inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: వివిధ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రూ. 100 కోట్ల రుణాన్ని దుర్వినియోగం చేసిన ఆరోపణలపై ఒడిశా పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) ఓ మహిళను అరెస్టు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు.సంబంధ్ ఫిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్పై నమోదైన రూ.5 కోట్ల రుణ మోసం కేసు ఆధారంగా అరెస్టు చేసినప్పటికీ. లిమిటెడ్, వివిధ ఫైనాన్స్ సంస్థల నుండి సంస్థ రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసి, దానిని దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసు అధికారులు తెలిపారు.చీటింగ్ కేసులో గత ఏడాది జూలైలో ఒడిశాకు చెందిన దీపక్ కిండోను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ '100 కోట్ల మోసం కేసులో ఒకరు అరెస్ట్'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: పీఆర్సీ కమిషన్ వేసినందుకు సీఎం వైయస్ జగన్కు ఏపీఎన్జీవో కార్యదర్శి శివారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా అయన మాట్లాడుతూ. టీడీపీ హయాంలో పీఆర్సీ కమిషన్ అడిగినందుకు గుర్రాలతో తొక్కించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు సీఎం జగన్కు ధన్యవాదాలు. ఇచ్చిన మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. సీఎం వైయస్ జగన్ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల 23 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రెగ్యులర్ ఉద్యోగులకు బెనిఫిట్స్ వచ్చినట్టే కాంట్రాక్ట్ ఉద్యోగులకూ వస్తాయి. సీఎం వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు సాహసోపేతమైనవని శివారెడ్డి అన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు సీఎం జగన్కు ధన్యవాదాలు'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: మూసీ నదిపై నాగోలు బ్రిడ్జ్ వద్ద ఇరువైపులా సుందరమైన వర్డికల్ గార్డెన్ తీర్చిదిద్దారు. మొక్కలను అందంగా పేర్చినట్లు ఏర్పాటు చేసిన ఈ గార్డెన్ అందరినీ అలరిస్తోంది. ఓ వైపు మూసీ తీర ప్రాంతంలో అందమైన పార్కు, మరోవైపు శిల్పారామం, నాగోలు మెట్రో స్టేషన్తో ఈ రోడ్డు ఆహ్లాదకరంగా దర్శనం ఇస్తోంది. ఈ మధ్య కాలంలోనే మూసీ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి చొరవతో మూసీ నదికి ఇరువైపులా క్లీనింగ్ కార్యాక్రమాన్ని చేపడ్టడంతో పాటుగా మూసీ బ్రిడ్జ్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడంతో ఈ ప్రాంతానికి నూతన అందాలు సమకూరాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'మూసీ వంతెనపై... తోటలతో కంచె'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఏడవ పే కమిషన్ సహా డిమాండ్ల పరిష్కారం కోసం ఎస్ఎస్ఎ టీచర్ల ధర్నా
జమ్ము : ఏడవ పే కమిషన్ సహా తమ అపరిష్కృత డిమాండ్ల సాధన కోసం జమ్మూ కాశ్మార్ సర్వశిక్ష అభియాన్ టీచర్లు ధర్నాకు దిగారు. పెద్ద సంఖ్యలో ఎస్ఎస్ఎ టీచర్లు శ్రీనగర్ లో ధర్నాకు దిగడతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడం వల్ల అనేక చెరువులు అలుగుపోస్తున్నాయి. కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లపైకి నీరు వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వర్షాలు, వరదల పరిస్థితిపై శనివారం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, మంత్రులతో మాట్లాడారు. ఆయా జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. తగు సూచనలు చేశారు. హైదరాబాద్ లో రెండు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని స్థానిక కలెక్టర్, పోలీస్ అధికారులతో కలిసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. చాలా చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని ఫలితంగా కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని, వరదల వల్ల రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి ఉత్పన్నం కావచ్చని సిఎం చెప్పారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని దాదాపు అన్ని చెరువులు అలుగుపోస్తున్నాయని చెప్పారు. ఆ రెండు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం రెండు హెలికాఫ్టర్లను సిద్ధంగా ఉంచింది. వరదల వల్ల చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వాటిని వినియోగిస్తున్నారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: ఎమ్మెల్యే భగత్ కు అసమ్మతి సెగ
నాగార్జునసాగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు భగత్ కుమార్ ని అభ్యర్థిగా ప్రకటించడంపై ఆయనకు వ్యతిరేకంగా గుర్రంపోడు మండలంలో అసమ్మతి జ్వాలలు గుప్పుమన్నాయి. వెంటనే అభ్యర్థిని మార్చాలని స్థానికులకే టికెట్ కేటాయించాలని బుధవారం గుర్రంపోడు మండలంలోని బిఆర్ఎస్ పార్టీకి చెందిన మెజారిటీ జెడ్పిటిసి ఎంపిటిసి సర్పంచులు అన్ని గ్రామాల నాయకులు సమావేశం నిర్వహించారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: జనసేన పార్టీ క్షేత్రస్ధాయిలో మరింత బలోపేతం: నాదెండ్ల
జనసేన పార్టీ క్షేత్రస జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, పార్టీ సిద్ధాంతాలను గ్రామగ్రామాన వివరిస్తామన్నారు. పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక అవగాహన, పునశ్చరణ తరగతులను నిర్వహిస్తామని తెలిపారు. జులై 2న జనసేన పార్టీ కార్యాలయంలో వీర మహిళలకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎంపిక చేసిన వీర మహిళలు ఈ తరగతులకు హాజరు అవుతారని ఆయన తెలిపారు. ఈ పునశ్చరణ తరగతుల్లో వివిధ రంగాల నిపుణులు పాల్గొంటారన్నారు. పార్టీకి మరింత ఉత్తేజం నింపేలా, క్షేత్రస్థాయిలో ఎలా పనిచేయాలనే విషయాలను వివరిస్తారని, భవిష్యత్ కార్యాచరణను విపులంగా చెబుతారని ఆయన అన్నారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఎలా పనిచేయాలో చర్చిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే ఆరు నెలల్లో ఓ గొప్ప యజ్ఞంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి జిల్లా, నియోజకవర్గంలో ఉండే క్రియాశీలక సభ్యులకు ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు వరుసగా ఉంటాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: దేశ రాజధానిలో దాదాపు 1 లక్ష గేదెలు మరియు ఆవులను వాణిజ్య పాల ఉత్పత్తికి ఉపయోగిస్తున్న 10 డెయిరీ కాలనీల తనిఖీ కోసం ఢిల్లీ హైకోర్టు కోర్టు కమిషనర్ను నియమించింది. జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మరియు జస్టిస్ సచిన్ దత్తాలతో కూడిన ధర్మాసనం మార్చి 23, 2023న జారీ చేసిన ఉత్తర్వులో పిటిషనర్లు మరియు ప్రతివాదులతో పాటు కోర్టు - న్యాయవాది గౌరీ పూరి నియమించిన కమిషనర్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ డెయిరీ కాలనీలు కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి నిబంధనలను ఉల్లంఘించాయని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు, వీటిని డెయిరీ యజమానులందరూ పాటించాలి మరియు వివిధ ప్రభుత్వ అధికారులు అమలు చేయాల్సిన అవసరం ఉంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'డెయిరీ కాలనీలను తనిఖీ చేయడానికి కమిషనర్ను నియమించిన ఢిల్లీ హైకోర్టు'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ రాజీనామా...
ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే శ్రీనివాస్ రాజీనామా లేఖ సమర్పించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజీనామా కంటే ముందే దమ్మాలపాటి రాజీనామాను ఆమోదించి. ఆ లేఖను గవర్నర్కు పంపించారు. 2016 మే నెలలో ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్గా దమ్మాలపాటి శ్రీనివాస్ నియమితులయ్యారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా లోనే కాకుండా ప్రతి వార్త పత్రికలోనూ అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కి సంభందించిన న్యూడ్ వీడియో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఎంతవరకు నిజం అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రతిపక్షాలు మాత్రం వైసీపీ పార్టీని, ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై స్పందించిన కొందరు టీడీపీ నాయకులూ . గంట. అరగంట.గోరింటాకు. జగన్ రెడ్డి నవరత్నాల్లో మూడు తేలినాయి. బయట పడని రత్నాలు ఎన్నో. ఆంబోతుకు అచ్చేసి రోడ్డు మీదకు వదిలినట్టు, జగన్ రెడ్డే వీళ్ళకు వైసీపీ కండువా వేసి వదిలినట్టుంది. లేకపోతే వీళ్ళు ఎవరి మీద ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోరు?అని సోషల్ మీడియా లో ట్వీట్స్ చేస్తున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'గంట... అరగంట...గోరింటాకు... జగన్ రెడ్డి నవరత్నాల్లో మూడు తేలినాయి'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: తిరువనంతపురం: తనను అత్యాచారం చేసేందుకు యత్నించిన వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కొన్న యువతి అతడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన కేరళలోని కోళ్లామ్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆ వివారాలిలా ఉన్నాయి. కోళ్లామ్లోని పద్మనలో 23 ఏళ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి గణేషానంద తీర్థపద స్వామి(54) అలియాస్ హరి ఆశ్రమంలో ఉంటోంది. యువతి తల్లిదండ్రులు ఆ దొంగబాబును విశ్వసించి ఆయన ఆశ్రయంలో ఉంటూ సేవలు చేస్తుండేవారు. ఈ క్రమంలో ఆ యువతిపై దొంగబాబా కన్నేశాడు. గత కొంతకాలం నుంచి గణేషానంద స్వామిగా సేవలు పొందుతున్న అతడు యువతిపై వేధింపులకు పాల్పడుతున్నాడు. రెండు రోజులుగా అతడి ఆగడాలు మితిమీరిపోయాయి. శుక్రవారం రాత్రి ఏకంగా యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వద్దని ఎంత చెప్పినా బాబా వినకుండా తనపై దారుణానికి యత్నించడంతో అతడి పురుషాంగాన్ని కోసేసినట్లు తెలిపింది. తిరువనంతపురం పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పి, ఫిర్యాదు చేసింది. పోస్కో చట్టం కింద అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ గణేషానంద స్వామి తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. యువతిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. గతేడాది ఏప్రిల్లో ఈశాన్య అసోంలోని భారాజులి గ్రామంలో యువకుడు తనను రేప్ చేయబోతే మహిళ ధైర్యంగా ఎదుర్కొని కృష్ణ భూంజీ అనే యువకుడి పురుషాంగం కోసేసింది. ఆ యువకుడు తీవ్ర రక్తస్రావమై ఆ మరుసటిరోజు చనిపోయిన విషయం తెలిసిందే.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'రాత్రి యువతి ఒంటరిగా ఉండటాన్ని గమనించి'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: అనంతపురం: మడకశిర మండలంలోని ఉక్కుడం రంగాపురం గ్రామంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. మంగళవారం గ్రామ ప్రధానరహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. రెండు నెలలుగా గుక్కెడు నీటి కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్తే రైతులు అడ్డుకుంటున్నారని వాపోయారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. శాంతించని ఆందోళనకారులు గ్రామం నుంచి మడకశిరలోని తహసీల్దార్, ఎంపీడీ ఓ కార్యాలయాల వద్దకు చేరుకుని ఖాళీ బిందెలతో నిరసనకు దిగా రు. అధికారుల తీరుపై దుమ్మెత్తి పోశారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: రాష్ట్ర సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ప్రధాన కమిషనర్​గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.రమేశ్ కుమార్ నియమితులయ్యారు. అలాగే రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్​గా రేపాల శ్రీనివాసరావును నియమించారు. వీరివురిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నియమించినట్లు సీఎస్ నీలం సాహ్నీ ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడు ఏళ్లపాటు లేదా 65 ఏళ్ల వయసు వరకు సర్వీసు నిబంధనల మేరకు వీరు పదవుల్లో కొనసాగుతారని పేర్కొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్​ నియామకానికి ఉత్తర్వులు'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: మైనర్లకు తల్లిదండ్రులు, ఇతరులు వాహనాలు ఇవ్వవద్దని ఎస్సై రామకృష్ణ సూచించారు. కొండేపి లో మోటర్ సైకిల్ లపై చక్కర్లు కొడుతూ తిరుగుతున్న బాలురకు ఎస్సై కౌన్సెలింగ్ ఇచ్చారు. మైనర్లు వాహనాలపై తిరుగుతూ పట్టుబడితే యజమాని లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. పట్టుబడిన 14 ద్విచక్రవాహనాలను పోలీస్ స్టేషన్లో పెట్టించారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు'.
2
['tel']
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: ఉపాధి హామీ కూలి వేతనం పెంపు
న్యూఢిల్లీ : జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు అందిస్తున్న కూలిని కేంద్రం పెంచింది. 205 రూపాయల నుంచి ఉపాధి హామీ పథకం వేతనాన్ని 224 రూపాయలకు పెంచింది. దినసరి వేతనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 205 రూపాయలు, కర్నాటక కేరళల రాష్ట్రాలలోవరుసగా 248, 271 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: పట్టుబడులు ఏపీకి ఎందుకు వస్తున్నాయో జగన్ చెప్పాలి : మంత్రి పత్తిపాటి పుల్లారావు
అమరావతి ,సూర్యప్రతినిధి: 11 రా„షా్ట్ర లకన్నా పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కు ఎందుకు వస్తున్నాయో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. రూ. 10 లక్షల 60వేల కోట్లు ఆ 11 రాషా్టల్ల్రో ఎక్కడా రాలేదని, ఏపీకే వచ్చాయని మంత్రి తెలిపారు. పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు ఎవరూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదని అన్నారు. కేంద్రం ఇస్తున్న ప్యాకేజీ ద్వారా అన్ని కవర్ అవుతున్నాయని, పైగా ఏపీ పెట్టు బడులకు అనువైన రాష్ట్రంగా ఉందని ఆయన అన్నారు. ఏపీలో నీతీ, నిజాయితీ గల ప్రభుత్వం ఉందని, కేంద్ర సహకారం పుష్కలంగా ఉందనిఅందుకే రెండో ఏడాదిలో రూ. 10 లక్షల 60వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. అలాగే మొదటి ఏడాది కూడా రూ. 42 శాతం పెట్టుబడులు వచ్చాయన్నారు. ఏపీలో ఇంత అభివృద్ధి జరుగుతుంటే జగన్ అవాస్తవాలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టి విధంగా మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం వైసీపీలో అంతర్గత పోరు ముమ్మరమైంది. జిల్లా వైసీపీ కార్యదర్శిగా పని చేస్తున్న సుబ్బారెడ్డికి, ఎమ్మెల్యే బుగ్గన రాజారెడ్డికి చాలా కాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ప్రయత్నించారు. అయినా, సయోధ్య సాధ్యం కాలేదు. విభేదాలు మరింత ముదిరాయి. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇవి మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ప్రకటించారు. సుబ్బారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలను ప్రారంభించారు. ఇప్పటికే డోన్ నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ కేఈ ప్రతాప్ సన్నిహితులు సుబ్బారెడ్డితో చర్చలు జరిపారు. టీడీపీలో చేరితే, సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ వ్యవహారం డోన్ నియోజకవర్గంలో హీట్ పెంచుతోంది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'వైసీపీ నుంచి ధర్మవరం సుబ్బారెడ్డి సస్పెన్షన్'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రసూల్పురలో పట్టుబడ్డా చైన్ స్నాచర్
రసూల్పురా వద్ద ఓ మహిళ నుంచి బంగారు గొలుసు లాక్కున్న వ్యక్తిని బేగంపేట పోలీసులు పట్టుకుని అతని నుంచి రూ. 49,600, బంగారు గొలుసు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.వివరాల్లోకి వెళ్తే. మల్కాజిగిరిలో నివాసముంటున్న కంటోన్మెంట్ బోర్డులో స్వీపర్గా పనిచేస్తున్న సబ్బు గణేష్ (35) అనే వ్యక్తి రసూల్పురాలోని ఓ మహిళ ఇంటికి వెళ్లి గ్లాసు నీళ్లు అడిగాడు. నీళ్లు తాగి వెళ్లిపోయి కొన్ని నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. ఆమె తలుపు తెరవగానే ఐదు తులాల బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు' అని డీసీపీ (ఉత్తర) చందన దీప్తి తెలిపారు. గణేష్ మల్కాజిగిరిలో పాన్ బ్రోకర్ వద్ద రూ.50వేలకు గొలుసును తాకట్టు పెట్టాడు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో పోలీసులు అతడిని గుర్తించి పట్టుకున్నారు. పాన్ బ్రోకర్ను కూడా అరెస్టు చేసినట్లు డీసీపీ తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: కనురెప్పపాటునే మనకు వాహన ప్రమాదాలు జరుగుతుంటాయి. ఆ కనురెప్పనే మూయనియకుంటే ఇక ప్రమాదాలకు ఆస్కారముండదు. కారు నడుపుతూ కనురెప్ప ఆర్పి వేయడం కారణంగా ప్రమాదాలు జరిగి కొన్ని వందల ప్రాణాలు ఏటా గాల్లో కలిసిపోతున్నాయి. కొందరు తృటిలో ప్రమాదాల నుంచి బయటపడుతున్నారు. దీనికి పరిష్కారాన్ని కనుగొన్నాడు నాగ్ పూర్ కు చెందిన యవకుడు గౌరవ్ సావల్కే. నిద్రలేమి, అలసట, అర్ధరాత్రి దాటిన తర్వాత వాహనాలను నడపడం ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతుంటాయి. సరిగ్గా గౌరవ్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం ఇతడు నేపాల్ వెళ్లాడు. రాత్రి సమయంలో కారు నడుపుతున్నప్పుడు నిద్ర వచ్చి తలవాల్చాడు. తృణిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనే అతడిలో ఆవిష్కర్తను బయటకు తీసుకొచ్చింది. వాహనం నడుపుతున్నప్పుడు నిద్ర కారణంగా ప్రమాదాలు జరగకూడదని గౌరవ్ భావించాడు. అలాంటి సందర్భాల్లో వాహనదారుడిని అప్రమత్తం చేసే పరికరం ఉంటే భద్రత పెరుగుతుంది కదా? అనుకున్నాడు. తనకున్న నైపుణ్యంతో చెవికి ధరించే ఒక పరికరాన్ని రూపొందించాడు. మనం కూర్చుని నిద్ర పోతే కనుక తలను కిందకు వాల్చేస్తాం. గౌరవ్ పరికరం ఇదే కిటుకు ఆధారంగా పనిచేస్తుంది. తలను 30 డిగ్రీలకు మించి వంచితే చెవికి ధరించిన పరికరంలోని సెన్సార్ గుర్తిస్తుంది. వెంటనే అలారం రూపంలో వాహనదారుడిని మేల్కొలుపుతుంది
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'కనురెప్ప మూయనియదటా...నాగ్ పూర్ యువకుడి అద్భుత ఆవిష్కరణ'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఫిల్మ్నగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో అర్థరాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో వైసీపీ యువజన విభాగం నేత ఆంజనేయులు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన 24 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి 19 బైక్లు, ఒక ఆటో, నాలుగు కార్లను సీజ్ చేశారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: హైదరాబాద్లో దారుణం... కత్తులతో పొడిచి హత్య...
హైదరాబాద్లో ప్రేమ పెళ్లి చేసుకోవడంతో శుక్రవారం కొందరు దారుణానికి పాల్పడ్డారు. బేగంబజార్ ప్రాంతంలో నీరజ్ పన్వార్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. అతని శరీరంపై 20 కత్తిపోట్లు ఉన్నాయి.నీరజ్ పన్వార్ ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. యువతి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. సమీపంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నీరజ్ పన్వార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: మిషన్ కాకతీయ మూడో విడత పనులను ప్రారంభించిన జూపల్లి
మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణలోని చెరువులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా వెల్గొండ ఆవులకుంటలో మంత్రి జూపల్లి మిషన్ కాకతీయ మూడో విడత పనులను ప్రారంభించారు. స్వయంగా పలుగు, పార పట్టి మట్టి తొవ్వారు. ఆ తర్వాత మట్టి మోశారు. చెరువు పూడికతీత పనుల్లో ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున పాల్గొనడాన్ని అభినందించారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: మంత్రి ఆర్ . కే . రోజా అధ్యక్షతన జిల్లా సమీక్షా మండలి సమావేశం
కృష్ణ జిల్లా పరిషత్ సమావేశపు హాల్ లో జిల్లా సమీక్షా మండలి సమావేశం రాష్ట్ర మంత్రి మరియు జిల్లా ఇన్ - ఛార్జి మంత్రి ఆర్ . కే . రోజా , రాష్ట్ర మంత్రి జోగి రమేష్ అధ్యక్షతన జరిగింది. తొలుత జిల్లా ఇన్ - ఛార్జి మంత్రి ని జిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రవిరాల మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. వేదిక మీద జిల్లా ఇన్ - ఛార్జి మంత్రి ని గౌరవ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు . వివిధ శాఖల వారి పలు అంశాలపై చర్చ ప్రారంభించారు . శాసన సభ్యులు పేర్ని వెంకటరామయ్య ( నాని ) , కొలుసు పార్ధసారధి , సింహాద్రి రమేష్ బాబు , కైలే అనిల్ కుమార్ , వివిధ శాఖల అధికారులు , ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు .
1
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: వైద్యవిద్య చదివేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రానికి చెందిన విద్యార్థి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన ఫిలిప్పీన్స్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే. కృష్ణా జిల్లా నందిగామ నేతాజీ నగర్కు చెందిన పొన్నపల్లి జగదీష్ వైద్య విద్యను చదివేందుకు 2016లో ఫిలిప్పీన్స్ కు వెళ్లాడు. ప్రస్తుతం జగదీష్ వెటర్నరీ కోర్సులో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం బైక్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు అతన్ని ఢీకొట్టింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా జగదీష్ మృతితో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఫిలిప్పీన్స్లో రోడ్డు ప్రమాదం'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: త్వరలో పీసీసీ అధ్యక్షుడి పాదయాత్ర
తెలంగాణలో ప్రస్తుతం పాదయాత్రల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 'ప్రజాసంగ్రామ యాత్ర', వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల 'ప్రజాప్రస్థానం పాదయాత్ర' కొనసాగుతుండగా మరో పాదయాత్ర ప్రారంభం కానుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమయ్యారు. జనవరి చివరి వారంలో 'సకల జనుల సంఘర్షణ యాత్ర' పేరుతో రేవంత్ పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర 5 నెలల పాటు సాగనుందని సమాచారం.
1
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: తిరుమలలో ఇటీవల బయటపడ్డ భద్రత లోపం కలకలం రేపింది. దీంతో తిరుమల కొండ భద్రతపై అధికారులు అప్రమత్తమయ్యారు. నేడు తిరుమలలో టీటీడీ అధికారులు పోలీసులతో కేంద్ర ఐబీ, రాష్ట్ర ఇంటిలిజెన్స్ అధికారుల కీలక సమావేశం జరుగుతోంది. ఏడు కొండలపై చేపట్టిన భద్రతా ఏర్పట్ల గురించి టీటీడీ భద్రతాధికారులు, పోలీసులు విడివిడిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'తిరుమల సెక్యూరిటీపై భేటీ'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: చిరంజీవితో ఉన్న విభేదాలపై స్పందించిన పవన్
మెగాసార్ట్ చిరంజీవితో ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని విభేదాలు వచ్చాయంటూ గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. ఎవరికి తోచినట్లు వారు ఇలాంటి వార్తలు రాస్తుంటారని పవన్ వ్యాఖ్యానించారు. అయితే, సమయం వచ్చినప్పుడు ఇటువంటి అతస్య ప్రచారం వాటికదే మాయపోతుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి రాతలకు ప్రాధాన్యం ఎందుకివ్వాలని, వాటిపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తమ మధ్య భిన్నమైన అభిప్రాయాలుంటే తాము బయటకు చెబుతామని వ్యాఖ్యానించారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం...
భార్యది సాఫ్ట్ వేర్ ఉద్యోగం. భర్తది ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది. ఉన్నంతలో హాయిగా బతుకుతున్నారు. కానీ పాపం ఇంతలో విధి వారి పాలిట కాటేసింది. రోడ్డు ప్రమాదం రూపంలో భార్యను మృత్యువు బలి తీసుకుంది. భార్యను కోల్పోయిన భర్త దిక్కులేని వాడయ్యాడు. తల్లిని కోల్పోయిన చిన్నారి అమ్మ ప్రేమకు దూరమైంది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన మిర్యాల గోపాలకృష్ణ, లావణ్య భార్యాభర్తలు. వీరికి 3 సంవత్సరాల పాప ఉంది. లావణ్య గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తుంది. గోపాలకృష్ణ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. వీరు రాయదుర్గంలో నివాసం ఉంటున్నారు. మూడు రోజుల క్రితం పని నిమిత్తం స్వగ్రామం నేరడకు బైక్ పై వెళ్లారు. బుధవారం ఉదయం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి వద్దకు రాగానే వీరి బైక్ హ్యాండిల్ ను లారీ ఢీకొట్టింది. దీంతో బైక్ పై కూర్చున్న లావణ్య కిందపడింది. రోడ్డుకు బలంగా తల తాకడంతో లావణ్య అక్కడికక్కడే చనిపోయింది. గోపాలకృష్ణకు, చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో షాకైన గోపాలకృష్ణ తన కూతురిని పట్టుకొని రోడ్డుమీదే కూర్చొని విలపించాడు. అప్పటివరకు తనతో సరదాగా మాట్లాడిన భార్య విగతజీవిగా మారడంతో ఆయన దిగ్బ్రాంతికి గురయ్యాడు. తల్లిని కోల్పోయిన చిన్నారి ఏం తెలియక బిక్కుబిక్కుమంటూ ఏడ్వడం అందరిని కంటతడి పెట్టించింది. అశ్రునయనాల మధ్య లావణ్య అంత్యక్రియలు ముగిశాయి. మధ్య తరగతి కుటుంబానికి చెందిన లావణ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: గణపురంలో దారుణం వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొంది
పెట్రోలింగ్కు బయల్దేరిని పోలీసు వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొంది.దీంతో ఏఎస్సై మృతి చెందారు. టీఎస్ఎండీసీ ఉద్యోగులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం. జాతీయ రహదారిపై వాహనాలను నెలకోసారి తనిఖీ చేసే డ్యూటీలో భాగం రేగొండ ఏఎస్సై బాదావత్ హరిలాల్ నాయక్ (55) గణపురం పోలీస్స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్కు శనివారం రాత్రి బయల్దేరారు. ఇసుక రవాణాపై నిఘా పెట్టే క్రమంలో తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగులు ఎం.డి.ఉమర్, దబ్బెట అశోక్ను వెంట పెట్టుకొని భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారి పై పెట్రోలింగ్ నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో డ్యూటీ ముగిం చుకొని తిరిగి వస్తున్న క్రమంలో గణపురం మండలం గాంధీనగర్ సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని పోలీస్ వాహనం ఢీకొంది. పోలీస్ వాహనాన్ని నడుపుతున్న ఉమర్ పొగమంచు తీవ్రత వల్ల లారీని గమనించక వెనుక వైపు నుంచి ఢీకొట్టాడు. దీంతో పోలీసు వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ఉమర్తోపాటు ఏఎస్సై హరిలాల్ నాయక్, అశోక్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికులు గణపురం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ క్షతగాత్రులను వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఏఎస్సైను హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అందుతున్న క్రమంలోనే ఏఎస్సై హరిలాల్ నాయక్ మృతి చెందారు. ఉమర్, అశోక్ వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు హరిలాల్ నాయక్ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం బాలానగ ర్తండా వాసి. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉమర్ది భూపాల పల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకోడెపాక కాగా అశోక్ అదే మండలం జగ్గయ్యపేటకు చెందిన వాడు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: అంకాలిపురంలో వైభవంగా చండి హోమం
గంగాధర నెల్లూరు మండలం , అగర మంగళం గ్రామం, అంకాలి పురం శ్రీ గుర్రప్ప అంకాల పరమేశ్వరి దేవస్థానమునందు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం భక్తి శ్రద్ధలతో వైభవంగా చండీ హోమం ఆలయ ధర్మకర్త దీపక్ కుమార్ తాళ్ల బెంగళూరు వాస్తవ్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులచే గణేశ ప్రార్థన పుణ్యహం, గణపతి హోమం, చండీ హోమం, పూర్ణాహుతి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్లకు మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: ఢిల్లీ లిక్కర్ కేసులోో ఆరోెపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితా ఈడీ ముందు విచారణకు రేపు హాజరుకానున్నారు. ఇదిలావుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరవ్వాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇచ్చేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్ పై ఈనెల 24న విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. దీంతో రేపు జరగనున్న ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సిన పరిస్థితి వుంది. లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా ఈనెల 11న ఈడీ అధికారులు కవితను 8 గంటలకు పైగా విచారించిన విషయం తెలిసిందే. 16న మరోసారి విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ఇతరులతో కలిపి విచారిస్తామని తనకు ఇచ్చిన నోటీసులో ఈడీ అధికారులు పేర్కొన్నారని, కానీ వాస్తవానికి అలా విచారణ చేపట్టలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తన ఫోన్ సీజ్ చేశారని ఆరోపించారు. సీఆర్ పీసీ 160 సెక్షన్ ప్రకారం మహిళను తన ఇంట్లోనే విచారించాలని, కానీ ఈడీ కార్యాలయానికి పిలిచారని అభ్యంతరం తెలిపారు. అయితే ఈ పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. 24న విచారణ జరుపుతామని చెప్పింది.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'రేపు ఈడీ విచారణకు హాజరుకానున్న ఎమ్మెల్సీ కవితా'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దసరా తర్వాత కార్యాచరణ ప్రారంభించాలని స్పష్టం చేశారు. పోడు సాగుదారుల లెక్క తేల్చి సమస్య పరిష్కరించాలన్నారు. తర్వాత ఒక్క గజం అటవీ భూమి అన్యాక్రాంతం కావొద్దని సూచించారు. దురాక్రమణలు అడ్డుకోవడానికి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అడవుల రక్షణ కోసం ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడవద్దని సీఎం కేసీఆర్ చెప్పారు. పోడు సమస్యపై అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. అటవీ పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అటవీ పరిరక్షణ కమిటీలకు విధివిధానాలను రూపొందించాలని కేసీఆర్ తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'పోడు భూముల పరిష్కారానికి కార్యాచరణ చేపట్టాలి: సీఎం కేసీఆర్'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: నగర శివార్లలోని వనస్థలిపురంలో పాల వ్యాను బీభత్సం సృష్టించింది. సుష్మా థియేటర్ సిగ్నల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన పాల వ్యాను అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన హెడ్లైన్ 'వనస్థలిపురంలో పాల వ్యాను బీభత్సం'.
2
['tel']
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు
తూ. గో జిల్లా మీదుగా నేటి నుంచి ఈనెల 11వ తేదీ మధ్య పలు రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. శుక్రవారం టాటా ఎస్ఎంవీ బెంగళూరు (08885), శనివారం హటియా - ఎస్ఎంవీ బెంగళూరు (08887), 8న తాంబరం - న్యూటిన్ సుకియా (06073), 11న న్యూటిన్ సుకియా - తాంబరం (06074) మధ్య రైళ్లు రాకపోకలు సాగిస్తాయన్నారు. తుని, సామర్లకోట, రాజమండ్రి స్టేషన్లలో ఇవి ఆగుతాయన్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలను ఈసారి రుతుపవనాలు ముందుగానే వచ్చేస్తున్నాయంటూ ఊరించిన వాతావరణ శాఖ మాటమార్చింది. రుతపవనాల రాకపై మరో అప్డేట్ ఇచ్చింది.నిన్ననే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని చెప్పిన IMD… ఇపుడు మరింత సమయం పడుతుందని చెబుతోంది. రుతుపవనాలు బలహీనంగా మారే అవకాశం ఉందని, వాటి రాకకు మరో 2-3రోజులు పడుతుందని చెప్పింది. రుతుపవనాలు జూన్ మొదటి వారంలో నెమ్మదిగా పురోగమిస్తాయని వెల్లడించింది.గాలుల స్థిరత్వం, బలం పుంజుకొంటేనే కేరళకు రుతుపవనాలు తాకుతాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. జూన్ 2 నుంచి 8 మధ్య ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకుంటుందని, మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు మే 29 వరకు వివిధ జిల్లాలకు ఇచ్చిన ఎల్లో అలర్ట్ను కూడా IMD ఉపసంహరించుకుంది. మరోవైపు అండమాన్ నికోబర్ దీవులను దాటిన రుతుపవనాలు.బలమైన గాలుల ప్రభావంతో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, లక్షద్వీప్, సహా కొమొరిన్ పై విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. వాతావరణ తాజా సూచనల ప్రకారం, దక్షిణ అరేబియా సముద్రం మీదుగా దిగువ స్థాయిలలో పశ్చిమ గాలులు బలపడి లోతుగా మారాయి. ఉపగ్రహాల చిత్రాల ప్రకారం, కేరళ తీరం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రంపై ఆకాశం మేఘావృతం అయింది. అందువల్ల, రాబోయే మూడు నాలుగు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'కేరళ వైపు పయనిస్తున్న నైరుతి రుతుపవనాలు'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఇండియాటుడే సదస్సులో చాలా అందంగా అబద్దాలు చెప్పారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ సదస్సుపై స్పందించిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 4,200 మంది రైతులు చనిపోతే ఆ ప్రస్తావనే లేదని విమర్శించారు. ఎవరో తలకుమాసిన మలేషియా మంత్రి చెబితే రాష్ట్ర సచివాలయం కూల్చేస్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి లేదని సీఎం నమ్మితే.కేసీఆర్ను లోక్పాల్ పరిధిలోకి తేవాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. మద్యం షాపుల పర్మిట్ రూంలకు జై తెలంగాణ బోర్డులు పెడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రూ.90 వేల కోట్లు అప్పు చేశారని, తెలంగాణలో నకిలీ పత్తి విత్తనాలు పంపిణీ అవుతున్నాయని శ్రవణ్ ఆరోపించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'కేసీఆర్ అబద్దాలు అందంగా చెప్పారు: శ్రవణ్'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ సెటైర్లు వేశారు. పవన్ చెబుతున్న జేఏసీ ఏర్పడాలంటే ముందు ఆయన టీడీపీ నుంచి బయటకు రావాలని అన్నారు. పవన్ కల్యాణ్ ఇంకా టీడీపీతోనే ఉన్నారని తాము భావిస్తున్నామని అన్నారు. అనంతపురంలో మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిల ఇళ్లకు వెళ్లి ఆతిథ్యం స్వీకరించడమే దీనికి నిదర్శనమని చెప్పారు. జిల్లా సమస్యలను తెలుసుకోవాలంటే జిల్లా కలెక్టర్ ను కలిస్తే సరిపోతుందని, టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే శీర్షిక 'జేఏసీ ఏర్పడాలంటే పవన్ టీడీపీ నుంచి బయటకు రావాలి : ఎమ్మెల్యే బుగ్గన'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: అమెరికా అధ్యక్ష బరిలో,భారత సతంతీ మహిళా
అమెరికాలో పరిస్థితులు కలిసొస్తే ఆ దేశానికి కూడా మన భారతీయ సంతతీ మహిళ అధ్యక్షురాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ అధ్యక్ష ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ రహస్య పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుండగా. మరోవైపు 2024 అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల విషయంలో చర్చ నడుస్తోంది. భారత సంతతికి చెందిన మహిళ నిక్కీ హేలీ అగ్రరాజ్యం అధ్యక్ష బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. రాజకీయాలతో పాటు దౌత్యపర అంశాల్లోనూ ఆమెకు మంచి అనుభవం ఉంది. గతంలో హేలీ సౌత్ కరోలినా గవర్నర్గా పనిచేశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో 2017 నుంచి 2018 వరకు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా వ్యవహరించారు. ఈ క్రమంలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై ఆమె ఈ మధ్య మాట్లాడారు. రిపబ్లికన్ పార్టీ కీలక నాయకురాలిగా ఎదిగిన ఆమె త్వరలోనే దీనిపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు, డెమొక్రాట్ నేత జో బైడెన్కు మరో అవకాశం ఇవ్వకూడదని ఆమె స్పష్టం చేశారు. అగ్రరాజ్యం అధ్యక్ష పదవికి పోటీ చేసేటప్పుడు రెండు విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని హేలీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నాయకత్వం అవసరమా? ఆ కొత్త నాయకత్వానికి తానే నేతృత్వం వహించాలా? అనే విషయాలపై ఆలోచించాలని చెప్పారు. ప్రస్తుతం అమెరికాకు కొత్త నాయకత్వం అవసరం అనేది తన అభిప్రాయమని నిక్కీ స్పష్టం చేశారు. అమెరికాను కొత్త బాటలో నడిపించగలనన్న ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడూ రేసులో ఓడిపోలేదని గుర్తు చేశారు. అలాగే ఇక మీదట కూడా ఓడిపోనని చెప్పారు. కాగా, ప్రస్తుతం భారత సంతతి మహిళ అయిన కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: గుంటూరు: బాపట్ల జిల్లా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. బాపట్ల ప్రజలు నాకు రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. 2019 నుండి మనం జిల్లా ఖచ్చితంగా సాధించాలి అని పట్టుదలతో పని చేస్తున్నాం. ఇప్పటికి జిల్లా తెచ్చుకో గలిగాం అని సంతోషం వెలిబుచ్చారు. మాఘమాసం సందర్భంగా బావన్నారాయణ స్వామికి మొక్కుబడులు చెల్లిoచుకోవాలన్నారు. ఎవరి మత విశ్వాసాల ప్రకారం వారు అనుకూలంగా చర్చ్ లలో, మసీదులలో ప్రత్యేక ప్రార్ధనలు చేయాలని కోరారు. జిల్లా సాధించిన సందర్భంగా వచ్చే మూడు ఆదివారాలు గొప్పగా భావదేవుని సన్నిధిలో మొక్కుబడుల కార్యక్రమాన్ని గ్రామ గ్రామాల ప్రజలు విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు. జిల్లాని అభివృద్ధి చేయడానికి అందరూ కలసి రావాలి, సహకరించిన ప్రతి ఒక్కరినీ జ్ఞాపకం చేసుకోవాలన్నారు. ఎందరో కవులు, పండితులు, కళాకారులు, బాపట్ల ఖ్యాతి పెంచగా, ఇప్పటివరకు పలువురు శాసన సభ్యులు బాపట్ల అభివృద్ధిలో ముందడుగు వేశారు. తోడ్పడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోవాలి. జిల్లా ఇచ్చిన సందర్భంగా వచ్చే మునిసిపల్ ఎన్నికలో ఏకగ్రీవంగా బాపట్లను ముఖ్యమంత్రి కి కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇందుకు ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా కలసి రావాలి అని కోరారు. ఈ సమావేశంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిని కృష్ణ మూర్తి, పట్టణ అధ్యక్షుడు ప్రకాశరావు పాల్గొన్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'బాపట్లను జిల్లాగా చేసినందుకు ముఖ్యమంత్రి కి కృతజ్ఞ తలు: డిప్యూటీ స్పీకర్'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: అందుబాటులోకి తిరుపతి దేవస్థానం మొబైల్ యాప్
తిరుమల తిరుపతి దేవస్థానం మొబైల్ యాప్ను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. జియో సహకారంతో రూపొందించిన నూతన టీటీడీ యాప్ను ఈవో ధర్మారెడ్డితో కలిసి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా భక్తులకు వన్స్టాప్ విధానంలో సేవలు అందిస్తామని చెప్పారు. వర్చువల్ సేవలను భక్తులు ఈ యాప్ ద్వారా వీక్షించవచ్చని వివరించారు. అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ యాప్ ద్వారా కూడా విరాళాలు అందించవచ్చన్నారు. భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా శ్రీటీటీదేవస్థానం పేరుతో రూపొందించిన మొబైల్ యాప్ను ప్రారంభించిన అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ. భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్ యాప్ ఉండేదని, దీన్ని మరింత ఆధునీకరించి మరిన్ని అప్లికేషన్లు పొందుపరచి నూతన యాప్ను రూపొందించామని తెలిపారు. ఈ మొబైల్ యాప్ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్ చేసుకోవచ్చన్నారు. విరాళాలు కూడా ఇదే యాప్ నుంచి అందించవచ్చని చెప్పారు. పుష్ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చని, ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ యాప్ ద్వారా చూడవచ్చని తెలిపారు.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి మరియు ఉధంపూర్ జిల్లాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను వేర్వేరుగా అరెస్టు చేసిన పోలీసులు, వారి వద్ద నుంచి హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ఆదివారం తెలిపారు. రాజౌరి జిల్లాలోని ఫతేపూర్లో తనిఖీలు చేస్తున్నప్పుడు అతని వద్ద నుండి ఆరు గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న తరువాత చప్రియన్ నివాసి ఇర్ఫాన్ ఖాన్ను అరెస్టు చేసినట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు.ఖాన్ని ప్రశ్నించడం వల్ల అతని సహచరుడు షారాజ్ అహ్మద్ని ఖబ్లాన్ గ్రామం థానామండి నుండి అరెస్టు చేశారు. అతడి నుంచి ఇరవై గ్రాముల హెరాయిన్, ఎలక్ట్రానిక్ తూకం మిషన్, రూ.1.62 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.పోలీసులు ఉదంపూర్ జిల్లాకు చెందిన మరో పెడ్లర్ను కూడా పట్టుకున్నారు మరియు 20 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.ముగ్గురు వ్యక్తులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ప్రతినిధి తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'జమ్మూకాశ్మీరులో ముగ్గురు హెరాయిన్తో పట్టుబడ్డారు'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: నల్లధన రారాజు కేజ్రీ
- ఆరోపణలు చేస్తూ కుప్పకూలిన కపిల్ మిశ్రా - యాక్సిస్ బ్యాంక్ సాయంతో బ్లాక్మనీని మార్చుకున్నకేజ్రీవాల్ న్యూఢిల్లీ : ఆదివారం ఢిల్లీ ప్రజలు విస్తుపోయేలా అరవింద్ కేజ్రీవాల్ అవినీతి బాగోతాలను బట్టబయలు చేస్తానని చెప్పిన బిహష్కృత మంత్రి కపిల్ మిశ్రా అన్నంత పనీ చేశారు. పదికి పైగా స్పైరల్ బైండింగ్ చేసిన పుస్తకాలను చూపిస్తూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన నిధులను కేజ్రీవాల్ ఎలా వాడుకున్నారో వెల్లడించారు. బ్లాక్మనీని యాక్సిస్ బ్యాంక్ ద్వారా వైట్ మనీగా కేజ్రీ మార్చుకున్నారని ఆరోపించారు. పార్టీకి రూ. 25 కోట్లు విరాళంగా వస్తే, రూ. 20 కోట్లను లెక్కలోకి చూపి, రూ. 5 కోట్లను ఆయన నొక్కేశారని చెప్పారు. మిగతా డబ్బులో రూ. 15 కోట్ల మొత్తాన్ని కూడా ఆయన స్వీయ అవసరాలకు, నేతల విదేశీ పర్యటనలకూ వాడారని చెప్పారు. ప్రతి ఖాతాకు సంబంధించిన బ్యాంకు వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిని ఎన్నికల కమిషన్తో పాటు, సీబీఐ, ఏసీబీ అధికారులకు ఇవ్వనున్నానని వెల్లడించారు. వందలాది కంపెనీల్లో కేజ్రీవాల్కు చట్టవిరుద్ధమైన వాటాలు ఉన్నాయని, ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయల మొత్తాలున్నాయని అన్నారు. కేజ్రీవాల్ ప్రారంభించిన షెల్ కంపెనీల వివరాలన్నీ తన వద్ద ఉన్నాయని అన్నారు. ప్రెస్ మీట్లో కుప్పకూలిన కపిల్ మిశ్రా: హుటాహుటిని ఆసుపత్రికి తరలింపు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేస్తూ, మీడియాతో మాట్లాడుతున్న వేళ కపిల్ మిశ్రా కుప్పకూలారు. ఆ వెంటనే అక్కడే ఉన్న ఆయన అనుచరులు, పోలీసులు మిశ్రాను ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఆయనను పరిశీలించిన వైద్యులు రక్తంలో గ్లూకోజ్ స్థాయి పడిపోయిందని శనివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఢిల్లీ ప్రజల ముందు కఠిన నిజాలను ఉంచుతానని చెప్పిన ఆయన మీడియాను పిలిచి కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఆధారాలతో కూడిన స్లైడ్లను ప్రదర్శిస్తూ, పడిపోయారు. అంతకు ముందు ఆయన ఆప్ నేతపై పలు ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కపిల్ మిశ్రాకు నిపుణులైన డాక్టర్ల నేతృత్వంలో చికిత్స జరుగుతున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
1
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను ఇవ్వండి: హైదరాబాద్ లో భారీ మోసం వెలుగుచూసింది. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ. కోట్లు మోసానికి పాల్పడ్డారు. 150 రోజుల్లో మూడు రెట్లు చెల్లిస్తామంటూ ఆశచూపి డబ్బులు వసూలు చేశారు. దాదాపు 25 వేల మంది నుండి రూ. 4కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. కేవలం రాజేంద్రనగర్ లోనే 150 మందికి పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు ముజీబ్ పరారీలో ఉన్నాడు. ముజీబ్ ను పట్టుకొని తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'క్రిప్టో ట్రేడింగ్ పేరుతో రూ.4 కోట్లకు టోకరా'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: సీఎం జగన్ కీలక ప్రకటన
ఏపీ సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లాలో గురువారం పర్యటించారు. బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్ ను గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ గతంలో గ్రాసిమ్ ప్రాజెక్టు సంబంధించి జరిగిన ఆందోళనల్లో 131 మందిపై కేసులు నమోదయ్యాయని. ఆందోళనకారులపై ఆ కేసులను ఎత్తివేస్తున్నామని ప్రకటించారు. ఈ రోజే జీవో విడుదల చేస్తున్నామని తెలిపారు. గ్రాసిమ్ పరిశ్రమతో ప్రత్యక్షంగా 1300 మంది, పరోక్షంగా 1150 మందికి ఉపాధి కలుగుతుందని సీఎం జగన్ అన్నారు. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా చట్టం చేశామన్నారు.
1
['tel']
క్రింది టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: ఏపీ ప్రజలకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 14వ తేదీ నుంచి పలు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర భారతదేశంలో అల్పపీడన ప్రాంతం. రుతుపవన ద్రోణితో కలిసి హిమాలయాల వైపుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా మారుతున్నాయి. ఈ కారణంగా ఏపీలో వర్షాలు కురిసే రోజులు సమీపించాయి. మరోవైపు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి, ఉభయగోదావరి జిల్లాల మీదుగా సోమవారం మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో ఏపీలో రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: విజయనగరం జిల్లాలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. జిల్లాలోని పార్వతీపురం, బొమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, బొబ్బిలి, మక్కువ, విజయనగరం తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వర్షం కురవడంతో కాస్త ఉపశమనం కలిగించినట్లయింది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'విజయనగరం జిల్లాలో పలుచోట్ల వర్షం'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. నేడు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 365 పాయింట్లు నష్టపోయి 65,322 వద్ద ముగిసింది. నిఫ్టీ 114 పాయింట్లు నష్టపోయి 19,428 వద్ద నిలిచింది.బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (3.24%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.95%), టైటాన్ (0.88%), రిలయన్స్ (0.49%), అల్ట్రాటెక్ సిమెంట్స్ (0.30%).టాప్ లూజర్స్ : ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.31%), NTPC (-2.02%), సన్ ఫార్మా (-1.59%), ఏషియన్ పెయింట్స్ (-1.52%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.39%).
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: టీడీపీ, బీజేపీ పొత్తు వార్తలపై విజయసాయిరెడ్డి స్పందించారు. "మాస్టర్ మేనిప్యులేటర్ చంద్రబాబు కూడికలు, తీసివేతల పొలిటికల్ మ్యాథ్స్ లో పూర్. అన్ని జెండాలతో 'జత' కట్టి వార్ వన్ సైడ్ అంటాడు. మరోసారి వ్యతిరేక ఓట్లు చీల్చి మాస్టర్ స్ట్రాటజీ అని ఎచ్చులు పోతాడు. ప్లస్సు, మైనస్సు, కుల మీడియా వ్యూహాల కంటే జనం సపోర్టు ముఖ్యం. గెలిపించాల్సింది వాళ్లే!" అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'పొలిటికల్ మ్యాథ్స్ లో చంద్రబాబు పూర్: విజయసాయిరెడ్డి'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసలో మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బుధవారం రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. హింసలో మరణించిన ఎనిమిది మందిలో ఉన్న జర్నలిస్టుకు కూడా అదే ఎక్స్గ్రేషియా వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. లఖింపూర్ ఖేరీ ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు మరియు జర్నలిస్టులకు తాను ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు ప్రకటించాను" అని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘెల్ లక్నో విమానాశ్రయంలో పేర్కొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ కూడా రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. పంజాబ్ మరియు ఛత్తీస్గఢ్ రెండూ కాంగ్రెస్ పాలనలో ఉన్నాయి.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ ''లఖింపూర్ ఖేరీ' ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: మధ్యాహ్నం 12 గంటల వరకు 60.46 శాతం పోలింగ్ నమోదు
హైదరాబాద్: సింగరేణిలో మధ్యాహ్నం 12 గంటల వరకు 60.46 శాతం పోలింగ్ నమోదు అయింది. కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ ఏరియాలో 63.95 శాతం పోలింగ్ నమోదు అయింది. శ్రీరాంపూర్లో 60 శాతం, మందమర్రిలో 59.23 శాతం, బెల్లంపల్లిలో 71.66 శాతం, భూపాలపల్లిలో 52 శాతం, రామగుండం ఆర్జీ1లో 60 శాతం, ఆర్జీ2లో 52 శాతం పోలింగ్ నమోదు అయినట్టు పోలింగ్ అధికారులు తెలిపారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చందుర్తి మండలం మూడపల్లి వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. లారీ ఎరువుల లోడ్తో కోరుట్ల వైపు వెళ్తున్న సమయంలో కారు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. . ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ప్రజా గొంతుకే నా యువగళం
నారా లోకేష్ కొనసాగిస్తున్న యువగళం పాదయాత్రను అడ్డుకోవడానికి రౌడీ గ్యాంగ్లను పంపుతున్నారు. వాళ్లను చూసి ఆగిపోవడానికి తాడేపల్లి పిల్లిని కాదు బ్ర దర్. నేను వేటాడే పులిని’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం అంటే పేదల గొంతుక అని వ్యాఖ్యానించారు. పాదయాత్రలో 87వ రోజైన మంగళవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కోడుమూరుల్లో యాత్ర సాగింది. గోనెగండ్ల మండలం గాజులదిన్నె క్రాస్ నుంచి 16.9 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు ఆయన 1,119.7 కి.మీ. పూర్తిచేశారు. ఎమ్మిగనూరు టీడీపీ ఇన్చార్జి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీలు బీటీ నా యుడు, రామగోపాల్ రెడ్డి లోకేశ్తో కలిసి నడిచారు. కోడుమూరులో లోకేశ్ మాట్లాడుతూ. పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందని, జగన్ అంటున్నారని. మరి దేశంలోనే ధనవంతుడైన సీఎం ఎలా అయ్యారో. చె ప్పే దమ్ముందా.? అని ప్రశ్నించారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఏపీ స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారు.
ఏపీలో జిల్లాల వారీగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేశారు. రిజర్వేషన్ల జాబితాకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. రిజర్వేషన్లకు సంబంధించిన జాబితాను ఏపీ సర్కార్ మధ్యాహ్నాంలోపు ఈసీకి అందించనుంది. ఇప్పటికే పలు జిల్లాల జాబితాలు ప్రభుత్వానికి చేరాయి. మరో గంటలో అన్ని జిల్లాలకు సంబంధించిన తుది జాబితాను సర్కార్ పరిశీలించి ఈసీకి పంపించనుంది. అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా హైకోర్టు సూచనల మేరకు కలెక్టర్లు రిజర్వేషన్లను ఖరారు చేశారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: వెనుకబడిన ప్రాంతం నుంచి స్పీకర్గా ఎన్నిక కావడం సంతోషం: పుష్పశ్రీవాణి
అమరావతి: వెనుకబడిన ప్రాంతం నుంచి తమ్మినేని సీతారాం స్పీకర్గా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ) పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన తమ్మినేని సీతారాంకు అభినందనలు తెలిపే కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తమ్మినేనికి స్పీకర్ బాధ్యతలను అప్పగించడం సహేతుకమని భావిస్తున్నానన్నారు. ఈ సభను తమ్మినేని హుందాగా నడిపిస్తారని నమ్మకం ఉందన్నారు. విలువలు, విశ్వసనీయత, రాజ్యాంగ స్ఫూర్తిని పరిఢవిల్లేలా చేయాలన్నారు. 2014లో శాసనసభలో అడుగుపెట్టినప్పుడు ఎన్నో ఆశలతో వచ్చామన్నారు. గత ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిందన్నారు. గత ప్రభుత్వం శాసనసభను సరైన దారిలో నడిపించలేక పోయిందన్నారు. నన్ను ఉపముఖ్యమంత్రిని చేసి సీఎం జగన్ దేశానికే స్ఫూర్తిగా నిలిచారన్నారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: మూడు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకొన్న బీఆర్ఎస్ పార్టీ
తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొంది. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 23న జరగాల్సి ఉంది. ఏపీలో 7, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు కాగా, తెలంగాణ బరిలో ముగ్గురే మిగిలారు. మొత్తం నాలుగు నామినేషన్లు దాఖలు కాగా, స్వతంత్ర అభ్యర్థి పాలమూరి కమల నామినేషన్ చెల్లదని అధికారులు ప్రకటించారు. దాంతో బరిలో మిగిలిన బీఆర్ఎస్ అభ్యర్థులు దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి, కూర్మయ్యగారి నవీన్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఫలితాలలో బీఆర్ఎస్ వర్గాల్లో హర్షం నెలకొంది.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: కరోనా వైరస్లో మరో కొత్తరకం గుర్తింపు
కరోనాతో ఇక్కట్లు పడుతున్న ప్రపంచానికి మలేసియా శాస్త్రవేత్తలు మరో భయంగొల్పే వార్త చెప్పారు. ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనా వైరస్ కంటే 10 రెట్ల ఎక్కువ వేగంతో విస్తరించే కొత్త వైరస్ను గుర్తించినట్టు వెల్లడించారు. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వాలు చేస్తున్న కృషిని ఇది అడ్డుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కొత్త రకం వైరస్కు ‘డి614జి’ అని పేరుపెట్టారు. ప్రస్తుత కరోనా వైరస్ ఉత్పరివర్తన చెంది ఈ రూపాన్ని సంతరించుకున్నట్టు పేర్కొన్నారు.భారతదేశం నుంచి తిరిగి వచ్చిన ఓ వ్యాపారి క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి దాదాపు 45 మందికి వైరస్ను అంటించాడని, ఈ సందర్భంగానే కొత్త వైరస్ ఉత్పరివర్తనను గుర్తించినట్టు వివరించారు. వ్యాపారవేత్త ద్వారా కరోనా సోకిన వారిలో ముగ్గురికి ‘డి614జి’ రకం వైరస్ సోకినట్టు పేర్కొన్నారు. ఈ రకం వైరస్ ఇప్పటికే అమెరికా, ఐరోపాలలో కనిపించిందని, దీనివల్ల కరోనా మహమ్మారి రెండోసారి విజృంభించే అవకాశం ఉందని మలేసియా ఆరోగ్యశాఖ డైరెక్టర్ జనరల్ నూర్ హిషామ్ పేర్కొన్నారు. వైరస్లోని జన్యుపదార్థంలో జరిగే మార్పునే మ్యుటేషన్ (ఉత్పరివర్తన) గా పిలుస్తారు. ఈ మార్పులు మానవులపై అదనపు దుష్ప్రభావాలను చూపిస్తాయి. ఈ ఉత్పరివర్తనాల వల్ల కొన్ని సందర్భాల్లో వైరస్ బలహీనపడుతుంది కూడా. కరోనాకు కారణమయ్యే సార్స్-కోవ్-2 వంటి ఆర్ఎన్ఏ వైరస్లు చాలా వేగంగా మ్యుటేషన్ చెందుతుంటాయి. వివిధ దేశాల్లో కొన్ని భిన్న రకాల కరోనా వైరస్లు ఉండడం ఇందులో భాగమేనని మలేసియా శాస్త్రవేత్తలు వివరించారు.
1
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: స్రవంతిని గెలిపిస్తేనే ఆడబిడ్డలకు ఆత్మగౌరవం: రేవంత్ రెడ్డి
ఒక వ్యక్తి ధన దాహంతోనే మునుగోడు ఎన్నిక… ఒక్క ఆడబిడ్డను ఓడగొట్టడానికి వందల మందితో దండయాత్రనా! మునుగోడులో లక్షా 25 వేల మంది ఆడ బిడ్డలు ఉన్నారు వారందరూ పాల్వాయి స్రవంతి ఓట్లేసి గెలిపించి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం చండూర్ లో నామినేషన్ తర్వాత ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ అసెంబ్లీకి పంపిస్తే తను సీతక్క తో పాటు సివంగిలా మారి కేసీఆర్ని నిలదీస్తారు అన్నారు. కేటీఆర్ తండ్రి కేసీఆర్ చిన్న మూలకాల మూడు చింతలపల్లి లక్ష్మాపూర్ ను దత్తత తీసుకొని, కొడంగల్ లో నిన్ను ఓడించడానికి దత్తత తీసుకుంటానని మోసం చేసి కొడంగల్ రోడ్ల పైన తట్టెడు మన్ను కూడా వేయలేదు అని దుయ్యబట్టారు. మునుగోడు కు ఎయిర్పోర్టు తెప్పిస్తా ఇక్కడ కూర్చొని అభివృద్ధి చేపిస్తా అవసరం అయితే సముద్రం తీసుకొస్తా అనే వాగ్దానాలు చేసే వారు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించాడు. ఈ కార్యక్రమంలో మాణిక్యం ఠాగూర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి , గీతారెడ్డి పాల్వాయి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మంచి పనులు చేస్తుంటే అడ్డుపడటం మంచిది కాదని ఎపి ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఎపి అసెంబ్లిలో ప్రాజెక్టులపై చర్చ జరిగింది. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ వెళ్లడంపై టిడిపి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై జగన్ మాట్లాడుతూ కెసిఆర్ మంచి పనులు చేస్తుంటే అభినందించాలని అన్నారు. అడ్డుపడటం మంచిది కాదని జగన్ అన్నారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆల్మట్టి 524 మీటర్ల ఎత్తు పెంచితే చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని జగన్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు ఏం చేశారని, ఎందుకు అడ్డుకోలేదని ఆయన ప్రశ్నించారు. కుళ్లు, కుతంత్ర రాజకీయాలు చేయడం సరికాదని ఆయన చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లానని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత ఉన్నందుకు సంతోషించండని ఆయన అన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'కెసిఆర్ మంచి పనులు చేస్తుంటే అడ్డుపడటం సరికాదు : జగన్'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: చొక్కా విప్పి సవాల్ విసిరిన మంత్రి సురేష్
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ కార్యకర్తలతో కలిసి మంత్రి ఆదిమూలపు సురేష్ ఆందోళన చేశారు. టీడీపీ కార్యకర్తలు మంత్రి కార్యాలయంలోకి చొరబడుతుండగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తగలపెడతారా రండి' అంటూ చొక్కా విప్పి సవాల్ చేశారు. అటు చంద్రబాబుపై రాళ్ల దాడి చేశారంటూ టీడీపీ కార్యకర్తలు ఆరోపించారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: డీజీపీ బదిలీపై ఏపీ సర్కారుకు పవన్కళ్యాణ్ లేఖ
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను ఆకస్మికంగా మార్చడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై ఏపీ సర్కారుకు మంగళవారం లేఖ రాశారు. ఆకస్మికంగా డీజీపీని ఎందుకు మార్చారో ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ డీజీపీగా సవాంగ్ ఈ రోజు మధ్యాహ్నం వరకూ విధుల్లో ఉన్నారని, ఆకస్మికంగా ఆ బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావచ్చని, కానీ డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏమి వచ్చిందో అని ప్రశ్నించారు. ఇందుకు గల కారణాలను ప్రజలకు తెలియచెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే డీజీపీపై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందని అన్నారు. ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ భయపెట్టి, అదుపు చేసేందుకు సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. డీజీపీ బదిలీ గతంలో చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను ఆకస్మికంగా తప్పించిన ఘటన గుర్తుకు వస్తుందని వివరించారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: ద్రవ్యోల్బణం మరోసారి దెబ్బతింది. ఇది డిసెంబర్ మొదటి రోజు. LPG సిలిండర్ (LPG ధరల పెంపు) చౌక కంటే ఖరీదైనది. డిసెంబర్ 1 నుంచి గ్యాస్ సిలిండర్లు రూ.100 పెరిగాయి. (LPG ధర పెంపు: వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 100 పెరిగింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యుడి వెన్నెముకను విరగ్గొట్టి డిసెంబర్ మొదటి రోజున ద్రవ్యోల్బణంతో ప్రజలు మరోసారి అల్లాడిపోయారు. పెట్రోలియం కంపెనీలు నేటి నుంచి గ్యాస్ ధర (ఎల్పీజీ ధర పెంపు) పెంచాయి. వాణిజ్య సిలిండర్ ధర రూ. కమర్షియల్ సిలిండర్లలో మాత్రమే పెంపుదల ఉందని, దేశీయ ఎల్పిజి సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదని భరోసా ఇచ్చారు. అయితే, వాణిజ్య సిలిండర్ ధరల పెరుగుదల తర్వాత రెస్టారెంట్ ఆహారం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. అయితే మోడీ ప్రభుత్వం పూర్తిగా నిరాశ చెందింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.100 పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.2,101కి చేరింది. అంతకుముందు నవంబర్ 1న కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.266 పెరిగి రూ.2,000.50కి చేరింది.
ఇవ్వబడిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'కమర్షియల్ సిలిండర్ ధర పెంపు'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: తనను తాను రక్షించుకునే సత్తా ఇండియాకు ఉంది: సుష్మా
న్యూఢిల్లీ: టిబెట్ సరిహద్దులో సైన్యాన్ని మోహరిస్తూ ఇండియాను భయపెట్టడానికి చూస్తున్న చైనా తీరుపై కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఆమె ఇవాళ రాజ్యసభలో మాట్లాడారు. తనను తాను రక్షించుకునే సత్తా ఇండియాకు ఉందని, చైనా తీరు తమను కనీసం భయపెట్టడం కూడా లేదని ఆమె స్పష్టంచేశారు. చైనా, ఇండియా సరిహద్దు ఉద్రిక్తతలపై రాజ్యసభలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నకు సుష్మా సమాధానమిచ్చారు. కొన్నేళ్లుగా ట్రై జంక్షన్ పాయింట్ దగ్గరికి రావడానికి చైనా ప్రయత్నిస్తూనే ఉన్నది. రోడ్లను రిపెయిర్ చేయడంలాంటి చర్యలు అందులో భాగమే అని ఆమె వెల్లడించారు. అయితే జూన్ 16న జరిగిన ఘటన ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయని సుష్మా చెప్పారు. ఈసారి మాత్రం చైనా బుల్డోజర్లు, నిర్మాణ సామగ్రితో ఆ ప్రదేశానికి వచ్చింది. అది మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లే చర్య అని ఆమె వివరించారు. భారత బలగాలు వెనక్కి వెళ్లాలని చైనా చెబుతున్నది. అలాంటపుడు చైనా కూడా అదే చేయాలి. ఈ విషయంలో న్యాయం, హక్కు మనవైపే ఉన్నాయి అని సుష్మా స్పష్టంచేశారు. నిజానికి ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపే ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఇక వన్ బెల్ట్ వన్ రోడ్పై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ. చైనా, పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ను ఓబీఓఆర్లో భాగం చేస్తున్నారని తెలియగానే మా నిరసనను గట్టిగానే తెలిపామని చెప్పారు. ఇండియా అనుకూల దేశాలన్నీ ఈ ప్రాజెక్ట్ వెనుక చైనా దురుద్దేశమేంటో పసిగట్టాయని సుష్మా అన్నారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: జి. మాడుగుల (మం) మదిలబండలో విషాదం చోటు చేసుకున్నది. విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందాడు. తన ఇంటికి కరెంట్ పోయిందని యువకుడు స్తంభం ఎక్కాడు. రేపు వివాహం చేసుకోవాల్సిన యువకుడు మృతి చెందాడు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే హెడ్లైన్ 'జి. మాడుగుల (మం) మదిలబండలో విషాదం'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: భార్య చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తున్న ఓ వ్యక్తి మద్యానికి బానిసై అర్ధరాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ ఘటన బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బేగంపేట్ పాటిగడ్డకు చెందిన కర్నాల వేణు (37) భార్య ఏండ్ల క్రితం చనిపోయింది. అప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. భార్య చనిపో యిన తర్వాత ఇద్దరి పిల్లలను వేణు అన్న నందకిషోర్ దత్తత తీసుకుని పెంచుతు న్నాడు. వేణు ఓ కారు గ్యారేజీలో వాషర్మేన్ గా పని చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి సోమవారం రాత్రి మద్యం సేవించి తన గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం అతని సోదరుడు నందకిషోర్ వెళ్లి తలుపు కొట్టగా తీయకపో వడంతో అనుమానం వచ్చి పగల కొట్టి చూశారు. అప్పటికే వేణు మృతి చెంది ఉన్నా డు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పి టలు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'మనస్థాపానికి గురై ఉరి వేసుకున్న వ్యక్తి'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: టోల్ ప్లాజాలపై కేంద్రం కీలక నిర్ణయం...!
కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న రోజులలో జాతీయ రహదారులపై ప్రయాణించడం ఈజీ కానుంది. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక నిర్ణీత పరిమితి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే టోల్ ఫీజులను వసూలు చేసేలా నిర్ణయం తీసుకోనుంది.ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే. రానున్న రోజులలో జాతీయ రహదారుల పై ప్రయాణించడం సులభం చేసింది.పదే పదే హైవేల పై ప్రయాణించే స్థానిక ప్రజలకు రిలీఫ్ ని తీసుకొచ్చింది. అయితే వీళ్ళు టోల్ ఫీజులను చెల్లించాల్సినవసరం లేదని కేంద్రం చెప్పింది. పైగా వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక పాస్ ని కూడా తీసుకు రానుంది. వచ్చే మూడు నెలలో ఇది అమలు లోకి తీసుకు వస్తున్నట్టు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ లోక్సభకు వెల్లడించారు. అలానే వచ్చే మూడు నెలలో దేశంలో టోల్ ప్లాజాల సంఖ్యను ప్రభుత్వం తగ్గించబోతుందని ఆయన అన్నారు. 60 కి.మీల పరిధిలో కేవలం ఒక్క టోల్ ప్లాజానే చేస్తుందన్నారు. 60 కి.మీల వెలుపలు ఉన్న ఇతర టోల్ ప్లాజాలను వచ్చే మూడు నెలల్లో క్లోజ్ చేసేస్తామని చెప్పారు. ఎప్పుడు టోల్ ప్లాజాల నుండి ప్రయాణించే స్థానిక ప్రజలు ఈ ఫీజులను చెల్లించాల్సినవసరం లేదని చెప్పారు. వచ్చే మూడేళ్లలో జాతీయ రహదారుల టోల్ ఆదాయం వార్షికంగా రూ.40 వేల నుంచి రూ.1.40 లక్షల కోట్ల వరకు పెరుగుతుందని గడ్కారీ అన్నారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని రాయండి: కేరళ సీఎంకు అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ
న్యూఢిల్లీ : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఒకట్రెండు సార్లు కాదు. మోదీ అపాయింట్మెంట్ పినరయి విజయన్కు లభించకపోవడం ఇది నాలుగోసారి. కేరళకు రేషన్ బియ్యం కేటాయింపుల్లో అసమానతలపై ప్రధాని మోదీతో చర్చించేందుకు అనుమతివ్వాలని సీఎం పినరయి పీఎంవోను కోరారు. మోదీ అపాయింట్మెంట్ కావాలని అడిగినప్పుడల్లా పీఎంవో వర్గాలు పినరయి విజ్ఞాపనను తిరస్కరిస్తున్నాయి. అవసరమైతే బియ్యం కేటాయింపులపై చర్చించేందుకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ను కలవాలని పినరయికి పీఎంవో వర్గాలు సూచించాయి. దీంతో సీఎం పినరయి విజయన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మార్చి 20న కూడా మోదీ అపాయింట్మెంట్ పినరయికి లభించలేదు. ఆ సమయంలో బడ్జెట్ కేటాయింపులపై మోదీతో చర్చించేందుకు కేరళ సీఎం అపాయింట్మెంట్ కోరారు.
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి : డిఐజి రంగనాధ్
- ప్రపంచ దేశాలకు తలమానికంగా నిలిచిన భారత్- వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి భయపడవద్దు- పోలీస్ సిబ్బంది అందరూ విధిగా వ్యాక్సినేషన్ తీసుకోవాలినల్లగొండ : పోలీస్ శాఖలో పని చేస్తున్న సిబ్బంది అంతా విధిగా కరోనా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ సూచించారు.దేశ వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న క్రమంలో పోలీస్ శాఖలో పని చేస్తున్న సిబ్బందికి శనివారం నుండి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా డిఐజి ఏ.వి.రంగనాధ్ కు డిఎంహెచ్ఓ కొండల్ రావు మాన్యం చెల్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా డిఐజి ఏ.వి. రంగనాధ్ మాట్లాడుతూ ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తకుండా వ్యాక్సిన్ రూపొందించి ప్రపంచ దేశాలకు భారతదేశం తలమానికంగా నిలించిందన్నారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఎవరూ భయపడవద్దని సూచించారు. యావత్ ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేసిన కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేలా వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్తల కృషి అభినందనీయమని, దేశ ప్రజలంతా వారి కృషికి వెన్నంటి నిలిచారని చెప్పారు. పోలీస్ శాఖలో అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది విధిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించినట్లు తెలిపారు. అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, సతీష్ చోడగిరి, డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్, ఎస్.బి. డిఎస్పీ రమణా రెడ్డి, సిఐలు, ఎస్.ఐ.లు, హెడ్ కానిస్టేబుల్స్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా శనివారం జిల్లా పోలీసు శాఖలో తొలి వ్యాక్సినేషన్ డిసిఆర్బీ సిఐ రవీందర్, కోర్టు లైజనింగ్ అధికారి శ్రీనివాస్ వ్యాక్సిన్ తీసుకున్నారు.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను ఇవ్వండి: ముక్కోటి దేవతలకు ఆదిగురువు, సకల సృష్టికి ఆది పురుషుడు భగవాన్ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు నూజివీడు పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు పట్టణంలో గల శ్రీ ఏకాంబరేశ్వర స్వామి సమేత శ్రీమత్ కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో మంగళవారం నాడు భగవాన్ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దేవతల గురువైన భగవాన్ విరాట్ విశ్వకర్మ సైన్సు కూడా కనిపెట్టలేని ఎన్నో గొప్ప నిర్మాణాలను చేశారని భక్తులు తెలియజేస్తున్నారు. దేవతలచే పూజలందు కొన్న భగవాన్ విరాట్ విశ్వకర్మ చేతివృత్తులకు ఆద్యుడని, సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ విశ్వకర్మ వేసిన బీజమే దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. నూజివీడు పట్టణంలో 200 సంవత్సరాల నుండి శ్రీ ఏకాంబరేశ్వర సమేత శ్రీ మత్ కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతోంది. ప్రతి ఏటా సెప్టెంబర్ 17వ తేదీ భగవాన్ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని. ప్రత్యేక పూజలు, యాగాలు, హోమాలు, విశ్వకర్మ వ్రతం నిర్వహించి, స్వామివారి ఉత్సవమూర్తి ని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా నగర ఉత్సవం కొనసాగుతుందని, అనంతరం భక్తులకు అన్నప్రసాదం సంతర్పణ చేయటం ఆనవాయితీగా వస్తున్నది అని ఆలయ భక్తులు పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నూజివీడు డివిజన్ ప్రచార కార్యదర్శి నీలా మన వెంకటేశ్వర్లు (వెంకట్), అధ్యక్షులు కొండిపర్తి ప్రసాద్, ప్రముఖ సిద్ధాంతి ఎర్రోజు శ్రీనివాసాచార్యులు, గంగాధర్, ఎర్ర బాబు, తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: మరో 24 గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని చందాపూర్ కు చెందిన పద్మమ్మ, వెంకటయ్య దంపతుల రెండో కుమార్తె భీమేశ్వరి(19)కి 10 రోజుల క్రితం ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. మంగళవారం పెళ్లి జరగాల్సి ఉంది. సోమవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు నిద్రలేచేసరికి భీమేశ్వరి ఇంట్లోని వెంటిలేటర్ కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంది. తనకు నిశ్చితార్థం జరిగినప్పటికీ చందాపూర్కు చెందిన లిక్కి అలియాస్ సిరిపి నర్సింహులు అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని ఆమె సూసైడ్ నోట్లో రాసింది. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు యువతి సూసైడ్ నోట్ లో రాసింది. భీమేశ్వరి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'మరో 24 గంటల్లో పెళ్లి... ఇంతలో విషాదం'.
2
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: ఢిల్లీ: జులై 1వ తేదీ నుంచి జీఎస్టీ అమలు చేసేందుకు అవకాశం ఉన్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ తెలిపారు. స్వల్ప మార్పులతో సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులను జీఎస్టీ కౌన్సిల్ ఈవాళ ఆమోదించింది. నేటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశ వివరాలను అరుణ్జైట్లీ మీడియా ద్వారా వెల్లడించారు. సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులను అన్ని రాష్ర్టాలు ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు. మిగిలిన విషయాలపై చర్చించేందుకు ఈ నెల 16న మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జులై 1 నుంచి జీఎస్టీ అమలుకు అవకాశం ఉందన్నారు. రాష్ర్టాల జీఎస్టీ బిల్లుకు న్యాయకమిటీ 3 రోజుల్లో తుదిరూపు ఇస్తుందని అనంతరం బిల్లును రాష్ర్టాలకు పంపిస్తామన్నారు. రాష్ర్టాల జీఎస్టీ బిల్లులను అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉందన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'జులై 1 నుంచి జీఎస్టీ అమలు: అరుణ్జైట్లీ'.
2
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: ఇంటర్నెట్డెస్క్: కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుట్టాడన్నట్టు మొన్నటికి మొన్న ఓ శిశువు పుట్టీపుట్టగానే నడుస్తూ ట్రెండింగ్ అయ్యాడు. తాజాగా మరో శిశువు పుట్టగానే తల కింద రెండు చేతులు పెట్టుకుని పోజు కొడుతున్న ఫొటో ఒకటి వైరల్గా మారింది. ఈ శిశువు ఎక్కడ జన్మించాడో తెలీదు కానీ. ఈ చిట్టితండ్రి స్టైల్కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అది చిన్నప్పటి రజనీకాంత్ ఫొటో అని కొందరు అంటుంటే, వీడి పుట్టుకలోనే స్టైల్ ఉందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక '‘తలైవా’ను మించిపోయిన శిశువు'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను వ్రాయండి: ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏలకు వ్యతిరేకంగా శుక్రవారం ఎంఐఎం పార్టీ ఇచ్చిన నిరసన ర్యాలీకి భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 4న జరిగిన మిలియన్ మార్చ్కు మించి జనం వస్తారని ఎంఐఎం వర్గాలు భావిస్తున్నాయి. పాతబస్తీ, మెహిదీపట్నం, మల్లేపల్లి, మలక్పేట్, ముషీరాబాద్, నాంపల్లితో పాటు వివిధ బస్తీల నుంచి జనం మీరాలం ఈద్గా వరకు చేరుకుంటారు. అక్కడి నుంచి సమూహంగా బయలుదేరి హసన్నగర్, ఆరాంఘర్, మైలార్దేవ్పల్లి, శాస్త్రిపురం, కింగ్స్కాలనీ, బాబా కాంటా వరకు ర్యాలీ ఉంటుంది. అక్కడ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించనున్నట్లు సమాచారం. దీనికోసం హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శంషాబాద్, కాటేదాన్ మార్గాల నుంచి వచ్చే వాహనదారులను బహదూర్పురా, జూపార్కుల వైపు వెళ్లడానికి అనుమతించరు. వారు ఆరాంఘర్ ఎక్స్ రోడ్డు నుంచి మెహిదీపట్నం మీదుగా వెళ్లాల్సి ఉంటుంది ఆరాంఘర్ జంక్షన్, కాటేదాన్ నుంచి వెట్లేపల్లి గేటు, శాస్ర్త్రిపురం వెళ్లే వాహనదారులు చంద్రాయణగుట్ట మీదుగా వెళ్లాల్సి ఉంటుంది రాజేంద్రనగర్, ఆరాంఘర్ నుంచి వచ్చే వాహనాలను కిషన్బాగ్, బహదూర్పురా వైపు అనుమతించరు. వారు పిల్లర్ నంబర్.202 వద్ద డైవర్షన్ తీసుకొని మెహిదీపట్నం మీదుగా వెళ్లాలి. మెహిదీపట్నం నుంచి వచ్చే వాహనాలను కిషన్బాగ్, బహదూర్పురా వైపు అనుమతించరు. వారు పిల్లర్ నెం.143 హైదర్గూడ వద్ద ఆరాంఘర్మీదుగా వెళ్లాలి ఫలక్నుమా, మైలార్దేవ్పల్లి మీదుగా శాస్త్రిపురం వైపు వెళ్లే వాహనదారులు మెహరాజా హోటల్ వద్ద డైవర్షన్ తీసుకొని ఫలక్నుమా వైపు వెళ్లాల్సి ఉంటుంది. దానమ్మ గుడిసె, హసన్నగర్ నుంచి కింగ్స్ కాలనీ, శాస్త్రిపురం వైపు వెళ్లే వాహనదారులు బాబా కాంటా వద్ద టర్నింగ్ తీసుకొని ఆరాంఘర్ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో గమ్య స్థానాలకు చేరే వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి, ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లాలని కోరారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'ఎంఐఎం పార్టీ నిరసన ర్యాలీ నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ వివరాలు...'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: స్టోన్ ప్లాంటేషను పనులు వెంటనే పూర్తిచేయాలి
రీ సర్వేపూర్తయిన గ్రామాలలో స్టోన్ ప్లాంటేషను పనులను వెంటనే పూర్తిచేయాలని సర్వే అండ్ సెటల్మెంటు కమీషనరు సిద్దార్థ జైన్ తెలిపారు. గురువారం జిల్లాకలెక్టరు, జాయింటు కలెక్టరు లతో రీసర్వే పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షనిర్వహించారు. ఈ కార్యక్రమంలో మన్యం జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ మాట్లాడుతూ పైనల్ ఆర్. ఒ. ఆర్. పూర్తయిన గ్రామాలలో స్టోన్ ఫ్లాంటేషను పూర్తిచేస్తున్నట్లు తెలిపారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సెల్పీ పిచ్చిపట్టుకొంటోంది. ఇంటిలో నోట్ల కట్టలు చూసి పట్టరాని సంతోషానికి గురైన ఓ ఎస్సై ఫ్యామిలీ. వాటితో సెల్ఫీలు దిగింది. దాదాపు 30 వరకూ రూ.500 నోట్ల కట్టలు వరుసగా పేర్చి. చుట్టూ కూర్చుని సెల్ఫీలకు ఫోజులిచ్చారు. అంతటితో ఆగకుండా అత్యుత్సాహంతో వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సదరు ఎస్సై చిక్కుల్లో పడ్డారు. అతడ్ని తక్షణమే బదిలీ చేసిన ఉన్నతాధికారులు. ఘటనపై దర్యాప్తు కూడా చేపట్టారు. ఉత్తర్ ప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన రమేశ్ చంద్ర సహానీ. ఉన్నావ్ జిల్లా బెహ్తా ముజవార్ పోలీసు స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఇటీవల ఆయన కుటుంబసభ్యుల నోట్ల కట్టలతో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన భార్య, ఇద్దరు పిల్లలు బెడ్పై కూర్చుని దాదాపు 30 వరకు రూ.500 నోట్ల కట్టలను పరిచి సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్నారు. ఈ ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడంతో వివాదాస్పదంగా మారింది. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నత అధికారులు. ఘటనపై విచారణకు ఆదేశించారు. మరోవైపు, ఆయనను తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేసి, పోలీసు లైన్స్కు బదిలీ చేసినట్లు స్థానిక ఉన్నావ్ ఎస్పీ సిద్ధార్థ్ శంకర్ మీనా తెలిపారు. ‘స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అధికారి భార్య, అతడి పిల్లలు నోట్ల కట్టలు చుట్టూ కూర్చుని ఫోటోలు తీసుకున్నారు. ఈ అంశాన్ని మేము తీవ్రంగా పరిగణించాం. సదరు హౌస్ ఆఫీసర్ను పోలీస్ లైన్కు బదిలీ చేశాం. దర్యాప్తు మొదలుపెట్టాం’ ఎస్పీ పేర్కొన్నారు. సర్కిల్ ఆఫీసర్ పంకజ్ సింగ్ మాట్లాడుతూ. సహానీ కుటుంబం రూ.500 నోట్ల కట్టలు చుట్టూ కూర్చుని ఫోటో షూట్ చేశారని అన్నారు. దీనిపై విచారణ చేపట్టామని తెలిపారు. కాగా, ఈ వివాదంపై స్పందించిన రమేశ్ చంద్ర సహానీ. ఆ ఫొటోలు 2021 నవంబరు 14న తీసుకున్నవని తెలిపారు. తమ కుటుంబానికి చెందిన ఓ ఆస్తిని విక్రయించినప్పుడు ఆ సొమ్ము వచ్చినట్లు చెప్పారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఆ నోట్ల కట్టల విలువ ఎంతో పోలీసులు వెల్లడించలేదు గానీ. రూ.14లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'నోట్ల కట్టలతో సెల్ఫీలు దిగిన ఎస్సై ఫ్యామిలీ,ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో తీవ్ర దుమారం'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: ఆరుగురు డీలర్ల పై కేసు నమోదు
విశాఖ జిల్లా కేబీపీ అగ్రహారం రేషన్ డిపోలో బుధవారం విచారణ జరిపారు. ఈ విచారణలో డీలర్ పై 6ఎ కేసు నమోదు చేసినట్లు తహసిల్దార్ కనకారావు చెప్పారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. మండలంలోని పలు ప్రాంతాలలో రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడుతున్నాయన్నారు. పదిమంది మృతుల పేరిట నిత్యావసర సరుకులను వారి కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా, ప్రభుత్వానికి అప్పగించకుండా నాలుగేళ్లుగా స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తూ. అదే గ్రామానికి చెందిన పలువురు సోమవారం స్పందనలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఇక్కడ రెవిన్యూ కార్యాలయానికి ఆదేశాలు రావడంతో. బుధవారం తాసిల్దార్ కనకారావు గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: గజరాజు ఎధురోడితే ఏం జరుగుతోంది.ఎవరైనా సరే వెనక్కి తగ్గాల్సి వస్తుంది. అటవీ మార్గం గుండా వెళ్తున్న ఓ బస్సును ఏనుగు వెంబడించడంతో మరో మార్గం లేని డ్రైవర్ బస్సును 8 కిలోమీటర్లు వెనక్కి నడిపాడు. అంతదూరం బస్సును వెంబడించిన ఏనుగు ఆ తర్వాత అడవిలోకి వెళ్లిపోవడంతో అందులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కేరళలో జరిగిందీ ఘటన. చాలకుడి నుంచి వాల్పరాయ్ మార్గంలో ఓ ప్రైవేటు బస్సు 40 మంది ప్రయాణీకులతో వెళ్తోంది. కొంతదూరం వెళ్లాక బస్సుకు ఓ ఏనుగు ఎదురుపడింది. అది తప్పుకుంటుందని భావించినా ఆ పని జరగకపోగా బస్సును అడ్డగించింది. అంతేకాకుండా ఆగ్రహంతో పరుగులు తీస్తూ బస్సువైపు దూసుకొచ్చింది. దీంతో ప్రయాణికులు భయపడిపోయారు. బస్సును వెనక్కి నడపమని డ్రైవర్ను కోరారు. డ్రైవర్ అలాగే చేశాడు. ఇరుగ్గా, వంకరగా ఉన్న ఆ రోడ్డులోనే అంబలాపర నుంచి అనక్కయాం వరకు దాదాపు 8 కిలోమీటర్ల పాటు బస్సును అలాగే రివర్సు గేరులో వెనక్కి నడిపాడు. అక్కడి వరకు బస్సును వెంటాడుతూనే వచ్చిన ఏనుగు ఓ గ్రామం వద్ద అడవిలోకి వెళ్లిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఏనుగు పేరు కబాలి అని రెండేళ్లుగా అది ఇలాగే చేస్తోందని స్థానికులు పేర్కొన్నారు. ఇది తనకు మర్చిపోలేని ఘటన అని, బస్సులోని అందరూ భయపడిపోయారని డ్రైవర్ అంబుజాక్షన్ పేర్కొన్నారు. బస్సును వెనక్కి నడపడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'గజరాజు ఎదురోడితే...ఎవరైనా వెనక్కి తగ్గాల్సిందే'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: కాళోజీ మెడికల్ యూనివర్సిటీ వెబ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (KNRUHS) పీజీ మెడికల్ డిగ్రీ/డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి కాంపిటెంట్ అథారిటీ కోటా కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల కేటాయింపు కోసం మొదటి దశ వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహణ కోసం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అనుబంధ ప్రభుత్వ వైద్య కళాశాలలు/ప్రైవేట్ నాన్-మైనారిటీ/ప్రైవేట్ మైనారిటీ వైద్య కళాశాలలు మరియు నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS), హైదరాబాద్లో 2021-22 కోసం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో సర్టిఫికేట్లు అప్లోడ్ చేయబడి, సంబంధిత విభాగాల సిబ్బందిచే తాత్కాలికంగా ధృవీకరించబడిన అభ్యర్థులు మరియు PG మెడికల్ అడ్మిషన్ల యొక్క తాత్కాలిక తుది మెరిట్ జాబితాలో అర్హులుగా తెలియజేయబడిన అభ్యర్థులు మరియు వెబ్సైట్లో తెలియజేయబడిన విధంగా మెరిట్ జాబితాలో తదుపరి సవరణలు KNRUHS, వరంగల్, కంప్యూటర్ ఆన్లైన్ నుండి ఆన్లైన్లో వెబ్ - ఎంపికలను వ్యాయామం చేయడానికి అర్హులు.KNRUHS వెబ్సైట్లోని తాత్కాలిక తుది మెరిట్ జాబితాలో పేర్లు ప్రదర్శించబడిన అర్హులైన అభ్యర్థులందరూ జనవరి 25 ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సర్వీస్ కోటా మరియు PWD కోటా సీట్లతో సహా PG మెడికల్ డిగ్రీ/ డిప్లొమా సీట్లలో ప్రవేశానికి అర్హతగా వెబ్ ఎంపికలను ఉపయోగించవచ్చు. జనవరి 27, 2022. లేదా అర్హత ప్రమాణాలు మరియు నిబంధనలు, అభ్యర్థులు నవంబర్ 19, 2021 తేదీ నాటి నోటిఫికేషన్లను చూడవలసిందిగా కోరబడతారు మరియు సీటు కేటాయించిన అభ్యర్థులు ఆన్లైన్లో పేమెంట్ గేట్-వే ద్వారా యూనివర్శిటీ ఫీజు రూ.20,600 చెల్లించాలి. మరియు కేటాయింపు లేఖను డౌన్లోడ్ చేయండి. మరియు ట్యూషన్ ఫీజు సంబంధిత మెడికల్ కాలేజీలలో చెల్లించబడుతుంది. ఏప్రిల్ 14, 2020 నాటి GO Ms No:20 HM& FW Dept.లో తెలంగాణ ప్రభుత్వం ద్వారా తెలియజేయబడిన ట్యూషన్ ఫీజు మరియు హైకోర్టు ఉత్తర్వులకు సంబంధించినది.అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు (సీట్ మ్యాట్రిక్స్) http://knruhs.telangana.gov.in వెబ్సైట్లో ఉంచబడ్డాయి, అభ్యర్థులు KNRUHS మరియు NIMS పరిధిలోని అన్ని మెడికల్ కాలేజీలలో PG మెడికల్ డిగ్రీ / డిప్లొమా కోర్సుల కోసం వెబ్ ఎంపికలను https:/ ద్వారా ఉపయోగించుకోవచ్చు. /tspgmed.tsche.in
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: అగ్ని ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం: డీసీపీ
సికింద్రాబాద్ సంభవించిన అగ్నిప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎలక్ట్రిక్ బైకు షోరూం నిర్వాహకుడు రంజిత్ పై ఇప్పటికే కేసు నమోదు చేశారు. కాగా. ప్రమాదం జరిగిన తీరుపై నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ. నిబంధనలకు విరుద్ధంగా రంజిత్ షోరూం నిర్వహిస్తున్నాడని అన్నారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్ఐ అప్పటికే మంటల్లో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులను కాపాడినట్లు తెలిపారు. ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను వ్రాయండి: హైదరాబాద్: టీఆర్ఎస్ నేత గుత్తాసుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగియటంతో. గుత్తా సుఖేందర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు గుత్తా సుఖేందర్రెడ్డి అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు నుంచి ధ్రువ పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నేత గుత్తాసుఖేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: టీడీపీ సీనియర్ కార్యకర్త కుటుంబానికి ఆర్ధిక సహాయం
కొత్తవలస మండలం వీరభద్రాపురం పంచాయతీ కర్రిచిన్నయ్యపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త కర్రీ సత్యనారాయణ ఇటీవల మరణించడం జరిగింది. అయితే అతనికి భార్య కర్రీ లక్ష్మి, అబ్బాయి కర్రీ శ్యామ్, అమ్మాయి కర్రీ ప్రియాంక ఉన్నారు. శనివారం వారిని వారి కుటుంబసభ్యులను శృంగవరపుకోట నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ కోళ్ల లలిత కుమారి మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి కోళ్ళ బాలాజీ అప్పల రాంప్రసాద్ కర్రీ సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఎల్లప్పుడూ మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసాను ఇచ్చి, ధైర్యం చెప్పడం జరిగింది. అదే విధంగా కర్రీ సత్యనారాయణ కుటుంబసభ్యులకు తెలుగుదేశం పార్టీ తరుపున తమ వంతు సహాయం కోళ్ల లలిత కుమారి 35, 000 రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు. అంతేకాకుండా వారి అబ్బాయి, అమ్మాయిల చదువు నిమిత్తం పదవ తరగతి పూర్తయ్యేంత వరకూ చదివించేందుకు కోళ్ల లలిత కుమారి దంపతులు వారి ఇద్దరి పిల్లలను దత్తత తీసుకోవడం జరిగింది.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: కోడిగుడ్లు ఎక్కువగా తింటున్నారా.?
మంచి ఆరోగ్యం కోసం రోజుకో గుడ్డు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అలాగని రోజూ ఎక్కువ గుడ్లు తీసుకుంటే సమస్యలేనని పేర్కొంటున్నారు. రోజుకు పరిమితికి మించి గుడ్లను తింటే డయేరియా బారిన పడొచ్చని అంటున్నారు. అలాగే జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపిస్తుందని, మలబద్ధకానికి దారి తీస్తుందని చెబుతున్నారు. ఎక్కువగా గుడ్లను తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగి సమస్యగా మారుతుందని అంటున్నారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఢిల్లీకి చేరుకున్నా మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే
మహారాష్ట్ర కొత్త సీఎం ఏక్ నాథ్ షిండే, కొత్త డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరపడి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన షిండే, ఫడ్నవీస్ శుక్రవారం తొలిసారిగా ఢిల్లీ వెళ్లారు.శనివారం కూడా ఢిల్లీకి రానున్న షిండే, ఫడ్నవీస్లు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ కానున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్తో భేటీ కానున్నట్లు సమాచారం.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: రంగారెడ్డి(D) ఇబ్రహీంపట్నం CHCలో కుటుంబనియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు చనిపోవడంపై DH శ్రీనివాసరావు స్పందించారు. '34 మందికి ఆపరేషన్లు జరిగాయి. నలుగురు మహిళలు చనిపోవడం దురదృష్టకరం. తెలంగాణలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. మిగతా 30 మందిని రక్షిస్తాం. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్ రూం ఇళ్లు, పిల్లలకు ఉచిత విద్య ప్రభుత్వం అందిస్తుంది' అని DH పేర్కొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'దురదృష్టకరం... తెలంగాణలో ఇలా జరగడం ఇదే తొలిసారి: డిహెచ్. శ్రీనివాసరావు'.
2
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: తెలంగాణ కరోనా అప్డేట్
తెలంగాణలో గత 24 గంటల్లో, 16,319 కరోనా పరీక్షలు నిర్వహించబడ్డాయి మరియు 155 పాజిటివ్ కేసులు కనుగొనబడ్డాయి. హైదరాబాద్లో అత్యధికంగా 81 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 11, సంగారెడ్డి జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 59 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇటీవలి కరోనా మరణాలు లేవు.తెలంగాణలో ఇప్పటివరకు 7,94,184 పాజిటివ్ కేసులు నమోదు కాగా. 7,89,166 మంది ఆరోగ్యంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగింది. మరో 907 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతి చెందారు.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: తగ్గిన భారతీయుల అమెరికా సందర్శన
అమెరికాను సందర్శించే భారతీయుల సంఖ్య తగ్గింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో సుమారు 13శాతం మేర ఆ సంఖ్య తగ్గుముఖం పట్టింది. నోట్ల రద్దుతో పాటు, వీసాల జారీ ప్రక్రియలో అమెరికా జాప్యం ఇందుకు దోహదం చేశాయని పర్యాటక అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల అమెరికా జాతీయ రవాణా, పర్యాటక కార్యాలయం ఇందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం తొలి ఆరునెలల్లో (జనవరి-జూన్) ఇండియా నుంచి అమెరికా వచ్చే వారి సంఖ్య 12.9 శాతం మేర తగ్గిందని పేర్కొంది. రెండో త్రైమాసికంలో ఆ సంఖ్య 18.3గా ఉందని తెలిపింది. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో భారత్ నుంచి వచ్చే వారి సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టిందని, దాని ప్రభావం స్వల్పకాలం మాత్రమే ఉంటుందని బ్రాండ్ యూఎస్ఏ ప్రెసిడెంట్, సీఈవో క్రిస్ థామ్సన్ పేర్కొన్నారు. భారత్లో గతేడాది కాలంగా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఇందుకు కారణమయ్యాయని చెప్పారు. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు ప్రభావితం చేసిందన్నారు. అయితే ట్రంప్ వలసవాద విధానాలు ప్రభావితం చేశాయనడాన్ని ఆయన కొట్టిపారేశారు. డిమాండ్కు తగ్గ వీసాలను జారీ చేయలేకపోవడమే ఇందుకు కారణమయ్యాయని చెప్పారు. 2016లో 11.7 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించి 1.36 లక్షల డాలర్ల ఆదాయాన్ని సమకూర్చారని, అది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 14 శాతం అధికమని థామ్సన్ చెప్పారు. 2016తో పోలిస్తే 2021 నాటికి సందర్శకుల సంఖ్య 72 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. ఇరు దేశాల మధ్య నేరుగా ప్రయాణించే విమానాల సంఖ్య, సహకారం పెరగడం వంటివి సంఖ్య పెరుగుదలకు, పర్యాటకాభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.
1
['tel']
కింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: మరి రోహిత్ ఫోకస్ పెట్టాడంటే అంతే...!
ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్ను భారత్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. తొలి మ్యాచ్లో ఓడిపోయినా, రెండు, మూడు మ్యాచ్ల్లో గెలిచి భారత్ గెలిచిందంటే ఆ జట్టు ఆటతీరే కారణమంటూ కొనియాడాడు. ఈ క్రమంలో మూడో టీ20 మ్యాచ్ను ఉదాహరిస్తూ టీమిండియా ‘బాస్ ఆఫ్ ద గేమ్’ అంటూ అభిప్రాయపడ్డాడు. అదే సందర్భంలో రెండో టీ20లో చెలరేగిన రోహిత్ శర్మపై ప్రత్యేకంగా పొగడ్తలతో ముంచెత్తాడు. ‘రోహిత్ శర్మ కచ్చితంగా ఆడాలనుకంటే అతను ఆడతాడు. ప్రపంచ క్రికెట్లో అతనొక అసాధారణ ఆటగాడు. ఈ మ్యాచ్లో ఆడాలని దృష్టి పెడితే రోహిత్ అందుకు తీవ్రంగా శ్రమిస్తాడు’ అని అక్తర్ పేర్కొన్నాడు. ఇప్పుడు రోహిత్ శర్మ బ్యాటింగ్ సంగతిని పెట్టి ఫీల్డింగ్పై ఫోకస్ పెట్టాడు. బంగ్లాదేశ్తో తొలి టెస్టులో భాగంగా శనివారం మూడో రోజు ఆటలో ముష్ఫికర్ రహీమ్ ఇచ్చిన క్యాచ్ను రెండో స్లిప్లో ఉన్న రోహిత్ జారవిడిచాడు. షమీ బౌలింగ్లో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కాస్త కష్టపడితే పట్టే క్యాచ్ను రోహిత్ నేలపాలు చేశాడు. దాంతో ఫీల్డ్లోనే అసహనం వ్యక్తం చేసిన రోహిత్ తాను క్యాచ్ను ఎందుకు వదిలేశాననే విషయాన్ని సీరియస్గా తీసుకున్నాడు. లంచ్ విరామంలో అదే తరహా స్లిప్ క్యాచ్లను ప్రాక్టీస్ చేశాడు. ఇలు పలుమార్లు ప్రాక్టీస్ చేసిన రోహిత్ ఏ బంతికి ఎంతవరకూ రియాక్ట్ కావాలో అంచనా వేసుకున్నాడు. లంచ్ తర్వాత షమీ వేసిన ఓవర్లో మహ్మదుల్లా ఇచ్చిన స్లిప్ క్యాచ్ను రోహిత్ ఏమాత్రం తడబాటు లేకుండా పట్టేసుకున్నాడు. ‘దటీజ్ రోహిత్. మరి రోహిత్ ఫోకస్ పెట్టాడంటే అంతే’ అని అనుకోవడం అభిమానుల వంతైంది. మరి దీనికి సంబంధించి వీడియోనే బీసీసీఐ తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్లో 57 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఏడో వికెట్గా మెహిది హసన్ ఔటయ్యాడు. ఇక నాలుగు పరుగుల వద్ద రోహిత్ రూపంలో లైఫ్ లభించిన రహీమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
1
['tel']
క్రింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: సింధు పోరాటం స్ఫూర్తిదాయకం : ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట, సూర్య ప్రతినిధి : టోక్యో ఒలింపిక్స్ లో పతకం సాధించి భారతావని గర్వించేలా చేసిన తెలుగు తేజం పీవీ సింధు అంకిత భావానికి నిదర్శనంగా నిలిచిందని డిప్యూటీ సీఎం, ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సింధు ప్రదర్శన తరతరాలు చెప్పుకునేలా చరిత్ర పుటల్లో నిక్షిప్తమై ఉంటుందని కొనియాడారు. ఓటమిపాలైన చోటే 24 గంటల్లోనే పట్టుదలతో కూడిన ప్రయత్నం, సంకల్పం అంకితభావంతో అసాధ్యాలను దాటి అద్భుతం చేసిందని పేర్కొంటూ సింధుకు శుభాభినందనలు తెలిపారు. సింధుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే అన్ని ప్రోత్సాహకాలు అందజేశామని గుర్తు చేశారు. సింధూ తండ్రి తనతో పాటు వాలీబాల్ ప్లేయర్ అని ఒక స్నేహితునిగా తనకి కూడా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. వరుసగా రెండు ఒలింపిక్స్ల్లోనూ పతకాలు అందించి ఆ ఘనత అందుకున్న తొలి భారత మహిళగా, తెలుగమ్మాయిగా ఘన కీర్తిని సాధించిన ఆమె విజయాలు యువతలో స్ఫూర్తిని కలిగిస్తాయని కృష్ణదాస్ ఆకాంక్షించారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: దేశ ప్రజలను, ఆర్థిక వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టిన కరోనా మహమ్మారికి, వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ వైరస్ ఇప్పటికే 33 లక్షల మందికి పైగా సోకిందని గుర్తు చేసిన ఆయన, అయినా కేంద్రం పారదర్శక వ్యూహంతో వెళ్లడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదని, ఈ పరిస్థితి దేశాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టవచ్చని రాహుల్ హెచ్చరించారు. కాగా, ఈ నెల 14న తన ట్విట్టర్ ఖాతాలో, వ్యాక్సిన్ పై కేంద్రం వ్యూహం ఏంటో, ఎప్పుడు తెస్తారో తెలియజేయాలంటూ రాహుల్ కోరిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై దేశ ప్రజలకు ఓ స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ లభిస్తే దాని ధర అందరికీ అందుబాటులో ఉండేలా తక్కువగా ఉండాలని, పంపిణీ కూడా పారదర్శకంగా సాగాలని ఆయన అన్నారు. ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ, నిత్యమూ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ఏదో ఒక విమర్శ చేస్తూనే ఉన్నారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్ విషయంలో రాహుల్ తనకు లభించే ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు. కేసుల సంఖ్య 20 లక్షలు దాటగానే, తన ట్విట్టర్ టైమ్ లైన్ లోని పాత ట్వీట్ ను రీ పోస్ట్ చేసిన రాహుల్, తాను చెప్పినట్టే జరుగుతోందని వ్యాఖ్యానించారు. జూలై 17న కరోనా కేసుల సంఖ్య 10 లక్షలను తాకిన వేళ, ఆగస్టు 10 నాటికి ఈ కేసులు 20 లక్షలు అవుతాయని రాహుల్ హెచ్చరించారు. ఆయన అంచనా వేసినట్టే జరిగింది.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'కేంద్రంపై మండిపడ్డ రాహుల్ గాంధీ...'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని వెంకటాద్రి నగర్ హౌసింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ లక్ష్మీ, వైస్ ప్రెసిడెంట్ వెంకట్ నారాయణ, జనరల్ సెక్రెటరీ అనిల్ తివారి, సెక్రెటరీ జ్యోతి, ట్రెజరర్ మల్లేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రాధ, సంధ్య, లక్ష్మి, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి: ఎమ్మెల్యే'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: ఢిల్లీలో కొత్తగా 17,335 పాజిటివ్ కేసులు... 9 మంది మృతి
ఢిల్లీలో శుక్రవారం 17,335 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి, గత ఏడాది మే 8 నుండి ఇప్పటివరకు ఈ రోజే అత్యధికంగా ఒకే రోజు 17,364 సులు నమోదయ్యాయి. కొత్త కేసులతో దేశ రాజధాని మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు 15,06,798కి చేరుకుంది.ఢిల్లీలో గత 24 గంటల్లో మొత్తం తొమ్మిది మంది వైరస్ బారిన పడి మృతి చెందారు., దీనితో మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 25,136 కు చేరుకుంది. జాతీయ ఢిల్లీ నగరంలో కరోనా సంక్రమణ రేటు శుక్రవారం 17.73 శాతానికి చేరుకుంది, ఇది గత ఎనిమిది నెలల్లో ఇదే అత్యధికం అని ఢిల్లీ ఆరోగ్య శాఖ ప్రకటించింది. నగరంలో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య శుక్రవారం 39,873కి పెరిగింది, గత ఏడాది మే 20 నుండి ఢిల్లీలో 40,214 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ప్రస్తుతం రికవరీ రేటు 95.68 శాతం, మరణాల రేటు 1.67 శాతం.గత 24 గంటల్లో 8,951 మంది రోగులు కోలుకోవడంతో, ఇప్పటి వరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 14,41,789కి పెరిగింది. ప్రస్తుతం మొత్తం 20,695 మంది కోవిడ్ రోగులు హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. దేశ రాజధానిలో కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 6,912కి చేరుకుంది. గత 24 గంటల్లో 2,00,280 టీకాలు వేయగా, వాటిలో 1,28,843 మొదటి డోసులు మరియు 71,797 రెండవ డోస్లు. ఆరోగ్య శాఖ ప్రకారం, ఇప్పటివరకు టీకాలు వేసిన మొత్తం లబ్ధిదారుల సంఖ్య 2,71,97,823.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: పులి సినిమాలోనైనా.జూలోనైనా చూసేందుకు ఇష్టపడతారు. కానీ అదే పులి జనంలోకి వస్తే నేరుగా చూసే సాహసం ఎవరైనా చేస్తారా.? పెద్ద పులి అంటే గజ్జున వణుకుతాం. అందరి పరిస్థితి అంతే. అదీ అడవీలో. లేదంటే జూలో చూస్తేనే సిచుయేషన్ వర్ణించలేం. అయితే అటవీ విస్తీర్ణం తగ్గడంతో ఇప్పటికే వానరాలు ఇళ్లలోకి వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కొన్ని మృగాలు కూడా జనారణ్యంలోకి రావడం భయాందోళనకు గురిచేస్తోంది. చిరుతపులి కనిపించిన అంతే సంగతులు. అలాంటి ఘటనలు ఇటీవల హైదరాబాద్లో చూశాం. ఇప్పుడు మెక్సికోలో ఓ పెద్దపులి సంచరించింది. దీంతో అక్కడున్న జనాల గుండె గుబెల్ మనే పరిస్థితి ఏర్పడింది. మెక్కికో నయరిటీ స్టేట్. టెక్యులా వద్ద ఓ పులి సంచరించింది. ఆ పులి రావడంతో స్థానికులు ఒక్కసారిగా భయపడ్డారు. వీడియోను కొందరు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. బుధవారం ఉదయం పులి సినాలొ సరిహద్దు దాటి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పోస్ట్ చేసింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. అదీ ప్రవేశించిన విధానం గురించి తెలుసుకున్నారు. ఓ యువతి పులి రావడం చూసి ఆరుపులు పెట్టిన వీడియో మనం చూశాం. తర్వాత ఒకరు వచ్చారు. అయినప్పటికీ జనం భయపడుతూనే ఉన్నారు. కానీ అతను నిపుణుడు కావడంతో. రిలాక్స్ అయ్యారు. అతను తాపీగా దానిని తీసుకెళ్లాడు. దాని మూతికి తాడు కట్టి తీసుకెళ్లాడు. అదీ అతనిని అనుసరిస్తూ మరీ వెళ్లింది. వీడియోను ఇప్పటికే 13 వేల సార్లు చేశారు. 189 మంది లైక్ చేశారు. ఆ వీడియో నిజానికి భయ కంపితులను చేసేలా ఉంది. సరయిన సమయానికి అధికారి ఒకరు రావడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. బతుకు జీవుడా అని వారంతా అనుకున్నారు. లేదంటే తమ పరిస్థితి ఎలా అని అనుకున్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన శీర్షిక 'అమ్మో పులి...గజగజ వణికిన మెక్కికో ప్రజలు'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: 'ఏడుకొండల వాడా. ఎక్కడున్నావయ్యా.' అంటూ సామన్య భక్తులు ఆవేదన చెందుతున్న పరిస్థితి తిరుమలలో నెలకొంది. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు కొండపై ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. కరోనా నిబంధనల పేరు చెప్పి, సర్వదర్శనాన్ని నిలిపివేయడమే ఇందుకు కారణం. కరోనా కారణంగా ఆలయం మూతపడటానికి ముందు రోజు వరకూ ఒక్క రూపాయి కూడా చెల్లించనవసరం లేకుండా, నిరుపేద సామాన్య భక్తులకు ఉచిత దర్శనం కల్పించిన టీటీడీ, తిరిగి ఆలయాన్ని తెరిచిన తరువాత మాత్రం సామాన్యుల ఊసు మరచిపోయిందని భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. మహమ్మారి విస్తరించక ముందు తిరుమల గిరులు నిత్యమూ లక్షలాది మంది భక్తులతో కళకళలాడుతూ ఉండేవి. రోజుకు దాదాపు 50 వేల మందికి ఉచిత దర్శనం లభించేది. ఇప్పుడు మాత్రం సప్తగిరులపై వేలాది మంది మాత్రమే కనిపిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు గుమికూడుతున్నారన్న కారణాన్ని సాకుగా చూపుతూ, సెప్టెంబర్ 6 నుంచి ఉచిత దర్శన టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నిరుపేదలకు స్వామి దర్శనం దుర్లభమైంది. ప్రస్తుతం తిరుమలలో స్వామిని దర్శించుకోవాలంటే, కనీసం రూ.300 టికెట్ కొనాల్సిందే. ఈ ప్రత్యేక దర్శనం టికెట్లను రోజుకు 16 వేల కోటాను విడుదల చేస్తున్న టీటీడీ, వాటిని ఆన్ లైన్ లో విక్రయిస్తోంది. ఆపై శ్రీవాణి ట్రస్ట్ కు రూ. 10 వేలు విరాళం ఇచ్చిన వారికి, రూ. 1000తో కల్యాణం చేయించుకున్న వారికి, బోర్డు సభ్యులు సిఫార్సు చేస్తే, రూ. 300పై సుపథం ద్వారా భక్తులను స్వామి దర్శనానికి అధికారులు అనుమతిస్తున్నారు. అంటే ఎంతో కొంత డబ్బు వెచ్చించనిదే ఆపద మొక్కులవాడిని దర్శించుకునే వీలు లేదన్నమాట. అలాక్కూడా రోజుకు దాదాపు 20 వేల మంది వరకూ స్వామిని దర్శించుకుంటున్నారు. ఈ సంఖ్యను కూడా పెంచాలని భావిస్తున్న అధికారులు, ఆన్ లైన్ లో మరిన్ని టికెట్లను అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు. ఇదే ఇప్పుడు టీటీడీపై విమర్శలకు కారణం అవుతోంది. సామాన్యులకు పెద్దపీట వేస్తామని చెప్పే పాలకమండలి, ఇప్పుడు వారి వంకైనా చూడటం లేదని పలువురు భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'తిరుమలలో సామన్య భక్తులు ఆవేదన...'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ పునరుజ్జీవ సభను విజయవంతం చేద్దామని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత కోరారు. జగిత్యాలలో పలు కుల సంఘాల నాయకులతో సమావేశం అయిన ఆమె, ఎస్సారెస్పీ ప్రాజెక్టు జీవనదిగా మారబోతోందని, దీని వల్ల లాభపడే జిల్లాల్లో జగిత్యాల జిల్లా మొదటిది అవుతుందన్నారు.వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎంపీ కవిత తెలిపారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీని నింపే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ రేపు (గురువారం) ప్రారంభిస్తున్నారని చెప్పారు. నీటి నిల్వ కోసం అదనపు రిజర్వాయర్లను నిర్మిస్తామని, కాలువలో ఎప్పుడూ నీరు నిలువ ఉంటుందని, కాలువ వెళ్తున్న గ్రామాల్లో కుంటలు, చెరువుల్లో నీటిని నిల్వ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని వివరించారు.పోచంపాడులో రేపు జరిగే సభకు లక్షల సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని ఎంపి కవిత కోరారు. రైతుల కోసం ప్రభుత్వం ఏం చేస్తున్నదో ఈ సభలో తెలియజేస్తారని వెల్లడించారు. బస్సులు, ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లు, సైకిళ్లు ఏది అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించుకుని సభకు తరలిరావాలని కోరారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'ఎస్సారెస్పీ పునరుజ్జీవ సభకు భారీగా తరలిరండి: కవిత'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: పవన్ కు కేఏ పాల్కు తేడా లేదు: మంత్రి జోగి రమేష్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కేఏ పాల్కు తేడా లేదని ఏపీ మంత్రి జోగి రమేష్ అన్నారు. తాడేపల్లిలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. పవన్, కేఏ పాల్ ఒకే రీతిలో మాట్లాడతారని, వారిద్దరికీ ఏపీలో సీట్లు లేవని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంతో సహా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వైసీపీదే విజయం అన్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: ఐపీఎల్ 20 20 మొదలవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇలాంటి కీలకమైన సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో దాదాపు 12-13 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో ఇద్దరు క్రికెటర్లు దీపక్ చాహర్ ఇంకా ఋతు రాజ్ గైక్వాడ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరు ఐసోలేషన్ లో ఉన్నారు.చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ సురేష్ రైనా శనివారం నాడు భారతదేశానికి తిరిగి ప్రయాణం అయ్యారు. ఇందుకు కారణం సురేష్ రైనా వ్యక్తిగత సమస్యలట. జాగరణ్ కథనం ప్రకారం సురేష్ రైనా బంధువుల లో ఒకరు క్రిటికల్ కండిషన్ లో ఉన్నారట. పటాన్ కోట్ లోని థరియాల్ లో నివసించే ఇంకొక బంధువుపై దాడి జరిగిందట. దెబ్బలు బాగా తగలడంతో సురేష్ రైనా బంధువు మరణించారట. సురేష్ రైనా తండ్రి సోదరి అయిన ఆశా దేవి ఆరోగ్యం విషమంగా ఉందట. అంతేకాకుండా సురేష్ రైనా ఇండియాకి తిరుగు ప్రయాణం అవ్వడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ బృందంలో కొంతమందికి కరోనా సోకడం, అంతేకాకుండా సురేష్ రైనా కి రిప్లేస్మెంట్ ప్లేయర్ కూడా దొరకడం అనేది చాలా కష్టమైన విషయం కావడంతో ప్రస్తుతం బిసిసిఐ ఆందోళనలో ఉంది.క్రిక్ ట్రాకర్ కథనం ప్రకారం ఈ మంగళవారం హర్భజన్ సింగ్ దుబాయ్ కి బయలుదేరాలి ఉందట. కానీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ఉన్న వాళ్లకి కరోనా పాజిటివ్ రావడంతో కొంచెం భయపడుతున్నారట. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల హర్భజన్ సింగ్ షెడ్యూల్ అయినా మార్చుకుంటారట.లేదా ఈసారి ఐపీఎల్ నుండి దూరంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయట. ఒకవేళ నిజంగా ఇలాగే కనుక జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. క్వారంటైన్ లో ఉండడం వల్ల మిగిలిన టీం లతో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ కూడా చేయలేదు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'చెన్నై సూపర్ కింగ్స్ టీం కి మరో షాక్'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: తెలంగాణలో తగ్గని కరోనా ఉధృతి...
తెలంగాణలో గత 24 గంటల్లో 1842 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 1,06,091కి చేరాయి. గత 24 గంటల్లో 6 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 761 చేరింది. ఇప్పటి వరకు 82,411 మంది డిశ్చార్జు కాగా 22,919 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. 16,482 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు.నేడు జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ 23,భద్రాద్రి 37,హైదరాబాద్ 373,జగిత్యాల 70,జనగాం 24,భూపాలపల్లి 1,గద్వాల 33,కామారెడ్డి 20,కరీంనగర్ 134,ఖమ్మం 77,ఆసిఫాబాద్ 5,మహబూబ్ నగర్ 42, మహబూబాబాద్ 64,మంచిర్యాల 59,మెదక్ 13,మేడ్చల్ 32,ములుగు 12,నాగర్ కర్నూల్ 32,నల్లగొండ 47,నారాయణపేట 4,నిర్మల్ 10,నిజామాబాద్ 158,పెద్దపల్లి 44,సిరిసిల్ల 13,రంగారెడ్డి 109,సంగారెడ్డి 50,సిద్దిపేట 86,సూర్యాపేట 113,వికారాబాద్ 11,వనపర్తి 50,వరంగల్ రూరల్ 8,వరంగల్ అర్బన్ 74,యాదాద్రి 14 కేసులు నమోదయ్యాయి.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను రాయండి: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండలం కొండనాగుల గ్రామంలో సోమవారం బహుజన సమాజ్ వాదీ పార్టీ ( బిఎస్పి) నాయకులు బూత్ స్థాయి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను నాయకులు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట బహుజన్ సమాజ్ పార్టీ ఇంచార్జి నారిమళ్ళ వెంకటస్వామి గారు, బల్మూర్ మండల అధ్యక్షులు జి. కృష్ణ , పదర మండల అధ్యక్షులు ఏనుపోతుల కృష్ణ , ఏనుపోతుల అరుణ్ కుమార్, ఓయూ నాయకులు, మండలి అంజి, అమ్రాబాద్ మండల నాయకులు పాల్గొన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'బూత్ స్థాయి ప్రచార నిర్వహించిన బీఎస్పి నాయకులు'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: ఆరు రాష్ట్రాల్లోని మూడు లోక్సభ, ఏడు అసెంబ్లీ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది.జార్ఖండ్లోని మందర్, ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూర్ మరియు త్రిపురలోని అగర్తల, టౌన్ బోర్దోవలి, సుర్మా మరియు జుబారాజ్నగర్లకు ఉప ఎన్నికలు జరగనున్న అసెంబ్లీ స్థానాలు.జూన్ 26న ఓట్ల లెక్కింపు, మే 30న ఉపఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ 'జూన్ 23న మూడు లోక్సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు'.
2
['tel']
కింది శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: సంక్షేమ పథకాలు ప్రజల ఉజ్వల భవితకు పెట్టుబడి: ఆత్మకూరు ఎమ్మెల్యే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేస్తున్న సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉజ్వల భవితకు పెట్టుబడి లాంటిదని, ఆయన అందిస్తున్న ఆర్థిక సహకారంతో ప్రతి ఒక్కరూ అభివృద్ది సాధించాలని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఏఎస్ పేట మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్ ఆసరా సంబరాల్లో భాగంగా పొదుపు మహిళలకు 3వ విడత ఆసరా జమ చేసిన నమూనా చెక్ ను ఆయన అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి అందచేశారు. తొలుత ఏఎస్ పేటకు వచ్చిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. అందరిని పేరుపేరున పలకరిస్తూ ఎమ్మెల్యే సభా స్థలికి చేరుకున్నారు.ఈ సందర్భంగా పొదుపు మహిళలు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలను అందచేస్తున్నారని అన్నారు. తాను 10 నెలలుగానియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఈ విషయం స్వయంగా తెలుసుకుంటున్నాని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఓ బృహత్తర కార్యక్రమమని, సంక్షేమ పథకాలను అందచేస్తూనే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.అభివృద్ది, ప్రజాసమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల గుర్తింపు అన్ని ఈ కార్యక్రమం ద్వారా జరుగుతున్నాయని వివరించారు. తమ కుటుంబంలో తమ తాత మునిసిఫ్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో తన తండ్రి, నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి చదువుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారని, చదువుకోవడానికి వెళ్లేందుకు కిలోమీటర్ల మేర వెళ్లేవారని, అయినా పట్టుదలతో చదివి అందరికి ప్రస్తుతం ఉన్నతస్థాయిలో చూసుకుంటున్నారని అన్నారు.ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించి విద్య, వైద్యం, వ్యవసాయం పట్ల ప్రోత్సహిస్తున్నారని, ప్రతి ఒక్కరిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా తన బాధ్యతగా చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని మరోమారు ప్రజలంతా కలసి ఆశీర్వదించాలని ఆయన కోరారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: ప్రొద్దుటూరు పరిధి రాజుపాలెం మండలం వెలువలి గ్రామంలో మంగళవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పధకాల ప్రయోజనాలు అందుతున్నాయా లేదా అని లబ్దిదారులను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీపీ ఎస్ఏ నారాయణరెడ్డి, జెడ్పీటీసీ మెంబర్ జీరెడ్డి అంజనీకుమారి, సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే'.
2
['tel']