inputs
stringlengths
53
5.97k
targets
stringlengths
51
5.93k
template_id
int64
1
2
template_lang
stringclasses
1 value
క్రింది న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: శ్రీనగర్ : జమ్మూ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)లో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ ఘటనలో నలుగురు సైనికులు సైతం గాయపడ్డారు. చొరబాటు ప్రయత్నాలను సైన్యం విఫలం చేసిందని రక్షణ వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులను దేశంలోకి పంపేందుకు పాక్ సైన్యం ఎల్ఓసీలోని అఖ్నూర్ సెక్టార్లోని ఖోర్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం నుంచి భారీ కాల్పులను ప్రారంభించిందని పేర్కొన్నాయి. పాక్ షెల్ దాడిలో నలుగురు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారని. ఇదే సమయంలో భారత సైన్యం చేతిలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని తెలిపాయి. అలాగే చొరబాటుకు యత్నించిన ప్రయత్నాలను అడ్డుకున్నట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. హతమైన ఉగ్రవాదుల మృతదేహాలు నియంత్రణ రేఖ వద్ద పాక్ వైపు పడి ఉన్నాయని, వాటిని పాక్ దళాలు తీసుకోలేదని అధికారులు తెలిపారు. 2021లో ఎల్ఓసీ వెంట మొదటిసారిగా జరిగిన అతిపెద్ద కాల్పుల విరమణ ఉల్లంఘన ఇదేనని అధికారులు చెప్పారు. కాశ్మీర్లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు భంగం కలిగించేలా పాక్లోని లాంచింగ్ ప్యాడ్ల వద్ద పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం. వారికి పాక్ ఆర్మీ, రేంజర్లు సహకరిస్తున్నట్లు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'ఖోర్ సెక్టార్లో ముగ్గురు ముష్కరుల హతం'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: ఈనెల 20 నుండి కౌన్సెలింగ్
ఏపీలోని ఇడుపులపాయ, ఒంగోలు, నూడివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఈనెల 20న కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 4,040 సీట్లకు కౌన్సెలింగ్ జరగనుంది. నూజివీడులో ఈనెల 20-21 తేదీల్లో, ఇడుపులపాయలో 21-22 తేదీల్లో, ఒంగోలులో 24-25 తేదీల్లో, శ్రీకాకుళం లోని ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు 24-25 తేదీల్లో కౌన్సెలింగ్ జరగనుంది.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: అమితాబ్ చేతుల మీదుగా విఐపి2 టీజర్ విడుదల
ధనుష్, అమలాపాల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం విఐపి మూవీ తెలుగులో రఘువరన్ బిటెక్ టైటిల్ తో విడుదలై ధనుష్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా విఐపి2 పేరుతో మూవీ రూపొందుతుంది. ఈ చిత్రం కూడా తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. ఇందులో కాజోల్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇండస్ట్రియలిస్ట్ గా నెగెటివ్ పాత్రలో కనిపించనుంది. 1997లో మినసర కనువు అనే తమిళ చిత్రంలో నటించిన కాజోల్ రెండు దశాబ్ధాల తర్వాత వీఐపీ2 అనే సౌత్ మూవీ చేస్తుంది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య తెరకెక్కిస్తుంది. కొచ్చాడియాన్ తర్వాత సౌందర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం వీఐపీ2. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ చిత్రం యూరప్ లో షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ని అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా విడుదల చేయించి మూవీపై భారీ అంచనాలు పెంచారు మేకర్స్ . మరి ఆ టీజర్ మీరు చూసి ఎంజాయ్ చేయండి.
1
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాల నివారణ కోసం ప్రమాదకర మూల మలుపులు ఇతరత్రా రోడ్ల వద్ద, ఇటీవల ప్రమాదాలు జరిగిన ప్రదేశాలలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం బుధవారం బోలార్డ్లను ఏర్పాటు చేసినట్టు షాద్ నగర్ ట్రాఫిక్ సిఐ శ్రీశైలం యాదవ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఫరూక్ నగర్ మండలం, కొత్తూరు, కేశంపేట్, కొందుర్గ్, చౌదరి గూడం మొదలైన మండలాల్లోని ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రమాద నివారణ కోసం బొలార్డ్ లు ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'అందరూ సహకరిస్తే ప్రమాదాలను నివారించవచ్చు: ట్రాఫిక్ సిఐ'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజేయ కల్లం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన కేవలం నెల రోజులు మాత్రమే విధులు నిర్వహించనున్నారు. మార్చి నెలాఖరున కల్లం పదవీ విరమణ చేయనున్నారు. ఏప్రిల్ నుంచి కొత్త సీఎస్గా దినేశ్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ కల్లం, దినేశ్లను చంద్రబాబు అభినందించి, సత్కరించారు. అజేయ కల్లం ఆర్థిక, రెవెన్యూ శాఖలతో పాటు పలు కీలక శాఖల్లో పనిచేశారు. 1983వ బ్యాచ్కు చెందిన దినేశ్ కుమార్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం సీఎస్గా ఉన్న సత్య ప్రకాశ్ టక్కర్ మంగళవారం పదవీ విరమణ చేశారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన అజేయ కల్లం'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: తిరుపతి: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. కేబినెట్లో మంత్రి పదవి అవకాశాలపై స్పందిస్తూ. తిరుపతి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం మంత్రి పదవి కంటే గొప్ప విషయమని చెప్పారు. తిరుపతిలో టీడీపీపై గెలవడమంటే అంత చిన్న విషయం కాదని, తన గెలుపునకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు భూమన వ్యాఖ్యానించారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ పనిచేస్తున్నారని భూమన కితాబిచ్చారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను : వైసీపీ ఎమ్మెల్యే భూమన'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: రాష్టంలో చలి తీవ్రతతో వణుకు...
చలి తీవ్రతతో రాష్ట్రం వణికిపోతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. సాధారణం కంటే నాలుగు దశల వరకు తగ్గుతోంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)లో 6 డిగ్రీలు, ఆదిలాబాద్లోని అర్లి (టి)లో 6.2 డిగ్రీలు, కుమ్రంభీం గిన్నెదరిలో 6.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జీహెచ్ఏసీ పరిధిలోని రాజేంద్రనగర్లో 11.2 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం నాగరత్న తెలిపారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: పుణే: పుణేలో జరుగుతున్న భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు తొలి ఇన్సింగ్స్లో 105 పరుగులకే భారత్ కుప్పకూలింది. ఆస్ట్రేలియా స్పీన్నర్ల ధాటికి టీమిండియా 40 ఓవర్లలో 105 పరుగులకు అలౌట్ అయింది. తొలి ఇన్సింగ్స్లో భారత బ్యాట్స్మెన్ కెఎల్ రాహుల్ 64 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్ కెఫే 35 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసుకొగా, స్టార్క్ 2, హజల్వూడ్, లాయన్ చెరో వికెట్ తీసుకున్నారు. తొలి ఇన్సింగ్స్ లో ఆస్ర్టేలియా 260 పరుగులు చేసింది. దీంతో భారత్ 155 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'తొలి ఇన్సింగ్స్లో 105 పరుగులకే కుప్పకూలిన భారత్'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్న, సన్నకారు రైతులకు అండగా ఉండి, వారికి భరోసా కల్పించటమే కాంగ్రెస్ -పార్టీ లక్ష్యమని ఆ పార్టీ ఎల్బీనగర్ ఇన్చార్జి మల్ రెడ్డి రాంరెడ్డి అన్నారు. ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా చంపాపేట డివిజన్ లోని పలు కాలనీల్లోని గడపగడపకు వెళ్లి టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫ ల్యాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమం కోసం అమలు పరిచే పథకాలను వివరించారు. అనంతరం చంపాపేట పోచమ్మ ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమం లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు దాచర్లపల్లి శ్రీపాల్రెడ్డి, నాయకులు వింజమూరి రాఘవాచారి. నారాయణ, మతిన్, సారయ్య, కిరణ్, యాదగిరి, శివ, రాజు, రమేష్ పాల్గొన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'రైతులకు అండగా ఉండటమే కాంగ్రెస్ లక్ష్యం'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: విపక్షాల కలలు కల్లలే : ప్రధాని మోడీ
ఇటీవల జరిగిన నాలుగో విడత ఎన్నికలలో పోలింగ్ పరిస్థితి చూసిన విపక్షాల ఇన్నాళ్లు తము కంటున్న కలలు చెదిరిపోయాయని ప్రధాని మోదీ అన్నారు. మంగళవారం ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ 'కౌన్ బనేగా ప్రధాన్ మంత్రి' అంటూ ఇంతవరకూ ప్రజలతో అటలాడిన విపక్షాలు నాలుగో విడత ఎన్నికల తర్వాత తామెక్కడా దాక్కునాలో అర్ధంకాని దాగుడుమూతలు' ఆట ఆడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు తమ పార్టీకి, తమ పార్టీ తీసుకున్న విధానాలకు పూర్తి మద్దతు ఇచ్చారని, విపక్షాల ప్రచారాలను నమ్మక పోవటంతో వారి కలలను తుంగలోకి తొక్కేలా జనం తమ ఓటు తో ప్రతాపం చూపించారని ప్రధాని పదవి నుంచి నన్ను తప్పించడమే ఏకైక లక్ష్యంగా విపక్షాలు బరి తెగించి చేసిన ప్రచారం ప్రజలు గుర్తించారని, ఇందుకు పాక్ నుంచి కూడా సహాయం అందినట్టు సమాచారం ఉందని అన్నారు మోడీ.
1
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఊటీలో ఘోర ప్రమాదం
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఊటీ సమీపంలోని కూనూర్ రోడ్డులో తమిళనాడు ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఊటీ నుంచి కోయంబత్తూర్కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను ఊటీలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
1
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను వ్రాయండి: ఉద్యోగులకు విద్యుత్ వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం. ఇందులో భాగంగా ఓలా, ఆథర్, హీరో, బిగాస్, కైనెటిక్, టీవీఎస్ వంటి 17 సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆప్కాబ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ (ఐడీఎఫ్సీ) వంటివి వాహనాల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తాయి. దీంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఇకపై ఎలక్ట్రిక్ బైక్లపై కార్యాలయాలకు రానున్నారు. ఉద్యోగులకు ఏడాదిలో కనీసం లక్ష వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్క్యాప్) తెలిపింది. విద్యుత్ వాహనాల కోసం 26 జిల్లాల్లోని అధికారులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక యాప్ను నెడ్క్యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా వాహనాలను కోరుకునే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'ఎలక్ట్రిక్ బైక్ ల కోసం...మూడు సంస్థలతో ఏపీ సర్కార్ ఒప్పందం'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని నెల్లూరు జిల్లాలో కరోనా పరిస్థితులను సమీక్షించారు. నెల్లూరు జిల్లా పరిషత్ ఎమర్జెన్సీ కంట్రోల్ సెంటర్ నుంచి జూమ్ యాప్ ద్వారా క్వారంటైన్ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా రోగుల మృతదేహాలను ఖననం చేసే విషయంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయని అన్నారు. అయితే, కరోనా రోగి మృతదేహంపై 6 గంటల తర్వాత ఎలాంటి వైరస్ ఉండదని, ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)తో పాటు అనేక వైద్య సంస్థలు కూడా పేర్కొన్నాయని తెలిపారు. కరోనా రోగి దురదృష్టం కొద్దీ మరణించిన పక్షంలో నిర్భయంగా అంతిమ సంస్కారం నిర్వహించవచ్చని స్పష్టం చేశారు. ఒకవేళ కరోనా రోగుల మృతదేహాలను తీసుకు వెళ్లేందుకు ఎవరూ రాకపోతే ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకుంటుందని తెలిపారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'నెల్లూరు జిల్లాలో కరోనా పరిస్థితులను సమీక్షించిన ఆళ్ల నాని'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: అబార్షన్లపై మహిళా హక్కులకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 22-24 వారాలలోపు అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకోడాన్ని చట్టబద్ధంగా పేర్కొంటూ. అందుకు సంబంధించిన ఫైలుపై శుక్రవారం సంతకం చేశారు.అబార్షన్కు రాజ్యాంగం కల్పిస్తున్న రక్షణను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల ఈ హక్కును ఆ దేశ సుప్రీం కోర్టు కొట్టివేయడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: గ్యాస్ మంట...కూలిన ప్రభుత్వం
అంశం ఏదైనా ప్రజాగ్రహం పెరిగితే ఏ ప్రభుత్వమైనా పతనం కావచ్చు. తాజాగా గ్యాస్ మంట ఓ ప్రభుత్వాన్నే పడగొట్టింది. మన దేశంలో ఉల్లి ధరలు రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించగా. కజకిస్థాన్ ప్రభుత్వాన్ని పడగొట్టింది గ్యాస్ ధరల పెరుగుదల. గ్యాస్ ధరల పెంపుపై మధ్య ఆసియా దేశాన్ని చుట్టుముట్టిన భారీ నిరసనల మధ్య కజకిస్థాన్ ప్రభుత్వం తన రాజీనామాను ప్రకటించింది. అధ్యక్ష డిక్రీ ప్రకారం అస్కర్ మామిన్ ప్రభుత్వం చేసిన రాజీనామాను కజకిస్థాన్ అధ్యక్షుడు ఖాసిమ్ జోమార్ట్ టోకయేవ్ బుధవారం ఆమోదించారు. 'రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 70 ప్రకారం. రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ ప్రభుత్వం రాజీనామాను ఆమోదించాలని నేను నిర్ణయించుకున్నాను' అని అధ్యక్ష డిక్రీ పేర్కొంది. అంతకుముందు, ప్రాంతీయ ఇంధన ధరల పెంపుపై ప్రారంభమైన భారీ నిరసనలు విస్తారమైన మాజీ-సోవియట్ దేశంలోని ఇతర ప్రాంతాలను చుట్టుముట్టడంతో టోకాయేవ్ అతిపెద్ద నగరం అల్మాటీ, చమురు సంపన్నమైన పశ్చిమ ప్రాంతంలో అత్యవసర పరిస్థితులను విధించారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) స్థానిక ధరల పెరుగుదలపై దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ప్రారంభమైన అశాంతిని అణిచివేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్లను ప్రయోగించడంతో కజకిస్థాన్ ఆర్థిక రాజధాని ఆగ్నేయ నగరం అల్మాటీ మంగళవారం అర్థరాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మామిన్ ప్రభుత్వం నిష్క్రమించిన తర్వాత, స్మైలోవ్ అలీఖాన్ అస్ఖానోవిచ్ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉంటారని టోకయేవ్ చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రస్తుత ప్రభుత్వ సభ్యులు తమ ఉద్యోగాలను పూర్తి చేస్తూనే ఉంటారని డిక్రీ స్పష్టం చేసింది.
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: కేవలం రాజకీయ లబ్ది కోసమే, బిల్లు ప్రవేశపెట్టారు
2010లో యూపీఏ హయాంలో కాంగ్రెస్ మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఓబీసీ మహిళలకు అందులో రిజర్వేషన్ కల్పించాలని ఎస్పీ, ఆర్జేడీ కోరాయి. అందుకు అంగీకరించకపోవడంతో ఆ రెండు పార్టీలు తమ మద్దతు ఉపసంహరించాయి. లేకుంటే 2010లోనే అమలులోకి వచ్చేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కులాల వారీగా జన గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ లక్ష్యాల కోసమే ప్రస్తుతం ఈ బిల్లును ప్రవేశపెట్టింది తప్ప. అమలు చేసే ఉద్దేశం లేదని ఆరోపించారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్తో ముడి పెట్టినందువల్ల మరో 10 ఏళ్లకే ఈ బిల్లు అమలులోకి వస్తుందని ఆరోపించారు. దేశంలో కుల గణనకు పెరుగుతోన్న డిమాండ్ను పక్కదోవ పట్టించేందుకే ఈ బిల్లును తెచ్చారని ఆరోపించారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఏసీబీ వలలో శ్రీ సిటీ ఎస్ఐ సుబ్బారె
చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం శ్రీ సిటీ ఎస్ఐ సుబ్బారెడ్డి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. బుధవారం శ్రీ సిటీ ఎస్సై సుబ్బారెడ్డి లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ సీఐ విజయ్ శేఖర్ ఆధ్వర్యంలోనే ఏసీబీ బృందం వలపన్ని పట్టుకున్నారు. ముఖ్యంగా పలు కేసుల్లోనూ, ఇసుక మాఫియా లోను తెరచాటున వ్యవహారాలు జరుపుకుంటూ లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ బుధవారం దాడులు జరిపి ఎస్ఐ సుబ్బారెడ్డి నీ పట్టుకోగలిగారు. ప్రస్తుతం ఎస్ఐ సుబ్బారెడ్డి నీ నెల్లూరు జిల్లా సుళ్ళూరుపేటలో విచారిస్తున్నారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: 13 మంది సభ్యులతో కాణిపాక ఆలయంకు నూతన పాలకమండలి ఏర్పాటు చేశారు. ఆలయ పాలకమండలి బోర్డు చైర్మన్గా అగరం మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పాలక మండలిచే ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటేశు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు ఎం ఎస్ బాబు హాజరైయ్యారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'కాణిపాక ఆలయ బోర్డు చైర్మన్గా అగరం మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం'.
2
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు
టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాలకు మంచి చేస్తే మరిచిపోయే అలవాటు ఉందంటూ కామెంట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎంను కోరాలని ఉందన్నారు.ప్రస్తుతం ఇస్తున్న 24 గంటల కరెంట్ కాకుండా. కేవలం 3 గంటల కరెంట్ ఇవ్వాలని సీఎంను కోరుతానని లక్ష్మారెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రస్తుతం నిలిపివేసి. ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా పనిచేసిన నేత ఇలా ఒక్కసారిగా నిర్వేదం వ్యక్తం చేయటం వెనుక ఏమై ఉంటుందా అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతంది.
1
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: జగన్ పాలనలో నియోజకవర్గానికో గాలి జనార్దన్రెడ్డి తయారయ్యాడని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. ప్రకృతి వనరులను, ప్రజాధనాన్ని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని ఆయన ఆరోపించారు. కొండల్ని, గుట్టల్ని ఆ మాఫియా మాయం చేస్తోందని, ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆనందబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. 150 నియోజకవర్గాల్లో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోందని అన్నారు. విశాఖలో ఏకంగా రుషికొండే కనుమరుగైందన్నారు. మన్యం ప్రాంతంలో వైవీ సుబ్బారెడ్డి రూ. 15 వేల కోట్ల బాక్సైట్ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. శేఖర్రెడ్డి పేరుతో జగన్ ఇసుకను దోచుకుంటున్నారని. వీటన్నింటిపైనా న్యాయ విచారణ జరగాలని నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్పై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన టైటిల్ 'నియోజకవర్గానికో గాలి జనార్దన్రెడ్డి: నక్కా ఆనంద్ బాబు'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: మీకు బీమా ఉందా? అయితే వీటిని ముఖ్యంగా తెలుసుకోండి
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండే భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థలో, వార్షిక ఆదాయానికి 10 నుంచి 15 రెట్లు సమానమైన బీమాను కలిగి ఉండటమే మంచిదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక ప్రణాళికను రూపొందించేటప్పుడు పరిష్కరించాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, కుటుంబంలో సంపాదించే సభ్యుడికి ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే, కుటుంబ లక్ష్యాలు, ఆకాంక్షలు మరియు గృహ రుణం వంటి బాధ్యతలను ఎవరు చూసుకుంటారు? ఒక వ్యక్తి వారి సమీప లేదా ప్రియమైనవారికి తగినంత భద్రతను సృష్టించగలరా? ఈ ప్రశ్నలకు ఒకటే సమాధానం ఉంది. అదే బీమా. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టాలా లేక బీమా పాలసీలను ఎంచుకోవాలా అనేది తరచుగా చర్చనీయాంశమవుతుంది. బంగారం, రియల్ ఎస్టేట్ మరియు ఇతర ఆస్తులకు సంబంధించి సమగ్ర ఆర్థిక ప్రణాళికను రూపొందించడానికి రెండు ఉత్పత్తులు అవసరం. మీరు తెలుసుకోవలసినది ఏమిటంటే, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి వాహనాలు అయితే భీమా ఉత్పత్తులు నష్టాన్ని కలిగి ఉంటాయి. అయితే మీకు ఎంత బీమా ఉండాలి? బీమా ఎంత సరిపోతుందనేది ప్రధాన ప్రశ్నపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.తగిన భీమా కవరేజీకి వచ్చేటప్పుడు పరిగణించవలసిన కొన్ని అంశాలు:ప్రస్తుత వార్షిక ఆదాయం: వార్షిక ఆదాయాన్ని భర్తీ చేయడానికి సమానమైన ఆదాయాన్ని సంపాదించడానికి సహాయపడేంత బీమా మొత్తాన్ని కలిగి ఉండటం లక్ష్యం.ఆర్థిక బాధ్యతలు: ఇందులో గృహ రుణాలు, కారు రుణాలు వంటి ప్రస్తుత బాధ్యతలు ఉండాలి. ఏదైనా వాయిదా వేసిన చెల్లింపులను కూడా పరిగణించాలి.ఆర్థిక లక్ష్యాలు: పిల్లల విద్య, వివాహం మొదలైనవి ఉంటాయి.వ్యక్తి యొక్క జీవిత దశ: జీవిత చక్రంలో బాల్యం, యవ్వనం, మధ్య దశలో, వృద్ధాప్య దశలో బాధ్యతలను జాగ్రత్తగా చూసుకోవాలంటే సరైన ఆర్థిక ప్రణాళికలు ఉండాలి.అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో, వార్షిక ఆదాయానికి 7 నుండి 10 రెట్లు సమానమైన బీమా రక్షణ ఉండాలి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండే భారతదేశం వంటి ఆర్థిక వ్యవస్థలో, వార్షిక ఆదాయానికి 10 నుంచి 15 రెట్లు సమానమైన బీమా కవర్ను కలిగి ఉండటమే మంచిదని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు. ఒక వ్యక్తికి వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయలు ఉంటే, తగిన బీమా రక్షణ ఏదైనా ఉంటే రూ.50 లక్షల నుండి 75 లక్షల రూపాయల వరకు ఉంటుంది. స్పష్టంగా, బీమా ప్రీమియం అనేది ప్రతి సంవత్సరం చెల్లించాలి. బీమా రక్షణ పరిధిని నిర్ణయించేటప్పుడు సంవత్సరానికి ప్రీమియం చెల్లించాలి. మార్గదర్శక సూత్రాలు, మరియు మీ లక్ష్యాలు, ఆకాంక్షలు మరియు పరిస్థితులకు ఆర్థిక ప్రణాళికను అనుకూలీకరించగల మంచి సలహాదారుడు చెప్పే విషయాలు పరిగణలోకి తీసుకోండి. ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టండి, కానీ తగిన బీమాను కూడా కొనడం మర్చిపోవద్దు.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: భూపాలపల్లిలో నకిలీ మావోయిస్టులు,రూ.5 లక్షలు ఇవ్వాలని సర్పంచ్కు బెదిరింపులు
భూపాలపల్లి జిల్లాలో నకిలి మావోయిస్టులు డబ్బు బెదరింపులకు దిగారు. తమను తాము మావోయిస్టులుగా చెప్పుకుంటూ అమాయకుల నుంచి డబ్బు గుంజుతున్నారు. ఇలా మోసాలకు పాల్పుడుతున్న నలుగురిని భూపాలపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఎర్ని సోమయ్య, చిలుముల తిరుపతి, ఈర్ల రాంచందర్, టేకుల సుధీర్ అనే వ్యక్తులు నకిలీ మావోయిస్టులుగా అవతారమెత్తారు. గతంలో హైదరాబాద్లో తమతో కలిసి పని చేసిన భూపాలపల్లి జిల్లా పంకెన గ్రామ సర్పంచ్ బొచ్చు శ్రీనివాస్ను టార్గెట్ చేశారు. మావోయిస్టుల పేరుతో 5 లక్షలు డిమాండ్ చేస్తూ సర్పంచ్కు లేఖ పంపించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మాటు వేసి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి మూడు మావోయిస్టు లెటర్ ప్యాడ్లు, కలర్ ప్రింటర్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: కేంద్రం, తెలంగాణ సీఎం కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆదినారాయణరెడ్డి ఆరోపించారు. రూ. 16వే కోట్ల లోటు బడ్జెట్తో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపి విభజన సమయంలో ఎన్నో హామీలిచ్చిందని, లక్షల కోట్లతో అభివృద్ధి అంటూ రంగుల సినిమా చూపిందని, చివరికి రూ.20 వేల కోట్లు ఇచ్చి లెక్క చెప్పమంటోందని ఇది సిగ్గుచేటన్నారు. కేంద్రం ఏపీలో పర్యటించి జరిగిన అభివృద్ధిని పరిశీలించాలని సూచించారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా అనేక సమస్యలు పరిష్కరించామన్నారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'ఏపిపై కేంద్రం, కేసీఆర్ల కక్ష'.
2
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: టీ టైం షాపును ప్రారంభించిన కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి
ఉప్పల్ ఐడీఏలో టీ టైం షాపును కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. గురువారం ఐడీఏలో మోడరన్ బేకరీ సమీపంలో ఏర్పాటు చేసిన టీ టైం షాపు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సల్ల రాజిరెడ్డి, కాంతాల నారాయణ రెడ్డి, ఉపేందర్ రెడ్డి , సందీప్ , భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని రాయండి: తులసి వల్ల కలిగే ప్రయోజనాలు
తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గొంతునొప్పి, నోటి దుర్వాసన, నోట్లో పొక్కులు లాంటి ఎన్నో సమస్యలకు తులసి ఆకులతో చెక్ పెట్టొచ్చు. మరి తులసి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.నోటి దుర్వాసన సమస్య ఉన్నవారు ప్రతిరోజూ రాత్రి నీళ్లలో తులసి ఆకులను నానబెట్టి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటితో పళ్లు తోముకోవాలి. ఇలా చేస్తే నోటి దుర్వాసన పోతుంది. నోట్లో పొక్కులు కూడా మానిపోతాయి.గొంతు నొప్పి సమస్య ఉన్నవాళ్లు నీళ్లలో తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీళ్లు గోరువెచ్చగా మారగనే తాగాలి. దాంతో గొంతునొప్పి మటుమాయం అవుతుంది.తులసి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ రెండింటిలోనూ యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. అందు వల్ల చర్మ సమస్యలు దరిచేరవు. సాధారణ జలుబు, దగ్గు కూడా తగ్గుతాయి. నోటిపూతకు కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.తులసి ఆకులకు శరీరంలో కొవ్వును తగ్గించే గుణం కూడా ఉంటుంది. తులసి ఆకులను ప్రతిరోజూ మజ్జిగతో కలిపి తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది.నిద్రలేమితో బాధపడేవారు తులసి ఆకులను చక్కెరతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి శీర్షికను వ్రాయండి: కొవిడ్ సంక్షోభం సమయంలో పేదలు, బడుగు వర్గాలకు భారతదేశం అందించిన సాయం విశేషమైనదని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ ప్రశంసించారు. కరోనా మహమ్మారి కొనసాగిన సమయంలో భారత ప్రభుత్వం 69 శాతం పట్టణ, 85 శాతం గ్రామీణ కుటుంబాలకు ఆహారం లేదా నగదు సాయాన్ని అందజేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం డిజిటల్ వేదికలు ఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. వివిధ దేశాల ప్రభుత్వాలు విస్తృతంగా రాయితీలు ఇవ్వడానికి బదులుగా. భారత్ లో అమలవుతున్న ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని అనుసరించాలని మాల్పాస్ చెప్పారు. దీనివల్ల అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ప్రయోజనాలు అందుతాయని వివరించారు. కరోనా మహమ్మారి వెలుగులోకి రావడానికి ముందు మూడు దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు. కానీ ఆ ప్రగతికి కొవిడ్-19 ముగింపు పలికిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద దేశాలు దీనితో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాయన్నారు. దక్షిణాఫ్రికా దాదాపు 2.9 కోట్ల మందికి 6 బిలియన్ డాలర్ల విలువ చేసే భారీ సామాజిక భద్రతా కార్యక్రమాన్ని అమలు చేసిందని మాల్పాస్ గుర్తు చేశారు. బ్రెజిల్ లో ఆర్థిక పరిస్థితులు మందగించినప్పటికీ. 2020లో డిజిటల్ నగదు బదిలీ ద్వారా అత్యంత పేదరికాన్ని కొంత తగ్గించగలిగిందని చెప్పారు. విస్తృత స్థాయి రాయితీలకు బదులు ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందనడానికి ఈ పరిణామాలే నిదర్శనమని తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'పేదలకు భారత ప్రభుత్వ సహాయం ప్రశంసనీయం: వరల్డ్ బ్యాంక్'.
2
['tel']
కింది వార్తా కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: చిలమత్తూరు పంచాయతీ పరిధి మర వ కొత్తపల్లికి చెందిన నరసింహమూర్తి (49) సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంలో తన సొంత పని నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఇంటికి కూరగాయలను తీసుకుని వస్తుండగా కొడికొండ చెక్ పోస్టు వైపు నుంచి వస్తూ మలుపు తిరుగుతున్న లారీని వెనుకవైపు నుంచి ఢీకొన్నాడు. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు.అతనికి భార్య రామాంజనమ్మ, కుమారు విగ్నేష్, వంశీ ఉన్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'లారీ ఢీకొని ఒకరి దుర్మరణం'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: హిమాచల్ప్రదేశ్లో ఈ సారి హంగ్ ఏర్పడే అవకాశాలున్నాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ఇండిపెండెంట్లపై బీజేపీ గురిపెట్టింది. వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. స్వతంత్ర అభ్యర్థులకు ప్రలోభాల వల విసురుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తం 68 అసెంబ్లీ సీట్లున్న హిమాచల్ప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 35 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఈ సారి అధికార బీజేపీగానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ గానీ ఈ మార్కును అధిగమించకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'ఇండిపెండెంట్లపై బీజేపీ గురి!'.
2
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: తెలంగాణలో స్కూల్స్ పని వేళల్లో మార్పులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదైన నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్ల పనివేళలను కుదిస్తూ తెలంగాణ విద్యాశాఖ గతంలో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒంటిపూట బడులు ప్రారంభించాక పాఠశాలల పని వేళలను కుదించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మాత్రమే నిర్వహించారు. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కావడంతో ఉదయం 11.30 వరకే తరగతులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ గత వారం క్రితం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం ఎండలు తగ్గడంతో తరగతుల నిర్వహణ మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. పాత పని వేళలనే పాటించాలని ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: గత 30 సంవత్సరాలుగా యానం ప్రజల కు సేవ చేస్తూ వారి అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజాసేవకే జీవితమును అంకితం చేస్తానని పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పేర్కొన్నారు .ఆదివారం ఉదయం స్థానిక అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలోపలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారుల పంపిణీ చేసి కార్యక్రమాన్ని అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలలో యానం కు ప్రజలు మరువలేని ప్రాజెక్టులు తీసుకెళ్తానని వాటిని త్వరలో పూర్తి చేసి ప్రజలకు సౌకర్యములు కల్పిస్తున్నట్లు తెలిపారు .విద్య ,వైద్య ,పర్యాటక రంగాలలో యానం ను అభివృద్ధి చేశానని ఇంకా అనేక స్కీమ్స్ తెచ్చి ప్రజలను పబ్లిక్ చేస్తున్నట్లు తెలిపారు .ఇప్పటికే 30 సంవత్సరాల నుండి ప్రజలను అభివృద్ధి పరిచి సేవలు చేస్తున్నానని ఇంకా జీవితం ఉన్నంతవరకు ప్రజాసేవకే అంకితం అన్నారు .మరో ముఖ్య అతిథి డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా మాట్లాడుతూ యానం చిన్న ప్రాంతం అయినను ఎంతో అభివృద్ధి చెందిందని దీనికి కారణం మంత్రి మల్లాడి కృషి అన్నారు .ఈ కార్యక్రమంలో మంత్రి ఆయా కులాల వారికి కుల పనిముట్లు ,వృద్ధాప్య పింఛన్లు ,వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఇచ్చే చెక్కులు ,20 కేజీల ఉచిత బియ్యం ,మత్యకారుల భీమా చెక్కులు ,వరదలు ,వర్షాల నష్టపరిహార చెక్కులు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గౌరీ సరోజ ,ఎస్పి రచన సింగ్ ,డిప్యూటీ తాసిల్దారు సత్యనారాయణ ,వ్యవసాయ శాఖ అధికారి తెలుగు శంకర్ మురగన్ ,ఇతర శాఖల అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు .
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ప్రజా సేవకే నా జీవితం అంకితం : పుదుచ్చేరి మంత్రి మల్లాడి'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: మంత్రుల సమక్షంలో జడ్పీ చైర్మన్ బాధ్యతల స్వీకరణ
పెద్దపల్లి జిల్లా పరిషత్ తొలి చైర్మన్గా పుట్ట మధుకర్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ల సమక్షంలో పుట్ట మధు బాధ్యతలు చేపట్టారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన, జేసీ వనజాదేవి, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, జడ్పీ సీఈఓ వినోద్తోపాటు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
1
['tel']
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: టీఆర్ఎస్ పార్టీ గోషామహల్ నియోజకవర్గ నాయకుడు గోవింద్ రాఠి మాట్లాడుతూ. గత కొంతకాలంగా సీఎం కేసీఆర్ హిందూమతంపై విరుచుకుపడుతున్నారు అన్నారు. కేసీఆర్ హిందూ మతం పై వ్యాఖ్యలు చేయడం తనను తీవ్ర మనస్తాపానికి గురిచేస్తోందన్నారు. బుధవారం కోఠిలోని తన నివాసంలో మనోజ్ జైశ్వాల్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు గోవింద్ రాఠి. ఇటీవల వనపర్తిలో కాషాయం జెండాపై, అంతేకాకుండా హిందువులు, బొందువులు అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం బాధాకరమని గోవింద్ రాఠి అన్నారు. హిందూ వ్యతిరేక విధానాలతో ముందుకెళ్తున్న పార్టీలో తాను కొనసాగబోనని, అందుకే తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పార్టీ అధికార యంత్రాంగానికి పంపుతానన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'కేసీఆర్ మాటలు బాధ కలిగించాయి... అందుకే రాజీనామా: గోవింద్ రాఠి'.
2
['tel']
కింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం నుంచి ఖైదీ పరారయ్యాడు. అనంతపురం సబ్జైల్లో కోలా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఒక దొంగతనం కేసులో సూర్యాపేట కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు తీసుకొచ్చారు. వెంకటేశ్వర్లు నిన్న రాత్రి పరారైనట్లు సమాచారం.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'ఎస్పీ కార్యాలయం నుంచి ఖైదీ పరారీ'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను రాయండి: మాజీ మంత్రి, రాజకీయ కురువృద్ధుడు చేగొండి హరి రామ జోగయ్య తన పెంపుడు శునకానికి దశ దిన కర్మను ఘనంగా నిర్వహించారు. హరిరామ జోగయ్యకు తన పెంపుడు ‘చాక్లెట్’ అంటే ఎంతో ఇష్టం. తన భార్య చనిపోయాక ఆయనకు ఈ శునకమే ఆసరా అయ్యింది. ఆయన మాములు మనిషి కావడానికి చాక్లెట్ సహకరించింది. చాక్లెట్తో ఆయనకు 13 ఏళ్లపాటు ఆయన అనుబంధం ఉంది. ఇటీవల ఆ శునకం చనిపోవడంతో హరిరామ జోగయ్ మనోవేదనకు గురయ్యారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చాక్లెట్ను భావించే హరిరామ జోగయ్య. దాని ఆత్మశాంతి కోసం శాస్త్రోక్తంగా పాలకొల్లులోని తన నివాసంలో దశదిన కర్మలు నిర్వహించారు. ఎవరైనా సరే హరిరామజోగయ్యను ఏమైనా చేస్తారనే అనుమానం వస్తే చాలు. చాక్లెట్ వారిపై దాడికి దిగేది. దాని బారిన పడిన వారిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. చాక్లెట్పై ఉన్న ప్రేమతో ఆయన టామీ చిత్రాన్ని సైతం నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో. ‘టామీ’ సినిమాను తెరకెక్కించారు. శునకాలు మనుషులపై ఎంత ప్రేమగా, విశ్వాసంతో ఉంటాయో చెప్పడం కోసమే ఆయన చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు వన్నెం రెడ్డి రాజా దర్శకత్వం వహించారు. 2015 మార్చి 13న ఈ సినిమా రిలీజైంది. ఇక చేగొండి హరిరామజోగయ్య విషయానికి వస్తే ఆయన 1937 ఏప్రిల్ 5న జన్మించారు. ఆయనకు నలుగురు కుమారులున్నారు. 1972-88 మధ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 1984-85లో హోం మంత్రిగా పని చేశారు. 1990-91లో అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన. 1993-95 మధ్య గనులు, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపురం నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి తగిన హెడ్లైన్ 'పెంపుడు శునకం దశదిన కర్మలు నిర్వహించిన హరిరామ జోగయ్య'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేయనున్న నిరసనకు మద్దతు తెపనున్నారు. అలాగే భవిష్యత్ కార్యాచరణపై ఎన్డీయేతర పక్షాతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే టైటిల్ 'ఢిల్లీ వెళ్లనున్న ఎపీ సీఎం'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ...
మీరు హైదరాబాద్ లో ఉంటున్నారా.? ఉద్యోగానికో, కోచింగ్ కో, మరేదైనా పనికోసమో రోజూ సిటీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.? అలాంటి వాళ్ల కోసమే టీఎస్ ఆర్టీసీ బంపరాఫర్ ను ప్రకటించింది. మునుపెన్నడూ లేని విధంగా ప్రయాణికులకు అద్భుతమైన సౌలభ్యాన్ని అందిస్తోంది. దీంతో హైదరాబాద్ లోని బస్సు ప్రయాణికులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయింది. హైదరాబాద్ లో సిటీ బస్సుల్లో రోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు మాత్రమే బస్సుల్లో ప్రయాణించేవారయితే పాస్ లను తీసుకోరు. అయితే రోజూ క్రమం తప్పకుండా బస్సులనే నమ్ముకుని ఉన్న వాళ్ల సంఖ్య సిటీలో తక్కువేమీ కాదు. వారంతా బస్ పాస్ లను తప్పకుండా తీసుకుంటుంటారు. బస్ పాస్ లను తీసుకునే ప్రయాణీకులకు ఆర్టీసీ పండగలాంటి వార్తను ప్రకటించింది. సిటీలో బస్ పాస్ తీసుకోవడమేనది ఓ పెద్ద ప్రయాసే అనే చెప్పుకోవచ్చు. బస్ కౌంటర్ కు వెళ్లాలి. వారు చెప్పిన టైమ్ లో లైన్లో నిల్చోవాలి. ఆ తర్వాత డబ్బులు చెల్లించి పాస్ ను తీసుకోవాలి. పాస్ గడువు ముగిసేలోపే ఈ ప్రక్రియ అంతా ముగించుకోవాలి. ఈ తతంగాన్నంతా తగ్గించి బస్ పాస్ ప్రక్రియను సులభతరం చేయాలన్న నిర్ణయానికి ఆర్టీసీ వచ్చింది. ప్రయాణికుల కష్టాలను తగ్గించేందుకు మార్గం సుగమం చేసింది. ఇకపై ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు. బస్ పాస్ మీ ఇంటి వద్దకే నడుచుకుంటూ వస్తుంది. హైదరాబాద్ లోని ప్రజలకు ఆర్టీసీ గొప్ప శుభవార్త చెప్పింది. ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇంటికే బస్ పాస్ ను పంపించే విధంగా ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం బస్ పాస్ కావాలనుకున్న వారు 8008204216 నెంబర్ కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ఏ మారు మూల ప్రదేశంలో ఉన్నా సరే, ఆర్టీసీ సిబ్బంది ఒకరు వచ్చి మీ వివరాలను తెలుసుకుని, బస్ పాస్ ను మీ ఇంటికే వచ్చి అందిస్తారు. అయితే దీనికి ఒకే ఒక్క కండీషన్ ను మాత్రం ఆర్టీసీ పెట్టింది. ఆయా ప్రాంతాల్లో కనీసం ఐదుగురయినా బస్ పాస్ ను తీసుకునేవారు ఉండాలన్న నిబంధనను మాత్రం ఆర్టీసీ పెట్టింది. ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకు ఈ ఫోన్ కాల్ సేవలు పనిచేస్తాయి. మరి ఈ సౌకర్యం కల్పించాము కదా అని బస్ పాస్ కౌంటర్లను అయితే ఆర్టీసీ తీసేయలేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్డినరీ బస్ పాస్ ధర 950 రూపాయలుగా ఉంది. మెట్రో ఎక్స్ ప్రెస్ ధర రూ.1070, మెట్రో డీలక్స్ బస్ పాస్ ధర రూ.1185, ఎయిర్ పోర్ట్ పుష్పక్ పాస్ ధర 2625, ఎన్జీవో ఆర్డినర్ పాస్ ధర రూ.320, ఎన్జీవో మెట్రో ఎక్స్ ప్రెస్ ధర 450 రూపాయలు, ఎన్జీవో మెట్రో డీలక్స్ బస్ పాస్ ధర 575 రూపాయలుగా ఉందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
1
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన మంత్రి
ఆడపిల్లకు అండగా తండ్రిగా, అన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లీలోని తలసాని నివాసంలో సనత్ నగర్ నియోజకవర్గానికి చెందిన పలువురి లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను తలసాని చేతల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలోనే అదర్శంగా నిలిచాయన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ప్రతి ఏటా లక్షలాది మంది ప్రయోజనం పొందుతున్నారన్నారు. పిల్లల తల్లిదండ్రులకు, వారి పిల్లల వివాహానికి ఈ పథకం ఎంతగానో సహాయపడుతుంది. ఈ కార్యక్రమం ముండా మార్కెట్ కార్పొరేటర్ ఆకుల రూప, హరికృష్ణ, బేగంపేట్ కార్పొరేటర్ తరుణ్, బంసిలాల్ పేట్ కార్పొరేటర్ హేమలత సికింద్రాబాద్ తాసిల్దార్ మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
1
['tel']
కింది వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: ఢిల్లీ : బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణతో పాటు పలువురు నాయకులు ఈసీని కలిసి ఫామ్-7 పై ఫిర్యాదు చేశారు. ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారడంతో ఈ వ్యవహారంపై ఈసీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ భేటీలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఉన్నారు. ఓట్ల తొలగింపుపై కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని తెలిపారు. ఏపీ డీజీపీని మార్చాలని అడిగినట్టు పేర్కొన్నారు. ఎవరు దొంగ ఎవరు కాదని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇరవై లక్షల ఓట్లు తెలుగు దేశం పార్టీ చేర్చిందని ఆ ఓట్లను తొలగించేందుకు ఆకరి సమయం వరకు తొలగించాలని అనుమతి తీసుకున్నామన్నారు. నివసించని వారివి, తెలంగాణలో ఉన్న వారివి ఓట్లను నమోదు చేయించినట్టు అనుమానాలున్నాయన్నారు. దొంగఓట్లను తొలగించకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్త పడుతుందని పేర్కొన్నారు. సరైన ఓటు కాదని ఫాం-7ను ఎవరైనా ధరఖాస్తు చేసుకోవచ్చు కానీ ఉన్న ఓట్లను తొలగించడటం ఏమిటని ప్రశ్నించారు. దొంగ ఓట్లను వేయించుకునేందుకు టీడీపీ పాల్పడుతోందని విమర్శించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే శీర్షిక 'ఈసీని కలిసిన ఏపీ బీజేపీ నేతలు'.
2
['tel']
కింది హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఏపీ కరోనా అప్డేట్
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల వ్యవధిలో 30,979 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 154 మందికి పాజిటివ్ అని తేలింది. చిత్తూరు జిల్లాలో 30 కరోనా కేసులు నమోదుయ్యాయి, విశాఖ జిల్లాలో 20 కరోనా కేసులు వచ్చాయి. కర్నూలు జిల్లాలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.అయితే అదే సమయంలో 177 మంది కరోనా నుంచి కోలుకున్నారు, నలుగురు చెందారు.
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో ఈరోజు మరో ఆసక్తికరమైన పోరు జరుగుతోంది. నేటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. పుణె వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవని మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్లు గెలిచిన పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో గెలిచి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండు రికార్డులను నెలకొల్పే అవకాశం ఉంది. ఐపీఎల్లో ఇప్పటివరకు 499 ఫోర్లు బాదిన రోహిత్ శర్మ. మరో ఫోర్ కొడితే లీగ్లో 500 ఫోర్లు పూర్తి చేస్తాడు. దీంతో ఐపీఎల్లో రికార్డు సృష్టించాడు. అయితే ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో హిట్ మాన్ ఈ రికార్డును బద్దలు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఐపీఎల్లో ఇప్పటివరకు రోహిత్ శర్మ 499 ఫోర్లతో పాటు 231 సిక్సర్లు బాదాడు.
1
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్,మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో ఊరట
మోదీ ఇంటి పేరుపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఆయనకు సూరత్ కోర్టు ఇచ్చిన రెండేళ్ల జైలు శిక్షపై. సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం. మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. మోదీ ఇంటి పేరుపై చేసిన ఈ కేసులో తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ. సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసులో గరిష్ఠ శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చెప్పలేదని. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీని దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును నిలిపేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి తరహా వ్యాఖ్యలు మంచివి కావని గుర్తు చేసిన సుప్రీంకోర్టు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అందరూ కోరుకుంటారని ధర్మాసనం పేర్కొంది. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో తాను నిర్దోషిని అని. తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ. సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు విచారణను శుక్రవారం చేపట్టింది. రాహుల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పరువు నష్టం దావా వేసిన గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు‘మోదీ కాదని సింఘ్వీ వాదించారు. ఆయన మోదీ అనే ఇంటిపేరును తర్వాత పెట్టుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ నేరస్థుడు కాదని. బీజేపీ కార్యకర్తలు గతంలోనూ ఆయనపై ఉద్దేశపూర్వకంగా ఎన్నో కేసులు వేసినప్పటికీ. ఏ కేసులోనూ శిక్ష పడలేదని సింఘ్వీ కోర్టుకు విన్నవించారు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ నిర్దోషిగా విడుదలయ్యేందుకు ఇదే చివరి అవకాశమని తెలిపారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో జరిగిన ఓ సభలో మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ. రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్కు రెండేళ్ల శిక్ష విధించింది. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద రాహుల్గాంధీపై అనర్హత వేటు పడగా. లోక్సభ సభ్వత్వాన్ని కోల్పోయారు. సూరత్ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించాలని గుజరాత్ హైకోర్టుకు చేసుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో శిక్షను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని రాయండి: టీటీడీపీ సమన్వయ కమిటీ భేటీకి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ బయల్దేరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు టీటీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు హాజరవుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం 10 గంటలకే ఈ సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, అమరావతిలో సీఆర్డీఏ సమావేశంతో పాటు, డెల్టా షుగర్స్ ఫ్యాక్టరీకి సంబంధించి రైతులతో సమావేశం ఉండటంతో. చంద్రబాబు సమయానికి హైదరాబాద్ రాలేకపోయారు. దీంతో, సమావేశాన్ని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. సమన్వయ కమిటీ సమావేశం తర్వాత గవర్నర్ నరసింహన్ ను చంద్రబాబు కలుస్తారు.
1
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని రాయండి: వివాదంలో చంద్రబాబు నివాసం!
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసం వివాదంలో చిక్కుకుంది. ఆయన ఉంటున్న ఇల్లు అక్రమ కట్టడం అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. చంద్రబాబు ఇంటిని కూల్చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్నారు. అది అక్రమ కట్టడం అని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాదు చంద్రబాబుని అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయిస్తామని, ఆ ఇంటిని కూల్చేస్తామని చెబుతున్నారు. చంద్రబాబు నివాసం గురించి ఆర్కే చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపుతున్నాయి. నదీ గర్భంలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని ఎమ్మెల్యే ఆర్కే స్పష్టం చేశారు. చంద్రబాబు నివాసం అక్రమ కట్టడం కిందకే వస్తుందన్నారాయన. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంటిని కూల్చి తీర్చుతామన్నారు. చంద్రబాబుని ఖాళీ చేయిస్తే ఆ ప్రాంతంలో ఉన్న నివాసాలు, విల్లాల సంగతి ఏంటనే కొత్త ప్రశ్న పుట్టుకొచ్చింది. కరకట్ట పక్కన ఉన్న అక్రమకట్టడాలపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఇల్లు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది. ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ తనకి చెందిన ఈ ఇంటిని చంద్రబాబుకి ఇచ్చారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. ప్రతిపక్ష నేత అయిన తర్వాత కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. లింగమనేని రమేశ్ ఇంటిని పునర్ నిర్మించి చంద్రబాబుకి ఇచ్చారు. ఆర్కే చెప్పిన ప్రకారం ఇవన్నీ అక్రమ కట్టడాల కిందకే వస్తాయి. నదీ పరివాహక పరిరక్షణ చట్టం 1890 ప్రకారం కరకట్ట సమీపంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా కరకట్టపై 5 కిలోమీటర్ల మేర అక్రమ కట్టడాలు కనిపిస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు ఇక్కడ విల్లాలు, ప్రైవేట్ రిసార్టులు నిర్మించుకున్నారు. రిక్రియేషన్ పేరుతో వుడాతో పర్మిషన్ తీసుకుని నివాసాలు నిర్మించుకున్నారు. చంద్రబాబు ఉంటున్న నివాసం ఉండవల్లి పంచాయితీ పరిధిలోకి వస్తుంది. చంద్రబాబు నివాసం కూల్చడానికి రూల్స్ ఏమైనా అడ్డు వస్తాయా? న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ఇల్లుని కూల్చకుండా ఆర్డర్ ఇస్తారా? అనే చర్చ జరుగుతోంది. నదీ పరివాహక పరిరక్షణ చట్టాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే నాడు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించిందని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు.
1
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
మాతృవియోగంతో బాధలో ఉన్న పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె పెద్దపల్లి మండలం కాసులపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. మనోహర్ రెడ్డి మాతృమూర్తి మధురమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అంతకుముందు జిల్లాలోని కమాన్పూర్ ఆది వరాహ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన కవితకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాదిలో కరోనా పీడపోయి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ కవితతోపాటు జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ఈ పూజలో పాల్గొన్నారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను వ్రాయండి: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం నివాసంలో దొంగలుపడ్డారు. చెన్నైనలోని నూగంబాకం పైక్రాఫ్ట్ గార్డెన్ రోడ్లో ఉన్న ఆయన ఇంట్లో పడ్డ దొంగలు, కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలతోపాటు కొత్త నగదు ఎత్తుకెళ్లారు. చిదంబరం భార్య నళినీ చిదంబరం, నెల రోజుల కిందట ఊటీకి వెళ్లి, ఆదివారం ఉదయం తిరిగొచ్చారు. ఉదయం 7.30 గంటలకు ఇంటికి చేరుకున్న ఆమె తలుపులు తెరవడంతో దోపిడీ జరిగిన విషయాన్ని గుర్తించారు. గదిలోని ఉన్న అల్మరాలు తెరచి ఉండటం, అందులోని విలువైన ఆభరణాలు, రూ. 1.50 లక్షల నగదు, ఖరీదైన ఆరు పట్టు చీరలు కనిపించలేదు. దీంతోనళినీ చిదంబరంమేనేజర్ మురళీ ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దొంగతనం వెనుక తమ పనిమనుషుల హస్తం ఉందేమోనని నళినీ చిదంబరం అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖానికి మాస్క్లు ధరించిన ఇద్దరు మహిళలు ఇంట్లోకి ప్రవేశించినట్టు సీసీటీవీ కెమెరాలో రికార్డయినట్టు గుర్తించారు. గతంలో ఈ మహిళలు చిదంబరం ఇంట్లో పనిచేశారని, ప్రస్తుతం పరారీలో ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. స్నిఫ్ఫర్ డాగ్స్ను కూడా రంగంలోకి దింపి, ఫింగర్ ప్రింట్స్ను సేకరిస్తున్నామని అన్నారు. ఈ దొంగతనం ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియరాలేదు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన హెడ్లైన్ 'కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి ఇంట్లో చోరీ ,భారీగా సొమ్ము అపహరణ'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని వ్రాయండి: కోడిగుడ్డు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే
కోడిగుడ్లలో శరీరానికి కావాల్సిన పోషకాలుంటాయి. కోడిగుడ్డు తింటే రక్తంలో ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. బరువు తగ్గొచ్చు. గుడ్డులో లభించే విటమిన్ ఏ కంటి సమస్యలను పోగొడుతుంది. రోజూ గుడ్డు తింటే ఐ సైట్, శుక్లాలు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. గుడ్డులో ఉండే విటమిన్ డీ, సల్ఫర్ గోళ్ల ఆరోగ్యానికి సహకరిస్తుంది. గుడ్డు సొనలో ఉండే కోలిన్ మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుడ్డు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
1
['tel']
క్రింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోజు గాడిద పళ్లు తోముతున్నాడా
‘రాప్తాడు సమీపంలో ఏర్పాటు కావాల్సిన జాకీ కంపెనీ (పేజ్ ఇండస్ట్రీస్) యాజమాన్యం గుడ్విల్ ఇవ్వని కారణంగా పనులకు అంతరాయం కల్పిస్తూ వచ్చారు. దీంతో ఆ పరిశ్రమ కాస్తా తమిళనాడులోని సేలానికి తరలిపోయిందంటూ 2018 డిసెంబరు 26న సాక్షి పత్రికలో కథనం వచ్చింది. మరి ఆరోజు ఎవరు అధికారంలో ఉన్నారు? సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోజు గాడిద పళ్లు తోముతున్నాడా’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. ఆయన అనంతపురం మండలం ఆలమూరు జగనన్న హౌసింగ్ లేఅవుట్ వద్ద విలేకరులతో మాట్లాడారు.‘కళ్లున్న కబోదులైన చంద్రబాబు, రామకృష్ణ, సోము వీర్రాజుకు వాస్తవాలు మాట్లాడితే రుచించదు. దొంగే. దొంగ దొంగ అని అరిచినట్లు చంద్రబాటు ట్వీట్లు చేస్తున్నారు. కనీసం పునాదిరాళ్లకు కూడా నోచుకోని ఒక కాగితం కంపెనీకి ఆరోజు వందకోట్లు విలువైన భూములు కేటాయించి గొప్పగా ప్రచారం కల్పించారు. నిర్మాణం జరగకుండానే అది వెళ్లిపోతే రామకృష్ణ ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: నగరంలో పనిచేస్తున్న 69 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా బదిలీలు జరుగుతాయని ఊహాగానాలకు తెరవేస్తూ, బుధవారం ఆమోదముద్ర వేశారు. శాంతిభద్రతలు, వీఐపీల తాకిడి పరంగా అత్యంత కీలక పోలీస్టేషన్లయిన పంజాగుట్ట, సైఫాబాద్, బేగంబజార్, నారాయణగూడ ఠాణాల్లో అధికారులకు స్థానచలనం కలిగింది. ట్రాఫిక్, సీసీఎస్, ఎస్బీ విభాగాల్లోనూ బదిలీలు జరిగాయి. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్థానాల్లో చేరాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన శీర్షిక 'హైదరాబాద్లో 69 మంది ఇన్స్పెక్టర్ల బదిలీలు...!'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: తెలంగాణలో ఐసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారంభంకానున్నది. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 6 నుంచి 11 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, స్లాట్ బుకింగ్ కోసం గడువు విధించారు. 8 నుంచి 12వ తేదీవరకు విద్యార్థుల సర్టిఫికేట్లను పరిశీలిస్తారు. 8 నుంచి 13 వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే వారికి వెబ్ కౌన్సెలింగ్ లో పాల్గొనడానికి అవకాశం కల్పించినట్లు ఉన్నత విద్యామండలి అధికారులు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన మొదటి విడుత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయించనున్నారు. ఈ నెల 22 నుంచి రెండో విడుత కౌన్సెలింగ్ ప్రారంభమవనుంది. డిసెంబర్ 22న స్లాట్ బుకింగ్, 23న సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినవారు 22 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ నెల 26 న చివరి విడుత కౌన్సిలింగ్ పూర్తయ్యాక విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. మిగిలిన సీట్లకు ఈనెల 28న స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే ఇందుకు సంబంధించి విదివిధానాలను ప్రకటించాల్సి ఉంది.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన శీర్షిక 'తెలంగాణలో ఈ నెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను ఇవ్వండి: హైదరాబాద్లోని ఉప్పల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. విద్యుత్ తీగలే యమపాశాలై ఇద్దరిని బలితీసుకున్నాయి. ఇద్దరు వ్యక్తులు అందరూ చూస్తుండగానే సజీవదహనం అయ్యారు. ఈ విషయం స్థానికుల గుండెల్లో గుబులు పుట్టించింది. ప్రముఖ వెబ్ సైట్ కథనం ప్రకారం ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఉప్పల్ టు రామంతాపూర్ వచ్చే దారిలో మోడ్రన్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లు కంటైనర్కు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇదే సమయంలో కంటైనర్లోనే ఉన్న డ్రైవర్ సెహజాద్, క్లీనర్ గంగ సాగర్ సజీవ దహనం అయ్యారు. కంటైనర్ లో మూడు కార్లు పూర్తిగా దగ్దమయ్యాయి. మిగతా కార్లు డ్యామేజ్ అయినట్టు ఎస్ఐ అంజయ్య తెలిపారు. హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఇద్దరు బాలురు విద్యుత్ షాక్ తో తీవ్రంగా గాయపడ్డారు. అది జరిగి వారం కాకముందే ఈ ఘటన జరగడంతో నగర వాసుల్లో ఒకింత ఆందోళనకు మొదలైంది.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'కంటైనర్లోనే ఇద్దరు సజీవదహనం'.
2
['tel']
క్రింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నరసరావుపేట విద్యార్థులు
రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలకు నరసరావుపేటకు చెందిన విద్యార్థులు శుక్రవారం ఎంపికయ్యారు. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న షేక్ కరిష్మా, శ్రీలత, షేక్ అఫ్రీన్, భార్గవి బాపట్ల జిల్లా మార్టూరులో ఏపీ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
1
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ మారథాన్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద సోమవారం ఉదయం 6: 30కి నిర్వహించిన 5k రన్ను జెండా ఊపి ప్రారంభించారు. 5k రన్ లో సిఆర్పిఎఫ్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ '5కే రన్ ను ప్రారంభించిన కేంద్రమంత్రి'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్ తో అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆ ప్రాంత రైతులు తలపెట్టిన ‘మహా పాదయాత్ర’ సోమవారం ప్రారంభమైంది. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరుతో ప్రారంభించిన ఈ పాదయాత్రకు తుళ్లూరులో శ్రీకారం చుట్టారు. ఈ పాదయాత్ర తిరుపతి వరకు కొనసాగనుంది. ఈ పాదయాత్ర మొత్తం 45 రోజులపాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది. పాదయాత్రలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయపక్షాల నేతలు పాల్గొన్నారు. అమరావతి రైతులు ప్రారంభించిన ఈ పాదయాత్రకు వైసీపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలిపాయి. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి టీడీపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగేవరకు తమ మద్దతు కొనసాగుతుందని టీడీపీ నేతలు తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ '45 రోజుల పాటు సాగనున్న ‘మహా పాదయాత్ర’'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: జమ్మికుంట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో గురువారం క్వింటాల్ పత్తి ధర రూ. 7, 250 చొప్పున పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. మార్కెట్ యార్డుకు రైతులు వివిధ ప్రాంతాల నుంచి 17 వాహనాల్లో 271 క్వింటాళ్లు లూజు పత్తిని అమ్మకానికి తీసుకురాగా గరిష్ట ధర రూ. 7, 250, మోడల్ ధర రూ. 7, 200, కనిష్ట ధర రూ. 7, 150 చొప్పున పలికినట్లు తెలిపారు. రైతులు నాణ్యమైన పత్తిని విక్రయానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'జమ్మికుంటలో క్వింటాల్ పత్తి ధర రూ.7,250'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను వ్రాయండి: కందుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు పట్టుబడిన నగదు వ్యవహారం వివాదాస్పదమైంది. బుధవారం ఆకస్మిక తనిఖీ చేసినప్పుడు లక్షా 34 వేలు నగదు పట్టుబడిందని అదే రోజు సాయంత్రం అధికారులు వెల్లడించారు. గురువారం సాయంత్రానికి సోదాలు ముగిసిన తర్వాత డిఎస్పి మోహన్ రావు మీడియాతో మాట్లాడుతూ పట్టుబడిన నగదు 90 వేలు అని ప్రకటించారు. మిగిలిన 44 వేలు నగదు ఏమైంది.? అన్న సందేహాలు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి సరిపోయే టైటిల్ 'వివాదాస్పదంగా మారిన ఎసిబి అధికారుల వివరణ'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి శీర్షికను రాయండి: తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో కరోనా రెండు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఆ కేసులు గుర్తించబడిన బ్యాంకు పేట ప్రాంతాన్ని రెవెన్యూ యంత్రాంగం రెడ్ జోన్ గా ప్రకటించింది.ఆ ఏరియా చుట్టుపక్కల 500 మీటర్ల పరిధిలో పూర్తిగా కంపార్ట్మెంట్ స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. లోపలికి బయటికి ఏ ఒక్కరు వెళ్లేందుకు అనుమతించరు. కేవలం వైద్యసేవలు, పారిశుద్ధ్యం, ఇతర అత్యవసర సేవల కోసం మాత్రమే అన్ని జాగ్రత్తలతో పంపుతారు. జిల్లా కేంద్రం కాకినాడలో రెడ్ జోన్ ప్రకటించడంతో నగర ప్రజలు భయంతో వణికిపోతున్నారు. నిజాముద్దీన్ లో ప్రయాణించిన వ్యక్తి కి కరోనా తో అతని ద్వారా అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి, పిఠాపురానికి చెందిన వ్యక్తికి ఈ వైరస్ సోకింది. దీంతో బ్యాంకు పేట మొత్తం ఉలిక్కి పడుతోంది. రెవెన్యూ, పోలీస్, మునిసిపల్, పంచాయతీరాజ్ ,వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'కాకినాడలో రెడ్ జోన్'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: అంతరిక్షంలో సుదూరంగా సంభవించిన ఓ పరిణామాన్ని హబుల్ టెలిస్కోప్ చిత్రీకరించింది. సూర్యుని కన్నా దాదాపు 20 రెట్ల అధిక పరిమాణంలో ఉన్న ఓ నక్షత్రం నశించిపోతున్న వేళ, ఆ సూపర్ నోవా బ్లాస్ట్ సంభవించగా, హబుల్ ఈ చిత్రాన్ని బంధించింది. నాసా ఈ బ్లాస్ట్ చిత్రాన్ని విడుదల చేసింది. మానవ చరిత్రలో ఇంతటి భారీ పేలుడు కనిపించడం ఇదే తొలిసారని, భూమికి 2,400 కాంతి సంవత్సరాల దూరంలో ఇది జరిగిందని నాసా వెల్లడించింది.సూపర్ నోవాలను (పేలుతున్న నక్షతాలు) గమనించేందుకు వివిధ రకాల హై ఎండ్ టెలిస్కోప్ లను వినియోగిస్తున్నామని, వాటిల్లో ఒకటి ఈ దృశ్యాన్ని చిత్రీకరించిందని నాసా సైంటిస్టులు వివరించారు. అంతరిక్షం, సూపర్ నోవాలపై అధ్యయనంలో ఈ చిత్రం ఎంతో ఉపకరిస్తుందని భావిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. ఇక ఈ సూపర్ నోవా బ్లాస్ట్ పిక్ ను ట్విట్టర్ లో షేర్ చేసుకున్న నాసా, ఈ పేలుడు తరువాత కాంతిపుంజాలు ఎంతో దూరం ప్రసరించాయని పేర్కొంది. ఆకాశాన్నంతా కప్పేసేలా విస్తరించిందని వెల్లడించింది.ఈ పేలుడు 10 వేల నుంచి 20 వేల ఏళ్ల క్రితం జరిగి ఉండవచ్చని, దీని కాంతి 60 కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించిందని అంచనా వేస్తున్నారు. సెకనుకు 220 మైళ్ల వేగంతో సూపర్ నోవా విస్తరించిందని నాసా పేర్కొంది. కాగా, ఇటీవల పాలపుంతకు అత్యంత సమీపంలోని ఆండ్రోమెడా గెలాక్సీలో భారీ ఎత్తున వాయు ప్రవాహాన్ని నాసా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన హెడ్లైన్ '2,400 కాంతి సంవత్సరాల దూరంలో సూపర్ నోవా బ్లాస్ట్...'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: దేశవ్యాప్తంగా 374 జిల్లాల్లో రుణ మేళా!
ప్రభుత్వరంగ బ్యాంకులకు దేశవ్యాప్తంగా రుణ మేళా నిర్వహించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు అక్టోబర్ లో వినియోగదారులకు పెద్ద మొత్తంలో రుణాలు పంపిణీ చేశాయి. గత నెలలో ప్రభుత్వరంగ బ్యాంకులు మొత్తం రూ.2.5 లక్షల కోట్ల రుణాలు ఇచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం, వినిమయానికి ఊతం అందించే ప్రయత్నంలో భాగంగా సెప్టెంబర్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రుణ మేళా కార్యక్రమాలు నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించారు. దీంతో బ్యాంకులు పట్టణాల్లో, గ్రామాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించి రుణాలను పంపిణీ చేశాయి.కేంద్రం ఆదేశాల మేరకు 2019 అక్టోబర్లో దేశవ్యాప్తంగా 374 జిల్లాల్లో రుణ మేళాలు నిర్వహించాయి. ఈ విధంగా అక్టోబర్లో ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు రూ.2,52,583 కోట్ల రుణాలను పంపిణీ చేశాయి. వీటిలో రూ.1,05,599 కోట్లు కొత్త టర్మ్ లోన్లు కాగా, రూ.46,800 కోట్లు కొత్త వర్కింగ్ క్యాపిటల్ లోన్లు అని ఆర్థిక సేవల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం రుణాల పంపిణీలో కొత్త టర్మ్ లోన్లతో పాటు తాజా రుణాలు 60 శాతం ఇచ్చారు. ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, ఇది గొప్ప మలుపు తిప్పే కథ అని, బ్యాంకులు పూర్తి మూలధనం కల్గి ఉన్నాయని, అన్ని రకాల రుణాలను తీర్చే స్థితిలో ఉన్నామని అన్నారు. రెండేళ్ల ప్రభుత్వ నిర్విరామ కృషితో ప్రభుత్వరంగ బ్యాంకులు తిరిగి మెరుగైన దశకు చేరుకుంటున్నాయని అన్నారు.2019 అక్టోబర్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్కు రుణాలు రూ.19,627.26 కోట్లు ఉన్నాయని తెలిపారు. కేంద్రం ఆదేశాల మేరకు ప్రైవేటు బ్యాంకులు, ఎన్బిఎఫ్సిల భాగస్వామ్యంతో బ్యాంకులు తొలి దశగా అక్టోబర్ 1 నుంచి 9 తేదీల్లో 226 జిల్లాల్లో నిర్వహించారు. ఆ తర్వాత రెండో దశ అక్టోబర్ 21 నుంచి 25 వరకు 148 జిల్లాల్లో నిర్వహించారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ సమీపంలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఆయన విజయవాడ వచ్చారు. మంగళూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని పవన్ నిర్వహించనున్నారు.శనివారం జరిగే పార్టీ సమావేశంలో పాల్గొననున్నారు. రెండు రోజుల పాటు విజయవాడలోనే ఉండనున్నారు.ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో ఈ భేటీలో పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇచ్చిన వార్తా కథనానికి అనువైన టైటిల్ 'రేపు మంగళూరు జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమావేశం'.
2
['tel']
ఇచ్చిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: తెలుగు భాషా సాహిత్యానికి గురజాడ అప్పా రావు వెలుగు జాడగా నిలిచారని ఎంఈవో ధనుంజయ మజ్జి, కవిటి మేజర్ పంచాయతీ సర్పంచ్ పూడి లక్ష్మణరావులు అన్నారు. కవిటి మండలంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలతో పాటు మండలంలోని వివిధ పాఠశాలలో గురజాడ అప్పారావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఇద్దివాని పాలెంలో గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల నాటకాన్ని ప్రదర్శన చేసి బాలబాలి కలకు నాటకంలోని రసరమ్యతను ఉపాధ్యాయుడు మురళీ ప్రకాష్ వివరించారు. గురజాడ తెలుగు సాహిత్యానికి అందించిన సేవలను వక్తలు కొనియాడారు. కార్యక్రమాల్లో హెచ్ఎం వరలక్ష్మీ, కేశవపు రియ , రాజేష్ కుమార్, లింగరాజ్ పట్నాయక్ పీఏ సీఎస్ డైరెక్టర్ ఎన్ని అశోక్, మండల కో - ఆప్షన్ సభ్యుడు పాండవ చంద్రశేఖరా పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'ఘనంగా గురజాడ జయంతి వేడుకలు'.
2
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: అత్తా కోడళ్లు అంటే కలహాలు,విబేధాలు గుర్తోసాయి. అత్తాకోడళ్ల మధ్య సత్సంబంధాలు కలిగి ఉండటం అనేది చాలా తక్కువగా వింటుంటాం. కానీ ఓ కోడలు మాత్రం తాను అందుకు భిన్న అంటూ. తన అత్తగారిపై ప్రమేను చూపించింది. కోడలు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కుటుంబంలో అత్తగారి పుట్టిన రోజుకు కోడలు ఏకంగా 60 రకాల వంటకాలను తయారు చేసింది. వంటకాలను ప్లాస్టిటిక్ డబ్బాల్లో నింపి వాటిపై పేర్లు రాసి పెట్టింది. పులిహోర మొదలు, కొబ్బరి రైస్, మ్యాగీ నూడిల్స్, పెరుగు ఇడ్లీ, వంకాయ బజ్జీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తనపై ఉన్న కోడలి ప్రేమను ఇలా రకరకాల వంటకాలు చేసి చూపించడంతో అత్త ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఇక కోడలి వంటకాల వీడియోకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అత్తాకోడళ్ళ బంధమంటే ఇలాగే ఉండాలంటూ కోడలిని మెచ్చుకుంటున్నారు. మాకూ అలాంటి వంటకాలుచేసే కోడలు ఉంటే బాగుండేదని, చూస్తుంటేనే నోరూరిపోతుందని కామెంట్ చేస్తున్నారు. వంటలు చేయడం కూడా స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా. అత్తకు 60 ఏళ్లు కావడంతో ఆ కోడలు. 60 రకాల వెరైటీ వంటలను చేసి అత్తగారికి కానుకుగా ఇచ్చింది. 60 రకాల వెరైటీల అని షాక్ అవ్వకండి అది నిజమే. ఇక కోడలి వంటకాల వీడియోకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇచ్చిన వార్తా కథనానికి తగిన శీర్షిక 'అత్తకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కోడలు'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: ఆర్మూర్ టౌన్: హైదరాబాద్ లోని మంత్రి క్యాంప్ ఆఫీసులో ఆశన్న గారి జీవన్ రెడ్డి సమక్షంలో ఆర్మూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు ఎమ్మెల్యే జీవారెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి సాధారణంగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిమాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి యువకులు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు పార్టీలో చేరిన వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని తెలిపారు.
ఇచ్చిన వార్తా కథనానికి సరిపోయే హెడ్లైన్ 'ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు...'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్
హైదరాబాద్ నగరంలోని బీజేపీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, నాయకులు మురళీధర్రావు, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, పార్టీ శ్రేణులు హాజరయ్యారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని వ్రాయండి: కోమటిరెడ్డి సీఎల్పీ లీడర్ కావాలని పూజలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సీఎల్పీ లీడర్గా ఎన్నిక కావాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మొగుదాల రమేష్గౌడ్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎల్పీ లీడర్గా రాజగోపాల్రెడ్డి నియమిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందన్న ఆశాభావాన్ని వారు వ్యక్తంచేశారు. కాగా. ఈ పూజా కార్యక్రమంలో నాయకులు పెద్దగోని రమేష్ గౌడ్, ముమ్మిడి నవీన్, పబ్బు శ్రీకాంత్, బొంగు రమేష్, చింతకింది గణేష్, కృష్ణ, వినయ్, వంశీలతోపాటు పలువురు పాల్గొన్నారు.
1
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: తొలి టీ20లో ఫీల్డర్ల తప్పిదాలపై మండిపడ్డ యువరాజ్
తొలి టీ20లో టీమిండియా ఫీల్డర్ల తప్పిదాలు మరోసారి కనిపించాయి. చేతుల్లోకి వస్తున్న బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన వాషింగ్టన్ సుందర్ ఒక అడుగు వెనకే ఉండిపోయి హెట్మెయిర్కు మొదట్లోనే లైఫ్ ఇచ్చాడు. చాహర్ వేసిన 16వ ఓవర్లో సునాయాసమైన క్యాచ్ను షార్ట్ ఫైన్లెగ్లో సుందర్ అందుకోలేకపోయాడు. వెస్టిండిస్తో ముగిసిన తొలి టీ20లో టీమిండియా ఫీల్డింగ్పై మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మండిపడ్డాడు. ఇటీవల బంగ్లాదేశ్తో సిరీస్లో బ్యాటింగ్, బౌలింగ్లో విజృంభించిన టీమిండియా మూడు టీ20ల సిరిస్లో భాగంగా విండిస్తో జరిగిన తొలి టీ20లో ఫీల్డింగ్లో మాత్రం ఆకట్టుకోలేకపోయింది. క్యాచ్ను అంచనా వేయడంలో పొరబడ్డ సుందర్ రెండడుగులు వెనక్కి వెళ్లగా. బంతి అతడి ముందే పడింది. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న హెట్మెయిర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఇక, బౌండరీ వద్ద నేరుగా చేతుల్లో పడ్డ బంతిని రోహిత్ శర్మ సిక్స్ పోనిచ్చాడు. చాహర్ వేసిన తర్వాతి ఓవర్లో తొలి మూడు బంతులూ క్యాచ్లే. వాషింగ్టన్ సుందర్ ఓ క్యాచ్ను వదిలేయగా, బౌండరీ వద్ద రోహిత్ శర్మ రెండు క్యాచ్లు మిస్ చేశాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరి ఓవర్లో జాసన్ హోల్డర్ ఇచ్చిన క్యాచ్ను చేజార్చాడు. దీంతో టీమిండియా ఫీల్డింగ్లో విఫలమైందని మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సైతం ట్వీట్ చేశాడు. యువరాజ్ తన ట్విట్టర్లో "భారత్ పేలవంగా ఫీల్డింగ్ చేసింది. బంతిని అందుకోవడంలో యువ ఆటగాళ్లు నిదానంగా కదులుతున్నారు. ఎక్కువగా క్రికెట్ ఆడుతుండటంతో ఇలా చేస్తున్నారా?" అంటూ ట్వీట్ చేశాడు. కాగా, తొలి టీ20లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ప్రాణాలతో చెలగాటమడే...టగ్ ఆఫ్ వార్
ప్రాణాలను పణంగా పెట్టి ఆడే ఆటలను ఎక్కడైనా చూశారా.ఇదేదో సాహస యాత్ర అనుకోకండి. కన్నడీగులు ఆడే ప్రాణాలతో చెలగాటమడే ఆట అది. టగ్ ఆఫ్ వార్. అటో గుంపు, ఇటో గుంపు తాడును పట్టుకుని పరస్పరం లాగేసుకునే ఆట. ఎవరు బలంగా తాడును లాగుతారో. వారే విజేతలుగా నిలిచే ఆట. మనుషుల మధ్య జరిగే ఈ ఆట చాలా సరదాగా కూడా ఉంటుంది. అయితే ఈ ఆటను కన్నడిగులు ట్రాక్టర్లతో ఆడుతున్నారు. రెండు ట్రాక్టర్లకు వాటి వెనుక వైపుగా తాళ్లను కట్టి. పరస్పరం విరుద్ధ మార్గాల్లో ట్రాక్టర్లను పరుగెత్తించే ఈ ఆటకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ట్రాక్టర్లతో టగ్ ఆఫ్ వార్లో భాగంగా జరిగిన ఈ పోటీలో ట్రాక్టర్లు ముందు టైర్లు గాల్లోకి లేచిపోతున్నాయి. ప్రత్యర్థి ట్రాక్టర్ బలంగా లాగితే. ఆవలి వైపున్న ట్రాక్టర్ తిరగబడిపోతోంది. మళ్లీ నేలపై సాధారణ స్థితికి వచ్చేస్తూ తనను లాగిన ట్రాక్టర్ను మరింత బలంగా లాగేస్తోంది. వేల మంది జనం మధ్యలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ట్రాక్టర్లు మీద పడితే ప్రాణాలే గాల్లో కలిసిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. వెరసి ప్రాణాంతకంగా మారే ప్రమాదమున్న ఈ క్రీడను కన్నడిగులు ఉత్సాహంగా సాగిస్తున్నారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను వ్రాయండి: న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజల విశ్వాసం పొందిన పాలనను భారతదేశంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని అందిస్తోందని తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది.దాదాపు 73శాతం మంది భారతీయులు ప్రధాని మోడీ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినట్లు ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమం కావడం విశేషం. దాదాపు 73శాతం మంది భారతీయులు ప్రధాని మోడీ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేసినట్లు ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమం కావడం విశేషం.మూడో స్థానంలో రష్యా ఆ తర్వాతి స్థానాల్లో టర్కీ(58శాతం), రష్యా(58శాతం), జర్మనీ(55శాతం) ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ సర్వే ప్రకారం. బ్రెగ్జిట్ సంక్షోభంతో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న బ్రిటన్ థెరిస్సా మే ప్రభుత్వంపై 41శాతం మంది ప్రజలు విశ్వాసం ఉంచారు. అవినీతి కుంభకోణంలో చిక్కుకున్న దక్షిణకొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హై కారణంగా ఆ దేశ ప్రభుత్వంపై కేవలం 25శాతం మంది ప్రజలు మాత్రమే నమ్మకం వ్యక్తం చేశారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన శీర్షిక 'ప్రపంచంలోనే మోడీ ప్రభుత్వం బెస్ట్'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: మన బ్యాంకులలో కుంభకోణాల విలువ ఎంతంటే?
2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో జరిగిన మోసాల విలువ ఎంత.? నోట్ల రద్దు తరువాత కొన్ని నెలల పాటు పుష్కలమైన నిధులతో కళకళలాడిన బ్యాంకులు ఆ తరువాత దివాళాతీసాయి. ఈ ఏడాది ఆరంభంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) లో వెలుగుచూసిన కుంభకోణం యావత్ బ్యాంకింగ్ రంగంలోనే సంచలనం సృష్టించింది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన బంధువు మెహుల్ ఛోక్సీ తదితరులు కలిసి పీఎన్బీకి రూ. 13వేల కోట్ల మేర కుచ్చుటోపి పెట్టారు. మొత్తంగా బ్యాంకుల్లో కుంభకోణాలు జరిగిన మోసాల విలువ ఎంత తెలుసా.? అక్షరాలా రూ. 41,167.7కోట్లు. భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజా గణాంకాలు వెల్లడించాయి. 2017-18 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ వ్యవస్థలో మోసాలు 72శాతం పెరిగాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 23,933కోట్ల మేర బ్యాంకులు మోసపోగా. గత ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 41,167.7కోట్లకు పెరిగింది. పీఎన్బీ కుంభకోణం వల్లే మోసాలు విలువ అమాంతం పెరిగిందని ఆర్బీఐ గణాంకాలు పేర్కొన్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో 5,076 మోసం కేసులు నమోదవగా. గత ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 5,917కు పెరిగింది. కాగా. మొత్తం నమోదైన మోసాల్లో 80శాతం రూ. 50కోట్లు అంతకంటే పైబడినవే. ఇక 93శాతం కేసుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులే మోసపోయినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: బెల్లంపల్లి 132 కేవీ సబ్ స్టేషన్ లో శుక్రవారం రాత్రి 10. 40 గంట మందమర్రి నుంచి వచ్చే ఇన్కమింగ్ రెండు సీటీ లలోమంటలు చెలరేగాయి. అధిక వేడి వల్ల సీటీలు దగ్ధమైనట్లు బెల్లంపల్లి ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే బెల్లంపల్లి నియోజకవర్గంలోని భీమిని, కన్నెపల్లి, తాండూరు, తిర్యాణి, బెల్లంపల్లి రూరల్, బెల్లంపల్లి పట్టణం ఉపకేంద్రా లకు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. కుమురం భీం జిల్లాకు సైతం పూర్తిగా నిలిచిపోయింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేస్తున్నారు. మంచిర్యాల ఎస్ఈ రమేష్, డీఈశ్రీధర్, ఏడీఈ శ్రీనివాస్, ఏఈలు, సిబ్బంది పరిశీలిస్తున్నారు. విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే హెడ్లైన్ 'సబ్ స్టేషన్ లో మంటలు'.
2
['tel']
కింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలుపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 2004కు ముందు నోటిఫికేషన్లో ఎంపికై, 2004 సెప్టెంబర్ 1 నాటికి చేరితే పాత పెన్షన్ వర్తింపుపై పరిశీలన చేస్తోంది. ప్రభుత్వ శాఖలన్నీ వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ కోరింది. సెప్టెంబర్ 14న సచివాలయంలో భేటీకి రావాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో 2003 డీఎస్సీ, కానిస్టేబుళ్లు, 1999 గ్రూప్-2 బ్యాచ్ ఉద్యోగులకు లబ్ధి కలిగే అవకాశం ఉంది.
ఇచ్చిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ '2003 డీఎస్సీ ఉద్యోగులకు శుభవార్త'.
2
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య
ఒంపోలుకు చెందిన రైతు బుధవారం మధ్యాహ్నం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్లితే. ఒంపోలుకు చెందిన ముచ్చకర్ల సూర్యనారాయణ(58) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సూర్యనారాయణ ఆరోగ్యం క్షీణించడంతో మధ్యాహ్నం ఇంటివద్ద ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగాడని తెలిపారు. సాయంత్రం ఇంటికొచ్చేసరికి సూర్యనారాయణ మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను ఇవ్వండి: పాడేరు పరిధిలోని జి.మాడుగుల మండలం కోరాపల్లి గ్రామానికి చెందిన కోరాబు త్రిమూర్తి కుమార్తె బోడకొండమ్మ అలియాస్ గాయత్రి(20) ఐదు నెలల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయి జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీ రూడిబయలు గ్రామానికి చెందిన పాంగి గణపతి(30)తో ఉంటోంది. అప్పటికే అతనికి రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మూడో భార్యగా చేసుకుంటానని చెప్పి ఒంగోలు తీసుకువెళ్లాడు. కొన్నాళ్లు అక్కడ ఉన్న తరువాత తనను పుట్టింటికి తీసుకువెళ్లమని గాయత్రి కోరడంతో అతను ఈ నెల 14వ తేదీన అక్కడికి తీసుకువెళ్లకుండా తన స్వగ్రామమైన రూడిబయలులోని పిన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. ఆమె తన పుట్టింటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండడంతో ఈ నెల 16వ తేదీ ఉదయం 7 గంటలకు ఆమె మెడకు చున్నీ చుట్టి హతమార్చాడు. తన కుటుంబ సభ్యులైన పాంగి శోభన్బాబు(21), పాంగి మహేష్బాబు(23), పాంగి లక్ష్మమ్మ(45), పాంగి భారతి(29), వెంకట్లకు ఈ విషయం చెప్పాడు. వారి సహకారంతో గాయిత్రి మృతదేహాన్ని పాడేరు మండలం వనుగుపల్లి పంచాయతీ తియ్యగెడ్డ గ్రామంలో పాతిపెట్టారు. దీనిని సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. గిరిజన యువతిని హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించిన కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఐదుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన శీర్షిక 'హత్య కేసు ఛేదించిన పోలీసులు, పలువురి అరెస్ట్'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను ఇవ్వండి: భారతదేశం నేడు ఎంతో పురోగతి సాధిస్తున్నా నేటికీ చాలా గ్రామాలు రవాణ సౌకర్యాలను నోచుకోవడంలేదని తెలిస్తే మనం షాక్ కు గురవుతాం. కానీ ఇది వాస్తవం. సరైన రహదారులు. రవాణా సదుపాయం. నదులపై వంతెనలు లేక ఎన్నో గ్రామాల్లో ప్రజలు సతమతం అవుతున్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో రోజువారీ కార్యక్రమాలను చేసుకోవడానికి పెద్ద పెద్ద సాహసాలు చేయాల్సి వస్తుంది. ఒడిశా రాష్ట్రంలోని బెహెరాగూడ గ్రామంలో వాగుపై వంతెన నిర్మించకపోవడంతో అక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తాజాగా గ్రామంలో చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఛాతీ లోతు వరద నీటిలో బంధువులు మృతదేహాన్ని భుజాలపై మోసుకువెళ్లాల్సి వచ్చింది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కలహండి జిల్లాలోని గోలముండా బ్లాక్లో ఒక ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే దానిపై వంతెన లేదు. దాంతో ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించడానికి బెహెరాగూడ గ్రామ నివాసితులు చాలా కష్టపడ్డారు. గ్రామంలో శాంతారాణా చాలాకాలంగా పక్షవాతంతో బాధపడుతూ మంగళవారం చనిపోయారు. దాంతో అతని మృతదేహానికి దహన సంస్కారం చేయడం పెద్ద సవాల్ అయింది. వాగుకు అవతలి వైపు శ్మశాన వాటిక ఉంది. దాంతో వాగులోంచి ఛాతీ లోతు నీటిలోంచి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అయితే అప్పుడు కూడా వర్షం పడతుండడంతో మృతదేహం తడవకుండా అరటి ఆకులను అడ్డంగా పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలావుంటే ఒడిశాలో దహన సంస్కారాల ఖర్చులను భరించలేని నిరుపేదల కోసం ఒడిశా ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం హరిశ్చంద్ర సహాయత యోజన పథకాన్ని ప్రారంభించింది. ఆ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మృతుడి కుటుంబానికి అంత్యక్రియలు నిర్వహించడానికి రెండు వేల రూపాయలను అందజేసింది. అయితే ఈ పథకం కింద అనేక అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాగా ఇటీవల మధ్యప్రదేశ్లోని ఓ గ్రామంలో దాదాపు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో స్మశానం లేకపోవడంతో నడిరోడ్డుపైనే ఓ వ్యక్తి అంత్యక్రియలను నిర్వహించాల్సి వచ్చింది. భింద్లోని మెహగావ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అజ్నాల్ గ్రామంలో ఎప్పటి నుంచో స్మశానం లేదు. ఎవరైనా చనిపోతే సొంత పొలాల్లోనే గ్రామస్థులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే ఎడతెరిపి లేని వర్షాల వల్ల గ్రామంలోని పొలాలన్నీ నీటితో నిండిపోయాయి. దాంతో గ్రామంలో చనిపోయిన ఓ వ్యక్తి అంత్యక్రియలు నిర్వహించేందుకు వేరే మార్గం లేకపోయింది. అందుకని నడిరోడ్డుపైనే దహన సంస్కారాన్ని నిర్వహించారు. ఎప్పటి నుంచో తమ సమస్యను ప్రజాప్రతినిధులకు, అధికారులకు తెలియజేస్తున్నామని కానీ వారు పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రామంలో ఒక స్మశానాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన టైటిల్ 'ఆ వీడియో చూస్తే కనీళ్లు ఆగవు...అంత:క్రియలకు నానా పాట్లు'.
2
['tel']
క్రింది వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తి దావఖానాలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. తొలిదశలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన బస్తీ దవాఖానాలను, తర్వాత కాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వం విస్తరించిందని, ఈ బస్తి దావఖాన ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి పరిధిలో 197 బస్తి దావఖానాలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని మంత్రి తెలిపారు. బస్తీ దవాఖానాలో ప్రభుత్వం నాణ్యమైన సేవలు అందించడంతో, వాటికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. హైదరాబాద్ నగరంలోని పేదలుండే చోటనే, పలు బస్తీలలో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖానాల ద్వారా స్థానికంగా ఉన్న పేద ప్రజలకు వైద్య ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సేవలను ఉచితంగా అందుతున్నాయని, ఇలా వైద్య సేవలే తమ ప్రాంతానికి రావడంతో వాటిని ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్తి దావఖానల మెత్తం సంఖ్యను 300లకు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తాము పని చేస్తున్నామని, త్వరలోనే దశలవారీగా ప్రస్తుతం ఉన్న 197 సంఖ్యను 300కు పెంచుతామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. బస్తీ దవాఖానాలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి కరుణ, జిల్లాల కలెక్టర్లు, మరియు పురపాలక శాఖ, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. బస్తీ దవాఖానలో ప్రస్తుతం ఒక్కోదానికి కనీసం 100 మంది వరకు ఇన్ పేషెంట్ సంఖ్య ఉన్నదని మొత్తంగా సుమారు 197 ద్వారా ప్రతి రోజూ సరాసరి 25 వేల మందికి సేవలు అందుతున్నాయని అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. పేద ప్రజలు ఉన్న ప్రతి డివిజన్ లోనూ బస్తి దావఖాన ఉండాలన్నదే తమ లక్ష్యమని, అవసరమైన చోట్ల రెండు లేదా అంతకు మించి కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బస్తీ దవాఖానలతోపాటు నగరంలో ఉన్న 130కి పైగా అర్బన్ పీహెచ్సీల్లో కలిపి ప్రజలకు ప్రాథమిక వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్నాయని, వీటితోపాటు వైద్యపరీక్షలు సైతం కొనసాగుతున్నాయని మంత్రి అన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని బస్తి దావఖానాలన్నీ ఇప్పటికే ఆన్లైన్ లోకి వచ్చాయని మిగిలిన వాటిని కూడా ఆన్లైన్ చేసి ఎప్పటికప్పుడు వాటి ద్వారా అందుతున్న వైద్యసేవలు సమీక్షిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. పేద ప్రజలకి ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంలో బస్తీ దవాఖాన విజయవంతమైన నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలో పెద్ద సంఖ్యలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఉన్న ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామన్నారు. బస్తీ దవాఖాన లు మరియు అర్బన్ పీహెచ్సీలో కేవలం ఓపీ సేవలు మాత్రమే కాకుండా వారికి అవసరమైన టెస్టులు(వైద్య పరీక్షలు) కూడా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రికి అధికారులు తెలియజేశారు. జిహెచ్ఎంసి పరిధిలో ప్రతిరోజు సుమారు 5,000 టెస్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, వీటి సంఖ్య మరింత పెంచేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఈ పరీక్షలు తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా చేస్తున్నామని, పరీక్షల ఫలితాలను కూడా మొబైల్ ఫోన్ ఉన్నవారికి వెంటనే చేరేలా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.ఈ విషయంలో ఇతర ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రయత్నం కొనసాగుతుందని వైద్య శాఖ అధికారులు మంత్రి కేటీఆర్ గారికి తెలియ జేశారు. బస్తీ దవాఖాన లో పలుచోట్ల మూత్రశాలలు లేని విషయం తమ దృష్టికి వచ్చిందని, వాటిని వెంటనే ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. మూత్ర శాలలు కట్టేందుకు స్థలం లేని చోట్ల మొబైల్ టాయిలెట్లను ఉంచుతామని తెలియజేశారు. బస్తి దావఖాన వాళ్ల ద్వారా పేద ప్రజలకు కావలసినప్పుడు వైద్యసేవలు అందడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్ వీటి సేవలను మరింత ప్రభావవంతంగా కొనసాగించేందుకు అవకాశం ఉన్న ప్రతి చోట ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. బస్తి దావఖాన పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే మరో వంద బస్తి దావఖానాలు ఒకటి రెండు నెలల్లో ప్రారంభం అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తి దావఖానాలు విజయవంతం : మంత్రి కేటీఆర్'.
2
['tel']
క్రింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: ఆర్థిక ఇబ్బందులు కుంకుమతో ఇలా దూరం
వాస్తు ప్రకారం కుంకుమతో కొన్ని పరిహారాలు చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని పండితులు పేర్కొంటున్నారు. ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత నీటిలో చిటికెడు కుంకుమ కలిపి సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎర్రటి సింధూరాన్ని హనుమంతునికి నివేదిస్తే ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయంటున్నారు. బుధవారం వినాయకుడికి కుంకుమ సమర్పించినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
1
['tel']
ఇవ్వబడిన టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: మధ్యప్రదేశ్ మాదిరి తెలంగాణ ఎన్నికల్లోనూ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు పోటీ
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు కేంద్రమంత్రులు సహా ఏడుగురు సీనియర్లను బీజేపీ బరిలోకి దించుతోంది. సోమవారం ఆ పార్టీ 39 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేయగా. ఇందులో ముగ్గురు కేంద్ర మంత్రుల సహా ఏడుగురు ఎంపీల పేర్లు ఉన్నాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్, జలశక్తి మంత్రి ప్రహ్లాద్ పటేల్, గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తేతో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ, ఎంపీలు ఉదయ్ ప్రతాప్ సింగ్, రితి పాఠక్, గణేశ్ సింగ్లకు ఎమ్మెల్యే టిక్కెట్లను కేటాయించింది. అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లను పోటీకి దింపాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం కేవలం మధ్యప్రదేశ్కే పరిమితం కాదు. ఎన్నికలు జరగబోయే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలలో దీనిని అనుసరించాలని ఆ పార్టీ యోచిస్తోంది. గతంలో పార్టీ అభ్యర్థులు పోరాడిన లేదా అరుదుగా గెలిచిన స్థానాలలో విజయవకాశాలను పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రాజస్థాన్లో అంతర్గత పోరును ఎదుర్కొంటున్న బీజేపీ. ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకుండా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని భావిస్తోంది. కేంద్ర జల్ శక్తి మంత్రి, జోధ్పూర్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్, పార్లమెంటరీ వ్యవహారాల సహా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజ్సమంద్ ఎంపీ దియా కుమారి, జైపూర్ (గ్రామీణ) ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వంటి ప్రముఖులకు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించనుంది. అయితే, నాయకుల మధ్య వర్గపోరు బలంగా ఉందనే నివేదికల దృష్ట్యా ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకూడదని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించుకున్నారు. ఫలితాల అనంతరం ఎన్నికైన ఎమ్మెల్యేలే శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారనే సందేశాన్ని పార్టీ పరోక్షంగా పంపింది. మాజీ సీఎం వసుంధర రాజే అసంతృప్తితో ఉన్నారని. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏ అవకాశాన్ని ఆమె వదులుకోరని అంటున్నారు. బీజేపీ గెలిస్తే సీఎం పదవి రేసులో ముందంజలో ఉన్న షెకావత్. కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవడమే కాకుండా పార్టీలో అంతర్గత పోరును కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. సీఎం గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ను ఓడించి 2019లో జోధ్పూర్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన షెకావత్తో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సూర్యకాంత వ్యాస్, షేర్గఢ్ మాజీ ఎమ్మెల్యే బాబు సింగ్ రాథోడ్లు విభేదిస్తున్నట్లు చెబుతున్నారు. ‘జీజీ’గా గుర్తింపు పొందిన 85 ఏళ్ల వ్యాస్. పుష్కర్ణ బ్రాహ్మణ వర్గానికి చెందిన ప్రముఖ నాయకురాలు. తనకు టిక్కెట్ నిరాకరించినట్లు వచ్చిన వార్తలపై కలత చెందిన ఆమె. దీనికంతటికీ షెకావత్ కారణమని ఆరోపించారు. అయితే, బీజేపీ అనధికారిక నియమం ప్రకారం 75 ఏళ్లు పైబడిన వారెవరైనా పోటీకి దూరంగా ఉండాలి. ఇక, తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సహా నలుగురు ఎంపీలను అసెంబ్లీ బరిలోకి దింపనున్నారని తెలుస్తోంది. మధ్యప్రదేశ్లో కేంద్ర నాయకుల మోహరింపు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి ప్రయోగాలకు నాందిగా భావిస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఇద్దరు కేంద్ర మంత్రులు, నరేంద్ర సింగ్ తోమర్, ఫగ్గన్ సింగ్ కులస్తే 2018లో కాంగ్రెస్ గెలిచిన స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. మరో నలుగురు లోక్సభ ఎంపీలలో ముగ్గురు గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ విజయం సాధించిన స్థానాల్లో పోటీ చేస్తారు.
1
['tel']
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: -విత్ డ్రా పరిమితిని పెంచిన ఆర్బిఐ -రూ. 24 వేల నుండి రూ. 50 వేలకు పెంపు -దశలవారీగా ఆంక్షల ఎత్తివేత -వచ్చే నెల 13 నుండి ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత -కరెంట్ అకౌంట్ ఖాతాదారుల విత్డ్రాపై పరిమితి లేదు న్యూఢిల్లీ: బ్యాంకు సేవింగ్స ఖాతాదారులకు శుభవార్త. పెద్దనోట్ల రద్దు అనంతర నిబంధనల ప్రకారం, వారానికి రూ.24 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉండేది. ఈ పరిమితిని రూ.50 వేలకు పెంచారు. కాగా, జనవరి 30న జారీ చేసిన నోటిఫికేషన్లో దశల వారీగా నగదు విత్ డ్రా లపై ఆంక్షలు ఎత్తివేస్తామని ఆర్బీఐ గతంలో ప్రకటించింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఫిబ్రవరి 20వ తేదీ నుంచి సేవింగ్స ఖాతాదారులు వారానికి రూ.50 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు. వచ్చే నెల 13 నుంచి ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇదిలా ఉండగా, కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు విత్ డ్రాపై ఎటువంటి పరిమితులు లేవు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే టైటిల్ 'ఇకపై రూ. 50 వేలు విత్డ్రా'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: కిషన్ రెడ్డికి మంత్రి పదవి...?
హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీనిచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా నడిచినప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు కనబడలేదు. ఏకంగా నాలుగు స్థానాలను బీజేపీ గెలుచుకుని సత్తా చాటింది. బీజేపీ గెలుచుకున్న స్థానాలన్నీ టీఆర్ఎస్కు గట్టి పట్టున్న ప్రాంతాలు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా నిజామాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పరాజయాన్ని ఎవరూ ఊహించలేదు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో కవిత దారుణ పరాజయం పాలయ్యారు. మిగతా వారిలో సికింద్రాబాద్ నుంచి జి.కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు గెలుపొందారు. ఈ నలుగురిలో సీనియర్ నేత అయిన కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి వర్గంలో చోటు లభించడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్గా రెండుసార్లు పనిచేసిన కిషన్రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఇందుకు కలిసి వస్తుందని చెబుతున్నారు.
1
['tel']
క్రింది న్యూస్ కథనానికి హెడ్లైన్ ను వ్రాయండి: ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మళ్లీ లాభాల బాటను పట్టాయి. మెటల్, బ్యాంకింగ్, ఐటీ స్టాకులు లాభాలనుముందుండి నడిపించాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 175 పాయింట్లు పెరిగి 40,850కి చేరింది. నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 12,037కు పెరిగింది.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'లాభాలతో స్టాక్ మార్కెట్లు'.
2
['tel']
ఇచ్చిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: ఒడిశా కేబినెట్ 17 ప్రధాన ప్రతిపాదనలకు ఆమోదం
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వ్యవసాయం మరియు రైతు సాధికారత, పంచాయతీరాజ్ మరియు తాగునీరు, ప్రణాళిక మరియు శాఖలకు సంబంధించి 17 ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. కన్వర్జెన్స్, రెవెన్యూ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్, స్టీల్ అండ్ మైన్స్ మరియు వాటర్ రిసోర్సెస్.సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేష్ చంద్ర మహాపాత్ర వివరించారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో వార్తా కథనాన్ని రాయండి: శ్రీకాళహస్తిలో ఆటోలకు జరిమానా
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తి పట్టణంలో మంగళవారం ఒకటో పట్టణ పోలీసులు నిబంధనలు పాటించని 120 ఆటోలకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా 48, 200 రూపాయలు జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్చార్జి ఏఎస్ఐ రియాజ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు , సిబ్బంది పాల్గొన్నారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: తెలంగాణలోని నిరుద్యోగులకు తీపికబురు...
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ సొసైటీ (TTWREIS) పరిధిలో వివిధ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా మొత్తం 160 ఖాళీలను భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ జూన్ 10న ప్రారంభమైంది.
1
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి టైటిల్ ను ఇవ్వండి: ఏపీ పరిశ్రమలు, ఐ. టి. మంత్రిత్వశాఖా మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్కు అత్యంత సన్నిహితులు మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ లోని అపోలో హిస్పిటల్లో గుండెపోటుతో ఆకస్మికంగా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు వెంకటగిరిలో వైసీపీ నాయకులు చిట్టెటి హరికృష్ణ, ఎల్. కె ఆర్ ఆధ్వర్యంలో వెంకటగిరిలోని ఎమ్మార్వో కార్యాలయం వద్ద టెంట్ వేసి మంత్రి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూల మాలలు వేసి, వెంకటగిరి వైసీపీ శ్రేణులు శ్రద్ధాంజలి ఘటించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా చిట్టెటి, ఎల్. కె. ఆర్ లు మాట్లాడుతూ మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం అటు రాష్ట్రానికి ఇటు పార్టీ కి, జిల్లాకి తీరని లోటని అన్నారు. ఇటీవల దుబాయ్కి వెళ్లి ఎక్స్పో లో పాల్గొని రాష్ట్రానికి 5 వేల 15 కోట్లు పెట్టుబడులు వచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుని తిరుగు ప్రయాణంలో నిన్న హైదరాబాద్కు రావడం సోమవారం ఉదయం గుండెపోటుతో చనిపోవడం విచారకరమని అన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ, ఐ. టి. శాఖల పరంగా ఆయన రాష్ట్రానికి చేసిన కృషిని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో చిట్టెటి హరికృష్ణ, ఎల్. కె. ఆర్ తోపాటు వైసీపీ సీనియర్ నాయకులు మంగళపురి వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ శాతరాసి బాలయ్య, జడ్పీటిసి కోలా వెంకటేశ్వర్లు, ఏఎంసి వైస్ చైర్మన్ మల్లి రెడ్డి, కౌన్సిలర్ నారిశేఖర్, శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ దేవస్థాన పాలకమండలి సభ్యులు ఆవుల మోహన్ యాదవ్, వైసీపీ నాయకులు పూజారి శ్రీనివాసులు, సతీష్, గణేష్, అబూబకర్, సుబ్రమణ్యం, చంద్రశేఖర్ తదితర వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'గౌతమ్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేసిన వెంకటగిరి వైసీపీ శ్రేణులు'.
2
['tel']
కింది న్యూస్ ఆర్టికల్ కి శీర్షికను రాయండి: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) నిర్వహించిన సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్ వైజర్ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం ఈ పిటిషన్ పై విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ఇటీవల జరిగిన గ్రూప్ 1 పరీక్షతో పాటు ఇతర నియామక పరీక్షలను టీఎస్ పీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే! ఈ క్రమంలోనే సీడీపీవో, ఈవో పరీక్షల నిర్వహణపైనా సందేహాలు ఉన్నాయని, వాటిని కూడా రద్దు చేయాలని పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు 76 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్వైజర్ ప్రశ్నపత్రాలపైనా దర్యాప్తు జరపాలని పిటిషన్లో కోరారు. జనవరిలో సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్వైజర్ నియామక పరీక్షలు నిర్వహించిందని, తాము వేసిన పిటిషన్పై తీర్పు వచ్చే వరకు నియామక ప్రక్రియను నిలిపేసేలా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. అయితే, తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం ఇవ్వాలని పిటిషన్ దారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ వాదనలు వినిపిస్తారని పిటిషనర్లు తెలిపారు. దీంతో విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి అనువైన టైటిల్ 'పరీక్షలను రద్దు పిటిషన్ పై విచారణ రేపటిికి వాయిదా'.
2
['tel']
ఇచ్చిన వార్తా కథనానికి హెడ్లైన్ ను రాయండి: ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంది. చాలా మంది కరోనాకు భయపడి అనేక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. మానసిక ప్రశాంతతకు దూరమవుతున్నారు. తాజాగా ఓ భర్త తన భార్యకు కరోనా సోకిందని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్ లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు. ఓ వ్యక్తి(54) తనభార్యతో కలిసి నివసిస్తున్నాడు. అయితే తాజాగా అతడి భార్యకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఉన్నట్టుండి ఆ వ్యక్తి గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం భార్యకు మాత్రమే కరోనా సోకిందా. అతడికి సైతం కరోనా వచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది. పోస్టుమార్టంలో అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
ఇవ్వబడిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'భార్యకు కరోనా ఉందని భర్త సూసైడ్!'.
2
['tel']
కింది హెడ్లైన్ తో న్యూస్ కథనాన్ని వ్రాయండి: బహనాగా స్కూల్ పునర్నిర్మాణానికి ఒడిశా సీఎం రూ.2.49 కోట్లు మంజూరు
జూన్ 2 న జరిగిన విషాద రైలు ప్రమాదం తరువాత తాత్కాలిక శవాగారంగా మారిన బాలాసోర్లోని బహనాగ హైస్కూల్ పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ. 2.49 కోట్లు మంజూరు చేశారు.బాలాసోర్ జిల్లాలోని బహంగా హైస్కూల్ 5T చొరవ కింద రూపాంతరం చెందుతుంది, దీని కోసం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2.49 కోట్ల రూపాయలను మంజూరు చేశారు అని సిఎం కార్యాలయం నుండి అధికారిక ప్రకటన తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తన 5T పాఠశాల పరివర్తన కార్యక్రమం కింద భవనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, కార్యదర్శి (5టి పరివర్తన చొరవ) వికె పాండియన్ ఈ విషయమై బహంగా హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మరియు జిల్లా కలెక్టర్తో వివరంగా చర్చించారు. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను 15 రోజుల్లోగా ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) సమర్పించాలని బాలాసోర్ కలెక్టర్ దత్తాత్రయ భౌసాహెబ్ షిండేను ముఖ్యమంత్రి కోరారు.
1
['tel']
కింది శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: కేప్ టౌన్ మూడో వన్డే: భారత్ టార్గెట్ 288 రన్స్
కేప్ టౌన్ వేదికగా టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య చివరి వన్డే జరుగుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది భారత్, తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌటైంది. సఫారీ ఇన్నింగ్స్లో ఓపెనర్ క్వింటన్ డికాక్ ఆట హైలైట్. డికాక్ సెంచరీ చేశాడు. లెఫ్ట్ హ్యాండర్ మొత్తం 130 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో రోసీ వాన్ డెర్ డాసన్ 52, డేవిడ్ మిల్లర్ 39 పరుగులు చేశారు. డ్వేన్ ప్రిటోరియస్ 20 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో ప్రముఖ్ కృష్ణ 3, దీపక్ చాహర్ 2, జస్ ప్రీత్ బుమ్రా 2, చాహల్ 1 వికెట్ తీశారు.
1
['tel']
కింది టైటిల్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: కేసీఆర్, కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వీర్యం చేశారు: కిషన్ రెడ్డి
కేసీఆర్, కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వీర్యం చేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉన్న విషయం తెలిసే పోలింగ్ శాతం తగ్గించేందుకు ఎన్నికలు పెట్టారని ధ్వజమెత్తారు. జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ఇంకా మూడు నెలలు ఉన్నా ఓటమి భయంతో ముందస్తుగా ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు
1
['tel']
ఇవ్వబడిన హెడ్లైన్ తో వార్తా కథనాన్ని వ్రాయండి: రాజ్యసభ రేపటికి వాయిదా
న్యూఢిల్లి : రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. తొలిసారి 15 నిముషాలపాటు వాయిదా పడిన రాజ్యసభ సమావేశం తిరిగి ప్రారంభమైంది. తమిళనాడు ఎంపిలు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమ స్థానాలలో నిలబడి నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
1
['tel']
ఇచ్చిన శీర్షికతో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: రేపు ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ
ఆంధప్రదేశ్ లో రేపు పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలిపింది. 9 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తాము బంద్ చేపట్టనున్నట్లు ఏబీవీపీ నేత ఒకరు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను పటిష్టపరిచే దిశగా ఏపీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేయాలనీ, ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను నిరుపేదలకు కేటాయించేలా చూడాలన్నారు. ఏపీలో ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న డీఈవో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీని నిర్వహించాలన్నారు.
1
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి శీర్షికను ఇవ్వండి: అమరావతి రైతుల మహా పాదయాత్రపై మాజీ మంత్రి పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. తనపై తనకు నమ్మకం లేని చంద్రబాబు టీడీపీ సానుభూతిపరులతో సాగిస్తున్న ఓ రాజకీయ క్రీడే అమరావతి రైతుల పాదయాత్ర అని విమర్శించారు. నాడు టీడీపీ ప్రభుత్వంతో వ్యాపార ఒప్పందం చేసుకున్న టీడీపీ సానుభూతిపరులే నేడు అమరావతి రైతుల ముసుగులో యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవ్వబడిన వార్తా కథనానికి తగిన టైటిల్ 'అమరావతి రైతుల పాదయాత్రపై పేర్ని నాని వైరల్ కామెంట్స్'.
2
['tel']
కింది టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని రాయండి: సిద్దిపేటలో పాల్గొన్న మంత్రి హరీశ్
రాష్ట్రవ్యాప్తంగా గులాబీ జెండా పండుగను టీఆర్ఎస్ శ్రేణులు అట్టహాసంగా నిర్వహించాయి. పల్లెపల్లెనా, వాడవాడనా నేతలు టీఆర్ఎస్ జెండాలను ఎగుర వేసి. మిఠాయిలు పంచిపెట్టారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జరిగిన వేడుకల్లో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు పాల్గొని, టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. 4వ, 23, 24వ వార్డుల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.
1
['tel']
ఇవ్వబడిన శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: అమ్మవారికి సారె సమర్పణ
దొండపర్తిలోని శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ అమ్మవారికి దొండపర్తి గ్రామ ప్రజలు సారె సమర్పించారు. వివిధ రకాలైన మిఠాయిలను అమ్మవారి పాదాల వద్ద నుంచి ప్రత్యేక పూజలు చేశారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో సుమారు 200 మంది భక్తులు దేవస్థానంకు విచ్చేసి శ్రీ అమ్మవారికి పలు రకాల మిఠాయిలను సమర్పించారు. దేవస్థానం ఈఓ జి. వి రమాబాయి ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతకు మునుపు ఇటువంటి కార్యక్రమం నిర్వహించనప్పటికీ ఈ ఏడాది ప్రత్యేకంగా అమ్మవారికి సారెను సమర్పించారు ఈ నెల 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ అమ్మవారి దేవస్థానంలో జరిగిన ఉత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు దేవస్థానం ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాబాయి తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి హెడ్లైన్ ను ఇవ్వండి: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ పై ఈ రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల పట్టణం చున్నాం భట్టి వాడకు చెందిన సిరుపురా భోగిరాజు (40) అనే వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన హెడ్లైన్ 'రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: జిల్లాలో ఖచ్చితమైన వివరాలు ఇచ్చి తప్పులు లేని ఓటరు జాబితా ను బలోపేతం చేయ్యోలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష పేర్కొన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్ లో జరిగిన కార్యక్రమంలో ఓటరు జాబితా బలోపేతం గోడ పత్రిక పోస్టర్ ఆవిష్కరించించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు నమోదు తక్కువ ఉన్న గ్రామాలలో ఓటర్ నమోదు జాబితా త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఫారం 6 బి నింపి ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని మహిళా ఓటర్లకు సమాచారం అందించి చైతన్యం చేయాలని కలెక్టర్ అన్నారు. కొత్తగ ఓటర్ నమోదుకు ఫారం 6 వినియోగించి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఫారం 8 ద్వారా మార్పులు సవరణ ఇంటి చిరునామా వివరాలు దివ్యాంగులుగా గుర్తింపు వంటివి సవరించుకోవాలని అన్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈనెల 16న పాలిటెక్నిక్ కళాశాల నుండి మెడికల్ కళాశాల వరకు 15, 000 మందితో ర్యాలీ, ఉంటుందని 17న జిల్లా స్థాయి నియోజకవర్గస్థాయిలో జండావిష్కరణ, 18న పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఈనెల 15న జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఒకటి నుండి 19 సంవత్సరాల వారు ఆల్బెండజోల్ మాత్రలు తప్పక వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలో, కళాశాలలో, అంగన్వాడి కేంద్రాలు పిల్లలకు మాత్రలు పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ప్రభుత్వ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్, డియంహెచ్వో రవిశంకర్ , డిపిఆర్ఓ రషీద్, డిఈఐవో జాకైర్ హుస్సేన్ యుంవిఐ అవినాష్ నాయక్, యంఅర్వో రాజేందర్ గౌడ్, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రైవేట్ కళాశాల, ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్ లు, జిల్లా అధికారులు, పిఈటిలు తథితరులు పాల్గొన్నారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి తగిన హెడ్లైన్ 'ఓటర్ జాబితా త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్'.
2
['tel']
ఇవ్వబడిన న్యూస్ కథనానికి హెడ్లైన్ ను రాయండి: వైసీపీ నేతల వద్ద పెద్ద ఎత్తున బ్లాక్ మనీ ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేనంత నల్లధనం ఏపీలో ఉందని చెప్పారు. ఏపీలో అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. వీటిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. హత్యలు చేసిన ఎమ్మెల్సీలను జగన్ ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించారు. క్యాష్ ద్వారా లిక్కర్ అమ్మకాలను చేయడం వల్ల వైసీపీ నేతలు భారీగా నల్లధనాన్ని పోగేశారని అన్నారు. ఈ అక్రమ సంపాదనతోనే వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో రూ. 40 కోట్లు ఖర్చు పెట్టేందుకు వైసీపీ నేతలు రెడీ అయిపోయారని చెప్పారు. ఆ డబ్బును చూసుకునే 175 సీట్లలో గెలుస్తామనే ధీమాతో ఉన్నారని అన్నారు. ఏపీలో సీబీఐ, ఈడీ, ఐటీ రెయిడ్స్ ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు.
ఇచ్చిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'వైసీపీ నేతల వద్ద పెద్ద ఎత్తున బ్లాక్ మనీ: విష్ణుకుమార్ రాజు'.
2
['tel']
ఇవ్వబడిన వార్తా కథనానికి టైటిల్ ను రాయండి: ఇరాక్లో ఉన్న అమెరికా స్థావరాలపై మిస్సైల్ దాడి చేసిన మరుసటి రోజు ఇరాన్ మరోసారి రెండు రాకెట్లను ఫైర్ చేసింది. బగ్దాద్లో ఉన్న గ్రీన్జోన్ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ రెండు రాకెట్లతో దాడికి పాల్పడింది. గ్రీన్జోన్లోనే అమెరికా దౌత్య కార్యాలయం ఉన్నది. గ్రీన్జోన్లో రెండు కత్యూషా రాకెట్లు పడినట్లు ఇరాక్ సైన్యం వెల్లడించింది. గ్రీన్జోన్ ప్రాంతంలో అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాల దౌత్య కార్యాలయాలు ఉన్నాయి. అయితే ఆ రాకెట్ల వల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. కానీ రాకెట్లు టార్గెట్ను పేల్చిన సమయంలో భారీ శబ్ధాలు వినిపించాయి. అమెరికాతో సమరానికి దిగేందుకు ఇరాన్ వెనుకాడుతుందని ట్రంప్ కామెంట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే గ్రీన్జోన్పై రాకెట్ల దాడి జరిగింది.
ఇచ్చిన న్యూస్ ఆర్టికల్ కి సరిపోయే శీర్షిక 'గ్రీన్జోన్పై ఇరాన్ రాకెట్ల దాడి'.
2
['tel']
ఇచ్చిన టైటిల్ తో న్యూస్ ఆర్టికల్ ని వ్రాయండి: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కార్పోరేషన్ ప్రారంభం
ఏపీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కార్పొరేషన్ ను సీఎం జగన్ ప్రారంభించారు. 50,449 మందికి సీఎం జగన్ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే ఇస్తామని సీఎం జగన్ అన్నారు. గతంలో ఉద్యోగాలు,జీతాల కోసం లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడా పరిస్థితి లేదని సీఎం జగన్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు చెల్లిస్తామన్నారు. అదే విధంగా ఉద్యోగాల సంఖ్యను మరింత పెంచుతామని సీఎం జగన్ అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను వివిధ ఏజన్సీల ద్వారా భర్తీ చేసేవారు. అదే విధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి జీతాలు కూడా వచ్చేవి కావు. దీంతో సీఎం జగన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంలో అవినీతి జరగకూడదని, అదే విధంగా ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వాలని నిర్ణయించారు. అందుకోసమే ప్రత్యేకంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. దానిని నేడు ప్రారంభించి ఇప్పటికే ఉన్న ఉద్యోగులకు అధికారికంగా నియామక పత్రాలు అందజేశారు.
1
['tel']
క్రింది న్యూస్ ఆర్టికల్ కి టైటిల్ ను రాయండి: తెలంగాణలో సీఎం కేసీఆర్కు మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన పాలనపై ప్రజలు విసుగు చెందారన్నారు. బీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో కేసీఆర్ అహంకారాన్ని తుంగలో తొక్కి తనను గెలిపించారని గుర్తు చేశారు. ఖమ్మంలో అమిత్ షా సభ ఏర్పాట్లను పరిశీలించి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇవ్వబడిన న్యూస్ కథనానికి అనువైన టైటిల్ 'కేసీఆర్కు మరోసారి అధికారం ఇస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది: ఎమ్మెల్యే ఈటల'.
2
['tel']
కింది శీర్షికతో న్యూస్ కథనాన్ని రాయండి: ఆ యువతి నవ్వినా, ఏడ్చినా ప్రాణాపాయమే
ఇంగ్లండ్ కు చెందిన ఓ యువతి అరుదైన వ్యాధితో బాధపడుతోంది.27 ఏళ్ల నటాషా కు ఉన్న వింత వ్యాధి పేరు మాస్ట్ సెల్ యాక్టివేషన్ సిండ్రోమ్.ఎప్పుడైతే నటాషా ఎక్కువ ఉద్వేగానికి లోనైనప్పుడు,నవ్వినా లేదా కన్నీళ్లు వచ్చినప్పుడు,శరీరంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి. నొప్పి తీవ్రమవుతుంది. ఒకొక్కసారి మరణం అంచుకు చేరుకుంటుంది. వెంటనే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిందే. ఇలా ఆమె దాదాపు 500 సార్లు ఆసుపత్రిలో చేరింది.
1
['tel']