియు నైజీరియా, అయితే ఇప్పటి వరకు 20 కంటే ఎక్కువ దేశాలు వేరియంట్ను గుర్తించాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో బోట్స్వానా, దక్షిణాఫ్రికా 62 శాతంగా ఉన్నాయని కాంగో రాజధాని బ్రాజావిల్లేలో ఉన్న ఆఫ్రికాకు సంబంధించిన WHO తెలిపింది. జాతీయ అధికారులు నిఘా మరియు సీక్వెన్సింగ్ కార్యకలాపాలను వేగవంతం చేయడంతో మరిన్ని దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కనుగొనబడుతుందని భావిస్తున్నారు, ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించడం ఆఫ్రికాలో కోవిడ్ ఇన్ఫెక్షన్లలో 54 శాతం పెరుగుదలతో సమానంగా ఉందని WHO తెలిపింది. "బోట్స్వానా మరియు దక్షిణాఫ్రికా ద్వారా కొత్త వేరియంట్ను గుర్తించడం మరియు సమయానుకూలంగా నివేదించడం ప్రపంచ సమయాన్ని కొనుగోలు చేసింది. త్వరగా గుర్తించడం మరియు నివారణ చర్యలను వేగవంతం చేయాలి" అని ఆఫ్రికా WHO రీజినల్ డైరెక్టర్ మాట్షిడిసో మొయిటీ హెచ్చరించారు. ఆఫ్రికా అంతటా వ్యాపించే కేసుల పెరుగుదలను ఆపడానికి వారి కోవిడ్ -19 ప్రతిస్పందనను సర్దుబాటు చేయాలని ఆఫ్రికన్ దేశాలకు పిలుపునిచ్చారు. ఒమిక్రాన్ దాని స్పైక్ ప్రోటీన్లో అధిక సంఖ్యలో ఉత్పరివర్తనలు (32) కలిగి ఉంది మరియు WHO ప్రకారం, ఆందోళనకు సంబంధించిన ఇతర వైవిధ్యాలతో పోల్చినప్పుడు, తిరిగి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని ప్రాథమిక ఆధారాలు సూచిస్తున్నాయి. ఆఫ్రికాలో, టీకా రేట్లు తక్కువగా ఉన్నాయి. కేవలం 102 మిలియన్ల మంది లేదా జనాభాలో 7.5 శాతం మంది మాత్రమే పూర్తిగా టీకాలు వేయబడ్డారు. జనాభాలో 80 శాతానికి పైగా ప్రజలు ఇంకా మొదటి మోతాదును అందుకోవాల్సిన అవసరం ఉందని WHO హెచ్చరించింది, కేవలం ఐదు ఆఫ్రికన్ దేశాలు మాత్రమే 2021 చివరి నాటికి తమ జనాభాలో 40 శాతం మందికి టీకాలు వేయడానికి WHO ప్రపంచ లక్ష్యాన్ని చేరుకున్నాయని పేర్కొంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'దక్షిణ ఆఫ్రికాలో పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: నేషనల్ హెల్త్ అథారిటీ డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్స్ పథకాన్ని డిసెంబర్ 31 వరకు పొడిగింపు
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద తన డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్స్ స్కీమ్ (DHIS)ని డిసెంబర్ 31, 2023 వరకు పొడిగిస్తున్నట్లు నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) శుక్రవారం ప్రకటించింది.ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా జనవరి 1, 2023 నుండి DHIS ప్రారంభించబడింది. దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ డెలివరీలో డిజిటల్ హెల్త్ టెక్నాలజీలు మరియు అభ్యాసాల స్వీకరణను ప్రోత్సహించడంలో ఈ పథకం ఒక ముఖ్యమైన ఉత్ప్రేరకంగా నిరూపించబడింది.హెల్త్కేర్ ప్రొవైడర్లు మరియు హెల్త్ టెక్ కంపెనీల నుండి దాని ప్రభావం మరియు ప్రతిస్పందన కారణంగా, మరింత మంది వాటాదారులు ఆర్థిక ప్రోత్సాహకాల నుండి ప్రయోజనం పొందేందుకు వీలుగా పథకం విస్తరించబడింది.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ సమావేశానికి 9 రాష్ట్రాల CMలు గైర్హాజయ్యారు. తెలంగాణ, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాజస్థాన్ CMలు ఈ భేటీకి హాజరుకావట్లేదని సమాచారం అందించారు. ‘వికసిత్ భారత్ @ 2047’ అనే థీమ్తో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'ఆ భేటీకి 9 రాష్ట్రాల సీఎంలు డుమ్మా!'.
2
['tel']